అమ్మ లేని లోటు తీరనిది | Bhuma akhila priya remembers her mother shobha nagi reddy | Sakshi
Sakshi News home page

అమ్మ లేని లోటు తీరనిది

Published Fri, Oct 17 2014 4:20 PM | Last Updated on Thu, Apr 4 2019 3:02 PM

అమ్మ లేని లోటు తీరనిది - Sakshi

అమ్మ లేని లోటు తీరనిది

హైదరాబాద్: అమ్మ లేని లోటు తీరనిదని భూమా శోభానాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియ కంటతడి పెట్టారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా అఖిల ప్రియ తన తల్లి శోభా నాగిరెడ్డిని స్మరించుకున్నారు. ఆమె ఆశయ సాధన కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రజా సమస్యల కోసం పాటుపడతానని, ప్రజల్లోనే ఉంటానని చెప్పారు.

అమ్మానాన్న, ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో పోటీ చేస్తున్నానని అఖిల ప్రియ అన్నారు. అమ్మ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదని చెప్పారు. శోభ మరణంతో ఎన్నిక జరుగుతుండటం బాధాకరమని ఆమె భర్త భూమా నాగిరెడ్డి అన్నారు.  శోభ లేని లోటు భర్తీ చేయడం సులభం కాదని చెప్పారు. అందరి అంచనాలకు తగ్గట్టుగా అఖిల పనిచేస్తుందని భూమా నాగిరెడ్డి చెప్పారు.

గత ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉన్న శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.  అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో ఆమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియను అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement