Babloo Prithiveeraj
-
నా కెరీర్లో ఎన్నో కష్టాలు పడ్డా.. నా లైఫ్ మార్చేసిన సినిమా అదే: బబ్లూ
కల్యాణ్ రామ్ (Kalyan Ram), విజయశాంతి (Vijayasanthi) కీలక పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ చిత్రంలో నటుడు బబ్లూ పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో పోలీసు అధికారిగా ఆయన అభిమానులను అలరించనున్నారు. తాజాగా నిర్వహించిన టీజర్ లాంఛ్ ఈవెంట్‌కు బబ్లూ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్లో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.బబ్లూ పృథ్వీరాజ్ మాట్లాడుతూ..'నేను సినిమా ఇండస్ట్రీలో గత 50 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పడ్డాను. సినిమాల్లో ఎన్నో ఎత్తు, పల్లాలు చూశాను. కానీ ఇప్పుడు నా టైమ్ మారింది. సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ తర్వాత నా లైఫ్ మారింది. కానీ ఈ రోజు వరకు 250 నుంచి 300 వరకు సినిమాలు చేశాను. నా కెరీర్లో ఎన్నో రోల్స్ చేశాను. నా లైఫ్‌లో అత్యంత కష్టమైన పాత్ర మాత్రం ఈ సినిమాలోనే చేశా' అని ఆయన అన్నారు. కాగా.. తాజగా రిలీజైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ చూస్తుంటే తల్లీ తనయుల అనుబంధం నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో డైలాగ్స్ చూస్తుంటే మోస్ట్ పవర్ఫుల్ యాక్షన్ మూవీగానే రూపొందించినట్లు తెలుస్తోంది. -
మేము పెళ్లి చేసుకోలేదు, సహజీవనం చేశాం.. ఇప్పుడు మాత్రం..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బబ్లూ పృథ్వీరాజ్. ఓ పక్క సినిమాలు చేస్తూనే అడపాదడపా సీరియల్స్‌లోనూ యాక్ట్ చేశాడు. మధ్యలో కాస్త వెనుకబడ్డ నటుడు ఈ మధ్యే మళ్లీ దూకుడు పెంచాడు. వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే పృథ్వీరాజ్ గతంలో బీనాను పెళ్లాడాడు. వీరికి అహద్ మోహన్ జబ్బర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇతడు ఆటిజంతో బాధఫడుతున్నాడు. బ్రేకప్ రూమర్స్.. కొన్నేళ్లపాటు బాగానే ఉన్న పృథ్వీరాజ్-బీనా మధ్య గొడవలు ఎక్కువవడంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత శీతల్ అనే తెలుగమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ సహజీవనం చేశారు. 56 ఏళ్ల వయసులో నటుడు సీక్రెట్‌గా ఆమెను పెళ్లి చేసుకున్నాడని ప్రచారం జరిగింది. ఇంతలోనే వీరి బంధం బీటలు వారిందని కొంతకాలంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. బబ్లూ తనకు ప్రపోజ్ చేసిన వీడియో శీతల్ డిలీట్ చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. తాజాగా తన బ్రేకప్ నిజమేనని అంగీకరించింది శీతల్. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. మేము పెళ్లి చేసుకోలేదు.. 'చాలామంది నా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎన్నో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏదేదో ఊహించుకుంటున్నారు. పృథ్వీ, నేను పెళ్లి చేసుకోలేదు. సహజీవనం చేశామంతే! మేము ఊహించినట్లుగా మా రిలేషన్షిప్ ముందుకు వెళ్లలేదు. అయితే ఈ ప్రయాణంలో మేము సంతోషాన్ని పంచుకున్న క్షణాలెన్నో ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే మేము విడిపోయాము. జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవిస్తూ, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించరని ఆశిస్తున్నాను' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Rukmini Sheetal (@sheetal_sheetu1) చదవండి: కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్‌కి పెళ్లయిపోయింది -
56 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. అంతలోనే నటుడి విడాకులు?
సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే! చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గానూ నటించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లోనూ నటించాడు. ఆ మధ్య అవకాశాల్లేక వెనుకబడిన నటుడు ఇప్పుడు మళ్లీ స్పీడు పెంచాడు. నేడు రిలీజైన యానిమల్ మూవీలోనూ కీలక పాత్రలో నటించాడు. అలాగే దయ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చాడు. వృత్తిపరమైన విషయాల కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు పృథ్వీరాజ్. 1994లో బీనాను పెళ్లాడిన ఇతడికి ఒక అహద్ మోహన్ జబ్బర్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అన్యోన్యంగానే ఉంటున్నారనుకున్న క్రమంలో వీరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. సుమారు ఆరేళ్లు విడివిడిగా జీవించిన వీరు గతేడాది విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది శీతల్‌కు దగ్గరయ్యాడు బబ్లూ. ఈమె తెలుగమ్మాయే.. బబ్లూ కంటే 30 ఏళ్లు చిన్నది. నటుడితోనే జీవితాన్ని గడిపేయాలనుకుంది. వీరు గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతలోనే వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. వీరు విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. బబ్లూ తనకు ప్రపోజ్ చేసిన వీడియోను శీతల్ డిలీట్ చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. చదవండి: నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?