టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విని అభిమానులు షాక్‌కి గురయ్యారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా కృష్ణంరాజు మృతికి నివాళిగా టాలీవుడ్‌లో షూటింగ్‌లు ఆపకపోవడంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు సిగ్గు సిగ్గు’ అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.ఆయనకు వీడ్కోలు ఇవ్వకపోవడం మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అని రాంగోపాల్ వర్మ ద్వజమెత్తారు.
'మనసు లేకపోయినా ఓకే..కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
చదవండి: ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు
భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!
— Ram Gopal Varma (@RGVzoomin) September 11, 2022
Comments
Please login to add a commentAdd a comment