
సాక్షి, హైదరాబాద్: గోహత్య నిషేదంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు ప్రవేశపెట్టింది కృష్ణంరాజు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తర్వాత కాలంలో యోగి ఆదిత్యనాథ్ కూడా గోహత్య నిషేద బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారని కృష్ణంరాజు సంతాపసభలో రాజ్‌నాథ్‌సింగ్ గుర్తుచేసుకున్నారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన నేరుగా కృష్ణంరాజు ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభకు హాజరై ప్రసంగించారు.
Joining condolence meeting in remembrance of Late Krishnam Raju Garu.
— Rajnath Singh (@rajnathsingh) September 16, 2022
https://t.co/piAGuhVpgQ
'కృష్ణంరాజుని నేను అన్నగారు అని సంభోధించేవాడిని. ఆయన దశదిన కర్మరోజు వద్దామనుకున్నా. కానీ షెడ్యూల బీజీ కారణంగా ఈ రోజే వచ్చాను. బాహుబలి సినిమా చూడాలని కృష్ణంరాజు కోరారు. మా ఫ్యామిలీ, కృష్ణంరాజు ఫ్యామిలీ కలిసి బాహుబలి సినిమా చూశాం. చాలా బాగుంది. ఆయన మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు. కృష్ణంరాజు తెలుగు ప్రజలకు రాజకీయ నాయకుడు, సినిమా స్టార్, రెబల్ స్టార్. కానీ ఆయన స్వగ్రామంలో మాత్రం తాను అందరికీ సొంత వ్యక్తి. గ్రామంలో ప్రతీ ఒక్కరిని కృష్ణంరాజు గుర్తు పడతారు.. అందరినీ పేరుతో పిలుస్తారు' అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: (ప్రభాస్‌తో ఫోన్‌లో మాట్లాడినా ఏదో వెలితి ఉందన్నారు: కిషన్‌రెడ్డి)