నామినేషన్ దాఖలు చేసిన భూమా అఖిల ప్రియ | Bhuma akhila priya files nomination as ysrcp candidate in allagadda by election | Sakshi
Sakshi News home page

నామినేషన్ దాఖలు చేసిన భూమా అఖిల ప్రియ

Published Fri, Oct 17 2014 1:28 PM | Last Updated on Thu, Apr 4 2019 3:02 PM

నామినేషన్ దాఖలు చేసిన భూమా అఖిల ప్రియ - Sakshi

నామినేషన్ దాఖలు చేసిన భూమా అఖిల ప్రియ

ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆళ్లగడ్డ తహసీల్డార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆమె వెంట తండ్రి భూమా నాగిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.


గత ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉన్న శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.  అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో ఆమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియను అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఎన్నికల షెడ్యూలు :

నామినేషన్లు        -  ఈ నెల 14 నుంచి  21వ తేదీ వరకు
పరిశీలన             -   ఈనెల 22న
ఉపసంహరణ       -  ఈనెల 24న
పోలింగ్               -   నవంబర్ 8న
ఓట్ల లెక్కింపు      -   నవంబర్ 12న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement