ప్రజల నమ్మకాన్ని నిలబెడతా: అఖిల ప్రియ | Bhuma Akhila Priya thanks to unanimously elected on allagadda by polls | Sakshi
Sakshi News home page

ప్రజల నమ్మకాన్ని నిలబెడతా: అఖిల ప్రియ

Published Fri, Oct 24 2014 2:40 PM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

Bhuma Akhila Priya thanks to unanimously elected on allagadda by polls

ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో భూమా అఖిల ప్రియ ఆనందం వ్యక్తం చేశారు.  ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన వారికి ఆమె శుక్రవారం కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజక వర్గ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,  కుటుంబ సభ్యులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని అఖిల ప్రియ తెలిపారు. 

 

తల్లి ఆశయ సాధనకు పాటుపడతానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ చేయనందువల్లే తన ఎన్నిక ఏకగ్రీవమైందని అఖిల ప్రియ అన్నారు.  ఆళ్లగడ్డ ఉప ఎన్నిక బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు ఉపసంహరించుకోవటంతో అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement