శోభా నాగిరెడ్డికి రక్షణ ఇవ్వని వాహనం
శోభా నాగిరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఆమెకు తగిన స్థాయిలో రక్షణ ఇవ్వలేకపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలతో కలిసి వైఎస్ఆర్ జనభేరిలో ఉత్సాహంగా పాల్గొన్న శోభా నాగిరెడ్డి, ప్రచారాన్ని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రోడ్డు మీద ఆరబోసిన ధాన్యం కుప్పల నుంచి వాహనాన్ని పక్కకు తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దాంతో ఒక్కసారిగా వాహనం నాలుగు పల్టీలు కొట్టింది. (చదవండి: శోభా నాగిరెడ్డికి తీవ్ర గాయాలు)
సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు ఏవైనా జరిగితే వెంటనే అలాంటి వాహనాల్లో వెంటనే బెలూన్లు తెరుచుకుంటాయి. అలాంటప్పుడు ముందు సీట్లలో కూర్చున్నవారికి ఎలాంటి ప్రమాదం జరగదు. సురక్షితంగా ఉంటారు. కానీ, బుధవారం రాత్రి సంభవించిన ప్రమాదంలో బెలూన్లు తెరుచుకోలేదు. వాహనం ముందుభాగం తుక్కుతుక్కు అయిపోయింది. ముందు టైర్లు కూడా ఊడిపోయాయి. ముందున్న అద్దం పగిలిపోయింది, తలుపు కూడా ఉన్నట్టుండి తెరుచుకుంది. దాంతో తలుపు లోంచి శోభానాగిరెడ్డి యబటకు పడిపోయారు. అందుకే ఆమెకు అంత తీవ్రస్థాయిలో గాయాలయ్యాయని తెలుస్తోంది.