చిన్నమ్మాయి లేదంటే నమ్మలేకపోతున్నా: ఎస్వీ సుబ్బారెడ్డి | could not believe that she is not alive, says sv subba reddy | Sakshi
Sakshi News home page

చిన్నమ్మాయి లేదంటే నమ్మలేకపోతున్నా: ఎస్వీ సుబ్బారెడ్డి

Published Thu, Apr 24 2014 1:13 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

చిన్నమ్మాయి లేదంటే నమ్మలేకపోతున్నా: ఎస్వీ సుబ్బారెడ్డి - Sakshi

చిన్నమ్మాయి లేదంటే నమ్మలేకపోతున్నా: ఎస్వీ సుబ్బారెడ్డి

శోభా నాగిరెడ్డి మరణవార్త విని ఆమె తండ్రి, సీనియర్ నాయకుడు ఎస్వీ సుబ్బారెడ్డి తీవ్రంగా కలత చెందారు. అసలు ఆమె లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. ఆళ్లగడ్డలో ఆయన 'సాక్షి'తో ఇలా మాట్లాడారు... ''ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందరికంటే చిన్నమ్మాయి. చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చి అందరిమెప్పు సాధించింది. ఆమె ఎన్నో విజయాలు సాధించింది. తక్కువ కాలంలోనే, చిన్న వయసులోనే ఇంత విజయాలు సాధించినవాళ్లను ఎవరినీ చూడలేదు. మా అందరికీ, మా కుటుం సభ్యులందరికీ చాలా బాధగా ఉంది. కన్న కూతురిగా చూసినా.. అందరి మన్ననలు పొందుతుంటే ఎంతో ఆనందించేవాళ్లం.

ఇప్పుడు ఆమె లేదన్న విషయం మాటల్లో చెప్పలేని బాధ కలిగిస్తోంది. శోభా నాగిరెడ్డికి ప్రమాదం జరిగినట్లు ఒక స్నేహితుడు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు టీవీ ఆన్ చేసి చూస్తే విషయం తెలిసింది. టీవీల్లో స్క్రోలింగ్ చూడగానే మా అబ్బాయి మోహన్రెడ్డికి ఫోన్ చేశాను. అప్పటికే మా అబ్బాయి, కోడలు నంద్యాలకు బయల్దేరారు. నేను కూడా బయల్దేరుతానని చెప్పినా, నేను హృద్రోగిని కావడంతో ఆరోగ్యం దెబ్బతింటుందని వద్దన్నారు. తాము చూసుకుంటామన్నారు'' అని ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement