
నేడు భూమా అఖిలప్రియ ప్రమాణ స్వీకారం
ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిలప్రియ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిలప్రియ గురువారం ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన చాంబర్‌లో ఆమె చేత ప్రమాణం చేయిస్తారని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం ఒక ప్రకటనలో తెలిపింది.