సినీ ఇండస్ట్రీలో రెబల్‌స్టార్‌గా పేరుగాంచిన కృష్ణంరాజు.. రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. 1991లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1998 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆయన కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు.
1999 మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలిచి వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మరోసారి బీజేపీలో చేరారు.
కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రెబల్‌స్టార్ కృష్ణం రాజు(83) ఆదివారం తెల్లవారుజామున ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు.
చదవండి: (Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment