
సమైక్యవాదులారా.. 'సమైక్య శంఖారావం'కు తరలిరండి
రాజకీయాలకు అతీతంగా సమైక్యవాదులంతా 'సమైక్య శంఖారావం' సభకు తరలిరావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు.
రాజకీయాలకు అతీతంగా సమైక్యవాదులందరూ 'సమైక్య శంఖారావం' సభకు తరలిరావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభ ఏర్పాట్లను పార్టీ నేతలతో కలసి శనివారం పరిశీలించారు.
తెలంగాణలో ఉన్న సమైక్యవాదులు కూడా సభకు తరలిరావాలని ఆమె అన్నారు. ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు హాజరుకావాలని, ఇదే తమ ఆహ్వానంగా భావించాలని శోభా నాగిరెడ్డి కోరారు.