ఓటీటీలో ఆకట్టుకుంటున్న 'ఉత్సవం' | Actress Regina Cassandra Latest Utsavam Movie Trending In OTT, Deets Inside | Sakshi
Sakshi News home page

Utsavam Movie OTT Response: ఓటీటీలో ఆకట్టుకుంటున్న 'ఉత్సవం'

Oct 13 2024 6:51 PM | Updated on Oct 14 2024 12:27 PM

 Utsavam Movie Trend In OTT

దసరా సందర్భంగా థియేటర్‌లతో పాటు ఓటీటీలో కూడా కొత్త చిత్రాల సందడి కనిపిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్‌గా వచ్చిన ఎమోషనల్ డ్రామా, సందేశాత్మక చిత్రం ‘ఉత్సవం.’ తాజాగా ఓటీటీలోకి వచ్చింది.  దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ,రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధా వంటి భారీ తారాగణంతో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెలలో థియేటర్లోకి వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

అంతరించిపోతోన్న నాటక రంగం గురించి, వాటితో ముడిపడి ఉన్న ఎమోషన్స్‌ను, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా కథనంతో అద్భుతంగా చూపించారు. ఎమోషనల్, యూత్‌ఫుల్ లవ్ డ్రామాగా వచ్చిన ఉత్సవం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 11న  అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చిన ఈ చిత్రం బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా  ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాకు రసూల్‌ ఎల్లోర్‌ సినిమాటోగ్రఫీతో పాటు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement