
తెలుగు ప్రేక్షకుల అభిమానం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. చిన్నా పెద్దా అని సంబంధం ఉండదు. మన భాష పరభాష అనేది పట్టించుకోరు. సినిమా నచ్చితే చాలు.. ఆ మూవీని, సదరు హీరోల్ని గుండెల్లో పెట్టేసుకుంటారు. ఇకపోతే తెలుగులోనూ కొందరు స్టార్ హీరోలకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్లలో కొందరు అప్పుడప్పుడు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు.
కర్నూలుకు చెందిన సాయి చరణ్ అనే కుర్రాడు.. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వీరాభిమానిలా ఉన్నాడు. ఎందుకంటే వచ్చే నెలలో తన పెళ్లి ఉంది. దీనికోసం ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ పంచుతున్నాడు. అందరిలా కాకుండా తన పెళ్లి పత్రికపై దేవుళ్ల ఫొటోలతో పాటు తను ఎంతో అభిమానించే మహేశ్ బాబు పిక్ కూడా ప్రింట్ చేశాడు.
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్!)
దీన్ని కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదెక్కడి అభిమానం రా బాబు అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇదే కాదు గతంలోనూ ఓసారి ఇలానే ఓ అభిమాని.. తన పెళ్లి కార్డుపై మహేశ్ బాబు ఫొటోని ముద్రించాడు. అప్పట్లోనూ దాని గురించి మాట్లాడుకున్నారు.
మహేశ్ బాబు సినిమాల విషయాలనికొస్తే.. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. 2027లో ఇది రిలీజ్ అవ్వొచ్చని అంటున్నారు. కానీ రాజమౌళితో మూవీ అంటే ఎప్పుడొస్తుందో చెప్పలేం. ప్రస్తుతానికైతే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మే నెలలో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ)
