
కిరణ్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి హెచ్చరించారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి హెచ్చరించారు. సోనియాగాంధీ వద్ద విభజనకు అంగీకరించిన ముఖ్యమంత్రి కిరణ్ ప్రజల వద్ద మాత్రం విభజనకు వ్యతిరేకమంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆళ్లగడ్డలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
వైఎస్సార్సీపీపై కక్ష సాధింపు చర్యలకు ముఖ్యమంత్రి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై అధికారులకు నివేదికలు ఇచ్చినా తిరస్కరిస్తున్నారని, ఇది ఏమాత్రం తగదని చెప్పారు.