Rebel Star Krishnam Raju Wife Shyamala Devi Gets Very Emotional His Demise - Sakshi
Sakshi News home page

Krishnam Raju Wife Shyamala Devi: కృష్ణంరాజు పార్థివదేహాన్ని మోసిన భార్య.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు

Published Mon, Sep 12 2022 1:55 PM | Last Updated on Mon, Sep 12 2022 4:41 PM

Krishnam Raju Wife Shyamala Devi Gets Emotional After His Demise - Sakshi

ప్రముఖ సినీ నటుడు, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు కడసారి చూపుకోసం అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌజ్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఇప్పటికే ఆయన అంతియాత్ర ప్రారంభమైంది.  అయితే ఆయన నివాసం నుంచి  ఫామ్‌హౌజ్‌కు భౌతికకాయాన్ని తరలించేముందు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు కలిచివేస్తున్నాయి.

చదవండి: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా?

పార్థివదేహాన్ని మోసుకెళ్లేటప్పుడు సాధారణంగా మహిళలు ముందుకు రారు. కానీ శ్యామలాదేవి మాత్రం తన భర్త పార్థివదేహాన్ని స్వయంగా తన భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కృష్ణంరాజు, శ్యామలా దేవిల మధ్య మంచి అనుబంధం ఉండేది. ఇండస్ట్రీలో ఆది దంపతులుగా పేరు సంపాదించుకున్న ఈ జంట  ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసేవెళ్లేవారు.

అంతేకాకుండా కృష్ణంరాజుగారే నాకు పెద్ద గిఫ్ట్‌ అని పలు సందర్భాల్లో శ్యామలా దేవి చెబుతుండేవారు. కృష్ణంరాజు పార్థివదేహాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలా దేవి విలపించిన దృశ్యాలు హృదయవిదాకరంగా ఉన్నాయి. చదవండి: కృష్ణంరాజు అంతిమయాత్ర.. అంత్యక్రియలకు వాళ్లకు మాత్రమే అనుమతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement