condolence meet
-
ఆదిలాబాద్ జిల్లాకు నర్సారెడ్డి పేరు పెట్టేందుకు కృషి
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేసిన మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరును ఆదిలాబాద్ జిల్లాకు పెట్టేందుకు కృషి చేస్తానని, ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతానని నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన నర్సారెడ్డి సంతాప సభలో మాజీ మంత్రులు జానారెడ్డి, వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ మహే ష్‌కుమార్‌గౌడ్, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో ఎన్నో పద వులు చేపట్టిన నర్సారెడ్డి సిద్ధాంతం, విలువల కోసం ఎప్పు డూ పాటు పడేవారని కొనియాడారు. మాజీ మంత్రి జానా రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నర్సారెడ్డి శాసనసభ ఐక్య వేదిక ఫోరాన్ని ఏర్పాటు చేసి పోరాటం చేశారని, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. వీహెచ్ మాట్లా డుతూ నర్సారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు. మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ నర్సారెడ్డి నియమ, నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీలో పని చేశారన్నారు. కోదండరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పోరాటం చేశారనీ, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన భూ సంస్కరణలో రెవెన్యూ మంత్రిగా తన భూమిని పేదలకు త్యాగం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. -
TS: హత్యా రాజకీయాలు చెల్లవు: కేటీఆర్
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణలో హత్యా రాజకీయాలు చెల్లవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణలో హత్య రాజకీయాలు మొదలయ్యాయని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణలో హింసా రాజకీయాల సంస్కృతిని ప్రోత్సహిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ మొత్తం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త రిటైర్డ్ ఆర్మీ జవాన్ మల్లేష్ కుటుంబాన్ని ఆదివారం కేటీఆర్ పరామర్శించారు. మల్లేష్ కుటుంబానికి పార్టీ తరపున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కేటీఆర్ వెంట పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు కేటీఆర్ ఇటీవలే సోదరుడిని కోల్పోయిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని పరామర్శించారు. వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఇదీచదవండి.. మల్కాజ్గిరి ఎంపీ సీటుపై మాజీ మంత్రి కన్ను -
దశదిన కర్మరోజు వద్దామనుకున్నా.. అందువల్లే ఈ రోజు వచ్చా: రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, హైదరాబాద్: గోహత్య నిషేదంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు ప్రవేశపెట్టింది కృష్ణంరాజు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తర్వాత కాలంలో యోగి ఆదిత్యనాథ్ కూడా గోహత్య నిషేద బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారని కృష్ణంరాజు సంతాపసభలో రాజ్‌నాథ్‌సింగ్ గుర్తుచేసుకున్నారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన నేరుగా కృష్ణంరాజు ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభకు హాజరై ప్రసంగించారు. Joining condolence meeting in remembrance of Late Krishnam Raju Garu. https://t.co/piAGuhVpgQ — Rajnath Singh (@rajnathsingh) September 16, 2022 'కృష్ణంరాజుని నేను అన్నగారు అని సంభోధించేవాడిని. ఆయన దశదిన కర్మరోజు వద్దామనుకున్నా. కానీ షెడ్యూల బీజీ కారణంగా ఈ రోజే వచ్చాను. బాహుబలి సినిమా చూడాలని కృష్ణంరాజు కోరారు. మా ఫ్యామిలీ, కృష్ణంరాజు ఫ్యామిలీ కలిసి బాహుబలి సినిమా చూశాం. చాలా బాగుంది. ఆయన మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు. కృష్ణంరాజు తెలుగు ప్రజలకు రాజకీయ నాయకుడు, సినిమా స్టార్, రెబల్ స్టార్. కానీ ఆయన స్వగ్రామంలో మాత్రం తాను అందరికీ సొంత వ్యక్తి. గ్రామంలో ప్రతీ ఒక్కరిని కృష్ణంరాజు గుర్తు పడతారు.. అందరినీ పేరుతో పిలుస్తారు' అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (ప్రభాస్‌తో ఫోన్లో మాట్లాడినా ఏదో వెలితి ఉందన్నారు: కిషన్‌రెడ్డి) -
ప్రభాస్‌తో ఫోన్లో మాట్లాడినా ఏదో వెలితి ఉందన్నారు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్ సొసైటీలో దివంగత సినీనటుడు కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో జేఆర్సీ కన్వెన్షన్‌లో శుక్రవారం కృష్ణంరాజు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత విలక్షణ నటుడు కృష్ణంరాజు అని అన్నారు. అందరూ చనిపోతారు. కొంతమందే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారిలో కృష్ణంరాజు ఒకరని పేర్కొన్నారు. 'నేను చిన్నప్పుడు కృష్ణంరాజు సినిమాలు చూసాను. మర్యాదకు మారుపేరు రాజు. ప్రభాస్ కూడా కృష్ణంరాజు స్థాయికి ఎదిగాడు' అని మంత్రి తలసాని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 'కృష్ణంరాజు మరణం మా పార్టీ దురదృష్టం. కృష్ణంరాజు చనిపోగానే రాజ్‌నాథ్ సింగ్ కాల్ చేసి ప్రభాస్ నంబర్ అడిగారు. ప్రభాస్‌తో ఫోన్లో మాట్లాడినా తన మనసులో వెలితి ఉందని, వాళ్ల కుటుంబాన్ని కలుద్దామని రాజ్‌నాథ్ అన్నారు. కృష్ణంరాజు ఇటీవలే కాల్ చేసి ప్రధానిని కలవాలి అన్నారు. అల్లూరి విగ్రహం ఆవిష్కరణకు భీమవరం వస్తానని కృష్ణంరాజు అన్నారు. కృష్ణంరాజు తన ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్లడానికి మేం అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా వల్ల వెళ్లలేకపోయారు. కల్మషం లేని వ్యక్తి కృష్ణంరాజు' అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: (కృష్ణంరాజు కుటుంబానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరామర్శ) -
కృష్ణం రాజు సంతాప సభ (ఫొటోలు)
-
గౌతంరెడ్డి లేరన్న విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: సీఎం జగన్
-
మనసుకి కష్టంగా ఉంది: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు: గౌతమ్ మన మధ్య లేడనే విషయం నమ్మడానికి మనసుకి కష్టంగా ఉందని, ఎంత చెప్పినా ఆయన లేని లోటు తీరనిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ హాలులో సోమవారం జరిగిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం జగన్.. గౌతమ్ చిత్రపటానికి నివాళి అర్పించి అనంతరం ప్రసంగించారు. గౌతమ్‌రెడ్డి లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం అని, ప్రతీ అడుగులో గౌతం తనకు తోడుగా ఉండేవాడని సీఎం జగన్ అన్నారు. రాజమోహన్ గారికంటే గౌతమ్ ఆత్మీయత తనకు ఎక్కువగా అనిపించేదని, తన ప్రోత్సాహంతోనే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో తనకు తోడుగా, స్నేహితుడిగా ఉండేవారన్నారు. వయసులో పెద్దవాడైనా.. ఆ గర్వం కనిపించేది కాదని, పైగా సోదర భావంతో మెలిగేవాడని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర పెట్టుబడుల కోసం ఎంతో తాపత్రయపడ్డాడని, చివరి క్షణం వరకూ రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డారని చెప్పారు. ఆ కుటుంబానికి తానే కాదు.. వైఎస్సార్సీపీ మొత్తం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు సీఎం జగన్. -
ఉసా, గస్తీ సంస్మరణ సభ రేపు
సాక్షి, హైదరాబాద్: ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉప్పుమావులూరి సాంబశివరావు(ఉసా), రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ సంస్మరణ ఆదివారం జరగనుంది. కర్మాన్‌ఘాట్ దుర్గానగర్‌లోని జేవీఆర్ ట్రస్ట్ భవన్లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ వీ చంద్రవదన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ప్రజాశక్తి మాజీ సంపాదకులు ఎస్. వినయ్‌కుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. దుగ్యాల అశోక్, సీఎల్ఎన్ గాంధీ, ఎస్. రామానందస్వామి, ఎం గంగాధర్, కె. వెంకటేశ్వరరావు, ఆర్. వెంకటేశ్వర్లు, డాక్టర్ సారంగపాణి ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరగనుంది. దళిత బహుజనుల ఆత్మగౌరవం కోసం జీవిత కాలం పోరాడిన ఉసా కరోనా బారిన పడి కన్నుమూశారు. జూలై 25న హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో జన్మించిన ఉసా దళిత, బహుజన, ఉద్యమ మేధావిగా ఎదిగారు. పీడిత ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసి ఉద్యమాల ఉపాధ్యాయుడిగా మన్ననలు అందుకున్నారు. కర్ణాటక నుంచి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అశోక్ గస్తీ(55) సెప్టెంబర్ 17న కరోనాతో చనిపోయారు. కర్ణాటకలో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)లో అంచెలంచెలు ఎదిగి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే ఆయన కన్నుమూయడంతో కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ అగ్ర నాయకులు షాక్‌కు గురయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండానే అశోక్ గస్తీ ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. -
నాన్నది కల్మషం లేని మనసు
సాక్షి కడప: ‘నాన్న వెరీ వెరీ సింపుల్ పర్సన్. ఆయన హస్తవాసి మంచిది కాబట్టి చనిపోయే పరిస్థితిలో ఉన్న చిన్నారులను కూడా బతికించేవారు. ఎక్కడా బాగు కాని కేసులు వచ్చేవి. వారందరినీ బతికించి, అందరి హృదయాలలో నాన్న చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు’ అని ఆయన కుమార్తె, సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ భారతితోపాటు పలువురు డాక్టర్ ఈసీ గంగిరెడ్డిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని వైఎస్ భారతి ఇలా గుర్తు చేసుకున్నారు. చెట్ల కింద ఉండి చూపించుకుని పోయేవాళ్లు ► ‘మేము పులివెందులలో పాత ఆసుపత్రి మేడపైన ఉన్నప్పుడు కింద ఎవరైనా చిన్నపిల్లలు ఏడ్చినా.. ఏదైనా అరుపు వినిపించినా నాన్న వెంటనే ఫోన్ చేసి అక్కడి సిస్టర్లకు చెప్పేవారు. ఎన్నోసార్లు నేను చూశాను. చివరకు పైనుంచి కిందకు దిగివెళ్లి ఏడుస్తున్న బాబు తల్లిదండ్రులతో మాట్లాడేవారు. ► ఆస్పత్రిలో బెడ్స్ లేవన్నా.. నాన్న హస్తవాసి మంచిదని, చెట్ల కింద మంచాలు వేసుకుని చూపించుకుని పోయిన వాళ్లు కోకొల్లలుగా ఉన్నారు. పేదలు, వికలాంగులతో ప్రత్యేకంగా మాట్లాడేవారు. వారికి వైద్యం అందించడమే కాకుండా వ్యక్తిగత ఇబ్బందులు తీర్చేవారు. ► విద్యార్థులు, గల్ఫ్ దేశాలలో ఉన్న ముస్లిం కుటుంబాలకు చెందిన వారికి ఉచితంగా వైద్యం అందించేవారు. ఎందుకంటే గల్ఫ్‌లో ఉంటున్న వారి కష్టాలు, విద్యార్థులు, దివ్యాంగుల కష్టాలు ఆయనకు బాగా తెలుసు కాబట్టి. చిన్న పిల్లల మనస్తత్వం ► చివరకు ప్రత్యర్థులను కూడా ప్రేమతో చూస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదించిన మంచి మనిషి నాన్న. అక్కడ ఉన్న చిన్నపిల్లలను చూసి హర్షమ్మ, వర్షమ్మ అని పిలుచుకునే గొప్ప మనస్తత్వం ఆయనది. 40 ఏళ్ల పాటు ఆయన్ను చూశాను. ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరించేవారు. సీరియస్‌గా ఉండేవారు కాదు. ► అత్యవసరంగా ఎక్కడికన్నా వెళ్లాల్సి వచ్చినా చికిత్స అందించిన తర్వాతే ముందుకు అడుగు వేసేవారు. మూగ, చెవిటి, వికలాంగులను ప్రేమగా దగ్గరకు తీసుకునేవారు. ఇంట్లోకి వెళ్లండి.. భారతమ్మ, దినేష్‌లను కలవండి.. అని చెప్పి పంపేవారు. ► పేషెంట్లను చూస్తున్నప్పుడు నాన్న వెంట అమ్మ ఉండేది. నాన్న చనిపోయాక చూడటానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది పేదలు, పిల్లలు, దివ్యాంగులే. నాన్నది సున్నిత మనస్తత్వం. తొందరగా బాధ పడతారు.. అంతే తొందరగా సంతోష పడతారు. ఒక రకంగా చెప్పాలంటే చిన్న పిల్లల మనస్తత్వం’ అని వైఎస్ భారతి గుర్తు చేసుకున్నారు. ► ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్నేహితులు, అభిమానులు, సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, ఈసీ సుగుణమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, డాక్టర్ ఈసీ దినేష్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్ ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఉదయం పులివెందులకు వచ్చారు. స్థానిక వైఎస్సార్ ఆడిటోరియం ఆవరణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిత్ర పటం వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ► ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రి విశ్వరూప్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, కడప, రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమరనాథరెడ్డి, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గౌతమి, తదితరులు పాల్గొన్నారు. -
పులివెందుల : ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్
-
నాన్న వైద్యం కోసం జనం తరలివచ్చేవారు: వైఎస్ భారతి
-
ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్
సాక్షి, పులివెందుల: భాకారాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ కొనసాగుతోంది. తన మామ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈసీ గంగిరెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పులివెందులలో కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ బయలు దేరి వెళతారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. పిల్లల దేవుడుగా గుర్తింపు పొందిన ప్రముఖ వైద్యుడు, పులివెందుల మాజీ ఎంపీపీ డాక్టర్ ఎద్దుల చెంగల్‌రెడ్డి గారి గంగిరెడ్డి (ఈసీ గంగిరెడ్డి) శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను రెండు వారాల క్రితం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు. ఈసీ గంగిరెడ్డికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు దినేశ్ రెడ్డి కూడా వైద్యులే. ఆయన కుమార్తె వైఎస్ భారతి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి. నాన్న మరణం మాకు తీరని లోటు తండ్రి మరణంపై వైఎస్ భారతి ఉద్వేగానికి లోనయ్యారు. ఈసీ గంగిరెడ్డి జ్ఞాపకాలను స్మరిస్తూ కంటతడి పెట్టారు. ఆయన సంస్మరణలో సభలో వైఎస్ భారతి మాట్లాడారు. ‘మా నాన్న ఈసీ గంగిరెడ్డి మనసున్న డాక్టర్. ఆయన హస్తవాసి మంచిదన్న పేరుంది. ప్రజల వైద్యుడిగా నాన్నకు మంచి గుర్తింపు ఉంది. క్రమశిక్షణ, విలువలు పాటించి నాన్న అందరికీ అదర్శంగా నిలిచారు. ప్రతి రోజూ 300 మంది రోగులకు వైద్య సేవలు అందించేవారు. రోజూ పనిలో ఎంత బిజీగా ఉన్నా ఎవరైనా కలవడానికి వస్తే..నాన్న ఆప్యాయంగా పలకరించే వారు. తనకు వ్యతిరేకంగా ఉన్నా.. వారితో ప్రేమగా మాట్లాడేవారు. వైద్యం కోసం వచ్చేవారిని ఆత్మీయులుగా భావించేవారు. పేదలకు వైద్య సేవలు అందించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.. నాన్న మరణం మాకు తీరని లోటు’అని వైఎస్ భారతి పేర్కొన్నారు. (చదవండి: డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఇక లేరు) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చెన్నైలో శ్రీదేవి సంతాప సభ
-
డల్లాస్‌లో సినారె సంతాప సభ
డల్లాస్ : ప్రముఖ తెలుగు కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డికి డల్లాస్‌లోని తెలుగువారు ఘన నివాళులు అర్పించారు. టాంటెక్స్, ఆటా, తానా, నాటా, డాటా, టాటా, నాట్స్, కళా వాహిని,టీ, టీడీఎఫ్ సంఘాల సహకారంతో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్(టీపీఏడీ) ఆధ్వర్యంలో బసెర ఇండియన్ రెస్టారెంట్లో సినారె సంతాప సభ జరిగింది. పెద్ద మొత్తంలో తెలుగు ప్రజలు ఒక్కచోట చేరి డా.సి. నారాయణరెడ్డి మృతిపై తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సి. నారాయణరెడ్డి మరణ వార్త తెలియగానే టీపీఏడీ సభ్యులు శారదా సింగిరెడ్డి, రావు కల్వల, రఘువీర్ బండారు, మాధవి సుంకిరెడ్డి, అశోక్ కొండల, కరణ్ పోరెడ్డి, ఉపెందర్ తెలుగులు సంతాప సభను ఏర్పాటు చేశారు. డా. సాంబ శివ రావు, డా. ఆల్ల శ్రీనివాస్ రెడ్డి, తోటకూర ప్రసాద్, రావు కల్వల, రఘువీర్ బండారు, శారదా సింగిరెడ్డిలు సి. నారాయణరెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శారదా సింగిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో ఒక వెలుగు వెలిగిన మేరు పర్వతం మేను వాల్చింది. ప్రపంచ మహోన్నత కవులకు తీసి పోనంతగా విశ్వంభర తో విశ్వ నరుడిగా వెలుగొందిన వాడు. కవిలోకానా సూర్యుని వలె కవితా కాంతులుగా వెలుగొందిన వాడు. యింతటి మహా కవిని తెలుగుతల్లి , తెలుగునేల కనడానికి ఎన్నేళ్లు పడుతుందో కదా! అంటూ సినారె లేనిలోటు తీర్చలేనిదిగా అభివర్ణించారు. -
10న దాసరి సంతాప సభ
ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు సంతాపసభను ఈ నెల 10వ తారీఖున నిర్వహించనున్నట్టుగా తెలిపారు. దాసరి సమకాలీనులైన తెలుగు సినీ ప్రముఖుల చాలా మంది ప్రస్తుతం అందుబాటులో లేని కారణంగానే సంతాప సభ ఆలస్యమయ్యిందని తెలిపారు. దాసరి మంచి ఫాంలో ఉన్న 80ల నాటి స్టార్స్ చాలా మంది ప్రస్తుతం చైనాలో ఉన్నారు. అందరూ అందుబాటులో ఉన్న సమయంలో సంతాప సభ నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈనెల 10న సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా సి.కళ్యాణ్ తెలిపారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ ఈ సభకు ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ హాజరవుతారని తమ మధ్య ఎలాంటి గ్రూపుల్లేవని తెలిపారు. -
'భార్యగానే కాదు.. మంచి స్నేహితురాలు కూడా'
ఆళ్లగడ్డ: భార్యగానే కాదు.. మంచి స్నేహితురాలు కూడా తనకు శోభానాగిరెడ్డి దగ్గరయిందని భూమా నాగిరెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన శోభా నాగిరెడ్డి సంతాప సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శోభ లేని లోటు తీరనిదని, ఎంతో బాధగా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి రోజు తన జీవితంలో ఉంటుందని ఊహించలేదని చెప్పారు. ప్రస్తుతం తాను బతికి ఉన్నానంటే అది తన పిల్లలకోసమేనని చెప్పారు. శోభా నాగిరెడ్డి జీవితమంతా కష్టాలే అనుభవించిందని చెప్పారు. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి గుర్తు చేశారు. తమది చాలా పెద్ద కుటుంబమన్న ఆయన ఆమె తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకునేదని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్న.. ఎక్కడ ఉన్నా నెంబర్ వన్ గా ఉండాలని కోరుకునేవారని చెప్పారు. తనకు వైఎస్ఆర్ తప్ప ఎవరూ తెలియదని, వైఎస్ఆర్ మరణం తర్వాతే తాను జగన్‌ను కలిసినట్లు తెలిపారు. జగన్ సీఎం కావాలని శోభా నాగిరెడ్డి కోరుకున్నారని చెప్పారు. ఆమె అడుగు అడుగునా ఇదే విషయం చెప్పారని.. ప్రతి చోట అదే మాట పలికారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శోభా నాగిరెడ్డి చివరి బహిరంగ సభలో కూడా జగన్ సీఎం కావాలనే కోరుకున్నారని భూమా అన్నారు. -
విద్యాపీఠం మూగబోయింది
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం చాన్స్‌లర్, అస్సాం మాజీ గవర్నర్, ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి జానకివల్లభ పట్నాయక్ మృతితో విద్యాపీఠం మూగబోయింది. విద్యాపీఠంలో మంగళవారం జరగాల్సిన 18వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన గుండెపోటుతో కన్నుమూయడం విద్యార్థులను కలచి వేసింది. విద్యాపీఠంలోని అన్ని కార్యక్రమాలు రద్దు అయ్యాయి. విద్యాపీఠం మూగబోయింది. నేడు సంస్మరణ సభ జరుగనుంది. యూనివర్సిటీక్యాంపస్: ఒరిస్సాకు చెందిన జేబీ పట్నాయక్ 2007 సంవత్సరం సెప్టెంబర్‌లో విద్యాపీఠం చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఈయన పదవీ కాలం 2012లో ముగిసింది. అయినా ఈయనను చాన్స్‌లర్‌గా నియమించారు. 2017, సెప్టెంబర్‌కు ఈయన పదవీకాలం ముగియాల్సి ఉంది. సంస్కృత విద్యాపీఠం డీమ్డ్ యూనివర్సిటీ కావడంతో అప్పుడు అస్సోం గవర్నర్‌గా పనిచేస్తున్న జేబీ పట్నాయక్‌ను విద్యాపీఠం వైస్ చాన్స్‌లర్‌గా నియమించారు. విద్యాపీఠం చాన్స్‌లర్ జేబీ పట్నాయక్ ఆకస్మిక మృతితో మంగళవారం జరగాల్సిన స్నాతకోత్సవాన్ని రద్దు చేశారు. ఈయన సంస్మరణ సభను బుధవారం నిర్వహిస్తున్నట్టు విద్యాపీఠం పీఆర్వో దక్షిణామూర్తిశర్మ తెలిపారు. -
ఈ 22న రామానాయుడు సంస్మరణ సభ
హైదరాబాద్ సిటీ: టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు సంస్మరణ సభను ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించనున్నారు. ఈ సభకు లలితా కళా పరిషత్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఈ సంస్మరణ సభలో పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. -
ఎంఎస్ నారాయణను అప్పడే మరిచిపోయారా?
కమెడియన్‌గా టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి ఎంఎస్ నారాయణ. 700కు పైగా సినిమాలలో తన నటనతో ప్రేక్షకులకు ఆయన నవ్వుల జల్లులు కురిపించారు. ఆశ్చర్యకర విషయమేమంటే... ఇటీవలే మరణించిన ఎమ్మెస్ నారాయణ గౌరవార్థం సంస్మరణ సభను తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం. టాలీవుడ్ నటీనటులు ఎవరైనా మరణిస్తే వారి గౌరవార్థం సంస్మరణ సభను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఎంఎస్ నారాయణ మరణించి వారం రోజులు అవుతున్నా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ గాని, మూవీ అసోసియేషన్ కాని, తెలుగు చిత్ర నిర్మాతల మండలి గాని, దర్శకుల మండలి... ఇలా ఎవరూ ఎంఎస్ సంస్మరణ సభ ఏర్పాటు విషయాన్ని పట్టించుకోకపోవడం తెలుగు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. కాగా ఎంఎస్ కుటుంబసభ్యులు సంస్మరణసభ ఏర్పాటు విషయమై 'మూవీ ఆర్ట్ అసోసియేషన్ (మా) 'ని సంప్రదించగా, సభ లాంటివి నిర్వహించేది లేదనే సమాధానం వారిని బాధకు గురి చేసిందని సమాచారం. ఓ నటుడు టాలీవుడ్‌కి పరిచయమైన 20 ఏళ్లలోనే 700 సినిమాలలో నటించడం అనేది మామూలు విషయం కాదు. ఎంఎస్ నారాయణ నటుడుగానే కాకుండా దర్శకత్వంతో పాటు రచయితగానూ చిత్ర పరిశ్రమకు సేవలందించారు. అనారోగ్యంతో ఎంఎస్ నారాయణ జనవరి 24న మృతి చెందిన విషయం తెలిసిందే.