మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం దాదాపు 20కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు వీటితో పాటే మరో తెలుగు సినిమా కూడా ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. నాటకాలు, వాటికి పునర్వైభవం తీసుకురావడం అనే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏ ఓటీటీలోకి వచ్చింది?
(ఇదీ చదవండి: నీకు నయని నచ్చిందా? పృథ్వీ-విష్ణుప్రియ ప్రేమ ముచ్చట్లు!)
ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, నాజర్, రాజేంద్ర ప్రసాద్.. ఇలా సీనియర్ నటుల్ని కీలక పాత్రల్లో నటించిన సినిమా 'ఉత్సవం'. దిలీప్ ప్రకాశ్ అనే కొత్త కుర్రాడు హీరోగా నటించగా, రెజీనా హీరోయిన్. స్టార్ నటీనటులు, భారీ బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. సెప్టెంబరు 13న థియేటర్లలో రిలీజైంది. కానీ ఎప్పుడొచ్చిందా అన్నంత వేగంగా వెళ్లిపోయింది. ఇప్పుడు ఎలాండి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.
'ఉత్సవం' కథ విషయానికొస్తే.. అభిమన్యు (ప్రకాశ్ రాజ్) సురభి నాటక మండలిలో కళాకారుడు. ఇతడి కొడుకు కృష్ణ(దిలీప్ ప్రకాశ్). అంతరించిపోతున్న నాటక కళాకారుల గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేసి, వాళ్ల కష్టాలు గట్టెక్కించాలని ప్రయత్నిస్తుంటాడు. ఓ ఈవెంట్ సందర్భంగా రమతో(రెజీనా) ప్రేమలో పడతారు. పెద్దలు వీళ్లకి పెళ్లి చేయాలని అనుకుంటారు. ఈ విషయం తెలియకు వీళ్లిద్దరూ పెళ్లి జరగడానికి ముందే పారిపోతారు. చివరకు వీళ్లకు పెళ్లయిందా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్)
Comments
Please login to add a commentAdd a comment