Utsavam Movie
-
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
అప్పట్లో తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న బబ్లూ పృథ్వీరాజ్.. చాన్నాళ్ల పాటు టాలీవుడ్ కి దూరమైపోయారు. మళ్లీ ఏ క్షణాన 'యానిమల్'లో నటించారో గానీ వరసగా తెలుగు మూవీస్ చేస్తున్నారు. రీసెంట్ టైంలో తండేల్, సంక్రాంతికి వస్తున్నాం, అర్జున్ సన్నాఫ్ వైజయంతి తదితర చిత్రాల్లో నటించారు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్!) కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో పృథ్వీకి మంచి రోల్ పడింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది గానీ పృథ్వీ క్యారెక్టర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతేడాది తనకెదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు.'గతేడాది రిలీజైన ఉత్సవం సినిమాలో నేను కూడా నటించా. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నాకు కాల్ వచ్చింది. వేరే షూటింగ్స్ లో ఉంటే అనుమతి తీసుకుని ఇక్కడికి వచ్చా. తీరా ఈవెంట్ కి వచ్చి దర్శకనిర్మాతలని పలకరిస్తే నన్ను సరిగా పట్టించుకోలేదు. సరేలే బిజీలో ఉన్నారేమో అని స్టేజీ ముందు సీట్ లో కూర్చున్నాను. వేరే వాళ్లొచ్చిన ప్రతిసారి నన్ను పక్కకు జరిపేశారు. అలా ఆ వరసలో చివరకెళ్లిపోయా'(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) 'యాక్టర్స్ తో పాటు నా పక్కనే కూర్చున్న సాంగ్ రైటర్, మేకప్ ఆర్టిస్టుని కూడా స్టేజీపై పిలిచారు, నన్ను మాత్రం పట్టించుకోలేదు. ఈవెంట్ చివరలో గ్రూప్ ఫొటో రమ్మని పిలిస్తే స్టేజీపైకి వెళ్లా. అతిథిగా వచ్చిన అనిల్ రావిపూడితో మాట్లాడుతుంటే ఆయన్ని లాక్కెళ్లిపోయారు. ఫొటో దిగుతుంటే వెనక్కి వెళ్లి నిలబడమన్నారు. యానిమల్ మూవీతో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా. కానీ ఇక్కడేంటి ఎవరూ పట్టించుకోవట్లేదేంటి అనుకున్నా. ఆ రోజు మాత్రం చాలా బాధపడ్డాను' అని పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.దిలీప్ ప్రకాశ్ అనే కొత్త కుర్రాడిని పరిచయం చేస్తూ తీసిన సినిమా ఉత్సవం. రెజీనా హీరోయిన్. బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, ప్రియదర్శి, నాజర్, ఆమని, పృథ్వీరాజ్.. ఇలా చాలామంది స్టార్స్ నటించారు. కానీ మూవీ ఫ్లాప్ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి) -
ఓటీటీలో ఆకట్టుకుంటున్న 'ఉత్సవం'
దసరా సందర్భంగా థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా కొత్త చిత్రాల సందడి కనిపిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్గా వచ్చిన ఎమోషనల్ డ్రామా, సందేశాత్మక చిత్రం ‘ఉత్సవం.’ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ,రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధా వంటి భారీ తారాగణంతో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెలలో థియేటర్లోకి వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.అంతరించిపోతోన్న నాటక రంగం గురించి, వాటితో ముడిపడి ఉన్న ఎమోషన్స్‌ను, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా కథనంతో అద్భుతంగా చూపించారు. ఎమోషనల్, యూత్‌ఫుల్ లవ్ డ్రామాగా వచ్చిన ఉత్సవం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 11న అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చిన ఈ చిత్రం బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాకు రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీతో పాటు అనూప్ రూబెన్స్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన తెలుగు సినిమా
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం దాదాపు 20కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు వీటితో పాటే మరో తెలుగు సినిమా కూడా ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. నాటకాలు, వాటికి పునర్వైభవం తీసుకురావడం అనే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏ ఓటీటీలోకి వచ్చింది?(ఇదీ చదవండి: నీకు నయని నచ్చిందా? పృథ్వీ-విష్ణుప్రియ ప్రేమ ముచ్చట్లు!)ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, నాజర్, రాజేంద్ర ప్రసాద్.. ఇలా సీనియర్ నటుల్ని కీలక పాత్రల్లో నటించిన సినిమా 'ఉత్సవం'. దిలీప్ ప్రకాశ్ అనే కొత్త కుర్రాడు హీరోగా నటించగా, రెజీనా హీరోయిన్. స్టార్ నటీనటులు, భారీ బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. సెప్టెంబరు 13న థియేటర్లలో రిలీజైంది. కానీ ఎప్పుడొచ్చిందా అన్నంత వేగంగా వెళ్లిపోయింది. ఇప్పుడు ఎలాండి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'ఉత్సవం' కథ విషయానికొస్తే.. అభిమన్యు (ప్రకాశ్ రాజ్) సురభి నాటక మండలిలో కళాకారుడు. ఇతడి కొడుకు కృష్ణ(దిలీప్ ప్రకాశ్). అంతరించిపోతున్న నాటక కళాకారుల గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేసి, వాళ్ల కష్టాలు గట్టెక్కించాలని ప్రయత్నిస్తుంటాడు. ఓ ఈవెంట్ సందర్భంగా రమతో(రెజీనా) ప్రేమలో పడతారు. పెద్దలు వీళ్లకి పెళ్లి చేయాలని అనుకుంటారు. ఈ విషయం తెలియకు వీళ్లిద్దరూ పెళ్లి జరగడానికి ముందే పారిపోతారు. చివరకు వీళ్లకు పెళ్లయిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
‘ ఉత్సవం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉత్సవంనటీనటులు:దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ తదితరులునిర్మాత: సురేష్ పాటిల్రచన, దర్శకత్వం: అర్జున్ సాయిసంగీతం: అనూప్ రూరబెన్స్సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్విడుదల తేది: సెప్టెంబర్ 13, 2024కథేంటంటే..అభిమన్యు నారాయణ(ప్రకాశ్ రాజ్).. అంతరించి పోయిన సురభి నాటక మండలిలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు. అతని కొడుకు కృష్ణ(దిలీప్ ప్రకాశ్)కి కూడా నాటక కళాకారులు అంటే చాలా గౌరవం. అంతరించిపోతున్న నాటక కళాకారుల గొప్పదనాన్ని నేటి ప్రపంచానికి తెలియజేసి, వాళ్ల కష్టాలను గట్టేకించాలని ప్రయత్నిస్తుంటాడు. మరో రంగస్థల నటుడు మహాదేవ్ నాయుడు(నాజర్) కూతురు రమ(రెజీనా) సహాయంతో కార్పొరేట్ వీకెంట్ ఈవెంట్లో రంగస్థల నటులతో నాటక ప్రదర్శనను ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో రమ-కృష్ణలు ప్రేమలో పడతారు.అయితే ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోతారు. మరోవైపు స్నేహితులైన అభిమన్యు, మహాదేవ్‌లు కృష్ణ, రమలకు పెళ్లి చేయాలని ఫిక్సవుతారు. అయితే ఈ విషయం తెలియకుండా ఇద్దరు పెళ్లికి ఒప్పుకుంటారు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రమనే అని కృష్ణకు, పెళ్లి కొడుకు కృష్ణనే అని రమకు తెలియదు. మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఒకరికి తెలియకుండా ఒకరు ఇంట్లో నుంచి పారిపోతారు.అయితే ఈ విషయాన్ని అటు పెళ్లికొడుకు వాళ్లు, ఇటు పెళ్లి కూతురు వాళ్లు ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు దాచి..పెళ్లి సమయానికల్లా వాళ్లను వెతికి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటారు. అసలు రమ-కృష్ణలు ప్రేమలో ఎలా పడ్డారు? విడిపోవాడానికి గల కారణం ఏంటి? పెద్దలు ఫిక్స్ చేసిన సంబంధం కూడా ఇదేనని ఇద్దరికి ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు రమ-కృష్ణలు ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..సినిమాలకు స్పూర్తి నాటకాలు. ఆ నాటక కళాకారుల మీద తీసిన సినిమానే ‘ఉత్సవం’. ఒకవైపు రంగస్థల కళాకారులు కష్టాలను చూపిస్తూనే ఓ చక్కని ప్రేమకథను చెప్పొకొచ్చాడు దర్శకుడు అర్జున్ సాయి. డైరెక్టర్ రాసుకున్న పాయింట్ బాగున్నా..దాన్నితెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు. ఒకదానికొకటి సంబంధం లేని సన్నివేశాలు వస్తుంటాయి. అలాగే ఎమోషనల్ సీన్లు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సన్నివేశాలు గతంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం, ఈ మధ్యే వచ్చిన రంగమార్తండా సినిమాలను గుర్త చేస్తాయి. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ కొంతమేర ఆకట్టుకుంటుంది. (చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)ఫస్టాఫ్లోహీరో హీరోయిన్ల ప్రేమాయణంతో పాటు నాటక కళాకారులు కష్టాలను చూపించారు. ఇక సెకండాఫ్‌లో నాటకాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి హీరో చేసే ప్రయత్నం.. అలాగే వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటో చూపించారు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్ సినిమాకే హైలెట్. ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలను కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహించినట్లే రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే..దిలీప్ ప్రకాష్‌కి ఇది రెండో సినిమా . అయినా ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. తండ్రికి విలువనిచ్చే కొడుకుగా, ఓ మంచి ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రమ పాత్రలో రెజీనా ఒదిగిపోయింది. తెరపై అందంగా కనిపించింది. ఇక హీరో తండ్రి, రంగస్థల నటుడు అభిమన్యు నారాయణగా ప్రకాశ్ రాజు జీవించేశాడు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్లో శివుడి అవతారంలో కనిపించి.. తనదైన సంభాషణలతో ఆకట్టుకున్నాడు. మరో నాటక కళాకారుడు మహాదేవ్గా నాజర్ కూడా అదరగొట్టేశాడు. , రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అనూప్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
నాటకం అమ్మలాంటిది – అనిల్ రావిపూడి
‘‘నాటకం అమ్మలాంటిది. సినిమా అనేది ఆ అమ్మకి బిడ్డలాంటిది. నాటకాల గురించి ఈ తరానికి చాలా కొద్దిగా తెలిసి ఉంటుంది. కానీ, నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగాన్ని ఏలిన చాలామంది గొప్పనటులు ఉన్నారు. అలాంటి నాటకరంగాన్ని నేపథ్యంగా ఎంచుకుని మంచి కాన్సెప్ట్‌తో తీసిన ‘ఉత్సవం’ సినిమా విజయోత్సవం జరుపుకోవాలి’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జు¯Œ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనిల్ రావిపూడి అతిథిగా çహాజరయ్యారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ–‘‘నాటక రంగాన్ని బతికించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘నా మనసుకు దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు దిలీప్ ప్రకాష్. ‘‘కళ కోసం జీవితాలన్నీ అంకితం చేసిన 150 కుటుంబాలు ఉన్నాయి. వారి అంకితభావం చూసి ‘ఉత్సవం’ సినిమా తీశా’’ అని అర్జు¯Œ సాయి తెలిపారు. ‘‘ఉత్సవం’ చాలా మంచి సినిమా’’ అని సురేష్ పాటిల్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనూప్ రూబె¯Œ్స, లిరిక్ రైటర్ అనంతశ్రీరామ్, రైటర్ రమణ గోపిశెట్టి, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడారు. -
‘ఉత్సవం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రేక్షకుల మనసుని హత్తుకుంటాయి: రెజీనా కసాండ్రా
‘‘నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ నాటకాలంటే ఇష్టం. స్కూల్, కాలేజ్ డేస్‌లో వేశాను. నాటక రంగంపై పరిశోధన చేసి ‘ఉత్సవం’ కథని రాసుకున్నారు అర్జున్ సాయిగారు. ఈ సినిమాలో రంగస్థలం నటుల గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలుఉన్నాయి. అవన్నీ ప్రేక్షకుల మనసుని హత్తుకునేలా ఉంటాయి’’ అని హీరోయిన్ రెజీనా కసాండ్రా అన్నారు. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా అర్జున్ సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్‌పాటిల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న తెలుగు, కన్నడ, హిందీలో విడుదలవుతోంది. తెలుగులో మైత్రీ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా రెజీనా కసాండ్రా మాట్లాడుతూ–‘‘ఉత్సవం’లో కార్పోరేట్ ఎం΄్లాయ్‌పాత్ర చేశా. చాలా స్వతంత్ర భావాలున్న క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేయడం చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. స్వతంత్ర భావాలున్న మహిళలకు నాపాత్ర నచ్చుతుంది. అలాగని ఇది సందేశాత్మక చిత్రం కాదు.. అన్ని వాణిజ్య అంశాలున్న కథ. దిలీప్ ప్రకాష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ప్రకాష్ రాజ్‌గారు, నాజర్ గారు థియేటర్ ఆర్ట్స్ నుంచే వచ్చారు. వారితో వర్క్ చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. రసూల్‌గారి అద్భుతమైన విజువల్స్, అనూప్ రూబెన్స్గారి చక్కని సంగీతం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. నాకంటూ ప్రత్యేకమైన లక్ష్యాలు పెట్టుకోలేదు. నా మొదటి సినిమా ‘ఎస్ఎంఎస్’ చేసినప్పుడే వెర్సటైల్ నటిగా ఉండాలని భావించాను. అది దూరం కాకుండా ఇన్నాళ్లు వైవిధ్యమైనపాత్రలు చేసుకుంటూ వచ్చాను. ప్రస్తుతం సన్నీ డియోల్‌గారు హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఓ హిందీ సినిమా చేస్తున్నాను. అలాగే మరో రెండు హిందీ చిత్రాలు ఒప్పుకున్నాను’’ అన్నారు. -
‘ఉత్సవం' మనందరం గర్వపడే సినిమా
‘‘కన్నడలో ‘క్రేజీ బాయ్’ సినిమా చేశాను. తెలుగులో నా తొలి చిత్రం ‘ఉత్సవం’. సురభి నాటక సమాజం స్ఫూర్తితో రంగస్థల కళాకారులపై తీసిన సినిమా ఇది. చాలా మంచి కథ. ఈ చిత్రానికి కథే హీరో’’ అని దిలీప్ ప్రకాష్ అన్నారు. అర్జున్ సాయి దర్శకత్వంలో దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్ర లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. దిలీప్ ప్రకాష్ మాట్లాడుతూ– ‘‘సినిమాలు పుట్టిందే నాటకాల నుంచి. ఈ విషయాన్నే ‘ఉత్సవం’లో చూపిస్తున్నాం. ఈ మూవీలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తాయి. సందేశంలా కాకుండా వినోదాత్మకంగా చెబు తున్నాం. మనందరం గర్వపడే సినిమా ఇది. రెజీనాగారు మంచి కోస్టార్. నా తర్వాతి చిత్రం తెలుగులోనే ఉంటుంది’’ అన్నారు.