![KTR Paid Tribute To Rebel Star Krishnam Raju - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/11/KTR.jpg.webp?itok=eJZv7qdm)
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం కారణంగా రెబల్‌స్టార్ కృష్ణంరాజు(83) ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కృష్టంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కృష్టంరాజు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. తన విలక్షణ నటనతో ప్రజల గుండెల్లో నిలిచారు. కృష్ణంరాజు వివాద రహిత వ్యక్తి. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తాము అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కృష్టంరాజు కుటుంబ సభ్యులకు కేటీఆర్.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment