నీకు నయని నచ్చిందా? పృథ్వీ-విష్ణుప్రియ ప్రేమ ముచ్చట్లు! | Bigg Boss 8 Telugu Day 39 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Day 39: బొక్క బోర్లా పడిన తేజ.. చివరకు గెలిచింది వాళ్లే

Published Fri, Oct 11 2024 8:24 AM | Last Updated on Fri, Oct 11 2024 9:13 AM

Bigg Boss 8 Telugu Day 39 Episode Highlights

బిగ్‪‌బాస్‌లో ప్రతిసారి హోటల్ టాస్క్ ఉంటుంది. ఈసారి కూడా అలాంటిది పెట్టారు. కానీ ఎక్కడో ఒకటో రెండో చోట్ల నవ్వు తప్పితే, పెద్దగా చూడాలనే ఇంట్రెస్ట్ కలిగించలేకపోయారు. పోటీపోటీగా సాగిన ఈ టాస్క్‌లో ఓజీ క్లాన్ సభ్యులే గెలిచారు. కానీ చివర్లో తేజ కిందపడిపోవడంతో కాస్త కంగారు అనిపించింది. ఇంతకీ 39వ రోజు బిగ్‌బాస్ హౌస్‌లో ఏమేం జరిగింది?

(ఇదీ చదవండి: 'విశ్వం' మూవీ ట్విటర్ రివ్యూ)

బుధవారం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి బీబీ హోటల్ టాస్క్ మళ్లీ షురూ చేశారు. మణికంఠతో రోహిణి డ్యాన్స్ చేయించింది. అంతలోనే ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్.. కొందరి పాత్రలని మార్చేశాడు. తేజ.. రోహిణి-అవినాష్‌కి అసిస్టెంట్ అని, కొడుకు గురించి గర్వంగా ఫీలవుతూ, అతడిని హీరోని చేద్దామని తల్లి పాత్ర హరితేజది అని.. ఆకతాయి అబ్బాయి కమ్ నయని బాయ్‌ఫ్రెండ్‌ గౌతమ్ అని, అవినాష్‌కి ఎట్రాక్ట్ అయిన హోటల్ మేనేజర్ ప్రేరణ అని, హోటల్ ఓనర్ నబీల్ కొడుకు పృథ్వీ అని ఫిక్స్ చేశారు.

ఇక స్టాఫ్ సేవలు మెచ్చి స్టార్ ఇవ్వాలని చెప్పడంతో.. యష్మి, సీతకు రాయల్ క్లాన్ సభ్యులు స్టార్ ఇచ్చారు. అలానే హోటల్ స్టాఫ్ శారీరక బలం ఏంటో తెలుసుకోవాలని, దానికోసం రాయల్ క్లాన్ పలు పోటీలు నిర్వహించాలని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. దీంతో తొలుత కప్ప గెంతులు గేమ్ పెట్టారు. యష్మి, ప్రేరణ ఇందులో ఓడిపోయారు. తర్వాత లెమన్ అండ్ స్పూన్ గేమ్ పెట్టగా నబీల్, పృథ్వీ ఔట్ అయిపోయారు.

(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)

చివరగా ఒంటికాలిపై రెండు చేతుల్లో నీళ్లున్న గ్లాస్ పట్టుకోవాలనే గేమ్ పెట్టగా.. సీత, నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియ పోటీపడ్డారు. చివరివరకు మణికంఠ, నిఖిల్‌ గెలిచారు. వీళ్లిద్దరికి.. స్విమ్మింగ్ పూల్ నుంచి స్పూన్స్ తెచ్చే టాస్క్ పెట్టగా మణి పూర్తిగా నిరాశపరిచాడు. నిఖిల్ గెలిచాడు. ఇతడికి స్టార్ ఇచ్చారు. మరోవైపు మణికంఠ గేమ్ కూడా నచ్చడంతో రాయల్ క్లాన్ సభ్యులు ఇతడికి కూడా స్టార్ ఇవ్వడం విశేషం.

ఇప్పటివరకు గేమ్స్‌ మూడ్ ఉన్నది కాస్త లవ్ మూడ్‌లోకి మారిపోయింది. ఓ చోట సోఫాలో కూర్చుని విష్ణుప్రియ-పృథ్వీ ప్రేమ కబుర్లు చెప్పుకొన్నారు. పృథ్వీ ఒడిలో పడుకుని మరీ విష్ణుప్రియ కబుర్లు చెప్పింది. ఈ డబ్బులు కూడా తీసుకో, కానీ నన్ను ప్రేమించు అని తెగ పోజులు కొట్టింది. పృథ్వీ ఏదో చెప్పబోతుంటే.. నీకు నిజంగా నయని నచ్చిందా అని విష్ణు అడిగింది. కాసేపు సైలెంట్‌గా ఉన్న పృథ్వీ.. తర్వాత లేదు అని బదులిచ్చాడు.

(ఇదీ చదవండి: రజనీకాంత్‌ "వేట్టయన్‌" మూవీ రివ్యూ)

ఇంటిలో నీటి సరఫరా ఆపేసి ఇరు టీమ్స్‌కి వాటర్ సేకరించే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ఓ చోట నుంచి మరో చోటుకి.. కింద అడుగుపెట్టకుండా దిగువన ఉన్న కొన్ని వస్తువులపై మాత్రమే నడుస్తూ గ్లాసుతో నీళ్లు పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇరు క్లాన్స్ నుంచి బాగా కష్టపడ్డారు కానీ ఓజీ క్లాన్ సభ్యులే ఇందులో విజయం సాధించారు. దీంతో విజేతకు రూ.25 వేలు ఇచ్చాడు బిగ్‌బాస్.

టాస్క్ పూర్తయిన తర్వాత ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమని బిగ్‌బాస్ అడిగాడు. కానీ తమ దగ్గర డబ్బులు తక్కువగా ఉండటంతో రాయల్ క్లాన్ సభ్యులకు అనుమానం వచ్చింది. ఓజీ క్లాన్ దగ్గరకు వెళ్లి అడగ్గా.. అవును దొంగతనం చేశానని సీత ఒప్పుకొంది. ఎంత అడిగినా సీత ఇవ్వకపోయేసరికి.. నాగ్ సర్ దగ్గర పంచాయతీ పెడదాం లే అని చాలాసేపు రచ్చ చేశారు. మెగా చీఫ్ నబీల్ వచ్చి సర్ది చెప్పేసరికి ఏమనుకుందో ఏమో గానీ సీత.. తన కొట్టేసిన డబ్బుల్ని తిరిగిచ్చేసింది. అలా రాయల్ క్లాన్ దగ్గర లక్ష 16 వేల 500 రూపాయలు.. ఓజీ క్లాన్ దగ్గర లక్ష 8 వేల 500 రూపాయలు ఉన్నాయి. దీంతో రాయల్ క్లాన్ విజయం సాధించింది. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement