'భార్యగానే కాదు.. మంచి స్నేహితురాలు కూడా' | shobha not only my wife and also my friend | Sakshi
Sakshi News home page

'భార్యగానే కాదు.. మంచి స్నేహితురాలు కూడా'

Published Fri, Apr 24 2015 12:39 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

'భార్యగానే కాదు.. మంచి స్నేహితురాలు కూడా'

'భార్యగానే కాదు.. మంచి స్నేహితురాలు కూడా'

ఆళ్లగడ్డ: భార్యగానే కాదు.. మంచి స్నేహితురాలు కూడా తనకు శోభానాగిరెడ్డి దగ్గరయిందని భూమా నాగిరెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన శోభా నాగిరెడ్డి సంతాప సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శోభ లేని లోటు తీరనిదని, ఎంతో బాధగా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి రోజు తన జీవితంలో ఉంటుందని ఊహించలేదని చెప్పారు. ప్రస్తుతం తాను బతికి ఉన్నానంటే అది తన పిల్లలకోసమేనని చెప్పారు. శోభా నాగిరెడ్డి జీవితమంతా కష్టాలే అనుభవించిందని చెప్పారు. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి గుర్తు చేశారు.

తమది చాలా పెద్ద కుటుంబమన్న ఆయన ఆమె తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకునేదని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్న.. ఎక్కడ ఉన్నా నెంబర్ వన్ గా ఉండాలని కోరుకునేవారని చెప్పారు. తనకు వైఎస్ఆర్ తప్ప ఎవరూ తెలియదని, వైఎస్ఆర్ మరణం తర్వాతే తాను జగన్ను కలిసినట్లు తెలిపారు. జగన్ సీఎం కావాలని శోభా నాగిరెడ్డి కోరుకున్నారని చెప్పారు. ఆమె అడుగు అడుగునా ఇదే విషయం చెప్పారని.. ప్రతి చోట అదే మాట పలికారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శోభా నాగిరెడ్డి చివరి బహిరంగ సభలో కూడా జగన్ సీఎం కావాలనే కోరుకున్నారని భూమా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement