అమ్మ లేనిలోటు ఇప్పటికీ బాధిస్తోంది: అఖిల ప్రియ | still we are in deep sorrow after the death of our mother says bhuma akhila priya | Sakshi
Sakshi News home page

అమ్మ లేనిలోటు ఇప్పటికీ బాధిస్తోంది: అఖిల ప్రియ

Published Thu, Nov 13 2014 10:55 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

అమ్మ లేనిలోటు ఇప్పటికీ బాధిస్తోంది: అఖిల ప్రియ - Sakshi

అమ్మ లేనిలోటు ఇప్పటికీ బాధిస్తోంది: అఖిల ప్రియ

హైదరాబాద్ : తనపై నమ్మకముంచిన ఆళ్లగడ్డ ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటానని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ అన్నారు. గురువారం ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ 'అమ్మ లేని లోటు ఇప్పటికీ బాధగానే ఉంది. నాన్నపై అక్రమ కేసులు పెట్టి నా ప్రమాణ స్వీకారానికి దూరం చేశారు.

 

నాన్న భూమా నాగిరెడ్డి పీఏసీ ఛైర్మన్గా, నేను ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఒకేసారి ప్రమాణం చేయాలనుకున్నాం. నాన్న విడుదలయ్యేంత వరకూ నంద్యాల నియోజకవర్గ ప్రజల సమస్యల్లో కూడా భాగస్వామ్యమవుతా. ఎమ్మెల్యేగా నాకు అవకాశం కల్పించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా'నని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement