
నాడు జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు
సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ గతంలో జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడ్డాడు.
సూర్యాపేట : సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ గతంలో జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడ్డాడు. 2009 మార్చి 26న జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళుతుండగా, రాత్రి వేళ మోతె మండలకేంద్రం సమీపంలోని తిరుతమ్మగుడి మూలమలుపు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో జూనియర్ ఎన్టీఆర్‌తో సహా పలువురికి గాయాలు కాగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్సకు హైదరాబాద్ తరలించారు.