shobha nagireddy
-
శోభమ్మ అభివృద్ధి చేయలేదా?
మరోవైపు అభివృద్ధి చేయలేదంటూ పరోక్షంగా శిల్పాపై భూమా విమర్శలు మండిపడుతున్న మాజీ మంత్రి సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యలు ఆ రెండు నియోజకవర్గాలతో పాటు అధికార పార్టీ నేతల్లోనూ కలకలం రేపుతున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొదటి నుంచీ భూమా కుటుంబ సభ్యులదే హవా. సుమారు రెండు దశాబ్దాల పాటు నియోజకవర్గాన్ని పాలించింది ఆ కుటుంబమే. అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి జరగలేదన్న భూమా అఖిలప్రియ వ్యాఖ్యలపై ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. అంటే తమ కుటుంబ హయాంలోనే అభివృద్ధి జరగలేదంటూ.. అందులోనూ శోభమ్మ అభివృద్ధి చేయలేదనే రీతిలో ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని కేడర్ బాధపడుతున్నట్లు సమాచారం. మరోవైపు నంద్యాలను గతంలో అభివృద్ధి చేయలేదంటూ భూమా నాగిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల శిల్పా వర్గీయులు గుర్రుమంటున్నారు. తమ నేతను లక్ష్యంగా చేసుకునే భూమా మాట్లాడారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా చేరికలు అధికార పార్టీలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. రెండు దశాబ్దాల పాలనలో.. వాస్తవానికి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొదటి నుంచి భూమా కుటుంబానిదే హవా. 1989 లో భూమా శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆ కుటుంబం నుంచి రంగప్రవేశం చేశారు. అయితే, 1992 లో శేఖర్ రెడ్డి చనిపోవడంతో భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో సాధారణ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటికీ.. ఆ తర్వాత ఎంపీ కావడంతో 1997లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 1997లో శోభానాగిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం 1999 సాధారణ ఎన్నికల్లోనూ ఆమె గెలు పొందారు. కేవలం 2004 నుంచి 2009 వరకూ గంగుల ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక 2009లో పీఆర్పీ నుంచి శోభానాగిరెడ్డి ఎన్నికయ్యారు. తాజాగా భూమా అఖిలప్రియ ఎన్నికయ్యారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికారంలో ఉన్నది రెండు దశాబ్దాల పాటు పాలించింది భూమా కుటుంబమే. అయినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదంటూ తమ కుటుంబాన్నే విమర్శించేలా మాట్లాడటం తగదనే అభిప్రాయం వారి అనుచరుల్లో వ్యక్తమవుతోంది. మా పైనే విమర్శలా? నంద్యాల అభివృద్ధిపై అనేక వాగ్దానాలు చేసి ఎమ్మెల్యేగా గెలు పొంది.. చివరకు ఏమీ చేయలేక అధికార పార్టీలో చేరుతూ తమపై పరోక్షంగా విమర్శలు చేయడం తగదని అధికార పార్టీలోని నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. నంద్యాలను గతంలో అభివృద్ధి చేయలేదన్న వ్యాఖ్యలు.. పరోక్షంగా శిల్పా, ఫరూఖ్లపై విమర్శలు చేశారని తెలుస్తోంది. కేవలం గతంలో ఎన్నడూ అభివృద్ధి జరగలేదనే వ్యాఖ్యలపై అటు శిల్పా వర్గీయులు కూడా గుర్రుగా ఉన్నారు. పార్టీలో చేరిన వెంటనే తనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం చూస్తుంటే విభేదాలకు ఆజ్యం పోయడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూమా వ్యాఖ్యలపై మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ‘‘ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. అందుకే నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరాను.’’ - టీడీపీలో చేరిక సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ‘‘నంద్యాల నియోజకవర్గాన్ని గతంలో అభివృద్ధి చేయలేదు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరుతున్నా.’’ - విజయవాడలో భూమా నాగిరెడ్డి -
శోభానాగిరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించిన విజయమ్మ!
-
మంచి మనసున్న మనిషి శోభ: భూమా నాగిరెడ్డి
-
'భార్యగానే కాదు.. మంచి స్నేహితురాలు కూడా'
ఆళ్లగడ్డ: భార్యగానే కాదు.. మంచి స్నేహితురాలు కూడా తనకు శోభానాగిరెడ్డి దగ్గరయిందని భూమా నాగిరెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన శోభా నాగిరెడ్డి సంతాప సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శోభ లేని లోటు తీరనిదని, ఎంతో బాధగా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి రోజు తన జీవితంలో ఉంటుందని ఊహించలేదని చెప్పారు. ప్రస్తుతం తాను బతికి ఉన్నానంటే అది తన పిల్లలకోసమేనని చెప్పారు. శోభా నాగిరెడ్డి జీవితమంతా కష్టాలే అనుభవించిందని చెప్పారు. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి గుర్తు చేశారు. తమది చాలా పెద్ద కుటుంబమన్న ఆయన ఆమె తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకునేదని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్న.. ఎక్కడ ఉన్నా నెంబర్ వన్ గా ఉండాలని కోరుకునేవారని చెప్పారు. తనకు వైఎస్ఆర్ తప్ప ఎవరూ తెలియదని, వైఎస్ఆర్ మరణం తర్వాతే తాను జగన్‌ను కలిసినట్లు తెలిపారు. జగన్ సీఎం కావాలని శోభా నాగిరెడ్డి కోరుకున్నారని చెప్పారు. ఆమె అడుగు అడుగునా ఇదే విషయం చెప్పారని.. ప్రతి చోట అదే మాట పలికారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శోభా నాగిరెడ్డి చివరి బహిరంగ సభలో కూడా జగన్ సీఎం కావాలనే కోరుకున్నారని భూమా అన్నారు. -
24న శోభా నాగిరెడ్డి వర్ధంతి
హైదరాబాద్: ఈ నెల 24న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దివంగత భూమా శోభా నాగిరెడ్డి మొదటి వర్ధంతి కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారు. 2014 ఏప్రిల్ 23న ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పటి ఆళ్లగడ్డ శాసనసభ్యురాలైన శోభా నాగిరెడ్డి తీవ్రంగా గాయపడి, 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. 1997లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి శోభానాగిరెడ్డి ప్రజాసేవకు అంకితమయ్యారు. -
అఖిలప్రియ ఎన్నిక ఇక లాంఛనమే!
-
ఆళ్లగడ్డపై కాంగ్రెస్‌లో వీడని సందిగ్ధం
ఆళ్లగడ్డ ఉపఎన్నికలో పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా స్పష్టత రాలేదు. స్థానిక రాజకీయాల గురించి క్షుణ్ణంగా చర్చించుకున్న కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకులు... ప్రస్తుత పరిస్థితుల్లో బరిలోకి దిగరాదని భావిస్తున్నారు. ఇదే అంశాన్ని పీసీసీకి తెలియజేశారు. అయితే పోటీ చేయాలా.. వద్దా అనే విషయంపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని జిల్లా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. పీసీసీ ఛీఫ్ రఘువీరా ఈ అంశంపై పార్టీ నేతలందరితో ఫోన్లో మంతనాలు జరుపుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా భవన్లో అందుబాటులో ఉన్న కాంగ్రెస్ నేతలతో సమావేశమై హైకమాండ్ సూచనల మేరకు పోటీ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే పోటీకి అవసరమైన ఎ ఫామ్, బీ ఫామ్ ఇప్పటికే కర్నూలుకు చేరాయి. ఆళ్లగడ్డ ఉపఎన్నికకు నామినేషన్ దాఖలు చేసేందుకు తుది గడువు ఈ మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. ఒకవేళ పోటీచేయాలనుకుంటే మాత్రం మంగళవారమే నామినేషన్ దాఖలుచేయాల్సి ఉంటుంది. దాంతో తుది నిర్ణయం వెంటనే తీసుకోవాలి. సాధారణంగా ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే, ఆ స్థానంలో పోటీచేసే అభ్యర్థికి వ్యతిరేకంగా వేరేవారిని నిలబెట్టకూడదన్న సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీయే తొలుత మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. -
ఆళ్ళగడ్డ నుండి టీడీపీ పోటీ చేయట్లేదు
-
అమ్మ లేని లోటు తీరనిది
హైదరాబాద్: అమ్మ లేని లోటు తీరనిదని భూమా శోభానాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియ కంటతడి పెట్టారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా అఖిల ప్రియ తన తల్లి శోభా నాగిరెడ్డిని స్మరించుకున్నారు. ఆమె ఆశయ సాధన కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రజా సమస్యల కోసం పాటుపడతానని, ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. అమ్మానాన్న, ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో పోటీ చేస్తున్నానని అఖిల ప్రియ అన్నారు. అమ్మ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదని చెప్పారు. శోభ మరణంతో ఎన్నిక జరుగుతుండటం బాధాకరమని ఆమె భర్త భూమా నాగిరెడ్డి అన్నారు. శోభ లేని లోటు భర్తీ చేయడం సులభం కాదని చెప్పారు. అందరి అంచనాలకు తగ్గట్టుగా అఖిల పనిచేస్తుందని భూమా నాగిరెడ్డి చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉన్న శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో ఆమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియను అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. -
నామినేషన్ దాఖలు చేసిన భూమా అఖిల ప్రియ
ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆళ్లగడ్డ తహసీల్డార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆమె వెంట తండ్రి భూమా నాగిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉన్న శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో ఆమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియను అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల షెడ్యూలు : నామినేషన్లు - ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు పరిశీలన - ఈనెల 22న ఉపసంహరణ - ఈనెల 24న పోలింగ్ - నవంబర్ 8న ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న -
నేడు భూమా అఖిలప్రియ నామినేషన్
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించగా, అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో ఆమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియను అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆళ్లగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో అఖిలప్రియ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. కాగా ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి వ్యవహరిస్తారు. ఆళ్లగడ్డ తహశీల్దార్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. ఎన్నికల షెడ్యూలు : నామినేషన్లు - ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు పరిశీలన - ఈనెల 22న ఉపసంహరణ - ఈనెల 24న పోలింగ్ - నవంబర్ 8న ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న -
హైకోర్టు తీర్పు తర్వాతే ఆళ్లగడ్డ ఉప ఎన్నిక
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవంబర్‌లో యువ ఓటర్ల దరఖాస్తుల స్వీకరణ ఒంగోలు: హైకోర్టు తీర్పు ఆధారంగానే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నిక విషయమై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుందని తెలిపారు. 2015 జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటరుగా పేర్లు నమోదు చేసుకునేందుకు నవంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. 8 ఓట్లకు రూ.5లక్షల ఖర్చా..? ఒంగోలులో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు చెప్పిన విషయం భన్వర్‌లాల్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాలివీ...గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో 6,276 సర్వీస్ ఓటర్లున్నారు. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉండటంతో ఎన్నికల అధికారులు అందరికీ పోస్టల్ బ్యాలెట్లు పంపించారు. అందుకుగాను రూ. 5లక్షల ఖర్చయింది. కానీ, ఓటు హక్కు వినియోగించుకున్నది 8మందే. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. -
'శత్రువుకు కూడా ఆ నరకం రాకూడదు'
-
'కష్టాల్లో నాకు అండగా నిలబడ్డ అక్కను కోల్పోయాను'
-
సమర్థంగా ప్రతిపక్ష పాత్ర
సాక్షి ప్రతినిధి/కర్నూలు, న్యూస్‌లైన్ : ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలనే టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు ఫలించవని, ఎన్నికల హామీలను నెరవేర్చకపోతే బలహీనపడేది ఆ పార్టీయేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు విశ్వరూప్, జగ్గారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సార్వత్రిక, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో జయాపజయాలపై శుక్రవారం స్థానిక దేవి ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా త్రిసభ్య కమిటీ సభ్యులు హాజరయ్యారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నికల ముందు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతికి సంతాపసూచకంగా పార్టీ శ్రేణులు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం త్రిసభ్య కమిటీ సభ్యులు మాట్లాడుతూ టీడీపీ ప్రలోభాలతో ఒకరిద్దరు పార్టీ ఫిరాయించినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ బలహీనపడదని జిల్లా కార్యకర్తలు రుజువు చేశారన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలి చంద్రబాబు మైండ్‌గేమ్‌కు తెరతీశాడన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చకపోతే ఆరు నెలల్లో ఆ పార్టీ బలహీనపడటం ఖాయమన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజల తరఫున పోరాటం సాగిస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీకి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల నుంచి గుర్తింపు లభించిందన్నారు. ఫలితంగా మండల, జెడ్పీ అధ్యక్ష పదవులతో పాటు మునిసిపల్ చైర్మన్లకు జరిగే ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులకే ఓటు వేసేలా విప్ జారీ చేసే అధికారం పార్టీకి లభించిందని గుర్తు చేశారు. కేంద్రంలో లోక్‌సభ కొలువుదీరాక నంద్యాల ఎంపీఎస్పీవై రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. పార్టీ నిర్మాణమే ఎజెండా కర్నూలు, నంద్యాలలో జరిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం పార్టీ నిర్మాణమే ఎజెండాగా సాగింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జయాపజయాలపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. రాష్ట్రంలో కడప తర్వాత కర్నూలు జిల్లా పార్టీ శ్రేణులు 11 సీట్లను జిల్లాలో కైవసం చేసుకుని పార్టీకి అండగా నిలిచారని ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీ సభ్యులు కొనియాడారు. గెలుపొందిన నియోజకవర్గాల్లో పార్టీకి లభించిన ఓట్ల శాతం, గ్రామాల వారీగా పార్టీ పటిష్టత, సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసిన ముఖ్య అంశాలు, పార్టీలోనే ఉంటూ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులు తదితర విషయాలపై వేర్వేరుగా నియోజకవర్గ సమావేశాలు నిర్వహించి విశ్లేషించారు. నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు అవసరమని భావిస్తున్నారనే విషయంపైనా మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు, వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల కన్వీనర్లతో చర్చించి రాత పూర్వకంగా సమీక్ష పత్రాలను తీసుకున్నారు. సమావేశంలో కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బాల నాగిరెడ్డి, సాయి ప్రసాద్‌రెడ్డి, ఐజయ్య, గౌరు చరితారెడ్డి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ జిల్లా కన్వీనర్ తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్చార్జి జగన్మోహన్రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ హఫీజ్‌ఖాన్, పులకుర్తి రాజారెడ్డి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నందికొట్కూరు నియోజకవర్గం, ఓర్వకల్లు, కల్లూరు మండలాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ఓటుతో శోభమ్మకు నివాళి
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: దివంగత ఎమ్మెల్యే శోభానాగిరెడ్డికి ఓటువేసి ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు నిజమైన నివాళులర్పించారని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా భూమా స్వగృహానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి మరణించినా ఓటు వేసి గెలిపించారన్నారు. ఆమె చేసిన సేవలను నియోజకవర్గ ప్రజలు మరువలేదన్నారు. మరణించిన అభ్యర్థిని గెలిపించిన సంఘటనలు ఎక్కడా లేవన్నారు. ప్రజల అభిమానం వల్లే 18 వేల మెజార్టీ వచ్చిందన్నారు. సీనియర్ నాయకురాలు శోభమ్మను కోల్పోవడం వైఎస్సార్సీపీకి తీరని లోటన్నారు. ఆమె మృతిని తమ కుటుంబంతోపాటు నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. శోభానాగిరెడ్డి ఆశయాల సాధనకు అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డ ప్రజలు తమ కుటుంబం వెంట ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. ధైర్యంగా ఎదుర్కొ నే నాయకులు, కార్యకర్తలు ఉండడం తమకు వరమని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజల అండతో ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామన్నారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. -
శోభమ్మకు విజయంతో ఘననివాళి
శో..భా..నా..గి..రె..డ్డి.. ఈ ఆరు అక్షరాలు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేని సరికొత్త రికార్డును సృష్టించాయి. స్వతంత్ర భారతదేశంలో మరణానంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక మహిళగా శోభా నాగిరెడ్డి చరిత్రపుటల్లో నిలిచిపోయారు. తన చిరకాల ప్రత్యర్థి , తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంగుల ప్రభాకర్ రెడ్డిపై ఆమె 17,928 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గతంలో ఆమె సాధించిన మెజారిటీ కంటే ఇది వెయ్యి ఓట్లు ఎక్కువ. ఏప్రిల్ 23వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు వైఎస్ షర్మిలతో కలిసి ప్రచారంలో పాల్గొని, తిరిగి ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె, 24వ తేదీన చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే. గతంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా మరణిస్తే వెంటనే ఎన్నికను వాయిదా వేసి, తర్వాత ఉప ఎన్నిక నిర్వహించేవారు. అయితే.. కొంతకాలం తర్వాత వేర్వేరు కారణాలతో ఆ సంప్రదాయాన్ని ఎన్నికల కమిషన్ మానుకుంది. దాంతో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నిక యథాతథంగా కొనసాగుతుందని ఈసీ ప్రకటించింది. అయితే, తొలుత శోభా నాగిరెడ్డికి ఓట్లు వేస్తే, అవి చెల్లకుండా పోతాయన్న ప్రచారం జరిగినా.. తర్వాత మాత్రం ఈసీ ఆ విషయంలో స్పష్టత ఇచ్చింది. ఎక్కువ ఓట్లు వస్తే ఆమెనే విజేతగా ప్రకటిస్తామని విస్పష్టంగా ప్రకటించింది. కర్నూలు జిల్లా ప్రజల గుండెల్లో గూడుకట్టుకుని ఉన్న శోభా నాగిరెడ్డి.. బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించారు. ఆళ్లగడ్డవాసులు తమ ఆడబిడ్డపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. చిన్నవయసులోనే చురుకైన నాయకురాలిగా గుర్తింపు పొందిన శోభా నాగిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అగ్రనేతగా ఎదిగారు. తనకు అక్కలేని లోటును శోభే తీర్చేవారని.. ఆమె తనకు దేవుడిచ్చిన అక్క అని స్వయంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా అన్నారు. తండ్రి వారసురాలిగానో, భర్త చాటుగానో కాకుండా.. నేరుగా తనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వంతో దీటైన నాయకురాలిగా ఎదిగిన శోభమ్మకు ఆళ్లగడ్డ నియోజకవర్గం ఓట్లనే పుష్పాలుగా మార్చి పుష్పాంజలి ఘటించింది. దీంతో స్వతంత్ర భారతదేశంలో మరణానంతరం ఎన్నికైన మొట్టమొదటి ఎమ్మెల్యేగా శోభా నాగిరెడ్డి చరిత్ర సృష్టించారు. -
శోభానాగిరెడ్డి ఆధిక్యం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివంగత నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి చరిత్ర సృష్టించబోతున్నారు. మరణానంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక మహిళగా శోభా నాగిరెడ్డి రికార్డు నెలకొల్పనున్నారు. తన చిరకాల ప్రత్యర్థి , తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంగుల ప్రభాకర్ రెడ్డిపై ఆమె ఐదు వేలకు పైగా ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజవర్గంలో శోభా భర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏప్రిల్ 23వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు వైఎస్ షర్మిలతో కలిసి ప్రచారంలో పాల్గొని, తిరిగి ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె, 24వ తేదీన చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే. గతంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా మరణిస్తే వెంటనే ఎన్నికను వాయిదా వేసి, తర్వాత ఉప ఎన్నిక నిర్వహించేవారు. అయితే.. కొంతకాలం తర్వాత వేర్వేరు కారణాలతో ఆ సంప్రదాయాన్ని ఎన్నికల కమిషన్ మానుకుంది. దాంతో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నిక యథాతథంగా కొనసాగుతుందని ఈసీ ప్రకటించింది. అయితే, తొలుత శోభా నాగిరెడ్డికి ఓట్లు వేస్తే, అవి చెల్లకుండా పోతాయన్న ప్రచారం జరిగినా.. తర్వాత మాత్రం ఈసీ ఆ విషయంలో స్పష్టత ఇచ్చింది. ఎక్కువ ఓట్లు వస్తే ఆమెనే విజేతగా ప్రకటిస్తామని విస్పష్టంగా ప్రకటించింది. -
ఆళ్లగడ్డ ఫలితాలు అద్భుతం
- 2 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం - మిగిలిన 18 స్థానాల్లోనూ 16 వైఎస్సార్సీపీ కైవసం - 2 స్థానాలకే పరిమితమైన టీడీపీ ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ నగర పంచాయతీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు ఆవిష్కృతమయ్యాయి. మొత్తం 20 స్థానాల్లో 18 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వశమయ్యాయి. కేవలం రెండు స్థానాల్లోనే టీడీపీ గెలించింది. నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులుండగా 2 వార్డులు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. దీంతో 18 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అందులోనూ 16 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతం ఎగురవేశారు. కేవలం 2 స్థానాల్లో టీడీపీ గెలిచింది. నగరపంచాయితీ పరిధిలో 28,861 ఓట్లు ఉండగా 21,908 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 12,842 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థులకు 8,676 ఓట్లు వచ్చాయి. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 4,166 ఓట్ల ఆధిక్యం లభించినట్లు అయింది. 1వ వార్డులో రమణమ్మ అత్యధికంగా 709 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 18వ వార్డులో సరోజమ్మ కేవలం 7 ఓట్లతో గొలుపొందారు. శోభా నాగిరెడ్డికి అంకితం ఇస్తాం తమ గెలుపు కోసం కృషి చేసిన దివంగత నేత శోభా నాగిరెడ్డికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నామని వైఎస్సార్సీపీ అభ్యర్థులు పేర్కొన్నారు. 17వ వార్డుకు ఎన్నికైన ఎద్దుల ఉషారాణి మాట్లాడుతూ ఆళ్లగడ్డలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయాలని శోభానాగిరెడ్డి చెప్పేవరాని అన్నారు. స్వీప్ చేయలేకపోయిన రికార్డు మెజార్టీ రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ విజయంలో దివంగత శోభానాగిరెడ్డి కృషి ఉందని తెలిపారు. 5వ వార్డుకు ఎన్నికైన రామలింగారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం శోభానాగిరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. 6వ వార్డుకు ఎన్నికైన గీత మాట్లాడుతూ శోభానాగిరెడ్డి చిరునవ్వు, ఆప్యాయతలే తమ విజయానికి నాంది అన్నారు. ఆమె భౌతికంగా లేకపోవడంతో విజయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోతున్నామన్నారు. 1వ వార్డుకు ఎన్నికైన రమణమ్మ చింతకుంటలో గెలుపును శోభానాగిరెడ్డి చూడలేకపోయినందుకు బాధగా ఉందన్నారు. -
శోభానాగిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: గట్టు
-
శోభా నాగిరెడ్డికి ఓటేసినా...
-
శోభానాగిరెడ్డికి అశ్రునివాళి
ఆత్మకూరు, న్యూస్‌లైన్: రోడ్డు ప్ర మాదంలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగి రెడ్డి మృతిపై నెల్లూరు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అ భ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఉదయగిరి అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నెల్లూరు మేయర్ అభ్య ర్థి అబ్దుల్ అజీజ్ శుక్రవారం ఆళ్లగడ్డకు చేరుకుని శోభానాగిరెడ్డి మృ తదేహానికి నివాళులర్పించారు. ఆమె భర్త నాగిరెడ్డిని ఓదార్చారు. పజలు, పార్టీకి శోభమ్మ సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ బలోపేతానికి ఆమె చేసిన కృషి శ్లాఘనీయమన్నారు. వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలిచిన ఆమె సేవలు మరువలేనివన్నారు. శోభమ్మ అకాల మృతి పార్టీకి తీరనిలోటన్నారు. పార్టీ ఓ మహోన్నత నాయకురాలిని కోల్పోయిందన్నారు. ఆ మెకు కర్నూలు జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులున్నారన్నారు. -
కడసారి చూపు కోసం...
-
నంద్యాల జనసంద్రం
-
కడసారి చూపుకు పోటెత్తిన జనం
-
రాజకీయాలకే కొత్త 'శోభ'
-
ఆళ్లగడ్డలో నేడు అంత్యక్రియలు
ఆళ్లగడ్డలో నేడు అంత్యక్రియలు ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పార్థివదేహానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఇంటి వద్దే ఉంచనున్నారు. ఆ తర్వాత భూమా నివాసం నుంచి పాతబస్టాండ్, ఇండోర్‌స్టేడియం, జాతీయరహదారి, చిన్నకందుకూరు రస్తా మీదుగా అంతిమయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జాతీయ రహదారి సమీపంలోని సుద్దపల్లి క్రాస్ రోడ్డు వద్ద సొంత స్థలం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. సాక్షి ప్రతినిధి/సాక్షి, కర్నూలు : ఏమ్మా బాగున్నావా.. అన్నా అంతా కుశలమేనా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ కలివిడిగా మెలిగిన శోభా నాగిరెడ్డి ఇక లేరనే చేదు నిజాన్ని ఆళ్లగడ్డ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నంద్యాల పట్టణంలో బుధవారం రాత్రి నిర్వహించిన జనభేరి సభలో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె.. తెల్లారేసరికి అనంతలోకాలకు వెళ్లిపోయారంటే ఏ ఒక్క మనసు అంగీకరించడం లేదు. బుధవారం రాత్రి నంద్యాల నుండి ఆళ్లగడ్డకు తిరుగుప్రయాణమైన ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆమె క్షేమంగా బయటపడాలని.. ఎన్నికల్లో విజయం సాధించి తమను అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రార్థించారు. కులమతాలకు అతీతంగా తిండీతిప్పలు మానుకొని ఆమె క్షేమ సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. ఏదైతే వినకూడదనుకున్నారో.. ఆ విషాద వార్తే వారి చెవినపడింది. కష్టసుఖాలను ఇంట్లో మనిషిగా పంచుకున్న ఆడపడుచు హఠాన్మరణం జిల్లా ప్రజలను దుఃఖసాగరంలో ముంచింది. గురువారం ఉదయం హైదరాబాద్ నుండి శోభమ్మ మృతదేహం నంద్యాల మీదుగా ఆళ్లగడ్డకు తరలించగా.. రోడ్ల వెంట అభిమానులు బారులు తీరారు. ఆత్మీయ నేత కడసారి చూపునకు పరితపించారు. కన్నీరుపెట్టిన నంద్యాల ఆత్మీయ నేత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసి నంద్యాల పట్టణం కన్నీటిసంద్రమైంది. శోభా నాగిరెడ్డి పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి నేరుగా నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు అభిమానులు, ఆత్మీయుల సందర్శనార్థం అక్కడే ఉంచారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచీ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి కూడా జనం పోటెత్తారు. రాత్రి 9.30 గంటలకు భౌతికకాయాన్ని ఆళ్లగడ్డకు తరలించారు. మూగబోయిన ఆళ్లగడ్డ శోభా నాగిరెడ్డి పార్థివదేహం ఆళ్లగడ్డకు చేరుకోగానే ప్రజలు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. మధ్యాహ్నం నుండే దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. భూమా నివాసం అభిమానులతో పోటెత్తింది. మిత్రులు, కుటుంబ సభ్యులు ఆప్తులు, సన్నిహితులు.. పార్టీ శ్రేణులతో కిక్కిరిసింది. ముఖ్యంగా మహిళలు ఈ విషాద ఘటనతో కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘ఎమ్మెల్యేగా తప్పక గెలుస్తుంది. మంత్రి అవుతారని ఆశించాము. ఇలా జరిగిందేంటి తల్లీ’’ అంటూ అభిమానులు బోరున విలపించిన దృశ్యాలు అందరినీ కలచివేశాయి. అంబులెన్స్ నుంచి శవపేటికపైకి ఆమె పార్థివదేహాన్ని చేర్చగానే చిన్నకుమార్తె బొట్టు పెట్టి దీపం వెలిగించి బోరున విలపించడంతో అందరి హృదయాలు ద్రవించుకుపోయాయి. ‘‘అమ్మా.. లేమ్మా అంటూ’’ విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. శవపేటికపై తలపెట్టి రోదిస్తున్న కుమారుడిని చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. ఆ ముగ్గురి ఆవేదన వర్ణనాతీతం ఎప్పుడూ చిరునవ్వు.. హుందాతనంతో అందరికీ ధైర్యం చెప్పే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, స్థానికులకు ధైర్యం చెబుతూ వచ్చిన ఆయన.. శోభ మరణవార్త తెలియగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని పట్టుకొని రోదించడం అందరినీ కలచివేసింది. -
కారు డ్రైవర్ కనిపించట్లేదు...
నంద్యాల, న్యూస్‌లైన్: శోభా నాగిరెడ్డి కారు డ్రైవర్ నాగేంద్ర(32) నంద్యాలలోని సాయివాణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిపించకుండాపోయాడు. బుధవారం రాత్రి ప్రమాదంలో గాయపడిన అతన్ని పోలీసులు తొలుత ఆళ్లగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బంధువులు మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి నంద్యాలకు తరలించారు. శరీరంపై గాయాలు లేకపోయినా కడుపు, ఛాతీలో నొప్పితో బాధపడుతుండటంతో వైద్యులు చికిత్స చేశారు. గురువారం ఉదయం 9 గంటల తర్వాత నాగేంద్ర తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వెంటనే మేడమ్‌ను చూడాలని ఆసుపత్రి సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇతను ఎక్కడా కనిపించకపోవడం పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అదృశ్యమైన నాగేంద్ర స్వస్థలం ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరుగా, తండ్రి సుబ్బరాయుడుగా ఆసుపత్రిలో వివరాలు నమోదయ్యాయి. -
డ్రైవర్ దూకుడుగా నడపడంవల్లే ప్రమాదం
సాక్షి, కర్నూలు: శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో గన్మెన్లు మహబూబ్‌బాషా, శ్రీనివాసులు గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తీరు వారి మాటల్లోనే.. కారు స్పీడ్ తగ్గించాలని చెప్పాం మాది గోనెగండ్ల మండలం ఐరన్‌బండ గ్రామం. 2009లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. రెండు వారాల కిందటే అక్క (శోభా నాగిరెడ్డి) వద్ద డ్యూటీలో చేరాను. నంద్యాల నుంచి షర్మిలమ్మ పర్యటన ముగించుకుని రాత్రి ఆళ్లగడ్డకు అవుట్లాండ్ కారులో అక్కతో పాటు నేను, మరో గన్‌మెన్ శ్రీనివాసులు బయలుదేరాం. రెగ్యులర్ డ్రైవర్ కాకుండా నాగేంద్ర అనే మరో డ్రైవర్ వచ్చాడు. అతను మొదటినుంచి కారును చాలా దూకుడుగా నడపటం గమనించి స్పీడ్ తగ్గించమని కూడా చెప్పాం. వరి ధాన్యం కుప్ప పక్కనే ఉన్న రాళ్లను ఎక్కించగానే... ఏయ్ అని అరవడంతో సడన్‌గా స్టీరింగ్ తిప్పేశాడు. దీంతో 140-150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. గన్మెన్లిద్దరం తేరుకునేలోపే అక్కను ఆసుపత్రికి తరలించారు. - ఎన్.మహబూబ్‌బాషా, గన్‌మన్ ఎప్పుడూ సీటు బెల్టు పెట్టుకునేవారు మాది గోస్పాడు మండలం యాళ్లూరు. నేను 2009లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాను. అక్క (శోభా నాగిరెడ్డి) వద్ద గన్‌మన్‌గా గత సంవత్సరం జూలైలో చేరాను. బుధవారం ఉదయం 7.30 గంటలకు గ్రామాల్లో ఎన్నిక ల ప్రచారానికి బయలుదేరాం. తర్వాత సాయంత్రం 4.30 గంటలకు నంద్యాలలో షర్మిలక్క ప్రచారంలో పాల్గొన్నాం. రాత్రి 11 గంటలకు ఆళ్లగడ్డ బయలుదేరాం. అక్క (శోభానాగిరెడ్డి) ముందు సీట్లో కూర్చున్నారు. ఉదయం, సాయంత్రం ఆ రోడ్డునే వెళ్లినా... రోడ్డుపక్కగా ఉన్న వరి ధాన్యం కుప్పలను మేము పెద్దగా గమనించలేదు. ప్రమాదం ధాటికి అక్క కారులోంచి ఎగిరి పడినట్లున్నారు. కారులో అక్క ఎప్పుడూ సీటు బెల్టు పెట్టుకునే కూర్చునేవారు. కానీ నిన్న అలసిపోయి బెల్టు పెట్టుకోవడం మరిచిపోయినట్లున్నారు. -శ్రీనివాసులు, గన్‌మన్ -
సీమ రాజకీయాల్లో ‘మహిళా శోభ’
నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన మహిళా నేత బలమైన ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొన్న శోభా నాగిరెడ్డి సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమలో భూమా శోభా నాగిరెడ్డి తిరుగులేని మహిళా నేత. 1997లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన శోభ.. తనదైన ముద్రతో సీమ రాజకీయాలకు వన్నె తెచ్చారు. అత్యంత సమస్యాత్మకమైన ఆళ్లగడ్డలో రెండు బలమైన వర్గాలైన గంగుల, ఇరిగెలను ఎదుర్కొని నాలుగు పర్యాయాలు విజయం సాధించటమే కాదు.. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఆమె ఎనలేని కృషి చేశారు. తొలుత టీడీపీ, ఆ తర్వాత పీఆర్పీ.. తదనంతరం తుదివరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.. ఎక్కడ ఉన్నా కీలక నేతగానే ఉన్నారు. తను కొనసాగుతున్న పార్టీపై విమర్శలు వస్తే దీటుగా తిప్పికొట్టగలిగే నేర్పు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. సీమ జిల్లాల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల ప్రజలతో శోభకు ప్రత్యేక అనుబంధం ఉంది. సీమలో తాగు, సాగునీటి కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. రాజకీయ కుటుంబంలో జననం... మాజీ మంత్రి ఎస్.వి.సుబ్బారెడ్డి, దివంగత నారాయణమ్మ దంపతుల ఐదో సంతానం శోభా నాగిరెడ్డి. 1969 డిసెంబర్ 16న జన్మించారు. శోభకు నాగలక్ష్మమ్మ, నాగరత్నమ్మ అక్కలు కాగా.. ఎస్.వి.ప్రసాదరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి అన్నలు. 1986లో భూమా నాగిరెడ్డితో వివాహమైంది. కూతుర్లు అఖిలప్రియ, నాగమౌనిక, కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి. తండ్రి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్, ఆళ్లగడ్డ, పత్తికొండ ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. సోదరి నాగరత్నమ్మ పత్తికొండ మేజర్ పంచాయతీ సర్పంచ్ కాగా, సోదరుడు ఎస్.వి.మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీగా పనిచేశారు. శోభ భర్త భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. బావలు భూమా శేఖరరెడ్డి ఎమ్మెల్యే గాను, భూమా భాస్కర్‌రెడ్డి ఎంపీపీగా పదవుల్లో ఉంటూనే చనిపోయారు. నాలుగుసార్లు వరుస విజయాలు... తండ్రి మాజీ మంత్రి ఎస్.వి.సుబ్బారెడ్డి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, భర్త భూమా నాగిరెడ్డి సాహచర్యంలో 1997, 1999, 2009, 2012 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికైన మహిళా ప్రతినిధిగా శోభానాగిరెడ్డి రికార్డును సొంతం చేసుకున్నారు. 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 1999 లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. 2002 నవంబర్ 7న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొట్టమొదటి మహిళా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. టీడీపీలో జనరల్ సెక్రటరీగా, పార్టీలో కీలక సభ్యురాలిగా పనిచేశారు. ఆ తర్వాత సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో భర్తతో పాటు శోభ ఆ పార్టీలో చేరారు. అక్కడ కూడా కీలకమైన అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కేవలం 18 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అందులో రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీ తరఫున మహిళా ఎమ్మెల్యేగా శోభా నాగిరెడ్డి మాత్రమే గెలుపొందారు. వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా...: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటం.. వై.ఎస్. కుటుంబంతో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో భూమా దంపతులు ఆ కుటుంబం వెంట నడిచారు. పీఆర్పీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012లో ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున శోభానాగిరెడ్డి సుమారు 37 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అక్రమ నిర్బంధంలో ఉండగా గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మకు శోభ తోడునీడగా నిలిచారు. ఆ ప్రాంతాల వారితో విడదీయరాని బంధం: జిల్లాలో కర్నూలు, నంద్యాల, పత్తికొండ, ఆళ్లగడ్డ నియోజకవర్గాల వారితో భూమా శోభా నాగిరెడ్డికి విడదీయరాని బంధం ఉంది. ఆళ్లగడ్డ జన్మస్థలం కావడంతో ఆ ప్రాంత వాసులు పార్టీలతో నిమిత్తం లేకండా భూమా కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. నంద్యాల ప్రజల్లో శోభా నాగిరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. తండ్రి ఎస్.వి.సుబ్బారెడ్డి ప్రాతినిధ్యం వహించిన పత్తికొండ ప్రజలతోనూ ఆమెకు అనుబంధం ఉంది. సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ, ఎస్.వి.మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి కావడంతో నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. తాగు, సాగునీటి కోసం పోరాటం: కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రైతులకు సాగు, తాగునీటి ప్రధాన కాలువ కేసీ కెనాల్ రైతుల కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీశారు. తాగు, సాగునీటి కోసం జరిగిన సాగునీటి సలహా మండలి, డీడీఆర్సీ సమావేశాలకు ఎవరు హాజరు కాకపోయినా.. ఎమ్మెల్యే హోదాలో శోభా నాగిరెడ్డి హాజరయ్యే వారు. ఆమె వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు, అధికారులు నీళ్లు నమిలేవారు. ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రజల తరఫున ఆమె గళం వినిపిస్తూ ప్రత్యేకతను సంతరించుకున్నారు. రాజకీయాలకు స్ఫూర్తి భూమానే శోభా నాగిరెడ్డి రాజకీయాలకు స్ఫూర్తి భర్త భూమా నాగిరెడ్డే. రాయలసీమ రాజకీయాల్లో మహిళలు నిలదొక్కుకోవడం ఎంతో కష్టం. అలాంటిది ఆళ్లగడ్డ లాంటి సమస్యాత్మక నియోజకవర్గంలో ఓ మహిళ 13 ఏళ్ల పాటు ప్రజాప్రతినిధిగా సేవలందించడం అబ్బురపరచే విషయం. ఇందుకు భర్త, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి ప్రోత్సాహమే ప్రధాన కారణం. ‘మీ రాజకీయ గురువు ఎవర’ని ఎవరైనా అడిగితే తడుముకోకుండా భర్త భూమా నాగిరెడ్డి పేరు చెప్పేవారామె. 1997లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. శాసనసభకు వెళ్లేందుకు జంకుతుండగా భూమా స్వయంగా తీసుకెళ్లి అందరినీ పరిచయం చేశారు. శాసనసభ సమావేశాల్లో ఎలాంటి ప్రశ్నలు వేయాలనే విషయంపైనా ఆమె భర్తతో చర్చలు జరిపేవారని సన్నిహితులు చెప్తారు. -
శోభా నాగిరెడ్డి మరిలేరు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి(46) ఇకలేరు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని 18వ జాతీయ రహదారిపై గూబగుండంమిట్ట వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభ... గురువారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కటెముకలు విరిగిపోవడంతో ఊపిరి పీల్చుకోలేక అపస్మారక స్థితిలో ఉన్న శోభను మెరుగైన చికిత్స కోసం గురువారం ఉదయానికి బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స చేశారు. అయితే ఈ ప్రయత్నం ఫలించకపోవడంతో ఉదయం 11.05 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి నంద్యాలలో షర్మిల బహిరంగసభలో పాల్గొని ఆళ్లగడ్డకు తిరిగి వెళుతుండగా శోభా నాగిరెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద స్థలిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన శోభను ఆళ్లగడ్డకు తరలించగా అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ల సూచనల మేరకు ఆమెను నేరుగా హైదరాబాద్ కు తరలించారు. ఉదయం 7.30కు అక్కడకు చేరుకోగానే ఆమె పరిస్థితిని ‘బ్రెయిన్ డెడ్’ (మెదడు పనిచేయని స్థితి)గా వైద్యులు అంచనా వేశారు. 11 గంటలకుపైగా మృత్యువుతో పోరాడిన శోభ ఉదయం 11.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. నంద్యాల వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు చికిత్స జరుగుతున్నపుడు ఆసుపత్రిలోనే ఉన్నారు. శోభ తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారన్న వార్త తెలియగానే ఆ కుటుంబసభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. భూమా నాగిరెడ్డి సృ్పహతప్పి పోవడంతో వైద్యులు తక్షణం చికిత్సను అందించారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే అభిమానులు, ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచే భారీస్థాయిలో ఆసుపత్రికి చేరుకున్నారు. నేత్రదానం: శోభ తన కళ్లను దానం చేస్తూ గతంలో అంగీకారపత్రం ఇవ్వడంతో వైద్యులు ఆమె నేత్రాలను తొలగించి ‘ఐ బ్యాంక్’కు పంపారు. శోభ కళ్లను శుక్రవారం ఇద్దరు అంధులకు అమర్చనున్నట్లు హైదరాబాద్ జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమం అధికారి డాక్టర్ రవీందర్‌గౌడ్ తెలిపారు. విజయమ్మ సహా పలువురి సందర్శన: శోభ పార్థివదేహం కేర్ ఆసుపత్రిలో ఉండగానే వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో సహా పలువురు ప్రముఖులు సందర్శించారు. శోభ భౌతికకాయాన్ని చూడగానే విజయమ్మ దుఖాన్ని ఆపుకోలేక విలపించారు. చికిత్స జరుగుతున్నపుడే ఎంవీ మైసూరారెడ్డి, డీఏ సోమయాజులు, లక్ష్మీపార్వతి, విజయచందర్, వాసిరెడ్డి పద్మ, అల్లు అరవింద్, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్.పి.మీనా, టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఆర్.ఆనంద్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారి చంద్రశేఖరరెడ్డి, సినీ నటులు మంచు మనోజ్, మంచు లక్ష్మి, రాజా, జీవిత, రాజశేఖర్, ప్రొఫెసర్ ఆర్.వేణుగోపాల్‌రెడ్డితో పాటు పలువురు శోభ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆళ్లగడ్డలో నేడు అంత్యక్రియలు శోభా నాగిరెడ్డి పార్థివదేహానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఇంటి వద్దే ఉంచనున్నారు. ఆ తర్వాత భూమా నివాసం నుంచి పాతబస్టాండ్, ఇండోర్‌స్టేడియం, జాతీయరహదారి, చిన్నకందుకూరు రస్తా మీదుగా అంతిమయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జాతీయ రహదారి సమీపంలోని సుద్దపల్లి క్రాస్ రోడ్డు వద్ద సొంత స్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు. భూమా నివాసం శోకసంద్రం ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: భూమా శోభా నాగిరెడ్డి మరణవార్తతో ఆళ్లగడ్డ శోకసంద్రమైంది. ఆమె పార్థివదేహం ఆళ్లగడ్డలోని నివాసానికి చేరుకోగానే ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు. శోభా నాగిరెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అమ్మా ఎక్కడికి పోతివమ్మా అంటూ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి దించగానే కుమార్తెలు బోరున విలపించారు. అమ్మా లేమ్మా... అంటూ రోదిస్తున్న వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. శవపేటికపై తలపెట్టి ఏడుస్తున్న కొడుకును చూసి అక్కడి వారంతా కన్నీరు పెట్టారు. మేనమామ ఎస్వీ మోహన్‌రెడ్డి వారిని ఓదార్చారు. ఆళ్లగడ్డలో మధ్యాహ్నం నుంచి స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు జనాలు బారులు తీరారు. భూమా నివాస ప్రాంగణంలో మిత్రులు, కుటుంబసభ్యులు ఆప్తులు, సన్నిహితులు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. ‘‘ఎమ్మెల్యేగా తప్పక గెలుస్తుంది. మంత్రి అవుతుందనే ఆశించాం. మీకు ఇలా జరుగుతుందని ఊహించలేదు తల్లీ’’ అంటూ మహిళలు బోరున విలపించారు. ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది: వైద్యులు అపస్మారక స్థితిలో ఉన్న శోభానాగిరెడ్డిని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చిన వెంటనే డాక్టర్ సోమరాజు నేతృత్వంలోని క్రిటికల్ కేర్, ఆర్థో, న్యూరో విభాగం వైద్యబృందం ఆమెకు పలు పరీక్షలు చేసింది. ఉదయం 9 గంటలకు తల, ఛాతీ, మెడ భాగంలో సీటీస్కాన్ తీయించారు. తలకు తగిలిన బలమైన గాయంవల్ల మెదడులో రక్తం గడ్డకట్టడంతో పాటు చెవి, ముక్కు నుంచి అధిక రక్తస్రావమైనట్లు గుర్తించారు. పక్కటెముకలు విరిగి గుండె, ఊపిరితిత్తులకు ఆనుకోవడంతో గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్నట్లు, శ్వాస కూడా తీసుకోలేకపోతున్నట్లు నిర్ధారించారు. మెడలోని నరాలు కూడా చిట్లిపోయినట్లు ఉదయం 10 గంటలకు విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో వైద్యులు స్పష్టం చేశారు. ఆపరేషన్ చేసి గుండెకు ఆనుకుని ఉన్న పక్కటెముకలను సరిచేయాలని వారు నిర్ణయించారు. అదే సమయంలో అకస్మాత్తుగా పల్స్‌రేటు పడిపోయింది. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. దీంతో శోభానాగిరెడ్డి చికిత్స పొందుతూ ఉదయం 11.05 నిమిషాలకు మృతి చెందినట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపీకృష్ణ ప్రకటించారు. ఆమెను కాపాడేందుకు నాలుగు గంటలపాటు తామెంతో శ్రమించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. -
జగన్ దిగ్భ్రాంతి
శోభా నాగిరెడ్డి మృతితో వైఎస్సార్సీపీలో తీవ్ర విషాదం జగన్, విజయమ్మ, షర్మిల ప్రచారం రెండ్రోజులు వాయిదా పార్టీ కార్యాలయంలో నివాళులు, జెండా అవనతం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉప నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డి మరణవార్తతో పార్టీలో విషాదం అలముకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సోదరి షర్మిల, సతీమణి భారతి ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. శోభ మృతికి సంతాప సూచకంగా గురు, శుక్రవారాలు జగన్, విజయమ్మ, షర్మిల పర్యటనలతో పాటు అన్ని ప్రచార కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆళ్లగడ్డలో శోభ అంత్యక్రియలకు పార్టీ పెద్దలంతా హాజరవుతారని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శోభా నాగిరెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాను అవనతం చేశారు. పార్టీ నేతలు పీఎన్వీ ప్రసాద్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఆళ్లగడ్డకు జగన్ పార్టీలో అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే తమ ఆత్మీయురాలు మరణించారని తెలిసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సోదరి షర్మిల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గుంటూరు జిల్లాలో రెండ్రోజులపాటు విస్తృతంగా పర్యటించి బుధవారం రాత్రికి పొన్నూరుకు చేరుకున్న జగన్‌కు శోభా నాగిరెడ్డి ప్రమాదవార్త తెలియడంతో హతాశులయ్యారు. ఆమెను కేర్ ఆస్పత్రికి తరలించారని తెలియడంలో ఆయన ఆస్పత్రి వర్గాలతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి పరిస్థితి తెలుసుకుంటూ వచ్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందనడంతో గురువారం ఉదయం పొన్నూరులో క్లుప్తంగా ప్రసంగించి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే శోభ ఉదయం 11 గంటలకే మృతి చెందడంతో భౌతిక కాయాన్ని స్వస్థలం ఆళ్లగడ్డ తీసుకువెళ్లారు. గురువారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్న జగన్ శుక్రవారం ఆళ్లగడ్డకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో హెలికాప్టర్లో ఆళ్లగడ్డకు వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అంత్యక్రియలకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. హుటాహుటిన వచ్చిన విజయమ్మ శోభా నాగిరెడ్డి ప్రమాదానికి గురయ్యారన్న సమాచారం తెలియడంతో విజయమ్మ రాజమండ్రి నుంచి హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఆమె కేర్ ఆస్పత్రికి చేరుకునే సమయానికే శోభ కన్ను మూయడంతో కన్నీరు మున్నీరయ్యారు. తన కూతురులాంటి శోభ మరణం భరించలేనిదని విలపించారు. తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించిన విజయమ్మ బుధవారం రాత్రి రాజమండ్రిలో బస చేశారు. గురువారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆమె ‘వైఎస్సార్ జనభేరి’ చేపట్టాల్సి ఉంది. ఈ కార్యక్రమం వాయిదా వేశారు. పులివెందుల నుంచి షర్మిల, భారతి నంద్యాలలో శోభానాగిరెడ్డితో కలసి వైఎస్సార్ జనభేరి నిర్వహించిన షర్మిల బుధవారం రాత్రి పులివెందుల చేరుకున్నారు. ఆమె గురువారం అనంతపురం జిల్లా కదిరిలో పర్యటించాల్సి ఉంది. అలాగే పులివెందులలో జగన్ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి వైఎస్ భారతి వేంపల్లె మండలంలో పర్యటించాల్సి ఉంది. శోభానాగిరెడ్డి ప్రమాదవార్త తెలియడంతో వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఒకే వాహనంలో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. శోభా నాగిరెడ్డి, -
ప్రమాదం జరిగిన తీరిదీ..
బుధవారం సాయంత్రం 4.40 గంటలు: నంద్యాలలో షర్మిల వైఎస్సార్ జనభేరి సభలో పాల్గొనేందుకు శోభా నాగిరెడ్డి అవుట్‌లాండర్ కారులో (నంబర్ ఏపీ21 ఏఎఫ్ 0001) ఆళ్లగడ్డ నుంచి 45 కి.మీ. దూరంలోని నంద్యాలకు వచ్చారు. రాత్రి 9.30: జనభేరి సభ ముగిసింది. రాత్రి 10.35: శోభానాగిరెడ్డి నంద్యాలలో భోజనం చేసి ఆళ్లగడ్డకు బయలుదేరారు. ఆమె కారు ముందు సీటులో కూర్చున్నారు. వెనుక సీటులో ఇద్దరు గన్మెన్లు కూర్చున్నారు. కారు వెంట రెండు ఎస్కార్టు వాహనాల్లో ఏడుగురు చొప్పున ఉన్నారు. రాత్రి 11.20: ఆళ్లగడ్డకు ఐదు కిలోమీటర్ల దూరంలోని గూబగుండం మిట్ట వద్ద రోడ్డుపై ఆరబోసిన ధాన్యం (వడ్లు) రాశికి అడ్డంగా పెట్టిన రాళ్లను తప్పించబోయి డ్రైవర్ కారును ఎడమవైపు తిప్పడంతో నాలుగు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ప్రధాన రోడ్డు నుంచి 100 మీటర్ల దూరం వరకు పోయి కారు ఆగిపోయింది. ప్రమాద సమయంలో కారు వేగం గంటకు 120 కిలోమీటర్లు ఉంది. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో శోభా నాగిరెడ్డి ముందున్న అద్దంలో నుంచి ఎగిరి కింద పడ్డారు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి 11.30: కారు వెనుక వస్తున్న మరో వాహనంలోని అనుచరులు (వీరు నంద్యాలలోని షర్మిల జనభేరి సభకు వెళ్లి వస్తున్న వారు) ప్రమాదాన్ని గుర్తించి ఆళ్లగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన 10 నిమిషాల తర్వాత ఎస్కార్ట్ వాహనాలు చేరుకున్నాయి. రాత్రి 11.40: ప్రథమ చికిత్స అనంతరం శోభా నాగిరెడ్డిని అంబులెన్స్‌లో నంద్యాలకు తీసుకెళ్లారు. రాత్రి 12.35: నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అక్కడ దాదాపు 3 గంటల పాటు వైద్యులు సేవలందించినా ఫలితం లేకపోయింది. గురువారం తెల్లవారుజామున 2.50: మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. ఉదయం 5.30: బీచ్పల్లి వద్ద అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్ నుంచి వచ్చిన మరో వాహనంలోకి మార్చారు. ఉదయం 7.10: హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఉదయం 11.05: వెంటిలేటర్‌పై వైద్య సేవలందించిన వైద్యులు చివరకు శోభా నాగిరెడ్డి మరణించినట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. - కర్నూలు, సాక్షి -
కేర్ లో శొభా నాగిరెడ్డికి ప్రముఖుల నివాళి
-
శోభా నాగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న జగన్ కుటుంబం
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వై ఎస్ విజయమ్మ, షర్మిలలు శుక్రవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరగనున్న శోభా నాగిరెడ్డి అంతిమ సంస్కారాలలో పాల్గొననున్నారు. పార్టీ శానససభా పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి ప్రమాద వార్త వినగానే ఈ ముగ్గురు నేతలూ తమ తమ ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్ కు హుటాహుటిన వచ్చారు. రెండు రోజుల పాటు తమ ప్రచార కార్యక్రమాన్ని ఈ నేతలు రద్దు చేసుకున్నారు. వైఎస్ విజయమ్మ కేర్ ఆస్పత్రికి వెళ్లి భూమా కుటుంబ సభ్యులను పరామర్శించారు. శోభా నాగిరెడ్డి హఠాన్మరణం పట్ల సంతాప సూచకంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నాడు అన్ని పార్టీ కార్యక్రమాలను రద్దుచేసింది -
కారు ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పెట్టలేమా?
ఏటా కారు ప్రమాదాలు దాదాపు పది లక్షల ప్రాణాలను హరించేస్తున్నాయి. బుధవారం రాత్రి వైఎస్ ఆర్ కాంగ్రెస్ కీలక నేత శోభా నాగిరెడ్డి కూడా కారు ప్రమాదంలో మరణించారు. కారు ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పెట్టలేమా? విలువైన ప్రాణాలను కాపాడలేమా? కారు ప్రమాదాలను నివారించే దిశగా ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఆ పరిశోధనల నుంచే 1948 లో రోడ్ గ్రిప్, త్వరగా బ్రేక్ పడే అవకాశాలున్న రేడియల్ టైర్లు వచ్చాయి. 1958 లో వోల్వో కంపెనీ సీట్ బెల్టుల్ని కనుగొంది. 1950 లో ఎయిర్ బ్యాగ్స్ వాడకం మొదలైంది. కారు ప్రమాదం జరగగానే ఒక బెలూన్ విచ్చుకుని దెబ్బ తగలకుండా షాక్ అబ్సార్బ్ చేస్తుంది. అయితే శోభా నాగి రెడ్డి విషయంలో ఎయిర్ బాగ్స్ విచ్చుకోలేదు. ఇటీవలే పలు ఆటో మొబైల్ కంపెనీలు ఎయిర్ బ్యాగ్స్ సరిగా పనిచేయకపోవడంతో లక్షలాది కార్లను వెనక్కి రప్పించాయి. కారు ప్రమాదాలను పూర్తిగా నివారించే దిశగా మూడు రంగాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆటో బ్రేకింగ్ - ముందున్న వాహనాలకు కారు మరీ దగ్గరగా వస్తే తనంతట తానుగా బ్రేక్ పడిపోయే టెక్నాలజీని ప్రస్తుతం రూపొందిస్తున్నారు. కారు లో ఉండే సెన్సర్లు కారును తక్షణం ఆపేస్తాయి. స్వీడెన్ లో ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంటెలిజెంట్ విండ్ స్క్రీన్ - డ్రైవర్ కారు నడిపేటప్పుడు ఎటు వైపు చూస్తున్నారన్న విషయాన్ని విండ్ స్క్రీన్ కనిపెట్టి డ్రైవర్ కి సలహా ఇచ్చేలా శాస్త్రవేత్తలు వ్యవస్థలను రూపొందిస్తున్నారు. రోడ్డు అంచు ఎక్కడ ఉంది, డ్రైవర్ దృష్టి ఎక్కడుంది వంటి విషయాల్లో డ్రైవర్ కి విండ్ స్క్రీన్ సూచనలను ఇస్తుంది. క్రాష్ టెస్ట్ డమ్మీ - కారు నడిపించే వారి ఎత్తు, బరువు, వయస్సు వంటి అంశాల ఆధారంగా, ఎంత వేగంతో ఢీకొన్నారు లేదా పల్టీ కొట్టారన్న అంశాల ఆధారంగా శాస్త్రవేత్తలు వందకు పైగా నమూనాలను తయారు చేశారు. ఎంత బరువున్న వ్యక్తి ఎంత వేగంతో ఢీకొంటే ఏయే అవయవానికి ఎంత ప్రమాదకారి వంటి అంశాలను పరిశీలించి దాని ఆధారంగా భద్రతా ఏర్పాట్లు చేయడానికి వీలుంటుంది. ఈ పరిశోధనలు ప్రమాదాలను వీలైనంత వరకూ తగ్గించగలవు. ఎన్ని భద్రతా ఏర్పాట్లున్నా మానవ తప్పిదమే అన్నిటికన్నా ప్రమాదకరమైన సమస్య. మితిమీరిన వేగం, రోడ్డు పై దృష్టి లేకపోవడం, నిద్ర లేమితో డ్రైవ్ చేయడం, మద్యం వంటి పదార్థాలు సేవించడం వంటివి తగ్గించుకుంటే ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు. -
ఆఖరి క్షణం వరకూ జనం కోసం... జనం నడుమ
-
ఒక్క నెల ఓపిక పట్టండి.... !
'వివిధ సమస్యలతో నా దగ్గరకు వస్తున్న ప్రజలకు నేనొక్కటే చెబుతున్నాను. ఒక్క నెల ఓపిక పట్టండి. మంచి రోజులు వస్తాయి. మీ సమస్యలన్నీ పరిష్కరించే ప్రజా ప్రభుత్వం వస్తుంది.' ఇదీ శోభా నాగిరెడ్డి చిట్టచివరగా సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో చెప్పిన మాటలు. ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నప్పటికీ ఆమె సాక్షి టీవీ ప్రతినిధిని చూడగానే నవ్వుతూ పలకరించారు. అడగగానే ఇంటర్ వ్యూని ఇచ్చారు. ఇంటర్ వ్యూలో ఆమె వైఎస్ ఆర్ కాంగ్రెస్ విధానాల పట్ల, పార్టీ కార్యక్రమాల పట్ల ఎనలేని నమ్మకాన్ని తన మాటల్లో కనబరిచారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే చేసే ఆరు సంతకాలు రాష్ట్రం దశ, దిశను మార్చేస్తాయని ఆమె గట్టిగా నొక్కి చెప్పారు. అన్నా సమస్య ఉందని ఎవరైనా భూమా నాగిరెడ్డి వద్దకు వస్తే ...'మీ అక్క ఉంది కదరా చెప్పు. ఆమె చూసుకుంటుంది' అనేవారు ఆయన. ఆళ్ళగడ్డకి ఆమె అక్క. ఆఖరి క్షణం దాకా ఆమె ప్రజల మధ్యే గడిపారు. పల్లెపల్లెను, గుండెగుండెనూ పలకరిస్తూ, చిరునవ్వుతో భరోసా ఇస్తూ ఆమె తరలిపోయారు. 'ఒక్క నెల ఆగండి. ఒక్క నెల ఓపిక పట్టండి' అని అందరికీ చెప్పిన శోభక్క ఒక్క రోజు ఆగకుండా వెళ్లిపోవడమే అసలైన విషాదం. -
రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి కన్నుమూత
-
కారు ప్రమాదంలో మరణించిన మహిళా నేతలు
రాజకీయనాయకుల జీవితమంతా పెను వేగమే. మామూలుగా కార్లే వారి జీవితానికి వేగాన్నిస్తాయి. ఏ చిన్న సంఘటన జరిగినా శరవేగంగా చేరుకునేందుకు కారే వారి సాధనం. కానీ చాలా సందర్భాల్లో కారే వారి ప్రాణాలు తీస్తుంది. వేగమే నేరమౌతుంది. ఉజ్వల భవిష్యత్తున్న యువనేత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత శోభానాగిరెడ్డి కూడా కారు వేగమే ప్రాణాలు తీసింది. కారు ప్రమాదాలు పలువరు మహిళా యువ నేతలను పొట్టనబెట్టుకున్నాయి. పిన్న వయసులోనే కారు ప్రమాదంలో చనిపోయిన కొందరు మహిళా నేతల వివరాలు ఇవి. లేడీ డయానా: సందర్భం, నేపథ్యం వేరైనా లేడీ డయానా కూడా శరవేగంగా పరుగులు తీస్తున్న కారు పారిస్ లోని ఒక టన్నెల్ రోడ్డులో ప్రమాదానికి గురి కావడంతో చనిపోయారు. విషాదం ఏమిటంటే ఈ మాజీ బ్రిటిష్ యువరాణి వెంటాడుతున్న పాపరాజ్జి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చనిపోయారు. ఆమె కొన ఊపిరితో ఉంటే సాయం చేయడానికి బదులు పాపరాజ్జీ క్రూరాతిక్రూరంగా ఫోటోలు తీసుకుంటూ కాలం గడిపేసింది. శవంపై చిల్లర ఏరుకునేంత చిల్లర పని చేసింది పాపరాజ్జి. (నాడు సౌందర్య... నేడు శోభ) వనం ఝాన్సీ: అచ్చంపేటకి చెందిన వనం ఝాన్సీ శరవేగంగా ఎదిగిన మహిళా నాయకుల్లో ఒకరు. బిజెపి పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసిన వనం ఝాన్సీ కూడా కారు ప్రమాదంలోనే హఠాన్మరణం పాలయ్యారు. ఎంతో భవిష్యత్తున్న యువనేత ఉన్నట్టుండి కనుమరుగయ్యారు. శోభా నాగిరెడ్డి: చివరి క్షణం వరకూ రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు శోభా నాగిరెడ్డి. కొద్ది గంటల క్రితమే ఆమె కర్నూలు జిల్లాలో షర్మిల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరినీ ఆత్మీయంగా పలకరించి, చిరునవ్వులు చిలికించిన యువనేత కొద్ది గంటల తరువాతే తిరిగి రాని లోకాలకు వెళ్లడం నిజంగా తీరని విషాదమే. -
శోభా నాగిరెడ్డి కన్నుమూత.
-
శోభా నాగిరెడ్డి గతస్మృతులు
-
నాడు సౌందర్య.. నేడు శోభ
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనే నాడు సినీనటి సౌందర్య, నేడు వైఎస్ఆర్సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మరణించారు. 2004 ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సౌందర్య (31).. ఆ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన బెంగళూరు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో అక్కడికక్కడే మరణించారు. అత్యధికంగా తెలుగు సినిమాల్లో నటించిన సౌందర్య, కొన్ని కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించడంతో మూడు రాష్ట్రాల్లోనూ ఆమెకు పెద్దసంఖ్యలో అభిమానులుండేవారు. ఆ అభిమానాన్ని ఓట్లరూపంలోకి మార్చుకోవాలని బీజేపీ కోరగా.. ఆమె ప్రచారం చేసేందుకు అంగీకరించి తన ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు శోభా నాగిరెడ్డి కూడా ఎన్నికల ప్రచార సంరంభం ముమ్మరంగా ఉన్న సమయంలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. చాలామంది నాయకురాళ్లలా తండ్రి చాటునో, భర్త చాటునో ఉండిపోకుండా తనకంటూ సొంతంగా నాయకత్వ లక్షణాలు సాధించి, రాయలసీమలోని మహిళా నేతల్లోనే ప్రత్యేక గుర్తింపు పొందిన శోభా నాగిరెడ్డి.. బుధవారం సాయంత్రం వైఎస్ షర్మిలతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆమె తిరుగులేని ఆధిక్యంతో గెలుస్తారని, మంచి ప్రాధాన్యం ఉన్న శాఖకు మంత్రిగా కూడా చేస్తారని కర్నూలు జిల్లావాసులు భావించారు. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం.. కేర్ ఆస్పత్రిలో కన్నుమూయడంతో అభిమానులు తల్లడిల్లిపోయారు. -
చిన్నమ్మాయి లేదంటే నమ్మలేకపోతున్నా: ఎస్వీ సుబ్బారెడ్డి
శోభా నాగిరెడ్డి మరణవార్త విని ఆమె తండ్రి, సీనియర్ నాయకుడు ఎస్వీ సుబ్బారెడ్డి తీవ్రంగా కలత చెందారు. అసలు ఆమె లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. ఆళ్లగడ్డలో ఆయన 'సాక్షి'తో ఇలా మాట్లాడారు... ''ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందరికంటే చిన్నమ్మాయి. చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చి అందరిమెప్పు సాధించింది. ఆమె ఎన్నో విజయాలు సాధించింది. తక్కువ కాలంలోనే, చిన్న వయసులోనే ఇంత విజయాలు సాధించినవాళ్లను ఎవరినీ చూడలేదు. మా అందరికీ, మా కుటుం సభ్యులందరికీ చాలా బాధగా ఉంది. కన్న కూతురిగా చూసినా.. అందరి మన్ననలు పొందుతుంటే ఎంతో ఆనందించేవాళ్లం. ఇప్పుడు ఆమె లేదన్న విషయం మాటల్లో చెప్పలేని బాధ కలిగిస్తోంది. శోభా నాగిరెడ్డికి ప్రమాదం జరిగినట్లు ఒక స్నేహితుడు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు టీవీ ఆన్ చేసి చూస్తే విషయం తెలిసింది. టీవీల్లో స్క్రోలింగ్ చూడగానే మా అబ్బాయి మోహన్‌రెడ్డికి ఫోన్ చేశాను. అప్పటికే మా అబ్బాయి, కోడలు నంద్యాలకు బయల్దేరారు. నేను కూడా బయల్దేరుతానని చెప్పినా, నేను హృద్రోగిని కావడంతో ఆరోగ్యం దెబ్బతింటుందని వద్దన్నారు. తాము చూసుకుంటామన్నారు'' అని ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. -
ఆర్టీసీకి మొట్టమొదటి మహిళా ఛైర్మన్
శోభానాగిరెడ్డి .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీఎస్ ఆర్టీసీకి మొట్టమొదటి మహిళా ఛైర్మన్‌గా వ్యవహరించారు. రాయలసీమలో బలమైన నేతగా ఎదిగిన శోభానాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 1968 నవంబర్ 16న పుట్టారు. ఇంటర్ వరకూ చదువుకున్నారు. తండ్రి మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి. శోభానాగిరెడ్డికి 1986లో భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 1996లో శోభా నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 1997లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరో దఫా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పీఆర్పీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున రాయలసీమ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మల్యే ఆమె మాత్రమే. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చిన ఆమె పార్టీలో చేరారు. అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి పార్టీలో కీలక బాధ్యతలు పోషించారు. ఇప్పటివరకూ శోభానాగిరెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏపీఎస్ ఆర్టీసీకి మొట్టమొదటి మహిళా చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. శోభానాగిరెడ్డి సోదరుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్సీ. శోభానాగిరెడ్డి కుటుంబం కర్నూలులో ఎంతో ప్రజాసేవ చేసింది. శోభానాగిరెడ్డి ఇక లేరన్న విషయం తెలియగానే కర్నూలు ప్రజలు దుఖఃసాగరంలో మునిగిపోయారు. -
రేపు శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు
-
తల్లడిల్లిన అభిమానులు
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి (43) మరణించిన విషయం తెలిసి పార్టీ నాయకులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. నేత్రదానం చేయనున్నట్లు గతంలోనే శోభా నాగిరెడ్డి ప్రమాణపత్రం రాసి ఇవ్వడంతో ఆమె నేత్రాలను తీసి మరో ఇద్దరికి అమరుస్తారు. శుక్రవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని వైఎస్ఆర్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ విజయమ్మ తన ప్రచారాన్ని ఆపి, హుటాహుటిన రాజమండ్రి నుంచి విమానంలో బయల్దేరి హైదరాబాద్ కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైన శోభా నాగిరెడ్డి.. దాదాపు 12 గంటల పాటు మృత్యువుతో పోరాడి, చివరకు ఓడిపోయారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న ఎంతోమందిని కాపాడి.. ప్రాణాలు పోసిన అత్యంత నిపుణులైన కేర్ ఆస్పత్రి వైద్యులు ఎంతగా ప్రయత్నించినా, గాయాల తీవ్రత అత్యంత ఎక్కువగా ఉండటం, ఆమె శరీరం కూడా చికిత్సకు ఏమాత్రం స్పందించలేదు. అన్ని రకాలుగా ప్రయత్నించిన తర్వాత ఇక ఫలితం లేకపోవడంతో ఆమె మరణించినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. బుధవారం రాత్రి తన నియోజకవర్గంలో ప్రచారం ముగించుకుని, తిరిగి ఇంటికి వెళ్తుండగా వేగంగా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో నాలుగు పల్టీలు కొట్టని తర్వాత ఆమె వెన్నెముక, పక్కటెములకు తీవ్రగాయాలు కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. మెదడుకు సైతం గాయాలు కావడంతో ఆమె ముక్కు, చెవుల్లోంచి కూడా రక్తస్రావం అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శోభా నాగిరెడ్డి ఇక లేరన్న విషయాన్ని కేవలం కర్నూలు జిల్లా వాసులు మాత్రమే కాదు.. యావత్ ఆంధ్రదేశ ప్రజలు తల్లడిల్లిపోయారు. ఏ సమయంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించే నాయకురాలు ఇక తమకు లేరని తెలిసి అభిమానులు తట్టుకోలేకపోయారు. కేర్ ఆస్పత్రి ప్రాంగణం మొత్తం ఆమె అభిమానులతో కిటకిటలాడింది. -
సీమలో పీఆర్పీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శోభ
శోభా నాగిరెడ్డి... మంచి నాయకత్వ లక్షణాలున్న మహిళ. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు భూమా దంపతులు ఆ పార్టీలో చేరారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరూ పీఆర్పీలో చేరారు. భారీ అంచనాలు ఉన్నా కూడా పీఆర్పీ పెద్దగా ఫలితాలు సాధించలేకపోయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీచేసినా.. కేవలం 18 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అందులోనూ రాయలసీమలో ఆ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది. ఆ ఒక్క స్థానంలో గెలిచిన ధీరవనిత.. శోభా నాగిరెడ్డి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి పీఆర్పీ తరఫున పోటీ చేసిన శోభా నాగిరెడ్డి 61,555 ఓట్లు సాధించి.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై 1958 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. టీడీపీ అభ్యర్థి ఎరిగెల రామపుల్లారెడ్డికి ఆ ఎన్నికల్లో కేవలం 23800 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఆ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో ఆమెను ఓడించడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా రంగంలోకి దిగి మరీ ఓటర్లను బెదిరించారు. శోభా నాగిరెడ్డికి ఓటేస్తే ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా నిధులు రావన్నారు. అయినా కూడా ఆమె దాదాపు 37 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఆ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డికి 88,697 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డికి 51,902 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఎరిగెల రామపుల్లారెడ్డికి ఆ ఎన్నికల్లో 20,374 ఓట్లు మాత్రమే వచ్చాయి. -
శోభా నాగిరెడ్డి కన్నుమూత
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ అగ్రనేత శోభా నాగిరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 11.05 గంటలకు ఆమె మరణించారు. ఈ విషయాన్ని కేర్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్నీరు మున్నీరయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు అయిన శోభా నాగిరెడ్డి చురుకైన నేత. ఆమె 1968 నవంబర్ 16న ఆళ్లగడ్డలో జన్మించారు. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె అయిన శోభ ఇంటర్ వరకు చదివారు. 1986లో ఆమెకు భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది. 1996 నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోదఫా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున రాయలసీమలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాత్రమే. అది కూడా చిరంజీవి ప్రభావం వల్ల కాకుండా, తమ కుటుంబానికి ఉన్న పరపతితోనే ఆమె గెలిచారు. -
తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం: బాలినేని, వైవీ
తమ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డికి జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆమె ఆరోగ్యం కుదుటపడాలని భగవంతుడిని వేడుకుంటున్నామని అన్నారు. శోభా నాగిరెడ్డిని, ఆమె భర్త భూమా నాగిరెడ్డిని పరామర్శించేందుకు మరికాసేపట్లో ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. -
శోభ.. నా అక్కలాంటిది: వైఎస్ జగన్
-
శోభా నాగిరెడ్డి కోసం అభిమానులు తీవ్ర ఆవేదన
-
శోభ.. నా అక్కలాంటిది: వైఎస్ జగన్
శోభా నాగిరెడ్డి తన అక్కలాంటి వారని, ఆమె అడుగడుగునా తన వెంట నడిచారని, తన నీడలా వెన్నంటి ఉండి పార్టీకి మంచి అండదండలు అందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శోభా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం విషమ పరిస్థితిలో హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, అందువల్ల తాను ఎన్నికల ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్తున్నానని గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన చెప్పారు. -
శోభా ఆరోగ్య పరిస్ధితి పై హెల్త్‌బులిటెన్ విడుదల
-
శోభా నాగిరెడ్డి పరిస్థితి విషమం: హెల్త్ బులెటిన్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి (43) పరిస్థితి చాలా విషమంగా ఉందని కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఉదయం 10.30 గంటల తర్వాత హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. నిపుణులైన వైద్యులు పరీక్షలు చేస్తున్నారని, ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. సీటీ స్కాన్, ఎమ్మారై తదితర పరీక్షలు చేశారు. పక్కటెముకలు విరిగి ఛాతీలోకి చొచ్చుకెళ్లినట్లు తెలిసింది. మెడమీద కూడా గాయాలయ్యాయి. మల్టిపుల్ ఇంజ్యురీస్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హృదయస్పందన, బీపీ, పల్స్ రేట్లు నార్మల్‌గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉందని చెప్పారు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోగులు త్వరగా చికిత్సకు స్పందించరని, మరికొంత సమయం గడిస్తే తప్ప ఎలా స్పందిస్తున్నారన్న విషయం నిర్ధరించలేమని అన్నారు. రాత్రి ప్రమాదం జరిగి, తెల్లవారుజామున ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనపడకపోవడం మాత్రం ఆందోళనకరంగా ఉంది. -
శోభానాగిరెడ్డి కోలుకోవాలని అభిమానుల పూజలు
-
'రోడ్డు మీద ఆరబోసిన ధాన్యం వల్లే ప్రమాదం'
-
కాసేపట్లో శోభానాగిరెడ్డి పరిస్థితిపై హెల్త్ బులెటిన్
-
శోభా నాగిరెడ్డికి రక్షణ ఇవ్వని వాహనం
శోభా నాగిరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఆమెకు తగిన స్థాయిలో రక్షణ ఇవ్వలేకపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలతో కలిసి వైఎస్ఆర్ జనభేరిలో ఉత్సాహంగా పాల్గొన్న శోభా నాగిరెడ్డి, ప్రచారాన్ని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రోడ్డు మీద ఆరబోసిన ధాన్యం కుప్పల నుంచి వాహనాన్ని పక్కకు తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దాంతో ఒక్కసారిగా వాహనం నాలుగు పల్టీలు కొట్టింది. (చదవండి: శోభా నాగిరెడ్డికి తీవ్ర గాయాలు) సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు ఏవైనా జరిగితే వెంటనే అలాంటి వాహనాల్లో వెంటనే బెలూన్లు తెరుచుకుంటాయి. అలాంటప్పుడు ముందు సీట్లలో కూర్చున్నవారికి ఎలాంటి ప్రమాదం జరగదు. సురక్షితంగా ఉంటారు. కానీ, బుధవారం రాత్రి సంభవించిన ప్రమాదంలో బెలూన్లు తెరుచుకోలేదు. వాహనం ముందుభాగం తుక్కుతుక్కు అయిపోయింది. ముందు టైర్లు కూడా ఊడిపోయాయి. ముందున్న అద్దం పగిలిపోయింది, తలుపు కూడా ఉన్నట్టుండి తెరుచుకుంది. దాంతో తలుపు లోంచి శోభానాగిరెడ్డి యబటకు పడిపోయారు. అందుకే ఆమెకు అంత తీవ్రస్థాయిలో గాయాలయ్యాయని తెలుస్తోంది. -
ఫోన్లో వైద్యులను సంప్రదించిన వైఎస్ జగన్
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్ సోమరాజుతో పాటు ఇతర వైద్య ప్రముఖులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి తెలుసుకుంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెబుతున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజమండ్రి నుంచి విమానంలో హైదరాబాద్ బయల్దేరారు. శోభా నాగిరెడ్డి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసి వైఎస్ భారతి తక్షణం కడప నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శోభా నాగిరెడ్డిని పరామర్శించేందుకు పలువురు పార్టీ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఎంవీ మైసూరారెడ్డి, నన్నపనేని రాజకుమారి తదితరులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
కేర్ లో శోభానాగిరెడ్డికి చికిత్స
-
సోమరాజు ఆధ్వర్యంలో శోభానాగిరెడ్డికి చికిత్స
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభానాగిరెడ్డిని కాపాడేందుకు కేర్ ఆస్ప్రత్రి ఛైర్మన్ డాక్టర్ సోమరాజు పర్యవేక్షణలో మూడు బృందాలు పనిచేస్తున్నాయి. ఆర్థో, న్యూరో, క్రిటికల్ కేర్ బృందాలు ఆమెకు చికిత్స చేస్తున్నాయి. ప్రస్తుతం సీటీ స్కాన్ తీశారు. పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన తర్వాతే ఏ చికిత్స అందిస్తారో తెలుస్తుంది. పరీక్షలన్నీ పూర్తయ్యి, చికిత్స ప్రారంభం అయిన తర్వాత మాత్రమే తాము మీడియాకు అప్డేట్ ఇవ్వగలమని వైద్యులు చెప్పారు. మొత్తం చికిత్స అంతా కేర్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు పర్యవేక్షణలోనే జరుగుతోంది. అయితే 48 గంటల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఏ విషయమైనా చెప్పగలమని వైద్యులు అంటున్నారు. ఆమె మెడకు తీవ్ర గాయం అయ్యిందని, కంటి పైభాగంలో కూడా గాయం అయ్యిందని చెబుతున్నారు. వాహనం బాగా వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగి, వాహనం అద్దాలు పగిలి శోభానాగిరెడ్డి రోడ్డుపై పడటంతో బలమైన గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఆమెకు తగిలిన గాయాల కారణంగా.. క్రిటికల్ కేర్ వైద్యులు ప్రధానంగా ఆమెను కంటికి రెప్పలా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థో టీంలో ముగ్గురు, న్యూరో టీంలో ముగ్గురు నలుగురితో పాటు క్రిటికల్ కేర్ విభాగంలోని ఓ పెద్ద బృందం ఆమకు చికిత్స అందిస్తోంది. దాదాపు మరో గంట సమయంలో హెల్త్ బులెటిన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలా ఉందో మాత్రం తాము చెప్పలేమని వైద్యులు అంటున్నారు. అయితే ఆమెకు ఇంటర్నల్ బ్లీడింగ్ (అంతర్గత రక్తస్రావం) జరుగుతోందని మాత్రం తెలిసింది. -
పరిస్థితి ఇంకా విషమమే: వైద్యవర్గాలు
కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ అభ్యర్థి శోభానాగిరెడ్డి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఆమెకు ముక్కు, చెవుల్లోంచి కూడా రక్తం వచ్చినట్లు కర్నూలు జిల్లాలో వైద్యులు ప్రాథమికంగా తెలిపారు. అందువల్ల బహుశ మెదడులో ఏమైనా గాయాలు ఉన్నాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఆమె శ్వాస తీసుకోడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల ప్రస్తుతానికి వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలోని ఆర్థో, న్యూరో ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ ముగ్గురూ కలిసి శోభా నాగిరెడ్డిని పరీక్షించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శోభా నాగిరెడ్డితో పాటు ఆమె భర్త భూమా నాగిరెడ్డి కూడా హైదరాబాద్‌కు వచ్చారు. ఆమె చికిత్స పొందుతున్న కేర్ ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. పలు మీడియా ఛానళ్లకు చెందిన ప్రతినిధులు కూడా ఆస్పత్రి వద్దకు ఉదయమే చేరుకున్నారు. -
పరిస్థితి ఇంకా విషమమే: వైద్యవర్గాలు
-
శోభానాగిరెడ్డికి తీవ్రగాయాలు.. హైదరాబాద్ కు తరలింపు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం నంద్యాలలో ప్రాథమిక చికిత్స.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు సాక్షి, ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా): వైఎస్సార్సీపీ ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డి బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శోభా నాగిరెడ్డి బుధవారం వైఎస్ షర్మిలతో పాటు నంద్యాలలో జరిగిన వైఎస్సార్ జనభేరి సభల్లో పాల్గొన్న అనంతరం ఆళ్లగడ్డలోని తమ నివాసానికి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కాసేపట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం సంభవించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆళ్లగడ్డ మండలం గూబగుండం మిట్ట వద్ద రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పల్ని తప్పించేందుకు సడెన్ బ్రేక్ వేయడంతో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడి నాలుగు పల్టీలు కొట్టింది. డోర్ ఓపెన్ కావడంతో ముందు సీట్లో కూర్చున్న శోభా నాగిరెడ్డి వాహనం నుంచి ఎగిరి మళ్లీ వాహనంపై పడ్డారు. దీంతో ఆమె తలకు, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన నంద్యాలలోని సురక్ష ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అయితే, ఆమెకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాలని, అందుకు తప్పనిసరిగా హైదరాబాద్ తరలించాల్సిందేనని అక్కడి వైద్య వర్గాలు తెలిపాయి. దాంతో ఆమెను బంజారా హిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలియగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నంద్యాల ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదంలో ఆమెతోపాటు కారు డ్రైవర్ నాగేంద్ర, గన్‌మెన్ శ్రీనివాస్, బాషాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. శోభానాగిరెడ్డికి పక్కటెముకలు విరిగాయని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడానికి ఆమె తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వెంటిలేటర్ ద్వారా ఆమెకు శ్వాస అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆమె తలకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం శోభా నాగిరెడ్డిని హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. -
శోభానాగిరెడ్డి తలకు తీవ్రగాయాలు
-
శోభానాగిరెడ్డిని హైదరాబాద్ కు తరలింపు
-
YSRCP నేత శోభానాగిరెడ్డికి తీవ్రగాయాలు..
-
మీడియాను అడ్డుపెట్టుకుని నీచ రాజకీ యాలు
కాంగ్రెస్, టీడీపీలపై శోభా నాగిరెడ్డి ధ్వజం రఘురామ కృష్ణంరాజు ఓ కోవర్టు.. ఎమ్మెల్యే బాలరాజు, ప్రసాదరాజు వేముల, వేంపల్లె, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీలు మీడియాను అడ్డు పెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఇడుపులపాయలో పార్టీ కేంద్ర పాలక మండలి సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత 50 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగితే సగం నియోజకవర్గాలలో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కలేదని ఆమె విమర్శించారు. జగన్ రమ్మని పిలిస్తే కాంగ్రెస్, టీడీపీలు ఖాళీ అవుతాయన్నారు. పార్టీలో కొంతమంది ఉన్నన్ని రోజులు పొగడటం.. వెళ్లిన తర్వాత విమర్శించడం మంచిది కాదన్నారు. ఎస్పీవై రెడ్డి సీఎంను కలిశారని విలేకరులు అడగగా.. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సీఎంను కలుస్తున్నారని.. ఆయనను సీఎంగా కలుస్తున్నారు తప్ప.. కాంగ్రెస్ నాయకులుగా కలవలేదని, మీడియాయే తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఆ మూడు పార్టీల కోవర్టు... బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు కోవర్టుగా ఉండటంవల్లే రఘురామ కృష్ణంరాజును వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నుంచి బహిష్కరించారని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు పేర్కొన్నారు. పార్టీలో ఉంటూ.. వ్యక్తిగత విషయాలను టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు చెప్పడం తెలుసుకొని పార్టీ నుంచి సాగనంపారన్నారు. ఆయన వ్యక్తిగతంగా తలబిరుసు మనిషి అని, డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో ప్రవర్తిస్తుంటారని విమర్శించారు. శనివారం వారు ఇడుపులపాయలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకే జగన్ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. రఘురామకృష్ణం రాజు వెంట ఏ ఒక్క వైఎస్ఆర్ సీపీ కార్యకర్తా వెళ్లడం లేదంటే.. ఆయనకు ఏ మేరకు రాజకీయ భవిష్యత్ ఉందో స్పష్టమవుతోందన్నారు. 17 మంది ఎమ్మెల్యేల్లో త్యాగం చేసిన ఎమ్మెల్యేగా తానూ ఒకడినని బాలరాజు చెప్పుకొస్తూ.. జగన్ మనస్తత్వం ఏమిటో తమకు తెలుసునని, ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు ఏమీ చేయలేవన్నారు. -
ధైర్యముంటే టి-బిల్లుపై ఓటింగ్ జరపాలి: శోభా నాగిరెడ్డి
ముఖ్యమంత్రికి ధైర్యముంటే, శాసనసభలో విభజన బిల్లుపై ఓటింగ్ జరుపుతామని ప్రకటించాలని వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో శాసనసభ నడుస్తోందని, కాంగ్రెస్ అధిష్టానం డైరెక్షన్ మేరకే శాసనసభలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ రాత్రికి రాత్రే తమ విధానాన్ని ఎందుకు మార్చుకుందని, విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబు ఇప్పటికైనా వెనక్కి తీసుకుంటారా అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. అసలు విభజన బిల్లుపై సభలో చర్చించిన తర్వాత ఓటింగ్ అంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. -
తెలుగు ప్రజలంటే చులకనా? శోభానాగిరెడ్డి ప్రశ్న
-
ఇంకా ముసుగు తీసి సహకరించండి
-
కిరణ్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి హెచ్చరించారు. సోనియాగాంధీ వద్ద విభజనకు అంగీకరించిన ముఖ్యమంత్రి కిరణ్ ప్రజల వద్ద మాత్రం విభజనకు వ్యతిరేకమంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆళ్లగడ్డలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వైఎస్సార్సీపీపై కక్ష సాధింపు చర్యలకు ముఖ్యమంత్రి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై అధికారులకు నివేదికలు ఇచ్చినా తిరస్కరిస్తున్నారని, ఇది ఏమాత్రం తగదని చెప్పారు. -
డీజీపిని కలిసిన వైయస్సార్సీపి నేతలు
-
సమైక్యవాదులారా.. 'సమైక్య శంఖారావం'కు తరలిరండి
రాజకీయాలకు అతీతంగా సమైక్యవాదులందరూ 'సమైక్య శంఖారావం' సభకు తరలిరావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభ ఏర్పాట్లను పార్టీ నేతలతో కలసి శనివారం పరిశీలించారు. తెలంగాణలో ఉన్న సమైక్యవాదులు కూడా సభకు తరలిరావాలని ఆమె అన్నారు. ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు హాజరుకావాలని, ఇదే తమ ఆహ్వానంగా భావించాలని శోభా నాగిరెడ్డి కోరారు. -
దొంగలెవరో తేల్చుకుందామా: వైఎస్ఆర్ సీపీ
-
చంద్రబాబును నిలదీయండి: శోభా నాగిరెడ్డి
-
చంద్రబాబును నిలదీయండి: శోభా నాగిరెడ్డి
తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినట్లు అంగీకరించిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ లేఖను వెనక్కి తీసుకున్న తర్వాత మాత్రమే సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలం అని చెప్పి, సమైక్యాంధ్ర కోసం జోరుగా ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రాంతంలో ఆయనెలా పర్యటిస్తారని ఆమె నిలదీశారు. చంద్రబాబు చేస్తున్న యాత్ర విజయవంతం అయితే సమైక్యాంధ్ర ఉద్యమం లేదన్న సంకేతాలు ఢిల్లీకి వెళ్తాయని, అందువల్ల సీమాంధ్ర జేఏసీ నాయకులు ముందుకొచ్చి, ఆయనను నిలదీయాలని శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యమకారులంతా కూడా చంద్రబాబును సమైక్యాంధ్ర విషయంలో నిలదీయాలని ఆమె కోరారు. లేని పక్షంలో ఢిల్లీ వర్గాలు ఇక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని అనుమానించే అవకాశం ఉందని హెచ్చరించారు.