
శోభ.. నా అక్కలాంటిది: వైఎస్ జగన్
శోభా నాగిరెడ్డి తన అక్కలాంటి వారని, ఆమె అడుగడుగునా తన వెంట నడిచారని, తన నీడలా వెన్నంటి ఉండి పార్టీకి మంచి అండదండలు అందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శోభా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు.
ఆమె రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం విషమ పరిస్థితిలో హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, అందువల్ల తాను ఎన్నికల ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్తున్నానని గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన చెప్పారు.