protection
-
అన్నదాత ఆక్రందన
(పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి/నెట్వర్క్) : చంద్రబాబు పాలన అంటేనే కరువు కాటకాలకు పుట్టినిల్లంటారు! అన్నదాతలు భయపడినట్లుగానే టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు ఓవైపు కరువు.. మరోవైపు తుపాన్లు, వరదలు, అకాల వర్షాలు.. ఒకటేమిటి వరుస వైపరీత్యాలతో రైతన్నలు హతాశులయ్యారు! ఇక ఎటు చూసినా కల్తీలు రాజ్యమేలుతున్నాయి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. చివరికి చేతికొచ్చిన పంటకూ మద్దతు ధర దక్కక విలవిల్లాడి పోతున్నారు. మిర్చి నుంచి టమాటా వరకు.. ధాన్యం నుంచి కంది దాకా ఏ పంట చూసినా మద్దతు ధర లభించక.. పెట్టుబడి ఖర్చులూ దక్కక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రధాన పంటలకూ మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొన్నా.. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద టన్ను కాదు కదా.. కనీసం క్వింటా పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన పాపాన పోలేదు. అన్నదాతా సుఖీభవ పెట్టుబడి సాయం లేదు.. కరువు సాయం లేదు.. పంట నష్ట పరిహారం జాడ లేదు... పంటల బీమా రక్షణ లేదు... వెరసి ‘కాల కూటమి’ పాలనలో రైతన్నల బతుకు దుర్భరంగా మారింది!16 లక్షల ఎకరాలు సాగుకు దూరంఈ దఫా ఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు కాగా, అతికష్టమ్మీద 70 లక్షల ఎకరాల్లోపు పంటలు సాగయ్యాయి. దాదాపు 16లక్షల ఎకరాలు సాగుకు దూరమయ్యాయి.ప్రకృతి వైపరీత్యాలతో 10 లక్షల ఎకరాల్లో పంట తుడిచి పెట్టుకుపోయింది. రాయలసీమలో దాదాపు వందకు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకోవడంతో సుమారు10 లక్షల ఎకరాలు బీడువారి పోయాయి. మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం మినహా ప్రభుత్వం పైసా పరిహారం విదిల్చలేదు. 14.80 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వేరుశనగ కేవలం 6.75 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఆరు లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన మిరప 3.72 లక్షల ఎకరాల్లోనే పరిమితమైంది.కాకి లెక్కలతో రైతు నోట్లో మట్టికష్టకాలంలో రైతన్నకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కాకి లెక్కలతో వారి నోట్లో మట్టికొట్టింది. సూపర్‌సిక్స్‌లో ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయంలో పైసా విదిల్చిన పాపాన పోలేదు. ఖరీఫ్–23లో 2.37లక్షల మందికి చెల్లించాల్సిన రూ.164.05 కోట్లతోపాటు రబీ–2023–24 సీజన్లో 1.54 లక్షల మందికి జమ కావాల్సిన రూ.163.12 కోట్ల కరువు బకాయిలు ఊసెత్తడం లేదు. చివరకు గత జూలైలో కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన 32 వేల మందికి రూ.31.53 కోట్లు నేటికీ జమ చేయలేదంటే రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో తేటతెల్లమవుతోంది.ఎరువులకూ దిక్కు లేదు..ఎరువుల కొరత రైతులను అడుగడుగునా వేధించింది. చంద్రబాబు పాలనలో ఆనవాయితీగా రైతులు మండల కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ బస్తాపై రూ.100–400 వరకు వసూలు చేస్తూ డీలర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. పుండుమీద కారం చల్లినట్టుగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు బస్తాకు రూ.255 వరకు పెంచాయి. నాసిరకం ఎరువుల నిర్వాకం సాక్షాత్తూ పౌరసరఫరాల మంత్రి తనిఖీల్లోనే బట్టబయలైంది.దిగజారిన దిగుబడులు.. దక్కని మద్దతుధాన్యం సహా ఈ ఏడాది ప్రధాన పంటల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. సాధారణంగా దిగుబడులు తగ్గినప్పుడు మార్కెట్లో మంచి రేటు పలకాలి. కానీ ఈ ఏడాది ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొంది. ఏటా ముందస్తు ధరలను అంచనా వేసే ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్కెటింగ్ కేంద్రం సైతం ఈ ఏడాది ఖరీఫ్ పంట ఉత్పత్తులకు ఆశించిన ధరలు లభించడం లేదని తేల్చి చెప్పింది. అధిక వర్షాలతో పంట నాణ్యత దెబ్బతినడంతో పాటు గోదాముల్లో పేరుకున్న నిల్వల కారణంగా మిరప, పత్తి ధరలు దారుణంగా క్షీణించాయని తేల్చింది.రూ.20,000 సూపర్ సిక్స్‌లో ఇస్తామని ఎగ్గొట్టిన పెట్టుబడి సాయం 2019–24 మధ్య విత్తనాలు, ఎరువులకు ఇబ్బంది పడని రైతులు.. కూటమి పాలనలో పడరాని కష్టాలు పడుతున్నారు. రైతు సేవా కేంద్రాల్లో నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరా నిలిచిపోయింది. సబ్సిడీ విత్తనాలు అరకొరగానే ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏటా సగటున 4 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేస్తే.. కూటమి సర్కారు మాత్రం చేతులెత్తేసింది. కృత్రిమ కొరత సృష్టిస్తూ బస్తాపై వంద నుంచి 400 వరకు డీలర్లు దండుకున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధర బస్తాకు రూ.250 వరకు పెంపుతో రైతులకు పెనుభారంగా మారింది.» కనీస మద్దతూ కరువు» ధాన్యం బస్తాకు దక్కాల్సింది రూ.1,725 » దళారులు చెల్లిస్తున్నదిరూ.1,350–రూ.1,550 టమాట మీద నిలవని మంత్రి అచ్చెన్న టమాట పంట ధరలు పతనమై అన్నదాతలు గగ్గోలు పెట్టగా.. కిలో రూ.8కి కొంటామని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తర్వాత డబ్బుల్లేవని మాట మార్చారు. మార్కెట్లో టమాట ప్రస్తుతం కిలో రూ.20 ఉంది. రైతులకు దక్కుతున్నది రూ.3నుంచి రూ.5. మిర్చి, పత్తి మినుముధరల పతనం2023–24 సీజన్లో క్వింటా రూ.21 వేల నుంచి రూ.27 వేలు పలికిన మిర్చి... ప్రస్తుతం సగటున రూ.8 వేలు–రూ.11 వేలు కూడా లేదు. నిరుడు పత్తి క్వింటా రూ.10 వేలకు పైగానే పలకగా.. నేడు రూ.4 వేల నుంచి రూ.5,800కు పరిమితమైంది. మినుముల ధర గత సీజన్ లో క్వింటా రూ.10 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.6 వేల నుంచి రూ.7,000 మాత్రమే.నిరుడు దిలాసా.. నేడు లాస్ డ్రాగన్ ఫ్రూట్ టన్ను నిరుడు రూ.1.80 లక్షలు పలకగా, నేడు రూ.1.20 లక్షలకు పడిపోయింది. అరటి రూ.25 వేలు, ద్రాక్ష రూ.40 వేలు, బొప్పాయి రూ.11 వేలు, పుచ్చకాయలు రూ.7 వేలు, కర్బూజా రూ.12 వేలకు మించడం లేదు. దిగుబడి లేక దిగాలు.. పరిహారం అందక కుదేలు2.80 ఎకరాల్లో వరి సాగు చేశా. తుపాన్‌తో రూ.50 వేలకు పైగా నష్టపోయా. పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం మా మండలంలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఎకరాకు రూ.5వేలు నష్టపోతున్నా. – భాస్కర్, పీవీ పురం, సత్యవేడు మండలం, తిరుపతి జిల్లాఎకరాకు రూ.లక్ష నష్టంఖరీఫ్లో ఆరు ఎకరాల్లో మిరప వేశా. ఎకరానికి రూ.లక్షన్నర వరకు ఖర్చుపెట్టా. బొబ్బర తెగులుతోపంట దెబ్బతింది. ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చేలా కనిపించడం లేదు. నిరుడు క్వింటా రూ.20 వేలు వరకు ఉంటే ఈ ఏడాది రూ.10 వేలకు కూడా కొనేవారు లేరు. ఎకరానికి రూ.లక్ష వరకు నష్టం వాటిల్లుతోంది. మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.– వెన్నపూసల జగన్మోహన్రెడ్డి, కాచవరం, కారంపూడి మండలం, పల్నాడు జిల్లా గత ఐదేళ్లూ బాగుంది..8 ఎకరాల్లో 1,500 చీనీ చెట్లు సాగు చేశా. కూలీలు, మందులు, ఇతర పెట్టుబడి కింద రూ.6.50 లక్షలు ఖర్చు చేశా. హెక్టారుకు 25 టన్నుల దిగుబడి ఆశిస్తే వాతావరణం దెబ్బకొట్టింది. 10 టన్నుల దిగుబడే వచ్చింది. గత నాలుగైదు సంవత్సరాలు మంచి వర్షాలు కురిశాయి. దిగుబడులు బాగా వచ్చాయి. టన్ను రూ.50 వేలకు తక్కువ కాకుండా ధర పలకడంతో లాభాలు ఆర్జించా. వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా కింద పరిహారం రూపంలో కూడా లబ్ధి పొందా. – రైతు నాగన్న, ముకుందాపురం, గార్లెదిన్న మండలం, అనంతపురం జిల్లాపత్తి రైతు చిత్తురాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 9.82 లక్షల ఎకరాల్లో సాగైంది. వరదలు, వర్షాలకు తోడు గులాబీ తెగులు ప్రభావంతో ఎకరాకు 4–6 క్వింటాళ్లకు మించిరాలేదు. గతేడాది క్వింటా రూ.10 వేలకు పైగా పలికిన పత్తి... ప్రస్తుతం గ్రేడ్‌ను బట్టి రూ.4 వేల నుంచి రూ.5,800 మించి పలకని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో సైతం గరిష్టంగా క్వింటాకు రూ.6,500 మించి ధర లేదని రైతులు చెబుతున్నారు. పెసర పంటకు కేంద్రం మద్దతు ధర రూ.8,558 ప్రకటించినా, ప్రస్తుతం మార్కెట్లో రూ.6 వేల నుంచి రూ.6,500 మించి పలకడం లేదు. 2023–24లో క్వింటా రూ.10 వేలు పలికిన మినుముకు ఈ ఏడాది రూ.7 వేలకు మించి ధర లేదు. టమాటా రైతులకు తొలి కోత నుంచే కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్లో కిలో రూ.20 పలుకుతున్నా రైతులకు మాత్రం రూ.3–5కు మించి దక్కడం లేదు. ధర లేకపోవడంతో చీని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగయ్యే కోకో పంటకు ఈసారి ధర లేకుండా పోయింది. చామంతి గతేడాది కిలో రూ.130 పలుకగా, ప్రస్తుతం కిలో రూ.20–30కి మించని పరిస్థితి నెలకొంది.మిర్చి రైతు కంట్లో కారంమిరప రైతులు తెగుళ్లు, చీడపీడలతో ఆశించిన దిగుబడులు రాక, మార్కెట్లో గిట్టుబాటు «ధర లేక తీవ్రంగా నష్టపోయారు. 2023–24 సీజన్లో 5.92 లక్షల ఎకరాల్లో మిరప సాగవగా, 2024–25లో కేవలం 3.94 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఎకరాకు రూ.2.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. జెమినీ వైరస్, నల్లతామర, ఇతర తెగుళ్ల ప్రభావంతో ఎకరాకు 10–15 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాని పరిస్థితి. 2023–24 సీజన్లో క్వింటా రూ.21 వేల నుంచి రూ.27 వేల వరకు పలకగా, ప్రస్తుతం సగటున క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.11 వేలకు మించి రావడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి తేజ రకానికి క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.12 వేలు.. లావు రకాలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు.. మధ్యస్థ రకాలకు రూ.10–11 వేలకు మించి ఇవ్వడం లేదు. తెల్లకాయలు గతంలో క్వింటా రూ.10వేలు నుంచి రూ.13 వేలు పలికితే ప్రస్తుతం రూ.3వేల నుంచి రూ.4 వేలకు మించి కొనడం లేదు. రాష్ట్రంలోని గిడ్డంగుల్లో 27 లక్షల బస్తాల నిల్వలు పేరుకుపోయాయి. గతంలో టీడీపీ హయాంలో 12 లక్షల టన్నుల మిరప ఎగుమతులు జరగగా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా, రికార్డు స్థాయిలో 16.10 లక్షల టన్నులను ఎగుమతి చేయడం గమనార్హం.రైతు కష్టం..పశువుల పాలు టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి కూరగాయల మార్కెట్లో కిలో టమాటా ధర రూ.3 నుంచి రూ.5 మధ్య పలికింది. 27 నుంచి 30 కిలోల బరువున్న టమాటా ట్రే ధర రూ.100 నుంచి రూ.150 మాత్రమే. కూలి, రవాణా ఖర్చులు పోగా, రైతులకు ఒక్కో ట్రేకు రూ.70 కూడా మిగలడం లేదు.చివరికి ఆ ధరకు కూడా మంగళవారం కొనుగోలు చేసేవారు లేకపోవడంతో పలువురు రైతులు తాము తెచి్చన టమాటా పంటను మార్కెట్లోనే పశువులకు పారబోసి వెనుదిరిగారు. ఉద్యాన, కూరగాయల రైతులను ఆదుకుంటామని చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం పత్తా లేకుండా పోయిందని, తమకు కష్టాలు తప్పడంలేదని రైతులు వాపోయారు. – బొబ్బిలి నాడు ప్రతీ పంటకు ‘మద్దతు’ఎన్నికల హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పతనమైన ప్రతిసారీ జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర దక్కేలా చేసింది. పొగాకు, పత్తి, పసుపుతో సహా సజ్జలు, కొర్రలు, రాగులు, శనగ, పెసలు, కంది, వేరుశనగ, జొన్నలు, ఉల్లి, టమాటా, బత్తాయి, అరటి రైతులకు అండగా నిలిచింది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి వంటి పంటలకు సైతం ఎమ్మెస్పీని ప్రకటించి ఐదేళ్లూ ఆ ధరకు ఒక్క రూపాయి తగ్గకుండా చూసింది. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. 2019–24 మధ్య వైఎస్ జగన్ హయాంలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేశారు.అంటే.. రెట్టింపు కన్నా అధికం. ఇక చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన 3,403 టన్నుల పత్తి, రూ.18 కోట్ల విలువైన 8,459.56 టన్నుల టమాటాను సైతం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. ఖజానాలో సొమ్ములు లేకపోయినా..వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో రూ.100 కోట్లకు మించి డబ్బులు లేకున్నా పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టారు. రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. శనగలు, మొక్కజొన్న, పత్తి, కందులు, పసుపు.. ఇలా తొలి ఏడాదిలోనే 14 రకాల ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు సేకరించారు. 3,76,902 మంది రైతుల నుంచి రూ.4354.11 కోట్ల విలువైన 11,02,105 టన్నుల పంట ఉత్పత్తులను సేకరించి చిత్తశుద్ధిని చాటుకుంది. -
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు తక్షణ రక్షణ కవచం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ఈ క్రమంలో ఇజ్రాయెల్ తరహాలో ఐరెన్ డోమ్ నిర్మించుకుంటామని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్(Israel)పై జరిగే రాకెట్ దాడులను ఐరన్ డోమ్ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో అమెరికాకు ఓ ఐరన్ డోమ్‌ను నిర్మించుకుంటామని ట్రంప్ అంటున్నారు. రక్షణ కార్యదర్శిగా పీట్ హెగ్స్త్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమం మియామీలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్.. ఐరన్ డోమ్(Iron Dome) వ్యాఖ్యలు చేశారు. అత్యవసరంగా ఆ నిర్మాణం జరగాల్సిన ఆవశ్యకత ఉందని, అతిత్వరలో ఆ దస్త్రంపై సంతకం చేస్తానని వెల్లడించారాయన.👉ఇజ్రాయెల్ ఆయుధాల పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఐరన్ డోమ్. నిప్పుల వర్షంలా ప్రత్యర్థులు రాకెట్లు ప్రయోగిస్తున్నా.. ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకొంటుంది. ఆకాశంలో క్షిపణులు దూసుకొస్తున్నా ఇజ్రాయెల్ వాసులు ధైర్యంగా తమ పని తాము చేసుకొనేట్లు చేసింది.👉2006లో హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. నాడు వేల రాకెట్లను ఆ సంస్థ టెల్అవీవ్ పై ప్రయోగించింది. దీంతో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకొంది. దీంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌కు తయారీకి నిర్ణయించింది. దీనికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. 2008 నాటికి టమిర్ క్షిపణులను పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. 2011 నాటికి అందుబాటులోకి తెచ్చింది.👉ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ చిట్టచివరి దశలో ఐరన్ డోమ్ ఉంటుంది. హమాస్(Hamas), హెజ్బొల్లా ప్రయోగించిన వేల రాకెట్లు, వందల డ్రోన్లను కూల్చేయడంతో ఇది ఆ మధ్య తీవ్ర చర్చనీయాంశమైంది.👉ఐరన్ డోమ్ సక్సెస్ రేటు 90శాతానికి పైగానే ఉంది. అక్టోబర్ 7న హమాస్ దాడిలో వేల రాకెట్లను ఇది కూల్చేసింది. కానీ, కొన్ని దీని బారినుంచి తప్పించుకొని ఇజ్రాయెల్ వాసుల మరణాలకు కారణమయ్యాయి. ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు 50 వేల డాలర్లు ఖర్చవుతుందని అంచనా. దూసుకొచ్చే ఒక్కో ముప్పును పేల్చేయడానికి రెండు క్షిపణులను ఐరన్ డోమ్ ప్రయోగిస్తుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద 10 ఐరన్ డోమ్ బ్యాటరీలు ఉన్నట్లు రేథియాన్ అంచనావేసింది. దీనిని వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చవచ్చు. 2020లో అమెరికాకు రెండు బ్యాటరీలను ఎగుమతి చేశారు. ఐరన్ డోమ్ ఎలా పని చేస్తుందంటే.. ఐరన్ డోమ్‌ను స్థానికంగా ‘కిప్పాట్ బర్జెల్’ అంటారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకొంటుంది. దీనిలో రాడార్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ ఉంటాయి. రాడార్ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనావేస్తుంది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేకపోతే.. వదిలేస్తుంది. అదే జనావాసాలు అయితే మాత్రం రాకెట్‌ను ప్రయోగించి దానిని ధ్వంసం చేస్తుంది. ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్టా, ఎంప్రెస్ట్ సిస్టమ్, రఫెల్ సంస్థలు పనిచేశాయి.ప్రతి ఐరన్ డోమ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు ఉంటాయి. ఒక్కోటి 10 సెకన్లలో 20 క్షిపణులను ప్రయోగించగలవు. అత్యధిక ముప్పులను ఏకకాలంలో ఎదుర్కొనేలా దీనిని డిజైన్ చేశారు. -
ధరించే కొద్దీ ఆభరణాలు మెరుపు తగ్గుతాయా? ఏం చేయాలి?
ఆభరణాలను ధరించే కొద్దీ మెరుపు తగ్గిపోతాయని అ΄ోహ పడుతుంటాం. కానీ వాటి మెరుపు ఎక్కడికీ పోదు. రోజూ ధరించే బంగారు ఆభరణాలు గాలి, దుమ్ము, ధూళి, వాయు కాలుష్యం కారణంగా మసకబారుతుంటాయి. వాటికి మెరుగు పెట్టించాలనుకుని దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నెలకోసారి ఇంట్లోనే శుభ్రం చేసుకోవచ్చు. ఒక పాత్ర (మెటల్ పాత్ర వాడరాదు, ప్లాస్టిక్ పాత్ర వాడాలి)లో డిష్ వాష్ లిక్విడ్ నాలుగు చుక్కలు వేసి గోరువెచ్చని నీటిని ΄ోసి కల΄ాలి. ఆ తరవాత ఆభరణాలను నీటిలో మునిగేలా ఉంచి 15 నిమిషాల తర్వాత చేత్తో రుద్ది కడగాలి. ఆ తర్వాత మంచినీటి పాత్రలో పెట్టి వేళ్లతో మృదువుగా రుద్దుతూ సబ్బు వదిలేటట్లు శుభ్రం చేయాలి. నీటితో శుభ్రం చేసిన తర్వాత పేపర్‌తో తుడిచే ప్రయత్నం చేయరాదు. మెత్తటి కాటన్ వస్త్రాన్ని ఒత్తుగా నాలుగు మడత లు వేసి ఆభరణాన్ని ఉంచాలి. శుభ్రం చేసిన ఆభరణాన్ని బీరువాలో పెట్టాలంటే ఆభరణంలో ఏ మాత్రం తేమ లేకుండా ఆరిన తర్వాత మాత్రమే భద్రపరచాలి. ఆభరణాలను శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన నియమం ఏమిటంటే...ఒక్కొక్క ఆభరణాన్ని విడిగా శుభ్రం చేయాలి. చెవికమ్మలు, రింగుల వంటి వాటిని కలిపి నానబెట్టి శుభ్రం చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. కలిపి ఒకే పాత్రలో నానబెట్టాల్సి వస్తే అడుగు వెడల్పుగా ఉండి ఒక కమ్మ మరొక కమ్మకు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కడిగేటప్పుడు కూడా ఒకదానికి మరొకటి తగులుతూ ఉంటే గీతలు పడతాయి.రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాన్ని శుభ్రం చేయాలంటే నీటిలో నానబెట్టరాదు. మొదట సబ్బు నీటితో ముంచిన మెత్తని వస్త్రంతో ఆభరణాన్ని తుడవాలి. ఆ తర్వాత మంచినీటిలో ముంచిన క్లాత్‌తో తుడవాలి. తుడిచిన తర్వాత మెత్తటి టవల్ మీద ఆభరణాన్ని తలకిందులుగా (ఈ స్థితిలో ఆభరణంలో పొదిగిన రాయి కిందగా టవల్‌ను తాకుతూ ఉంటుంది. బంగారు పైకి కనిపిస్తుంటుంది) ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టడం వల్ల రాయికి బంగారానికి మధ్య తేమ చేరకుండా ఉంటుంది. చదవండి: కళ్లు చెదిరే ఇన్‌స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలుబామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్ -
అమరావతి ‘ముంపు టెండర్ల’లో అక్రమాల వరద
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కొండవీటి వాగు, పాల వాగు వరద ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు చేపట్టే పనుల టెండర్లలో అక్రమాలు వరదెత్తాయి. పనుల అంచనా వ్యయాన్ని 100 నుంచి 250 శాతం పెంచేసి.. మూడు ప్యాకేజీలుగా విభజించి.. ముందుగా ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారుల ద్వారా ముఖ్యనేతలు మూడు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వీటి కాంట్రాక్ట్ విలువ (అన్ని పన్నులతో కలిపి) రూ.1,404.13 కోట్లుగా నిర్దేశించారు. పనుల విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్ట్ సంస్థలకు పనులు అప్పగించి.. పెంచిన అంచనా వ్యయం రూ.702.33 కోట్లను కమీషన్ల రూపంలో రాబట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. మూడు ప్యాకేజీల పనులు ఇవీ ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణంగా ఇస్తున్న నిధులతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ చేపట్టింది. ఒకటో ప్యాకేజీ కింద కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి, లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎల్ఎస్ (లంప్సమ్) విధానంలో 24 నెలల్లో పూర్తి చేయడంతోపాటు మరో రెండేళ్లు నిర్వహించాలని నిబంధనతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.462.26 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా రూ.60.53 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ ప్యాకేజీ పనుల అంచనా వ్యయం రూ.522.79 కోట్లు. రెండో ప్యాకేజీ ఇదీ రెండో ప్యాకేజీ కింద నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడం.. కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో రెండేళ్లలో పూర్తి చేసి, మరో రెండేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.303.73 కోట్లుగా నిర్దేశించింది.దీనికి అదనంగా రూ.38.57 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా విలువ రూ.342.3 కోట్లు. ఒకటో, రెండో ప్యాకేజీ పనులకు షెడ్యూళ్లు దాఖలు చేయడానికి ఈనెల 31 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరిచి.. అర్హత ఉన్న కాంట్రాక్ట్ సంస్థలు దాఖలు చేసిన ఆరి్థక బిడ్లను ఫిబ్రవరి 5న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనున్నారు. మూడో ప్యాకేజీ కింద.. మూడో ప్యాకేజీ కింద మంగళగిరి మండలం నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో ఈ నెల 1న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.470.74 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా వ్యయం రూ.539.04 కోట్లు. ఈ పనుల టెండర్లలో షెడ్యూళ్ల దాఖలుకు ఈ నెల 22 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్, ఈనెల 25న ఆర్థిక బిడ్ తెరిచి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టనున్నారు. అంచనాల్లో పొంగిపొర్లిన అక్రమాలు రాజధాని ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు వంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించడమే.. కొత్తగా 7.843 కిమీల పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వడానికి ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు.ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, 10 నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ. రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల (జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ వంటి పన్నులతో కలిపి)కు మించదని జలవనరుల శాఖలో అనేక ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక అధికారి తేల్చిచెప్పారు.ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను జీఎస్టీ వంటి పన్నులతో కలిపి రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. కొండవీటి వాగు, పాల వాగు లోతు, వెడల్పు పెంచే పనులకు కి.మీ. రూ.5 కోట్లు చొప్పున వేసుకున్నా రూ.201.75 కోట్లు అవుతుంది. శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.వంద కోట్లు లోపే అవుతుంది.జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే..జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉండి ఉంటే టెండర్ ముసాయిదా షెడ్యూల్ దశలోనే ఈ అక్రమాలు బహిర్గతమయ్యేవని.. అందుకే ఆ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు స్పష్టం చేశారు. జాయింట్ వెంచర్‌గా ఏర్పడి టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి వీల్లేదని నిబంధన పెట్టడం ద్వారా ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్ట్ సంస్థకే పనులు అప్పగించేందుకు ముఖ్యనేతలు ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది. అదే టెండర్ నోటిఫికేషన్లో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే వెసులుబాటును కల్పించడాన్ని బట్టి చూస్తే ముఖ్యనేతల దోపిడీ పన్నాగం బట్టబయలవుతుందని రిటైర్డ్ ఎస్ఈ ఒకరు స్పష్టం చేశారు.రాష్ట్రంలో 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి, ప్రతిపాదన దశలోనే పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి.. వాటిని కమీషన్ల రూపంలో వసూలు చేసుకుని జేబులో వేసుకోవడానికి ముఖ్య నేతలు మరిగారు. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని చేసి.. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని రద్దు చేశారు. రూ.100 కోట్లు.. అంతకంటే వ్యయం ఎక్కువగా ఉన్న పనులకు సంబంధించి టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలి.దీన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. ఇంజనీర్లు, మేధావులు, ప్రజలు, కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఆన్లైన్లో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి అభిప్రాయాలను తీసుకుంటారు. వాటి ఆధారంగా ముసాయిదా షెడ్యూల్లో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసిన ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదిస్తారు. దాంతోనే సంబంధిత శాఖ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని పునరుద్ధరించింది. ఇది జరిగాకే రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్లు పిలుస్తున్నారు. మిగిలిన రెండు ప్యాకేజీల్లోనూ ఇదే తీరురెండో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.197.05 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం పన్నులతో కలిపి రూ.342.3 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే అంచనా వ్యయం రూ.145.25 కోట్ల మేర పెంచేసినట్టు స్పష్టమవుతోంది. 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడానికి.. కిలోమీటర్‌కు రూ.6 కోట్ల చొప్పున రూ.47.05 కోట్లు అవుతుంది.కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం రూ.150 కోట్లకు మించదు. మూడో ప్యాకేజీ కింద నీరుకొండ వద్ద 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.200 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.339.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టు తేటతెల్లమవుతోంది. -
సోషల్ మీడియా DPDP నిబంధనలు : 18 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిరి
సామాజిక మాధ్యమాల వినియోగంలో 18 ఏళ్ల లోపు పిల్లలకు సంబంధించి కీలక చట్టం రాబోతోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్ డ్రాప్ట్ రూల్స్ ప్రకారం ఇకపై 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి ముందు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమ్మతి అవసరమని స్పష్టం చేస్తోంది. భారతదేశం వెలుపల వ్యక్తిగత డేటాను బదిలీ చేయడానికి కంపెనీలకు ప్రభుత్వ అనుమతి అవసరమని కూడా పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (జనవరి 3న) డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 (DPDP) కోసం డ్రాఫ్ట్ నియమాలను నోటిఫై చేసింది. నిబంధనలపై అభిప్రాయాన్ని/కామెంట్లను పంచుకోవడానికి మంత్రిత్వ శాఖ వాటాదారులను కూడా ఆహ్వానించింది. ముఖ్యంగా స్కూల్ పిల్లలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచడం దేశ ప్రయోజనాలకు మంచిదన్న అభిప్రాయం, సోషల్ మీడియా వినియోగానికి కనీసం 21 ఏళ్లు లేదంటే ఓటు హక్కుకు అమలు చేస్తున్నట్టుగా 18 ఏళ్ల వయోపరిమితి ఉండాలన్న వాదనల మధ్య ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.The Ministry of Electronics and Information Technology has published the draft rules for the Digital Personal Data Protection (DPDP) Act for public consultation. Suggestions and objections regarding the draft rules can be submitted through the MyGov portal until February 18,… pic.twitter.com/a5X4uPeFyW— Bar and Bench (@barandbench) January 3, 2025 పిల్లల డేటా ప్రాసెసింగ్‌పై DPDP రూల్స్ ప్రకారం చైల్డ్ (C) వినియోగదారు సోషల్‌మీడియా ఖాతాను సృష్టించాలనుకుంటే, డేటా ఫిడ్యూషియరీ (DF) తప్పనిసరిగా తల్లిదండ్రుల సమ్మతిని ధృవీకరించాలి. ఈ సందర్భంలో, తల్లిదండ్రులు (P) తనను తాను గుర్తించి, DFతో ఇప్పటికే అందుబాటులో ఉన్న ధృవీకరించిన గుర్తింపు, వయస్సు వివరాలతో రిజిస్టర్డ్ యూజర్ అని నిర్ధారిస్తారు. పిల్లల డేటాను ప్రాసెస్ చేయడానికి ముందు, డీఎఫ్ తప్పనిసరి. అలాగే తల్లిదండ్రుల గుర్తింపు , వయస్సు రికార్డుల విశ్వసనీయతను కూడా నిర్ధారించాల్సి ఉంటుంది.ఫిబ్రవరి 18 వరకు ప్రజాభిప్రాయాల సేకరణకుద్దేశించిన ముసాయిదా నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నిర్దేశించిన IDని ధృవీకరించి, డిజిటల్ లాకర్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా అందుబాటులో ఉంచడానికి పిల్లల వయస్సును ధృవీకరించాలి. వివాదంDPDP చట్టంలో పిల్లల డేటా ప్రాసెసింగ్‌కు సంబంధించిన నిబంధనలు వివాదాస్పదంగా ఉన్నాయి. పౌర సమాజం, పరిశ్రమ వర్గాలతో పాటు, మెటా, గూగుల్ (Meta, Google) లాంటి బిగ్ టెక్ సంస్థలు కూడా ప్రభుత్వాన్ని పిల్లలు, డేటా వినియోగం నిబంధనలపై మార్పులను కోరుతున్నాయి. ప్రధాంగా ఈ నిబంధనలోని వయస్సును 18 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల కంటే తక్కువకు తగ్గించాలంటున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని మినహాయింపులను కూడా ఇచ్చింది. ఫిబ్రవరి 18 తరువాత, ప్రజలనుంచి వచ్చిన సూచనలు, సలహాల మేరకు మరికొన్ని మినహాయింపులుండవచ్చని భావిస్తున్నారు.పిల్లల డేటాను ప్రాసెస్‌పై పరిమితులు, మినహాయింపులు మానసిక ఆరోగ్య సంస్థ లేదా ఆరోగ్య సంరక్షణ నిపుణులుఅనుబంధ ఆరోగ్య సంరక్షణ నిపుణులువిద్యా సంస్థచైల్డ్ డే కేర్ సెంటర్విద్యా సంస్థకాగా 2023 ఆగస్టులో పార్లమెంటులో ఆమోదించిన DPDP బిల్లు ఈ నిబంధనను నిర్దేశించింది. దేశ పౌరుల డిజిటల్ హక్కులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన సంగతి తెలిసిందే. -
Cimate Change : అడాప్టేషన్
ప్రకృతి వైపరిత్యాలు, సముద్ర నీటిమట్టం పెరుగుదల, జీవవైవిధ్యం క్షీణత, ఆహార – నీటి అభద్రత వంటి వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుతం ఎదురవుతున్న, భవిష్యత్తులో ఎదురయ్యే దుష్ప్రభావాలను తట్టుకునే శక్తిని పెంపొందించే రక్షక చర్యలనే అడాప్టేషన్ అంటారు. వాతావరణ మార్పుల నష్టాన్ని సాధ్యమైనంత వరకు స్థానిక స్థాయిలో అమలు చేయాలినవి అడాప్టేషన్ చర్యలు. అంటే, అడాప్టేషన్ చర్యలను అమలుపరచటంలో గ్రామీణ ప్రజలు, నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వంటి పునరుజ్జీవన వ్యవసాయ పద్ధతులను అనుసరించటం.. కరువును తట్టుకునే వంగడాలను సాగు చేయటం.. నీటి నిల్వ – వినియోగ పద్ధతులను మెరుగుపరచటం.. అడవులు తగులబడకుండా అడ్డుకునే రీతిలో భూముల నిర్వహణ చర్యలు చేపట్టడం.. వరదలు, వడగాడ్పులు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బలమైన రక్షణ వ్యవస్థలను నిర్మించటం.. ఇవన్నీ అడాప్టేషన్ చర్యలే. అయితే, స్థానికంగా చర్యలు తీసుకుంటే అడాప్టేషన్ పూర్తి కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని తగ్గించుకునేందుకు దారితీసే విధానాల రూపకల్పనతో పాటు ప్రభుత్వాలు అనేక భారీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సముద్ర నీటి మట్టాలు పెరగటం వల్ల దెబ్బతిన్న కోస్తా ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం లేదా వేరే సురక్షిత ప్రాంతానికి తరలించటం.. మరింత తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నా తట్టుకునే విధంగా మౌలిక సదుపాయాలను పటిష్టం చేయటం.. ప్రకృతి వైపరిత్యాల గురించి ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థలను విస్తరింపజేసి వైపరిత్యాల సమాచారాన్ని అందుబాటులోకి తేవటం.. ప్రత్యేకించి వాతావరణ మార్పులకు సంబంధించిన నష్టాలను పూచ్చేందుకు బీమా సదుపాయాలను అభివృద్ధి చేయటం.. ప్రకృతిసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలకు, వన్యప్రాణులకు సరికొత్త రక్షణ చర్యలు చేపట్టం.. ఇవన్నీ క్లైమెట్ ఛేంజ్ అడాప్టేషన్ చర్యలే! ఇదీ చదవండి : తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే! -
కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా?
నేను ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలోని ఇబ్బంది వల్ల వేరే ఉద్యోగం చూసుకున్నాను. ప్రస్తుతం ఉన్న కంపెనీలో కనీసం మూడు సంవత్సరాలు పనిచేస్తాను అని అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. కానీ, రాజీనామా ఇస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తాము అని చెప్పారు. తీరా రాజీనామా చేసే సమయానికి ‘మేము రిలీవింగ్ ఇవ్వము. నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వము. అగ్రిమెంట్ ప్రకారం మూడేళ్లు పనిచేయాల్సిందే – అంటే ఇంకో 14 నెలలపాటు ఇక్కడే ఉండాలి అంటున్నారు.’ ఇదే కంపెనీలో పని చేస్తే నేను జీవితాన్ని కోల్పోతాను. ఎంతో హెరాస్మెంట్గా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు. – ఒక ఐ.టీ. ఉద్యోగి, హైదరాబాద్అసలు మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కంపెనీ వారికి ఎందుకు ఇచ్చారు? అలా తీసుకునే హక్కు కానీ, తీసుకుని వారి వద్దనే ఉంచుకునే హక్కు కానీ ఎవరికీ లేదు. పరిశీలించిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు మీకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అలా కాదని ఎవరైనా చేస్తే అది చట్టరీత్యా తప్పు. ఐటీ కంపెనీలలో సాధారణంగా ఫ్రెషర్స్ గా వచ్చిన వారితో బాండు రాయించుకోవడం చూస్తుంటాము. కానీ, బాండు రాయించుకున్నంత మాత్రాన మీరు వారి వద్ద బానిసత్వం చేయాలి అని అర్థం కాదు. అలాంటి బాండ్లు అన్నివేళలా చెల్లవు కూడా. కంపెనీవారు మీకు ఏదైనా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి, (స్పెషల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ వంటివి) ఆ శిక్షణ ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటే, సదరు శిక్షణ నుంచి మీరు నేర్చుకున్న పని ఆ కంపెనీకి ఉపయోగకరం అయినప్పుడు మాత్రమే వారు ఇచ్చిన శిక్షణకు ప్రతిఫలంగా కొంతకాలం వారి వద్ద పనిచేయాలి అనే నిబంధన చెల్లుతుంది. అంతేకానీ ప్రతి ఒక్క ఉద్యోగి దగ్గర ఇలాంటి బాండ్లు రాయించుకుంటే అవి చెల్లవు. వాటికి భయపడాల్సిన అవసరం లేదు.కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, ఇండియన్ కాంట్రాక్టు యాక్ట్, సెక్షన్ 27 ఒక వ్యక్తిని తన వాణిజ్య/వ్యాపారాలు చేయడం వీలు లేదు అని రాసుకున్న ఏ అగ్రిమెంట్ అయినా కాంట్రాక్టు అయినా చెల్లవు. మీరు రాసుకున్న అగ్రిమెంట్/ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ లోని పదజాలాన్ని ఒకసారి పరిశీలించండి. మీరు లిఖితపూర్వక నోటీసు ఇచ్చి, నోటీసు సమయాన్ని పూర్తి చేసి ఆ కంపెనీని వదిలి వెళ్లవచ్చు. వీలుంటే ఒక లాయర్ని సంప్రదించి ఆ కాంట్రాక్టు చెల్లుతుందో లేదో చూసుకోండి. ఇదీ చదవండి: ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!ఐటీ ఉద్యోగి అయినప్పటికీ, మీరు చేసే పని గనుక లేబర్ యాక్ట్ పరిధిలోకి వస్తే, మీరు లేబర్ కోర్టును కూడా సంప్రదించవచ్చు. అలాగని అందరు ఐటీ ఉద్యోగులకూ లేబర్ చట్టాలు వర్తించవు. కొందరికి మాత్రమే వర్తిస్తాయి. ప్రత్యామ్నాయంగా మీరు సివిల్ కోర్టును మీరు ఆశ్రయించవచ్చు. కొంత సమయం పట్టినప్పటికీ మీకు సరైన న్యాయం దొరుకుతుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసంsakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
6 జిల్లాల్లో శీతల గాలులు: పంటలను ఇలా రక్షించుకుందాం!
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే రెండు రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ఉదయపు వేళల్లో దట్టంగా పొగమంచు ఆవరించే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. పి. లీలారాణి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వివిధ పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు ఈ కింది సూచనలు పాటించాలని డా. పి. లీలారాణి సూచించారు.వరి: తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలి ప్రభావంతో యాసంగి నారుమడుల్లో నారు ఎదగక పోవచ్చు. ఆకులు పసుపు, ఎరుపు రంగుల్లోకి మారవచ్చు. కొన్నిసార్లు నారు చనిపోవచ్చు. అందువల్ల రైతులు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలి. నారుమళ్ళపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం పూట కప్పి, మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రాత్రి వేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి, కొత్త నీరు పెట్టాలి. ∙200 చదరపు మీటరు విస్తీర్ణం గల నారుమడికి ఆఖరి దుక్కిలో 2 క్వింటాళ్లు బాగా చివికిన కోళ్ళు లేదా గొర్రెల ఎరువు వేయాలి. విత్తే సమయంలో 1 కిలో నత్రజని, 1కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే రసాయనిక ఎరువులు వేయాలి. వరి నారుమళ్ళలో జింక్ ధాతువు లోపం నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరుసగా వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేదా ప్రతి యాసంగిలో దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. చలి వాతావరణం, పొగమంచు వరిని అగ్గి తెగులు ఆశించటానికి అనుకూలం. పొలంలో, పొలంగట్లపైన ఉండే గడ్డి కలుపు మొక్కలు అగ్గి తెగులను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి, పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. వరి నారుమళ్ళలో అగ్గి తెగులు గమనిస్తే, నివారణకు 0.5 గ్రా. ట్రైసైక్లాజోల్ లేదా 1.5 మి.లీ. ఐసోప్రొథైయోలిన్ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న: చలి వల్ల మొక్కజొన్నలో భాస్వరం లోపించి ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లైతే నివారణకు 10 గ్రా. 19–19–19 లేదా డి.ఎ.పి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మిరప : ప్రస్తుత చలి వాతావరణం మిరపను బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 3గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5గ్రా. టేబుకొనజోల్ + గంధకం లేదా 1.5గ్రా. కార్బండజిమ్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 0.3గ్రా. డైనోటేఫురాన్ + 1గ్రా. కార్బండజిమ్ + 2.5 మి.లీ. వేపనూనె లేదా 0.5 గ్రా. థయోమిథాక్సామ్ + 2 మి.లీ. హెక్సాకొనజోల్ + 2.5 మి.లి వేప నూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కుసుమ: నవంబర్‌లో విత్తుకున్న కుసుమ పంటకు పేనుబంక ఆశించే అవకాశం ఉంది. నివారణకు 2 మి.లీ. డైమిథోయెట్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
పురుషుల ప్రాణాలూ ముఖ్యమే
బెంగళూరు: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెక్కీ సోదరుడు భావోద్వేగంతో ప్రకటన చేశారు. మహిళల ప్రాణాలు ఎంత ముఖ్యమో పురుషుల ప్రాణాలూ అంతే ముఖ్యమని, పురుషుల రక్షణ కోసమూ చట్టం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. తన సోదరుడి ఆత్మహత్య సంఘటన తీవ్రత ఉన్నప్పటికీ, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు అనుభవిస్తున్న పురుషుల కోసం చట్టాలు రూపొందించాలన్నారు. ‘నా సోదరుడికి న్యాయం చేయాలి. పురుషులు కూడా వేధింపులకు గురవుతున్నారు. వారి కోసం కూడా చట్టాలు చేయాలి. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. స్త్రీ ప్రాణం ఎంత ముఖ్యమో పురుషుడి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. చట్టపరంగా ముందుకెళ్తాం’అని తెలిపారు. సుభాష్‌ను అత్తమామలు చిత్రహింసలకు గురిచేస్తున్నారని తమకు తెలుసని, కానీ అతను ఇలాంటి చర్యకు పాల్పడతాడని తాము ఊహించలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే బెంగళూరు టెక్కీ ఆత్మహత్యకు పాల్పడినట్లు వైట్ ఫీల్డ్ డీసీపీ శివకుమార్ ధ్రువీకరించారు. ‘అతనిపై ఉత్తరప్రదేశ్‌లో పలు కేసులు నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి అతని భార్య, ఆమె కుటుంబ సభ్యులు అతని నుంచి డబ్బు డిమాండ్ చేశారు. ఆ కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మారతహళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది’అని ఆయన వెల్లడించారు. ఛితాభస్మాన్ని కలపొద్దు డిసెంబర్ 9న బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి ముందు ఆయన 24 పేజీల సూసైడ్ నోట్ రాశారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ ఫ్యామిలీ కోర్టు జడ్జి తన వాదనను వినడం లేదని, కోర్టులోని ఓ అధికారి జడ్జి ముందు లంచం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన సంఘటనలను ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. భార్య నికిత తనపై హత్య, లైంగిక వేధింపులు, డబ్బు కోసం వేధించడం, గృహ హింస, వరకట్నం సహా తొమ్మిది కేసులు పెట్టిందని సుభాష్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తన నాలుగేళ్ల కుమారుడిని తనకు దూరంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను తన తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. న్యాయం జరిగేవరకు తన చితాభస్మాన్ని నిమజ్జనం చేయొద్దని కుటుంబ సభ్యులను కోరుతూ సుభాష్ ఓ వీడియోను రికార్డు చేశారు. మృగంలా ప్రవర్తించారు: నికిత ఆరోపణ ఆత్మహత్యపై నేపథ్యంలో 2022లో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాలు బయటకొచ్చాయి. జౌన్‌పూర్‌కు చెందిన నికితకు 2019లో బిహార్‌కు చెందిన సుభాష్‌తో వివాహం జరిగింది. వీరు బెంగళూరులో ఉంటూ అక్కడే పనిచేసేవా రు. తన భర్త అతుల్ తనను కొట్టేవాడని, భార్యాభర్తల సంబంధం విషయంలో మృగంలా ప్రవర్తించేవాడని నికితా సింఘానియా ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లిలో ఇచి్చన కట్నంతో సంతృప్తి పొందక మరో 10 లక్షలు డిమాండ్ చేశారన్నారు. కట్నంకోసం తనను శారీరకంగా, మానసికంగా హింసించారని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులకు చెబితే సర్దుకుని పోవాలని సూచించేవారని ఫిర్యాదులో వెల్లడించారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదని, మద్యం తాగి భర్త తనను కొట్టడం ప్రారంభించాడని, బెదిరించి తన జీతం మొత్తాన్ని అతని ఖాతాకు బదిలీ చేసుకునేవారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అత్తామామలు పదేపదే వేధించడం వల్లే తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, 2019 ఆగస్టు 17న గుండెపోటుతో మరణించారని ఆమె తెలిపారు. -
పగడాలను ఎలా భద్రపర్చాలి? అసలు, నకిలీ ఎలా గుర్తించాలి?
జాతిరత్నాల్లో రాణిగా ముత్యాన్ని చెబుతారు. పగడాన్ని అందమైన రత్నంగా వ్యవహరిస్తారు. ఇది కూడా ముత్యంలాగానే సముద్రంలోనే ఆవిర్భవిస్తుంది. అయితే ముత్యాన్ని సముద్రంలో తయారయ్యే పద్ధతిలోనే బయట కూడా కల్చర్ చేయవచ్చు. పగడానికి అలాంటి అవకాశం లేదు. అందుబాటులో ఉన్న పగడాల్లో కొన్ని అసలైనవి, కొన్ని నకిలీవి. ఇందులో కల్చర్డ్ కోరల్ అనేది ఇంత వరకు లేదు. సముద్రపు మొక్క నుంచి పగడం తయారవుతుంది. పగడంలో ఎరుపు, గులాబీరంగు, ఆరెంజ్, బ్రౌన్‌తో పాటు వైట్, ఎల్లో, గ్రీన్, పర్పుల్, బ్లాక్ కోరల్స్ కూడా ఉంటాయి. పగడం అసలుదా నకిలీదా అని తెలుసుకోవడానికి టర్మరిక్ టెస్ట్ సులువైన పద్ధతి. పగడం మీద పసుపు కొమ్ముతో రుద్దాలి. అప్పుడు పగడం మీదున్న ఎరుపు రంగు పగడాన్ని వదిలి పసుపు కొమ్ముకి రంగు అంటితే అది నకిలీ పగడం. అసలు పగడం మీద పసుపు కొమ్ముతో ఎంత రుద్దినా పగడం రంగు వదలదు, పసుపు కొమ్ముకి రంగు అంటదు. స్వచ్ఛమైన పగడాన్ని ధరిస్తే అది మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతతనిస్తుంది. ఆధ్యాత్మిక చింతనకు దోహదం చేస్తుంది. డిప్రెషన్, స్ట్రెస్, నిద్రలేమి వంటి సమస్యలను దూరం చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.పగడం చెట్టు నుంచి ఆవిర్భవించినది కాబట్టి ప్రాణం ఉన్న వస్తువులాగానే దీనికి గాలి అందుతుండాలి. ముత్యాలు, పగడాలను సుదీర్ఘకాలం గాలి అందని అలమారల్లో పెట్టరాదు. ముత్యాలు, పగడాల ఆభరణాలను ధరించడం వాటి మన్నిక కోసమే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యం కోసం కూడా. సాధారణ పగడాల వరుస అయితే భద్రపరచడంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదు. బంగారంలో పొదిగిన ఆభరణాల విషయంలో ఆభరణం నుంచి రాలిపోకుండా ఉండడానికి మెత్తటి కుషన్ ఉన్న బాక్సుల్లో పెట్టాలి. నగధగలుపగడాలేం చెబుతున్నాయి – జియా నస్రీన్, జెమాలజిస్ట్ -
లారెన్స్ బిష్ణోయ్‌ని కేంద్రం సంరక్షిస్తోంది: కేజ్రీవాల్ ఆరోపణ
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ప్రభుత్వం నుంచి రక్షణ లభిస్తోందని ఆయన ఆరోపించారు.ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ విధ్వంసం సృష్టిస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. లారెన్స్ బిష్ణోయ్ బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడని, అక్కడి నుంచే దోపిడీ రాకెట్ నడుపుతున్నాడని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో భద్రతపై అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో ప్రశ్నలను లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఢిల్లీలో చోటుచేసుకున్న పలు సంఘటనలను ఆయన ప్రస్తావించారు. #WATCH | In the Delhi Assembly, AAP MLA and party's national convener Arvind Kejriwal says, "In the last 10 years, Delhi's law and order is going from bad to worse, especially since 2019 when Amit Shah became the Home Minister...He is unable to handle Delhi...Incidents of murder… pic.twitter.com/vjCa9rGK4h— ANI (@ANI) November 29, 2024గత పదేళ్లలో ఢిల్లీలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 2019లో అమిత్ షా హోంమంత్రి అయినప్పటి నుండి ఢిల్లీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. నేరాలను అరికట్టడంలో ఆయన అసమర్థులుగా కనిపిస్తున్నారని, ఢిల్లీలో హత్యాయుత ఘటనలు తరచూ జరుగుతున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని జనానానికి దోపిడీ కాల్స్ వస్తున్నాయని, గ్యాంగ్ వార్, కాల్పులు బహిరంగంగానే జరుగుతున్నాయని ఆయన వాపోయారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కేజ్రీవాల్ ఆరోపించారు.ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి -
రాజ్యాంగ పరిరక్షణ కోసమే.. మా పోరాటం: రాహుల్
వయనాడ్: దేశంలో నేడు ప్రధానమైన పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసమే జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని ఆగ్రహం, విద్వేషంతో కాకుండా ప్రేమ, ఆప్యాయత, వినయంతో రాశారు. అంతటి విశిష్టమైన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. పౌరులుగా మనం పొందుతున్న రక్షణ, దేశ ఔన్నత్యం తదితరాలకు రాజ్యాంగమే కారణభూతం’’ అన్నారు. కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానం పరిధిలోని మనాంథావాడీలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి, తన సోదరి ప్రియాంకా గాంధీ కోసం ప్రచారం చేశారు. ‘‘ప్రేమకు, విద్వేషానికి ఆత్మవిశ్వాసానికి, అభద్రతకు మధ్య నేడు యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో నెగ్గాలంటే విద్వేషాన్ని, ఆగ్రహావేశాలను హృదయం నుంచి తొలగించుకోవాలి. ప్రేమ, అనురాగం, వినయాలను నింపుకోవాలి’’ అని సూచించారు. తన సోదరిని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రియాంక కోసం తాను ఓట్లు అభ్యరి్థంచడం ఇదే తొలిసారని రాహుల్ గుర్తు చేశారు. తండ్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోదోషి అయిన నళినిని ఆప్యాయంగా హత్తుకున్న మంచి మనస్సు తన చెల్లిదన్నారు. ప్రేమ, సానుభూతి, మానవత్వంతో కూడిన ఇలాంటి రాజకీయాలే మనకు కావాలని ఉద్ఘాటించారు. రాహుల్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించలేదు. ‘‘మోదీ గురించి చెప్పీ చెప్పీ బోరు కొట్టేసింది. అందుకే ఆయన ప్రస్తావన తేవడం లేదు’’ అన్నారు. అనంతరం రాహుల్ అరీకోడు పట్టణంలో ప్రచారంలో పాల్గొన్నారు. వయనాడ్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.సంపన్న మిత్రుల కోసమే ఆరాటంప్రధాని మోదీపై ప్రియాంక మరోసారి నిప్పులు చెరిగారు. కొందరు బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. సంపన్న మిత్రుల సేవలో ప్రధాని తరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మనాంథావాడీలో సభలో ఆమె ప్రసంగించారు. ‘‘పేదలకు మంచి చేయాలన్న ఆలోచన మోదీకి అస్సలు లేదు. ప్రజలకు మంచి విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలివ్వాలన్న ఉద్దేశం లేదు. దేశ ప్రజల మధ్య మోదీ సర్కారు చిచ్చుపెడుతోంది. వారిని విభజిస్తోంది. హక్కులను కాలరాస్తోంది. ప్రజాస్వామిక సంస్థలను దెబ్బతీస్తోంది’’ అని ధ్వజమెత్తారు. -
శాంతమే సౌఖ్యం..
తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్షాకవచంగా నిలుస్తుందని సుమతీ శతకకారుని సుధామయ ప్రబోధం.. శాంతం అనేది మానవులు అలవోకగా, అలవాటుగా అలంకరించుకోవలసిన గొప్ప ఆభరణం. క్రోధం కలిగినపుడు మనలో ప్రజ్వరిల్లే తక్షణ ఆవేశానికి లోను కాకుండా మదిని శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం. శాంతాన్ని ఆశ్రయించిన అతికొద్ది నిమిషాల్లోనే మనలోని వివేకం మేలుకొంటుంది.జంతుజాలానికీ, మనకూ ఉన్న భేదమే శాంతాన్ని కలిగించే వివేకం. జంతుకోటికి శాంతం వహించడం అంత సాధ్యం కాదు. వాటికి పక్కనే ఉన్న జంతువులతో తేడా వస్తే, ముందుగా గుర్తుకు వచ్చేది పోరాటం. తమను బాధపెట్టిన జంతువు బలాన్ని బేరీజు వేసుకుంటాయి. వాటితో పోరాటానికి సిద్ధమవుతాయి. అదే జంతువు బలం ఎక్కువైతే, అప్పటికప్పుడే పలాయనం చిత్తగిస్తాయి. వాటికి ఉన్న వివేకసంపద పరిమితి అంతే. కానీ, జంతుకోటికి భిన్నంగా జనించి, సమస్త జీవకోటిలోనూ అత్యంత తెలివైనవాడైన మానవుడు కోపంతోనూ, క్రోధంతోనూ చరించరాదు. బహుళ ప్రయోజనకరమైన శాంతాన్ని అన్నివేళలా ఆశ్రయించాలి. రంగస్థలంమీద పాత్రధారులు నవరసాలను పోషించి, అలరిస్తారు. అవి వరుసగా– శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, భీభత్సం, రౌద్రం, శాంతం. ఈ రసాల్లో హృదయానికి ఎటువంటి ఉద్వేగాన్ని కలగనీయకుండా అలరించే ఏకైక రసం శాంతరసం. రంగస్థలం మీద కొందరే పాత్రధారులుంటారు. జీవన రంగస్థలం మీద మానవులంతా పాత్రధారులే. అంటే, ఒకరితో ఒకరు ఏదో ఒక పనిమీద సంభాషించుకుంటూ ఉంటారు, కార్యకలాపాలను నెరపుతూ ఉంటారు. అటువంటి కార్యాలకు జయాన్ని సిద్ధింపజేయడంలో శాంతం ప్రధానపాత్ర పోషిస్తుంది. అనవసరంగా కేకలు పెడుతూ, హడావుడి చేసే మనిషి దగ్గరకు చేరడానికి ఎవరూ ఇష్టపడరు. ప్రశాంత చిత్తంతో, శాంతంతో మాట్లాడే వారి దగ్గరకు అందరూ చేరతారు. తీయగా మాట్లాడే అటువంటి వ్యక్తులకు ఏ రంగంలోనైనా జయాన్ని సాధించే అవకాశమూ మిగిలినవారితో పోలిస్తే బాగా ఎక్కువే..!! శాంతికరమైన వ్యవహారశైలి సొంతమైన వీరు జీవితంలో ఎంతగానో సుఖిస్తారు, వారితో చరించేవారినీ ఆనందపరుస్తారు. అత్యుత్తమమైన శాంత గుణానికున్న ప్రత్యేకతను తేటపరుస్తూ,‘‘శాంతములేక సౌఖ్యము లేదు’’ అన్నాడు వాగ్గేయకారుడు త్యాగయ్య.అయితే.. మనం ఆలోచించవలసిన ప్రశ్న ఒకటుంది. మనిషికి శాంతమనేది ఏ రకంగా లభిస్తుంది? కొంతమందికి అందమైన భార్య, ప్రయోజకులైన సంతానం, కావలసినంత సంపద.. ఈ విధంగా అన్నీ అమరినట్లే ఉంటాయి. కానీ, జీవితంలో మాత్రం నిరంతరం వారికి ఏదో అసంతృప్తి, అశాంతి..!! దానికి కారణం ఒక్కటే.. తాను కోరుకునే వస్తువులు, లేదా సుఖాల మీద అంతులేని వ్యామోహం నీడలా వెన్నాడడమే..!! మనిషిని సర్వకాల సర్వావస్థల్లో శాంతపరచేది తృప్తి మాత్రమే..!!ఆనందకరమైన మానవ జీవనానికి నిత్య వసంతాన్ని నింపే ఆమని.. శాంతమనే సంజీవని..పరిస్థితులవల్ల వచ్చిన ఉద్వేగాలకూ, ఉద్రేకాలకూ లోను కాకుండా స్వభావానికి దగ్గరగా ఉండడమే శాంతంగా వర్తించడమనే నిర్వచనం చెప్పుకోవచ్చు’’ ఇదీ ఓ ఆంగ్ల సిద్ధాంతకర్త వాక్కు. వినగానే, ఒకింత కఠినమైన సూత్రంగా ఈ వాక్యం అనిపించినా, అంతర్లీనమైన భావం మాత్రం సర్వకాల సర్వావస్థల్లో శాంతియుతంగా మానవులను ప్రవర్తించమన్నట్లుగా, శాంతంగా ఎదుటివారితో వర్తించమన్నట్లుగా భావించాలి.ఇంద్రియాలను జయించినవాడికైనా, సకల శాస్త్రాలను క్షుణ్ణంగా చదివినవాడికైనా శాంతగుణం అవసరమే. ధన కనక వస్తు వాహనాలెన్ని ఉన్నా, భోగభాగ్యాల్లో తేలియాడామని తలపోసినా, మనిషి ప్రశాంతచిత్తుడు కాకపోతే, అతనికి కలిగే ‘ప్రయోజనం సున్నా’. ఇది వాస్తవం. స్వప్రయోజనాల కోసమో, పదవుల కోసమో వెంపర్లాడుతూ పంచకళ్యాణిలా పరుగెత్తే ఆశలతో సతతమూ నలిగిపోయే వాళ్లకు శాంతమనేది ఒక అందని ద్రాక్ష. జీవితకాలంలో వాళ్లు ఎప్పుడూ స్థిమితంగా ఉండరు. మరొకరిని ఉండనివ్వరు. ఏదో ఒక రూపంలో అసహనం, అశాంతి వాళ్లకు చుట్టంలా చుట్టుకుని ఉంటుంది. పక్కవాళ్లకూ వీళ్ళ సాహచర్యం ఒకింత భరింపరానిదిగానే ఉంటుంది. – వెంకట్ గరికపాటి‘‘వ్యాఖ్యాన విశారద’’ -
వజ్రాభరణాలు : షైనింగ్ పోకుండా ఉండాలంటే ఎలా? పాలిష్ చేయించొచ్చా?!
పండుగలు పెళ్లిళ్లలో అందమైన పట్టుచీరకు, డైమండ్ నగలు మరింత అందాన్ని తెస్తాయి. ఒకసారి వేసుకొని మర్చిపోయేవుకాదు డైమండ్ ఆభరణాలు అంటే. చాలా ఖరీదైనవి కూడా. ఎప్పటికి మన అందాన్నీ ఇనుమడింప చేసే డైమండ్ నగలు మెరుపు పోకుండా షైనింగ్ ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో టిప్స్ మీకోసం!స్నానం చేసేటప్పుడు డైమండ్ ఆర్నమెంట్స్‌ను తీయాలి. మైల్డ్ సోప్, మైల్డ్ షాంపూ అయితే ఫరవాలేదు. కానీ గాఢత ఉన్న సబ్బులు, షాంపూలతో స్నానం చేస్తే వాటిలోని రసాయనాల దుష్ప్రభావం ఆభరణాల మీద పడుతుంది.రోజువారీ ధరించే చెవి దిద్దులు, ఉంగరాలు, లాకెట్, బ్రేస్లెట్లు ఎక్కువగా సొల్యూషన్ బారిన పడుతుంటాయి. వాతావరణంలో సొల్యూషన్ కారణంగా ఆభరణాల్లో అమర్చిన డైమండ్ మీద మురికి పేరుకుంటుంది. జిడ్డుగా కూడా మారుతుంది. దాంతో డైమండ్ మెరుపు తగ్గుతుంది. వేడి నీటిలో లిక్విడ్ సోప్ నాలుగు చుక్కలు కలిపి అందులో ఆభరణాన్ని పది నిమిషాల సేపు నానపెట్టి ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో సున్నితంగా రుద్దాలి. సబ్బు అవశేషాలు ఆభరణం మీద మిగలకుండా శుభ్రమైన నీటిలో ముంచి కడగాలి. నీటిలో నుంచి తీసి మెత్తని నూలు వస్త్రం మీద పెట్టి మెల్లగా అద్దినట్లు తుడవాలి. బేకింగ్ సోడా మంచి క్లీనింగ్ ఎలిమెంట్. కానీ తక్కువ క్వాలిటీ డైమండ్ ఆభరణాలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా వాడకూడదు. పైన చెప్పుకున్నవి కట్ డైమండ్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అన్‌కట్ డైమండ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆభరణం తయారీలో అన్‌కట్ డైమండ్ వెనుక సిల్వర్ ఫాయిల్ అమరుస్తారు. వెండి వస్తువులు గాలి తగిలితే నల్లబడినట్లే అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్స్ కూడా అంచులు నల్లబడతాయి. వాటిని గాలి దూరని బాక్సులో భద్రపరచాలి.ఇటీవల వేడుకల్లో ఎయిర్‌కూలర్‌లో పెర్ఫ్యూమ్ కలుపుతున్నారు. వాటి ప్రభావంతో కూడా అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్స్ నల్లబడే ప్రమాదముంది. అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్ మెరుపు విషయంలో ఇంట్లో ఏ ప్రయత్నమూ చేయకూడదు. అవి చాలా డెలికేట్‌గా ఉంటాయి కాబట్టి ఆభరణాల తయారీ దారులతో పాలిష్ చేయించుకోవాలి.ఆభరణాలు పెట్టే ప్లాస్టిక్ బాక్సులకు ముఖమల్ క్లాత్‌ని గమ్‌తో అతికిస్తారు. డైమండ్ ఆర్నమెంట్స్‌ను బీరువాలో భద్రపరిచేటప్పుడు ఈ గమ్ బాక్సుల్లో పెట్టకూడదు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బాక్సు నుంచి తీసి మెత్తని తెల్లని క్లాత్ మీద అమర్చి భద్రపరుచుకోవాలి. -
కెనడా ప్రధాని చుట్టూ ఖలిస్తాన్ ఉగ్రవాదులే
న్యూఢిల్లీ: కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో తీరును కెనడాలో భారత హై కమిషనర్‌గా పనిచేసిన సంజయ్ కుమార్ వర్మ బట్టబయలు చేశారు. ట్రూడో ఆంతరంగికుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులతోపాటు భారత వ్యతిరేక శక్తులు ఉంటాయని చెప్పారు. కెనడాలో రాజకీయ అవసరాల కోసం ఖలిస్తానీ ఉగ్రవాదులకు ట్రూడో ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోందని అన్నారు. భారత్–కెనడా మధ్య వివాదం నేపథ్యంలో సంజయ్ కుమార్ వర్మను భారత ప్రభుత్వం ఇటీవల వెనక్కి పిలిపించిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెనడాలోని ఖలిస్తానీ శక్తులు, భారత వ్యతిరేక శక్తులు ప్రధాని ట్రూడోతో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటాయని వెల్లడించారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ట్రూడో ఆప్తమిత్రులుగా మారిపోయారని తెలిపారు. 2018లో ట్రూడో భారత్‌ను సందర్శించినప్పుడు ఆయన వెంటనే ఖలిస్తాన్ సానుభూతిపరులు కూడా కనిపించారని సంజయ్ కుమార్ వర్మ గుర్తుచేశారు. ఖలిస్తాన్ పోరాట యోధులమని చెప్పుకుంటున్న వ్యక్తులకు కెనడాలో ఎనలేని ప్రోత్సాహం లభిస్తోందని ఆరోపించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో సంజయ్ కుమార్ వర్మను కెనడా ప్రభుత్వం అనుమానితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్ సహకరించడం లేదని కెనడా చేస్తున్న ఆరోపణలపై సంజయ్ కుమార్ వర్మ స్పందించారు. ఆ కేసులో భారత్ పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తేలి్చచెప్పారు. ఖలిస్తానీ ముష్కరులు కెనడాలో భారత కాన్సులేట్ కార్యాలయాల ఎదుట అల్లర్లు సృష్టించారని, భారత దౌత్యవేత్తలను సోషల్ మీడియా ద్వారా బెదిరించేందుకు ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు. దారుణ పరిస్థితుల్లో విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకుంటున్న భారత విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సంజయ్ కుమార్ వర్మ సూచించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మెరుగ్గా లేవని అన్నారు. రూ.లక్షలు ఖర్చు చేసినా మంచి కాలేజీల్లో ప్రవేశాలు దొరకడం లేదని, చదువులు పూర్తిచేసుకున్నాక ఉద్యోగాలు లభించడం లేదని చెప్పారు. విద్యార్థుల్లో కుంగుబాటు, ఆత్మహత్య వంటి పరిణామాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. తాను కెనడాలో హైకమిషనర్‌గా పనిచేసిన సమయంలో వారానికి కనీసం రెండు మృతదేహాలను భారత్‌కు పంపించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు రాక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక కెనడాలో భారతీయ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. అందుకని కెనడాను ఎంచుకోకపోవడమే మంచిదని సూచించారు. ఒకవేళ భారత్–కెనడా మధ్య సంబంధాలు బాగున్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు తాను ఇదే సలహా ఇచ్చేవాడినని వ్యాఖ్యానించారు. ఎన్నో ఆశలతో వెళ్లిన విద్యార్థులు శవాలై తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితికి ఏజెంట్లు కూడా కొంత కారణమని విమర్శించారు. రూ.లక్షలు దండుకొని ఊరూపేరు లేని కాలేజీల్లో విద్యార్థులను చేరి్పస్తున్నారని, సరైన వసతులు కూడా కలి్పంచడం లేదని వెల్లడించారు. వారానికి కేవలం ఒక క్లాసు నిర్వహించే కాలేజీలు కూడా ఉన్నాయన్నారు. ఇరుకు గదిలో ఎనిమిది మంది విద్యార్థులు సర్దుకోవాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తున్నాయని తెలిపారు. కెనడాలో భారతీయ విద్యార్థులు చదువులు పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగాలు రాక జీవనోపాధి కోసం క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్నారని, దుకాణాల్లో చాయ్, సమోసాలు అమ్ముకుంటున్నారని సంజయ్ వర్మ ఆవేదన వ్యక్తంచేశారు. -
కుటుంబానికి బీమా ధీమా..
షణ్ముఖ్, నిత్య దంపతులకు ఇద్దరు పిల్లలు. షణ్ముఖ్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నిత్య గృహిణి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేవు. సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం చిచ్చు పెట్టింది. షణ్ముఖ్ పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు రెండున్నాయి. ఆ రెండింటి నుంచి వచ్చిన మొత్తం కేవలం రూ.15 లక్షలు. కుటుంబ జీవన అవసరాలకు ఈ మొత్తం చాలదని తెలియడంతో.. బాధను దిగమింగుకుని నిత్య ప్రైవేటు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. జీవిత బీమా రక్షణ లేని వారు కొందరు అయితే.. ఉన్నా తగినంత కవరేజీతో సరైన ప్లాన్ తీసుకోని వారే ఎక్కువ. ఇలాంటి వారికి షణ్ముఖ్ కేసు కనువిప్పు కలిగిస్తుంది. సరైన బీమా పథకాన్ని, తగినంత కవరేజీతో తీసుకున్నప్పుడే దాని లక్ష్యం, ఉద్దేశం నెరవేరుతుంది. ఈ దిశగా అవగాహన కలి్పంచే కథనమే ఇది...తమపై ఎవరైనా ఆరి్థకంగా ఆధారపడి ఉంటే, అలాంటి ప్రతి ఒక్కరూ జీవిత బీమా రక్షణను (పాలసీ) తప్పకుండా తీసుకోవాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భాల్లో వారి కుటుంబం జీవన అవసరాల కోసం ఆరి్థకంగా ఇబ్బందులు పడకుండా జీవిత బీమా పరిహారం సాయంగా నిలుస్తుంది. కానీ, ఇదంతా సరైన, సరిపడా రక్షణ తీసుకున్నప్పుడే అని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. తమ విలువైన జీవితంపై చేస్తున్న అసలైన పెట్టుబడిగా అర్థం చేసుకోవాలి.కవరేజీ ఎంత?ఏజెంట్ లేదా బ్రోకర్ చెప్పిన మేరకు లేదా ప్రీమియం తమకు సౌకర్యంగా అనిపించిన మేరకు జీవిత బీమా కవరేజీని ఎక్కువ మంది తీసుకుంటుంటారు. కానీ, ఇది సరైన విధానం కాదు. ఎంత లేదన్నా వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్ల మొత్తం జీవిత బీమా రక్షణగా తీసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. అలాగే, వార్షిక ఆదాయానికి 25 రెట్ల వరకు కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. 20 రెట్లు మధ్యస్థంగా ఉంటుంది. ఒకవేళ రుణాలు తీసుకుని ఉంటే ఆ మేరకు కవరేజీని అదనంగా ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.12 లక్షలు ఉంటే, కనీసం రూ.1.2 కోట్ల సమ్ అష్యూర్డ్‌తో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణాలు రూ.10 లక్షలు ఉన్నాయనుకుంటే.. అప్పుడు రూ.1.2 కోట్లకు బదులు రూ.1.3 కోట్లను ఎంపిక చేసుకోవాలి. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ చెల్లించే పరిహారంతో అప్పులు తీర్చి, మిగిలిన మొత్తంతో కుటుంబం సాఫీగా జీవించడానికి అవకాశం ఉంటుంది.సరిపోతుందా..?ఇంతకు ముందు ఉదాహరణలో వార్షిక ఆదాయం రూ. 12 లక్షలకు పది రెట్లు అంటే రూ.1.2 కోట్లకు టర్మ్ లైఫ్ ప్లాన్ తీసుకున్న తర్వాత.. పాలసీదారు మరణించినట్టయితే వచ్చే పరిహారం కుటుంబానికి సరిపోతుందా..? ఇక్కడ రూ.1.2 కోట్ల డిపాజిట్‌పై 6 శాతం వార్షిక రేటు ఆధారంగా వచ్చే మొత్తం రూ.7.2 లక్షలు మించదు. అంటే అప్పటి వరకు వచ్చిన వార్షికాదాయం కంటే తక్కువ. తమకు ఏదైనా జరిగినా.. ఎప్పటి మాదిరే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఇక్కడ రూ. 2.4 కోట్లకు బీమా రక్షణను (సమ్ అష్యూర్డ్) తీసుకోవాలి. ఉదాహరణకు షణ్ముఖ్ వయసు 30 ఏళ్లు. ప్రస్తుత వార్షికాదాయం రూ.12 లక్షలకు 20 రెట్ల చొప్పున రూ.2.4 కోట్లకు టర్మ్ లైఫ్ కవరేజీ తీసుకున్నాడని అనుకుందాం. 40 ఏళ్లకు వచ్చే సరికి షణ్ముఖ్ వార్షికాదాయం రూ.24 లక్షలకు పెరిగింది. ఈ ప్రకారం చూస్తే పదేళ్ల క్రితం తీసుకున్న టర్మ్ ప్లాన్‌లో రక్షణ వార్షిక ఆదాయానికి పది రెట్లకు తగ్గిపోయిందని తెలుస్తోంది. వయసు పెరిగే కొద్దీ జీవితంలో బాధ్యతలు, ఖర్చులు పెరుగుతాయని తెలిసిందే. కనుక పెరుగుతున్న ఆదాయానికి, జీవన వ్యయాలకు అనుగుణంగా బీమా కవరేజీ కూడా పెరిగేలా చూసుకోవాలి. సొంతిల్లు, పిల్లలకు మెరుగైన విద్య అన్నవి తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమైన లక్ష్యాలు. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించినప్పుడు వచ్చే పరిహారం కేవలం ఆ కుటుంబ జీవన అవసరాలే కాదు, ముఖ్యమైన జీవిత లక్ష్యాల సాకారానికీ తోడ్పాటునివ్వాలి. అందుకుని వాటికయ్యే వ్యయాలను కూడా కవరేజీని నిర్ణయించుకునే విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి..? ‘‘వివాహం అయిన తర్వాత లేదా పిల్లలు కలిగిన తర్వాత టర్మ్ ప్లాన్ తీసుకోవాలనే ధోరణి సరికాదు. ఎంత వీలైతే అంత ముందుగా టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. అంతేకాదు పాలసీ పూర్తి కాలానికి అదే కొనసాగుతుంది’’ అని ఆనంద్‌రాఠి ఇన్సూరెన్స్ బ్రోకర్స్‌కు చెందిన దినేష్ దిలీప్ భోయ్ సూచించారు. వీలైనంత ముందుగా అంటే.. సంపాదన మొదలు పెట్టిన వెంటనే అని అర్థం చేసుకోవచ్చు. జీవితంలో స్థిరపడడంలో ఆలస్యమైన వారు.. కనీసం తమ సంపాదన మొదలైన మొదటి 30 రోజుల్లో అయినా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మరిచిపోవద్దు. సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల వయసు వారు టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఆలస్యం చేసిన కొద్దీ వయసుతోపాటు ప్రీమియం పెరుగుతుంది. పైగా నేటి రోజుల్లో చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర సమస్యలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు జీవిత బీమా తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేసి, అనారోగ్య సమస్యలు పలకరించిన తర్వాత తీసుకోవాలంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఆరోగ్య వంతులతో పోలి్చతే ప్రీమియం 20–50 శాతం అధికంగా పడుతుంది. కొన్ని సందర్భాల్లో రిస్క్ మరీ ఎక్కువ ఉంటుందని బీమా సంస్థలు భావిస్తే బీమా కవరేజీని తిరస్కరించే అవకాశం కూడా లేకపోలేదు.ఎంత కాలానికి? జీవిత బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఎంత వయసు వచ్చే వరకు ఈ రక్షణ ఉండాలన్నది కూడా ముఖ్యమైన అంశమే అవుతుంది. మనలో చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. ఎక్కువ మంది 20–25 ఏళ్ల కాలానికే రక్షణను ఎంపిక చేసుకుంటుంటారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి జీవిత బీమా కవరేజీ తీసుకున్నారని అనుకుంటే.. అతడికి/ఆమెకు 50 ఏళ్లు వచ్చే సరికి ఆ రక్షణ ముగిసిపోతుంది. దీంతో అక్కడి నుంచి మళ్లీ కొంత కాలానికి మరో పాలసీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రీమియం భారంగా మారుతుంది. ప్లాన్ తీసుకునే నాటికి తమ వయసు ఎంతన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఎంతలేదన్నా రిటైర్మెంట్ వరకు (60 ఏళ్లు) జీవిత బీమా కవరేజీ ఉండాలి. కొందరికి ఆలస్యంగా వివాహం కావచ్చు. అంటే 30–45 ఏళ్ల మధ్యలో వివాహం చేసుంటే.. 60 ఏళ్లు వచ్చినా పిల్లలకు సంబంధించి, కుటుంబ బాధ్యతలు ఇంకా మిగిలి ఉంటాయి. పిల్లలకు కనీసం 23–25 ఏళ్ల వయసు వచ్చే వరకు అయినా తమకు టర్మ్ కవరేజీ ఉండేలా చూసుకోవడం సరైనది. రిటైర్మెంట్ నాటికి లేదా జీవితంలో అన్ని ముఖ్యమైన బాధ్యతలు తీరే నాటికి బీమా కవరేజీ ఉంటే సరిపోతుంది.ఎలాంటి టర్మ్ ప్లాన్? టర్మ్ ప్లాన్ అంటే అచ్చమైన బీమా రక్షణతో కూడిన పాలసీ కదా? అన్న సందేహం రావచ్చు. అవును టర్మ్ ప్లాన్ ఉద్దేశంఅదే. కానీ, వినియోగదారుల ధోరణి, అంచనాలు, అవసరాలకు అనుగుణంగా ఇందులోనూ పలు రకాలు వచ్చాయి. సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో బీమా రక్షణతోపాటు, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా కానీ రాబడి ప్రయోజనం లభిస్తుంది. అంటే అది బీమా, పెట్టుబడి కలిసిన సాధనం. టర్మ్ ప్లాన్ ఎలాంటి రాబడి ఇవ్వని.. కేవలం మరణించిన సందర్భాల్లోనే (పాలసీ కాల వ్యవధిలో) పరిహారం చెల్లించేది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి జీఎస్టీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం (టీఆర్‌వోపీ)గా దీన్ని పిలుస్తారు. లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇది అందరికీ తెలిసిన ప్లాన్. కాల వ్యవధి పూర్తయ్యే వరకు కవరేజీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకుంటే, కాల వ్యవధి ముగిసే వరకు రూ.50 లక్షల కవరేజీయే కొనసాగుతుంది. ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో సమ్ అష్యూర్డ్ స్థిరంగా ఉండదు. నిరీ్ణత కాలానికోసారి పెరుగుతూ పోతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నుంచి పరిహారానికి హెడ్జింగ్ లభిస్తుంది. అంతేకాదు పెరిగే వయసుకు తగ్గట్టు బాధ్యతలు కూడా అధికమవుతుంటాయి. ఈ విధంగానూ అదనపు రక్షణ అక్కరకు వస్తుంది. డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇంక్రీజింగ్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. నిరీ్ణత కాలానికోసారి కవరేజీ తగ్గుతూ వెళుతుంది. ఉదాహరణకు ఏదైనా లోన్ తీసుకుని, దానికి రక్షణ కోసం టర్మ్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. కొంత కాలానికి రుణ భారం తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగా బీమా రక్షణ తగ్గేలా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో టర్మ్ ప్లాన్‌ను ఎండోమెంట్ లేదా హోల్‌లైఫ్ పాలసీగా మార్చుకోవచ్చు. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్: నూరేళ్ల కాలానికి ఈ ప్లాన్‌లో రక్షణ లభిస్తుంది. నోట్: టర్మ్ ప్లాన్‌లో ఎన్ని రకాలున్నా.. అచ్చమైన టర్మ్ ప్లాన్ (లెవల్ టర్మ్ఇన్సూరెన్స్) సులభమైనది. మిగిలిన వాటిల్లో తమకు ఏదైనా మరింత ప్రయోజనం అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లెవల్ టర్మ్ ప్లాన్‌లో కాల వ్యవధి ముగిసే వరకు ప్రీమియం మారదు. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్‌లో, కన్వర్టబుల్, హోల్‌లైఫ్ ప్లాన్లలో ప్రీమియం అధికంగా ఉంటుంది. సాధారణ లెవల్ టర్మ్ ప్లాన్‌తో పోల్చితే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్‌లోనూ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. రైడర్లు..టర్మ్ ప్లాన్‌కు అనుబంధంగా పలు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్: కేన్సర్, కాలేయ వైఫల్యం తదితర 20 నుంచి 64 వరకు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఈ రైడర్ నుంచి ఏక మొత్తంలో పరిహారం లభిస్తుంది. ఈ రైడర్లో ఎన్నింటికి కవరేజీ అన్నది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. వేవర్ ఆఫ్ ప్రీమియం: ప్రమాదంలో అంగవైకల్యం పాలైనా లేక తీవ్ర వ్యాధుల బారిన పడినా ఇక అక్కడి నుంచి పాలసీదారు ప్రీమియం చెల్లించే అవసరాన్ని ఇది తప్పిస్తుంది. బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి ప్రీమియం చెల్లిస్తుంది. యాక్సిడెంటల్ డెత్, టోటల్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్: ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం పాలైనా ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర పరిహారం పొందొచ్చు. పరిహారం చెల్లింపు ఎలా..? పాలసీదారు మరణించినప్పుడు పరిహారం చెల్లింపులో పలు ఆప్షన్లను టర్మ్ ప్లాన్లు ఆఫర్ చేస్తుంటాయి. → ఎంపిక చేసుకున్న సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని ఒకే విడత చెల్లించడం ఇందులో ఒకటి. → సమ్ అష్యూర్డ్‌లో 50 శాతాన్ని ఏకమొత్తంగా చెల్లించి, మిగిలిన 50 శాతాన్ని సమాన వాయిదాల్లో కొన్ని సంవత్సరాల పాటు చెల్లించడం మరో ఆప్షన్. → సమ్ అష్యూర్డ్‌లో కొంత మొత్తాన్ని ఒకే విడత చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీగా పెంచుతూ చెల్లించడం మూడో ఆప్షన్.చిట్కాలు→ తగినంత కవరేజీ ఎంపిక చేసుకున్న తర్వాత.. అందుకు ఏటా చెల్లించే ప్రీమియం తమ సామర్థ్యం మేరకే ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం చెల్లించలేనంత భారంగా మారకూడదు. ప్రీమియం చెల్లించలేక పాలసీ మధ్య లో లాప్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకని తగినంత బీమా రక్షణ ఒక్కటే కాదు, తమ చెల్లింపుల సామర్థ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. → ఏదో ఒక కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం కాకుండా, వివిధ కంపెనీల మధ్య ఫీచర్లు, ప్రీమియం రేట్లను పరిశీలించి చూసుకోవాలి. → టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు అనుబంధంగా వచ్చే రైడర్లు, యాడాన్‌లను తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్‌ను తీసుకోవడం ఎంతో అవసరం. → ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియంలో కొంత తగ్గింపు లభిస్తుంది. → పెరుగుతున్న జీవన అవసరాలకు అనుగుణంగా, అదనపు రుణం తీసుకున్న ప్రతి సందర్భంలో ఆ మేరకు బీమా కవరేజీని పెంచుకోవాలి. → ఎంపిక చేసుకునే బీమా సంస్థ, క్లెయిమ్‌లను ఏ మేరకు ఆమోదిస్తుందో తప్పకుండా పరిశీలించాలి. దీర్ఘకాలంలో మెరుగైన చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థను ఎంపిక చేసుకోవాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కలసి ఉంటేనే కలదు విజయం
ఈ భూమి మీద విజయం సాధించిన వారంతా కేవలం తామొక్కరుగానే ఆ విజయాన్ని సాధించలేదు. వారందరికీ ఏదో సమయంలో అనేక మంది సహకరించడం వల్లనే ఆ విజయం సం్రపాప్తించిందన్నది జగమెరిగిన సత్యం. ఏ మనిషైనా ఎన్ని ప్రతిభా సామర్ధ్యాలున్నప్పటికీ, ఎంతటి పండితులైనప్పటికీ, అపారమైన మేధో సంపత్తి ఉన్నప్పటికీ, ఆయా సామర్థ్యాలను సాధించడానికి వారు చేసిన కృషి ఒక ఎత్తయితే, ఆ కృషి చేయడానికి సహకరించిన చేతులు అనేకం అని చెప్పక తప్పదు.ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి గురించి మాట్లాడినపుడు వారు పడిన శ్రమను, కష్టం గురించి మాట్లాడడం జరుగుతుంది తప్ప, వారికి అంతర్లీనంగా సహకరించిన పెద్దలను, మహనీయులను, గురువులను, స్నేహితులను, మిత్రులను గాలికి వదిలేస్తాం. నిజానికి వారందరి సహకారం లేనిదే ఆ వ్యక్తి అంతటి ఉన్నత శిఖరాలకు చేరుకుని ఉండేవారు కాదన్నది వాస్తవం. ఒకవేళ ఆ వ్యక్తి తనకు తానుగా గొప్పవాడిగా భావించుకుని అందరినీ దూరంగా జరిపితే ఆయా విజయాల దరిదాపుల్లోకి వెళ్ళేవాడు కాదన్నది అక్షరాల నిజం. అందుకే కలిసుంటే కలదు సుఖమే కాదు... అది జీవిత సత్యంగా కూడా ఆకళింపు చేసుకోవాలి. మన పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ ఏ ఒక్క యుగ పురుషుడు కూడా ఐకమత్యం సాధించకుండా విజయ బావుటా ఎగురవేయలేదన్న విషయంలో ఎంత వాస్తవం ఉందో, ఐకమత్యం లేకపోతే ఆ విజయాలు సాధ్యం కావన్న విషయంలోనూ అంతే నిజం ఉంది.అందువల్ల ఏదైనా ముఖ్యమైన విజయాన్ని సాధించడానికి, అత్యంత అవసరమైన అంశం ఐకమత్యం. మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐకమత్యం అండగా నిలుస్తుంది. కనుక మన భవిష్యత్ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అన్ని శక్తులు, సామర్థ్యాలు, వనరులు వాడుకోవాలి. ఇవన్నీ ఏ ఒక్కరిలోనో ఉండవు. సహాయం, సహకారం అవసరమున్నప్పుడు అర్ధించడం బలహీనతకు సూచన కాదు. అది వివేకవంతుల లక్షణం కూడా.దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేయడానికి సాక్షాత్తు ఆ జగన్మాతే ఐకమత్యంతో అసురులపై విజయం సాధించింది. చండ, ముండాసురులను, మహిషాసురుని సంహరించి జగజ్జేతగా నిలిచింది. ఆ జగన్మాతకు విజయం దక్కడానికి ముక్కోటి దేవతలు ఒక్కటయ్యారు. తమకు కంటకంగా మారిన అసురులను సంహరించడానికి ఆ తల్లికి సహకరించారు. సృష్టి స్థితి, లయాలకు కారకులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులతో పాటు, ముక్కోటి దేవతలు ఆ తల్లికి తమకున్న శక్తులన్నింటినీ ధారపోశారు. తమకున్న అపార యంత్ర, తంత్ర, అద్వితీయ శక్తులను జగన్మాతకు ఇచ్చి, ఆ తల్లిని శక్తి స్వరూపిణిగా నిలబెట్టారు. చివరకు అసుర సంహారం చేశారు. అందువల్ల మన నిజమైన సామర్థ్యాలు మన ఒక్కరిలో ఉన్నవే కాదు. మన తోటి వాళ్ళందరితో కలిసి ఉంటేనే అవి సర్వశక్తిమంతులుగా మార్చుతాయి. ఇది ఐకమత్యంతోనే సాధ్యమవుతుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి మసలుకుని విజయులమవుదాం.ఐకమత్యమే మహాబలం, మహాభాగ్యం అన్నారు పెద్దలు. అవును నిజమే.. మన పెద్దలు చెప్పినట్టు ఐకమత్యంగా ఉంటే ఎన్నో పనులు చెయ్యచ్చు.. శత్రువులను సైతం తరిమి తరిమి కొట్టచ్చు. ఎలాంటి దుస్సాధ్యమైన పనైనా సునాయాసంగా చేయచ్చు. ఐకమత్యం బలాన్ని, ప్రేమను, అనురాగాలను పెంచుతుంది. ఇది నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. ఏకత్వాన్ని సూచిస్తుంది, ఆనందాన్నిస్తుంది. కష్టాలలో పాలు పంచుకునే అవకాశాన్నిస్తుంది. శక్తిని, విశ్వాసాన్ని పెంచుతుంది. ఏకత్వాన్ని కలిగిస్తుంది. వ్యక్తుల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. జీవితంలోని సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించడానికి ఇది మనకు ఎంతగానో దోహదం చేస్తుంది. – దాసరి దుర్గా ప్రసాద్ -
మొక్కలు చీడపీడల్లేకుండా, పచ్చగా ఉండాలంటే, ఇవిగో చిట్కాలు!
పచ్చదనం అంటే.. ఎక్కడో పార్క్లకో, అడవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. మన పెరట్లో నాలుగు మందార, గులాబీ,చేమంతి మొక్కలో ఉంటే సరిపోతుంది. ఇంటి ముందు గుబురుగా పెరిగిన తులసి మొక్క చాలు మనసు ప్రశాంతంగా ఉండటానికి. చిన్న చిన్న మొక్కలతో ఇల్లు అందంగా కనిపించడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.అయితే మనకున్నచిన్న బాల్కనీలో, పెరట్లో మొక్కల్ని పెంచడం అంత ఈజీ కాదు సాధారణంగా మొక్కలను ఇష్టపడేవారు బయటి నుంచి మొక్కలు తెచ్చి తమ తోటల్లో లేదా ఇళ్లలోని కుండీల్లో నాటుతారు. మొక్కలకు సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, వాడిపోతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఎండిపోతాయి. సరైనపోషణతో కీటకాల బెడద లేకుండాపచ్చగా ఎదగాలంటే ఏం చేయాలి?మొక్కలు జాగ్రత్తగా పరిశీలించకపోయినా,పోషణ అందకపోయినా, నీళ్లు ఎక్కువైనా చని పోతాయి. పురుగులు కీటకాలు మొక్కలను మాత్రమే కాకుండా కుండలోని మట్టిని కూడా దెబ్బతీస్తాయి. జాగ్రత్తలు, చిట్కాలుదెబ్బతిన్న, చనిపోయిన ఆకులని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. దీని వల్ల చెట్లు చక్కగా పెరుగుతుంది. కాబట్టి, వీటిని కత్తెరతో కత్తిరించడం మంచిది.మొక్కలకి నీళ్ళతో పాటు సరైన కాంతి అవసరం. మరీ ఎండలో కాకుండా సమానమైన ఎండ తగిలేలా చూసుకోవాలి. అలా అని చీకటికూడా మంచిది కాదు. కాస్తంత వెలుతురు కావాలి.మొక్కలకి ఇంట్లోనే తయారు చేసుకున్న అనేక ఎరువులు ఇస్తూ ఉండాలి. పుల్లటి మజ్జిగ ద్రావణం, బనానా పీల్ ఫెర్టిలైజర్, పంచగవ్య, ఎండిన పశువుల ఎరువు, వేపనూనె, వేపగింజలు, ఆకుల కషాయం లాంటివి మొక్క, కుండా సైజును బట్టి ఇవ్వాలి.పుల్ల మజ్జిగ ద్రావణంగ్లాసు పుల్లటి మజ్జిగలో ఐదు గ్లాసులు నీళ్లుపోసి కలపాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్లో పోసి మొక్కలపై చల్లాలి. ఉదయం సాయంత్రం ఒకసారి ఈ నీటిని మొక్కలు పోయడం వల్ల చీడపీడలు పోయి మొక్కలు చక్కగా పెరుగుతాయి.పచ్చి బఠానీతో పచ్చగా... పచ్చి బఠాణి మనకు ఎంత మేలు చేస్తుందో తెలిసిందే. అయితే బఠాణి పిక్కలు తీసి తొక్కలను పారేస్తుంటాము. కానీ ఈ తొక్కలు మొక్కలకు చక్కని పోషకాలు అందిస్తాయి. అందుకే తొక్కలను మిక్సీజార్‌లో వేసి పేస్టులా చేయాలి. ఈ పేస్టులో కాసిని నీళ్లు ΄ పోసి వడగట్టాలి. ఈ నీటిని గార్డెన్‌లోని మొక్కలకు పోషకాలు ఈ నీరు మంచి బలవర్థకమైన టానిక్‌లా పనిచేసి మొక్కలు చక్కగా పెరిగేందుకు దోహదపడతాయి.తెగుళ్లు, నివారణమొక్కలు సాధారణంగా పురుగులు,తెగుళ్లు నుంచి ఎప్పటికప్పుడు వాటిని కాపాడుకోవాలి. తెల్ల నల్లి, గొంగళి లాంటి వాటిని చేతితో తీసేయవచ్చు. పసుపు, ఉప్పు, ఇంగువ నీళ్లు చల్లినా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కనీసం రెండు రోజులకు ఒకసారైనా మొక్కల్ని పరికించి చూడాలి. లేదంటే గొంగళిపురుగులు, ఆకుతొలిచే పురుగులు ఆకుల్ని పూర్తిగా తినేస్తాయి. మట్టిలో తేమ కారణంగా, కొన్నిసార్లు చిన్న నత్తలు లేదా పాకే పురుగులు మొక్కలను పూర్తిగా నాశనం చేస్తాయి. వీటికి పొడి గుడ్డు పెంకు పొడి బాగా ఉపయోగపడుతుంది. గుడ్డు పెంకులను పూర్తిగా శుభ్రం చేసి, పొడి చేసి మట్టిలో కలపాలి.పువ్వులపై మైనంలాగా కనిపించే తెల్లటి మీలీ బగ్స్ (మందార, గులాబీ మొక్కలపై) వాటిని వదిలించుకోవడానికి, ఒక లీటరు నీటిలో చిటికెడు బేకింగ్ సోడా, 1 టీస్పూన్ షాంపూ, 2-3 చుక్కల వేపనూనె కలిపి మొక్కలపై చల్లుకోవాలి. టొమాటో, బెండకాయ, బీన్స్, ఓక్రా మొదలైన కొన్ని కూరగాయలపై కూడా ముందుగానే చల్లుకోవాలి. దాల్చిన చెక్క పొడికూడా బాగా పనిచేస్తుంది.ఇదీ చదవండి: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా -
‘ఆమె మహిళా హక్కుల పరిరక్షకురాలు’
న్యూఢిల్లీ: జస్టిస్ హిమా కోహ్లి ఒక మహిళా జడ్జి మాత్రమే కాదని స్త్రీ హక్కుల పరిరక్షణకు తీవ్రంగా పాటుపడ్డారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కితాబిచ్చారు. సెప్టెంబరు 1న రిటైరవుతున్న హిమా కోహ్లి గౌరవార్థం సీజేఐ శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఆమె రిటైరయ్యాక సర్వోన్నత న్యాయస్థానంలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలు ఉంటారు. ‘జస్టిస్ కోహ్లితో కలిసి ధర్మాసనంపై కూర్చోవడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. హిమా.. మీరొక మహిళా జడ్జి మాత్రమే కాదు.. స్త్రీల హక్కుల పరిరక్షకురాలు కూడా’ అని సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చంద్రచూడ్, హిమాకోహ్లిలు బ్యాచ్మేట్లు కావడం గమనార్హం. న్యాయం కోసం జస్టిస్ కోహ్లి తన జీవితాన్ని ధారబోశారని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అన్నారు. 2006 మే నెలలో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన హిమా కోహ్లి.. 2007 ఆగస్టులో శాశ్వత జడ్జి అయ్యారు. జనవరి 7, 2021న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. -
త్వరలోనే డేటా రక్షణ నిబంధనలు
న్యూఢిల్లీ: వ్యక్తిగత డిజిటల్ డేటా పరిరక్షణ చట్టం ముసాయిదా నిబంధనలను నెలరోజుల్లోనే విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. ప్రభుత్వం తొలుత డిజిటల్‌గా ఈ చట్టం అమలుపై దృష్టి పెట్టినట్టు.. అందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించినట్టు చెప్పారు.‘‘కార్యాచరణ సిద్ధమైంది. సంప్రదింపుల కోసం ముసాయిదా నిబంధనలను నెల రోజుల్లోపు ప్రజల ముందు ఉంచుతాం’’ అని మీడియా ప్రతినిధులకు వైష్ణవ్ తెలిపారు. నిబంధనలకు సంబంధించి భాష సరళతరంగా ఉంటుందన్నారు. గోప్యత హక్కు అన్నది ప్రాథమిక హక్కుల్లో భాగమేనంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఆరేళ్ల తర్వాత.. 2023 ఆగస్ట్ 9న ‘ద డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు’కు పార్లమెంట్ ఆమోదం తెలపడం గమనార్హం.ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు యూజర్ల వ్యక్తిగత డేటా దుర్వినియోగాన్ని ఈ చట్టం అడ్డుకుంటుంది. వ్యక్తిగత డేటా సేకరణ, ప్రాసెసింగ్‌కు సంబంధించి నిబంధనలను కచ్చితగా అమలు చేయాల్సి ఉంటుంది. డేటా ఉల్లంఘన చోటుచేసుకుంటే రూ.250 కోట్ల వరకు జరిమాన చెల్లించే నిబంధన సైతం ఈ చట్టంలో భాగంగా ఉంది. -
పచ్చదనాల పల్లె.. మరియపురం
గీసుకొండ: ఒకప్పుడు పల్లెలు పచ్చదనానికి పట్టుగొమ్మలు, ఇప్పుడంతా మారిపోయిందని అంటూ ఉంటారు. కానీ వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం మాత్రం ఇప్పటికీ పచ్చదనంతో కళకళలాడుతోంది. ఏ ఇంటి ఆవరణ చూసినా, ఏ వీధిలో తిరిగినా పచ్చటి చెట్లు, మొక్కలు కనువిందు చేస్తున్నాయి. 2019 నుంచి ఇటీవలి వరకు సర్పంచ్‌గా పనిచేసిన అల్లం బాలిరెడ్డి చొరవే దీనికి కారణం. ఆయన సొంత ఖర్చుతో నర్సరీల నుంచి మొక్కలు తెప్పించారు. గ్రామంలోనూ నర్సరీ ఏర్పాటు చేయించారు. వివిధ పండ్లు, పూలు, కూరగాయల మొక్కలను ఇంటింటికి అందించారు. మొక్కలు నాటి సంరక్షించిన వారికి బహుమతులు ఇచ్చారు. నిండా పచ్చదనంతో, కాలుష్యానికి దూరంగా ఉండే ఈ గ్రామానికి ఇప్పటికే జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా గుర్తింపు వచ్చి0ది. ఇటీవల రాష్ట్ర స్థాయి పర్యావరణ పరిరక్షణ అవార్డు ఇచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు.. సోలార్ ఉత్పత్తిలోనూ.. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికీ సర్పంచ్ కృషి చేశారు. గ్రామంలో ఇంటింటికీ జనపనార, క్లాత్ సంచులను అందించారు. తనకు వచ్చే గౌరవ వేతనాన్ని మßహిళా సంఘాలకు ఇచ్చి.. వారితో వారంలో ఒకరోజు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే పనులు చేయించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను పోగుచేసి విక్రయించి, ఆ సొమ్మును గ్రామ అభివృద్ధికి ఖర్చు చేశారు. ఇక గ్రామంలో 20 మంది తమ ఇళ్లపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం సర్పంచ్ తన వంతుగా రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. గత ఐదేళ్లలో గ్రామంలో పుట్టిన 29 మంది బాలికలకు రూ.10వేల చొప్పున సాయం అందించారు. గ్రామాల అభివృద్ధితోనే దేశ ప్రగతి.. ‘‘ప్రజలు, ప్రభుత్వ అధికారుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశాం. అన్ని గ్రామాలు స్వయం సమృద్ధి చెందితే దేశం మరింత ప్రగతి సాధిస్తుంది.’’ – మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి -
ఇరాన్ ముప్పు.. ఇజ్రాయెల్‌కు అమెరికా రక్షణ కవచం
ఇరాన్‌తో పాటు ఆ దేశం మద్దతు కలిగిన రెబల్ గ్రూపుల నుంచి బెదిరింపులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా పశ్చిమాసియాలో అదనపు యుద్ధ విమానాలను, నౌకాదళ నౌకలను భారీగా మోహరించేందుకు సమయాత్తమవుతోంది.ఇరాన్, రెబల్ గ్రూపుల నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌కు రక్షణ అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ తెలిపారు. పశ్చిమాసియాకు మరిన్ని యుద్ధ విమానాలను పంపాలని అమెరికా డిఫెన్స్ చీఫ్‌ను ఆదేశించినట్లు పెంటగాన్ తెలిపింది. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య చర్చలు జరిగినట్లు పేర్కొంది.ఇదేవిధంగా అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ జె. ఆస్టిన్.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆస్టిన్ ఇజ్రాయెల్‌కు అదనపు సహాయాన్ని అందిస్తామని హామీనిచ్చారు. టెహ్రాన్‌లో ఇటీవల హమాస్ నేత ఇస్మాయిల్ హనియెహ్ హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే అమెరికా ఇజ్రాయెల్‌కు సహకారం అందిస్తోంది.హమాస్‌కు చెందిన ఇద్దరు అగ్రనేతలు, హెజ్ బొల్లాకు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్ హత్యలతో పశ్చిమాసియా నివురు గప్పిన నిప్పులా ఉంది. ఈ మూడు హత్యలలో రెండింటిలో ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్, హమాస్, హెజ్ బొల్లా ఆరోపిస్తున్నాయి. ఈ మూడు ఇజ్రాయెల్ పైకి దండెత్తే అవకాశాలున్నాయని అమెరికా అంచనా వేస్తోంది. -
Beauty Tips: పాదాలు అందంగా కనిపించాలా? అయితే ఈ టూల్‌ని..
తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు ఆరోగ్యంగా ఉంటేనే అందం సొంతమవుతుంది. కేశ సౌందర్యం ముఖానికి ఆకర్షణ కాబట్టి.. దానిపట్ల ఎలాగూ శ్రద్ధ పెడతాం! పాదాలనే పెద్దగా పట్టించుకోం! పాదాలే కదా అని పెదవి విరవకుండా.. ఇదిగో ఈ టూల్‌ని తెచ్చుకోండి.. వాటిని చక్కగా సంరక్షించి.. ఆరోగ్యం, అందం రెంటినీ చేకూరుస్తుంది.చిత్రంలోని ఈ డెడ్ స్కిన్ రిమూవర్లో.. 2 లెవెల్స్‌లో స్పీడ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డివైస్‌తో పాటుగా రీప్లేసబుల్ గ్రైండింగ్ హెడ్స్ లభిస్తాయి. వాటిలో 2 స్క్రబ్ హెడ్స్‌తో పాటు.. ఒక రోలర్ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్‌తో పోర్టబుల్ డివైస్‌గా ఉన్న ఈ రోలర్.. యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది.హ్యాండిల్‌తో.. తేలికగా, ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుందీ డివైస్. తడి లేదా పొడి చర్మాలకు అనువైనది. అలాగే స్త్రీ, పురుషులు ఎవరైనా వాడొచ్చు. దీన్ని శుభ్రపరచడం తేలిక. కాళ్లు, గోళ్లు, గోళ్ల చుట్టూ ఉండే చర్మం.. ప్రతి భాగాన్ని శుభ్రపరచి మృదువుగా మారుస్తుంది.ఈ ఎలక్ట్రిక్ మేకప్ రిమూవర్ ఫుట్ స్క్రబ్ డెడ్ స్కిన్ ఎక్స్ఫోలియేషన్.. హై హీల్స్ వాడేవారికి.. పాదాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకునేవారికి చక్కగా ఉపయోగపడుతుంది. అందమైన పాదాలను కోరుకునేవారికి.. ఇది చక్కటి బహుమతి అవుతుంది. ఈ ఫుట్ స్పా బ్యూటీ రోలర్ ఇంట్లో ఉంటే.. పెడిక్యూర్ కోసం పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ధర కేవలం 449 రూపాయలు. దీన్ని స్నేహితులకు, శ్రేయోభిలాషులకు గిఫ్ట్‌గానూ ఇవ్వచ్చు.ఇవి చదవండి: ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో.. -
Lok Sabha Election 2024: ఎమర్జెన్సీలో రాజ్యాంగం గొంతు నొక్కారు
హోషియార్పూర్: ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగం గొంతు పిసికిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ అంటూ గొంతు చించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. 1984 నాటి అల్లర్లలో సిక్కుల మెడలకు టైర్లు బిగించి, నిప్పంటించి కాల్చి చంపుతుంటే కాంగ్రెస్‌కు రాజ్యాంగం గుర్తుకు రాలేదని ధ్వజమెత్తారు. గురువారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో మోదీకి ఇదే చివరి సభ. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి ఉద్దేశాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లలో కోత విధించి, బడుగు బలహీనవర్గాలకు అన్యాయం చేసిన చరిత్ర ప్రతిపక్షాలకు ఉందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టేందుకు విపక్షాలు ప్రయతి్నస్తున్నాయని దుయ్యబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తిని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనోభావాలను ప్రతిపక్షాలు కించపరుస్తున్నాయని ఆక్షేపించారు. అవినీతిలో కాంగ్రెస్ డబుల్ పీహెచ్డీ కాంగ్రెస్ పార్టీ అవినీతికి తల్లిలాంటిదని ప్రధానమంత్రి నిప్పులు చెరిగారు. అవినీతిలో ఆ పార్టీ డబుల్ పీహెచ్డీ చేసిందని ఎద్దేవా చేశారు. మరో అవినీతి పారీ్ట(ఆమ్ ఆద్మీ పార్టీ) కాంగ్రెస్‌తో చేతులు కలిపిందన్నారు. ఢిల్లీలో కలిసికట్టుగా, పంజాబ్‌లో విడివిడిగా పోటీ చేస్తూ ఆ రెండు పారీ్టలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ గర్భంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఊపిరి పోసుకుందని అన్నారు. కాంగ్రెస్ నుంచే అవినీతి పాఠాలు చేర్చుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాల్లో మునిగి తేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సైనిక దళాలను బలహీనపర్చిందని ఆరోపించారు. సైన్యంలో సంస్కరణలు చేపట్టడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు. ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలి వారణాసి ప్రజలకు ప్రధాని పిలుపు లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. వారణాసిలో శనివారం పోలింగ్ జరుగనుంది. తన నియోజకవర్గ ప్రజలకు మోదీ గురువారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. భారతదేశ అభివృద్ధి కోసం వారణాసి ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చారు. కాశీ విశ్వనాథుడితోపాటు అక్కడి ప్రజల ఆశీర్వచనాలతోనే పార్లమెంట్లో వారణాసికి ప్రాతినిధ్యం వహించే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. పవిత్ర గంగామాత తనను దత్తత తీసుకుందన్నారు. నవకాశీతోపాటు ‘అభివృద్ధి చెందిన భారత్’ను సాకారం చేసుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలకమని వివరించారు. జూన్ 1న జరిగే ఓటింగ్‌లో వారణాసి ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని, ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. కాశీని ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని మోదీ హామీ ఇచ్చారు. కన్యాకుమారిలో మోదీ ధ్యానముద్ర సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్లోని ధ్యాన మండపంలో ప్రధాని మోదీ గురువారం సాయంత్రం ధ్యానం ప్రారంభించారు. దాదాపు 45 గంటపాటు ఆయన ధ్యానం కొనసాగించనున్నారు. మోదీ తొలుత కేరళలోని తిరువనంతపురం నుంచి హెలికాప్టర్లో కన్యాకుమారికి చేరుకున్నారు. సంప్రదాయ ధోతీ, తెల్ల రంగు కండువా ధరించి భగవతి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మోదీ సముద్ర తీరం నుంచి పడవలో రాక్ మెమోరియల్‌కు చేరుకున్నారు. ధ్యాన మండపం మెట్లపై కాసేపు కూర్చుకున్నారు. తర్వాత ధ్యాన మండపంలో సుదీర్ఘ ధ్యానానికి శ్రీకారం చుట్టారు. -
రాజ్యాంగ పరిరక్షణే ప్రధానం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తాను మళ్లీ జైలుకెళ్తే ఎలాగ అనే విషయం వదిలేసి రాజ్యాంగ పరిరక్షణ మీదే దృష్టిపెట్టాలని, అది మీ బాధ్యత అని ఓటర్లకు ఆప్ కనీ్వనర్ కేజ్రీవాల్ హితవు పలికారు. బుధవారం చాంద్నీ చౌక్, నార్త్‌వెస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచార రోడ్‌షోలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ హరియాణా, ఉత్తరప్రదేశ్.. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాకబు చేశా. దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ గెలవబోయే సీట్లు బాగా తగ్గిపోతున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే దేశాభివృద్ధి కోసం పని మొదలుపెడతాం. దీంతో నియంతృత్వం అంతమవుతుంది. నేను మళ్లీ జైలుకెళ్తే ఎలాగ అన్న ఆలోచనలు పక్కనపడేయండి. రాజ్యాంగ పరిరక్షణే అత్యవశ్యకం. అది మీ బాధ్యత’’ అని ఓటర్లకు హితవు పలికారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
సాక్షి, అమరావతి: భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం. దీనివల్ల రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి.చట్టం ముఖ్య ఉద్దేశంప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి. అన్ని వివరాలూ స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక విధంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చొచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే కోర్టుకే వెళ్లాలి. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కింది కోర్టు, పైకోర్టు అంటూ తిరగాలి. ఈ అవస్థలన్నింటినీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందా?ల్యాండ్ టైట్లింగ్ చట్టం గెజిట్ జారీ అయినా ఇంకా అమల్లోకి రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఏదైనా అమలులో ఉన్నట్లు లెక్క. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అసెంబ్లీలో బిల్లు పాసైంది. దీనికి టీడీపీ కూడా మద్దతు తెలిపింది. రీ సర్వే ఇంకా జరుగుతుండటంతో నోటిఫికేషన్ జారీ చేయలేదు. చట్టం అమల్లోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ అథారిటీ ఏర్పడుతుంది. ఆ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అప్పిలేట్ అధికారులు, ట్రిబ్యునళ్లను నియమిస్తుంది. ఇంకా అథారిటీయే ఏర్పడలేదు. కాబట్టి టైటిల్ రిజిస్ట్రేషన్, అప్పిలేట్ అధికారులను నియమించలేదు. ఆ అధికారులుగా ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా ఇంకా నిర్ణయించలేదు. అసలు చట్టమే ఉనికిలో లేదు. ఎందుకంటే దాని అమలుకు ఎటువంటి మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. చట్టం అమలుకు నోటిఫికేషన్ జారీ చేసి అందుకనుగుణంగా నిబంధనలు, మార్గదర్శకాలతో జీవో జారీ అయితేనే అమల్లోకి వచ్చినట్లు లెక్క. అదేమీ లేకుండానే చట్టం అమలైపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు.ఈ చట్టం వల్ల వచ్చే లాభంల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం ఒకసారి మీ భూమి రికార్డుల్లోకి ఎక్కితే అదే తుది రికార్డు అవుతుంది. ఇతర రికార్డులు, కాగితాల కోసం తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరూ ఆ భూమిని లాక్కోలేరు. దౌర్జన్యం చేయలేరు. తప్పుడు పత్రాలు సృష్టించే అవకాశం ఉండదు. ఆ భూమి ఇతరుల పేర్ల మీదకు మారినా, మీకు తెలియకుండా మీ భూమి కోల్పోయినా, మీ ప్రమేయం లేకుండా రికార్డు మార్చినా ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తుంది. అంటే ప్రజల భూములకు ప్రభుత్వమే రక్షణ, భద్రత కల్పిస్తుంది.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చరిత్రమన దేశంలో భూ రికార్డులు, లావాదేవీలు ఇప్పటివి కావు. 1526 నుంచి 1707 వరకు పాలించిన మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత బ్రిటిషర్లు కొన్ని నియమాలు పెట్టి భూ రికార్డులు తయారు చేశారు. వాటినే ఇప్పటికీ మనం ఉపయోగిస్తున్నాం. 75 సంవత్సరాలుగా దేశంలో భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదు. వందల ఏళ్ల నాటి రికార్డులు కావడంతో ఇప్పటి పరిస్థితులకు సరిపోక భూ కబ్జాలు, తప్పుడు పత్రాలు సృష్టించడం, భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, సివిల్ కేసులు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి.* 1986– తొలిసారిగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఆలోచన చేసింది. దీనిపై అధ్యయనం కోసం ప్రొఫెసర్ డీసీ వాధ్వా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. సుదీర్ఘ అధ్యయనం చేశాక ఆయన 1989లో గ్యారెంటీయింగ్ టైటిల్ ఆఫ్ ల్యాండ్‌ను రూపొందించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు.* 2008ల్యాండ్ టైట్లింగ్ చట్టం మళ్లీ తెర మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ)ను ప్రవేశపెట్టింది. కెనడా, యూకే వంటి యూరోపియన్ దేశాల్లో అమలు చేస్తున్న టోరెన్స్ విధానాన్ని అమలు చేయాలని భావించింది. రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. కానీ అమలు చేయలేదు.* 2010అప్పటి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ల్యాండ్ టైటిల్ యాక్ట్–2010ని రూపొందించింది. విధి విధానాలు ఖరారు చేసి డ్రాఫ్ట్‌ను ఆన్లైన్లో పెట్టింది. రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయాలని ఆదేశించింది. కానీ అమలు జరగలేదు.* 2013యూపీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు చేసే ఉద్దేశంతో నిపుణుల కమిటీ నియమించింది. ఈ కమిటీ టైట్లింగ్ చట్టానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.* 2019ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను అమలు చేయాలని భావించింది. ఆ దిశగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రూపొందించింది. ఇందుకోసం నీతి ఆయోగ్ ముసాయిదా చట్టాన్ని రూపొందించి 2019 నవంబర్ 25న దాన్ని విడుదల చేసింది. ‘ది మహారాష్ట్ర టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్’ తరహాలో దీన్ని రూపొందించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో ఇదే చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచించి చట్టం గెజిట్ విడుదల చేసింది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్– ఇతను రిజిస్ట్రేషన్ల పత్రాలను పరిశీలించి సరిగా ఉన్నాయో లేదో చూస్తారు. తప్పుడు పత్రాలు ఉంటే వెంటనే తిరస్కరిస్తారు.– భూ యజమాని ఇచ్చిన సమాచారాన్ని బట్టి పబ్లిక్ నోటీసు ఇస్తారు. ఆ భూమిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని ప్రజలను కోరతారు. ఇందుకు నిర్దిష్ట సమయం ఇస్తారు. – ఈ నోటీసుపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని పరిశీలించి ఆ భూమి ఎవరిదో రికార్డుల ప్రకారం అక్కడే నిర్ధారిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన, చుట్టుపక్కల అభ్యంతరాలను స్వీకరిస్తారు.– ఆ భూమిపై ఎలాంటి వివాదాలూ లేకపోతే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే రిజిస్ట్రేషన్ నిలిపివేసి, పై అధికారులకు సమాచారం ఇస్తారు. అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లమని సూచిస్తారు.అప్పిలేట్ అథారిటీ– భూ లావాదేవీలు, సమస్యలను ఈ అథారిటీ పరిష్కరిస్తుంది. అప్పిలేట్ అధికారిగా జేసీ ఆ పైస్థాయి అధికారులు ఉంటారు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉండదు.– టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సేవలు సంతృప్తిగా లేకపోయినా, అన్యాయం జరిగిందని భావించినా, తప్పుడు వివరాలు ఎక్కించారని తెలిసినా అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు.– ఈ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను పర్యవేక్షిస్తుంది. వారి విధులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తుంది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తుంది.– టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి భూమి వివరాలను తప్పుగా ఎంట్రీ చేసినా, మీకు అన్యాయం జరిగినా అప్పిలేట్ అథారిటీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ల్యాండ్ రికార్డ్‌పై అనుమానం ఉంటే అథారిటీ ఆఫీసర్ సుమోటోగా ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశిస్తారు.– భూమి రికార్డులను మార్చే అధికారం కేవలం అప్పిలేట్ అథారిటీ లేదా కోర్టుకు మాత్రమే ఉంటుంది. టైట్లింగ్ రిజిస్ట్రేషన్ అధికారి ప్రమేయం ఏమాత్రం ఉండదు.కోర్టు..– అప్పిలేట్ అథారిటీ వద్ద అన్యాయం జరిగిందని భావిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చు. హైకోర్టులో మీ కేసును వెంటనే పరిష్కరించడానికి ఒక బెంచ్‌ను ఏర్పాటు చేస్తారు.– అప్పిలేట్ అథారిటీపై వచ్చిన కేసులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఈ బెంచ్ పరిష్కరిస్తుంది. తద్వారా సత్వర న్యాయం అందుతుంది.– హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్. దీన్ని అప్పిలేట్ అథారిటీ అమలు చేస్తుంది. ఈ తీర్పును మార్చే అధికారం అప్పిలేట్ అథారిటీ లేదా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు ఉండదు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రయోజనాలు– ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితోపాటు ఆ భూమి ఏ శాఖ పరిధిలోనిదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు.– ఇప్పటివరకు వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కారమవుతాయి. ఇప్పుడు జారీ చేసే రికార్డే ఫైనల్ రికార్డు. ఒకవేళ ఈ రికార్డులో మీకు అన్యాయం జరిగితే హైకోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక బెంచ్ ఉంటుంది.– మీ భూమికి ప్రభుత్వం గ్యారెంటీగా నిలవడం వల్ల భరోసా పెరుగుతుంది. పొరపాటున మీకు అన్యాయం జరిగితే ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిస్తుంది. – ఈ చట్టం వల్ల భూ యజమానులకు భరోసా దక్కుతుంది. ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో భూవివాదాలు 90 శాతం మేర కనుమరుగవుతాయి.– ఒక భూమికి క్లియర్ టైటిల్ ఉంటే అమ్మకాలు, కొనుగోళ్లు పెరుగుతాయి. శాశ్వత భూ హక్కు చట్టం ద్వారా బ్యాంకుల్లో సులువుగా రుణాలు పొందవచ్చు. ఈ చట్టం వల్ల జీడీపీ కూడా పెరుగుతుందని శాస్త్రీయ లెక్కలు చెబుతున్నాయి.– మీ భూమిని మరొకరు దౌర్జన్యంగా లాక్కునే అవకాశం ఉండదు. తప్పుడు పత్రాలు సృష్టించే మార్గాలు మూసుకుపోతాయి. మీ భూమిపై మరొకరి ఆజమాయిషీ ఉండదు.– ల్యాండ్ టైట్లింగ్ చట్టం వల్ల మీ భూములకు శాశ్వత హక్కులు లభిస్తాయి. ఎలాంటి కబ్జాలకు ఆస్కారం ఉండదు. ఈ చట్టం వల్ల సరిహద్దు వివాదాలు, రికార్డుల తగాదాలు, గొడవలు తగ్గుతాయి. – ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్, అప్పిలేట్ ఆఫీసర్‌గా ప్రభుత్వ అధికారులనే నియమిస్తారు. ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం కానీ, ప్రలోభాలు కానీ ఉండవు. ఒకవేళ మీకు అన్యాయం జరిగినట్లు భావిస్తే నేరుగా హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించవచ్చు. అక్కడి తీర్పు ఆధారంగా మీ రికార్డులు మీరు పొందవచ్చు. నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు.– భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. మీ భూమి రికార్డుల్లోకి ఎక్కించేటప్పుడు మీ గ్రామంలోకి వచ్చి బహిరంగ ప్రకటన ఇస్తారు. మీ భూమి చుట్టుపక్కల రైతులతో మాట్లాడతారు. ఎలాంటి వివాదాలు లేకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ వివాదం ఉంటే డిస్ప్యూట్ రిజిస్టర్ కింద నమోదు చేసి, ఈ కేసును పరిష్కరిస్తారు.– ప్రస్తుతం ఉన్న భూ రికార్డుల వల్ల భూములకు భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరు కబ్జా చేస్తారనే భయం ప్రజల్లో ఉంది. ఎవరు ఎక్కడి నుంచి తప్పుడు పత్రాలు సృష్టిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ సమస్యకు చెక్ పెడుతుంది. -
గాడిద మోత గురించి ఎపుడైనా ఆలోచించారా? ఇంట్రస్టింగ్ కథనం
మన దేశంలో మహారాష్ట్రలో గాడిదలను అధిక స్థాయిలో రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఇటుక బట్టీలలో ఇసుక రవాణాలో వీటి వీపు మీద 200 కేజీల వరకూ వేయడానికి వెనుకాడరు. దీని వల్ల గాడిదలు హింసకు గురవుతున్నాయి. రోగాల బారిన పడుతున్నాయి. అందుకే నాందేడ్‌కు చెందిన సిర్జనా నిజ్జర్ గాడిదల సంరక్షణ గురించి పోరాడుతోంది. గాడిద మోత నుంచి గాడిదలను తప్పించాలంటోంది. ఆమె పోరాటం గురించి...‘జనం దేనికైనా విరాళాలు ఇస్తారు గాని గాడిదలంటే ఇవ్వరు. కాని గాడిదలు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు’ అంటుంది సిర్జనా గుజ్జర్.ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివిన సిర్జనా జనం కోసం న్యాయస్థానాల్లో వాదించడం కంటే హింసకు గురవుతున్న మూగజీవాల కోసం సమాజంలో వాదించడం మేలు అనుకుంది. అందుకే ఆమె ఎఫ్.ఐ.ఏ.పి.ఓ. (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్)లో కీలకబాధ్యతలు నిర్వహిస్తోంది. వీధి శునకాలతో మొదలైన ఆమె సేవ నేడు గాడిదలకు చేరింది.నాందేడ్‌లో చూసి...మహరాష్ట్రలోని నాందేడ్ సిర్జనా తాతగారి ఊరు. కాలేజీ రోజుల్లో వేసవి సెలవుల్లో అక్కడకు వెళితే గాడిదలు విపరీతంగా కనిపించేవి. వాటిని చూసి సరదా పడదామనుకుంటుడగానే ఒళ్లంతా గాయాలతో, బరువులు మోయలేక అవస్థపడుతూ, తిండి లేక ఎముకలు తేలి ఉన్న వాటి రూ΄ాలు సిర్జనాకు ఎంతో బాధ కలిగించేవి. విద్యార్థిగా ఉండగానే వాటి కోసం చేతనైనంతలో హెల్త్ క్యాంప్స్ నిర్వహించేది. లా పూర్తయ్యాక ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటి సంరక్షణ కోసం పని చేస్తోంది.మూడు జిల్లాల్లో...‘మహరాష్ట్రలోని మూడు జిల్లాలు నాందేడ్, బీడ్, లాతూర్‌లలో గాడిదల సంఖ్య ఎంత లేదన్నా 6000 ఉంటుంది. ఇవి మహరాష్ట్రలో వాన కొరత ్ర΄ాంతాలు. జనం పేదరికంలో మగ్గుతుంటారు. ఈ మూడు జిల్లాల్లోనూ ఇటుక బట్టీలు విస్తారం. వాటిలో కూలీ చేస్తే రోజుకు వంద రూ΄ాయలు వస్తాయి. ఇటుకలు మోయడానికి వీరంతా గాడిదలను ఉపయోగిస్తారు. ఇటుకలను చేరవేయడానికి వాటి వీపు మీద 60 కేజీల నుంచి 100 కేజీల వరకూ బరువు మోయిస్తారు. ఈ ప్రాంతంలో పారే ఉపనది చంద్రభాగ ఒడ్డు నుంచి ఇసుక మోయిస్తారు. శక్తికి మించి బరువు మోయడం వల్ల గాడిదలు గాయాల బారిన పడతాయి. ఒక్కోసారి వాటి కాళ్లు విరుగుతాయి. కంటి సమస్యలు వస్తాయి. వాటికి వైద్యం చేయించే శక్తి పేదలకు ఉండదు. వాటిని అలాగే వదిలేస్తారు’ అంటుంది సిర్జనా.వానలు వస్తే పస్తే‘నాందేడ్, బీడ్, లాతూర్ జిల్లాల్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకూ నిర్విరామంగా ఇటుక బట్టీల పని జరుగుతుంది. అన్నాళ్లు గాడిదలకు పని ఉంటుంది. కొద్దోగొ΄్పో తిండి దొరుకుతుంది. కాని ఎప్పుడైతే తొలకరి మొదలవుతుందో ఇటుక బట్టీలు మూతపడతాయి. కూలీలు గాడిదలకు తిండి భారం అని రోడ్ల మీద వదిలేస్తారు. వాటికి తిండి దొరకదు. మంచినీరు దొరకదు. రోగాలతో బాధ పడతాయి. ముసలివైతే కబేళాకు అమ్మేస్తారు. వాటి కోసం ఈ మూడు జిల్లాలో సంరక్షణాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్.పి.సి.ఏ. (సొసైటీస్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్) బలోపేతం చేస్తున్నాం. గత పదేళ్లలో గాడిదల సంఖ్య కూడా బాగా తగ్గింది. వీటి సంఖ్య కాపాడుకుంటూ వీటితో మానవీయంగా వ్యవహరించే చైతన్యాన్ని కలిగించడమే నా లక్ష్యం’ అని తెలిపింది సిర్జనా. -
మధ్యాహ్నం వేళ..బయటకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్‌నాయక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్‌కు ఎగబాకడంతో వాతావరణశాఖ రాష్ట్రానికి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసిందన్నారు. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు. జాగ్రత్తలు... ► దాహం వేయకపోయినా వీలైనంత వరకు తగినంత నీరు తాగాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) తాగాలి. ఇంట్లో తయారు చేసిన నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి. ► ప్రయాణ సమయంలో వెంట నీటిని తీసుకెళ్లాలి. పుచ్చకాయ, మస్క్ మెలోన్, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు మరియు కూరగాయలు వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి. ► సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలు ధరించడం మంచిది. ► ఎండలో వెళ్లేప్పుడు గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని ధరించాలి. ► ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చప్పల్స్ వేసుకోవాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. బాగా వెంటిలేషన్, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► పగటిపూట కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచాలి. ► శిశువులు, చిన్న పిల్లలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, గర్భిణులు, మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటుతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు శారీరక శ్రమకు సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ► ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను నివారించాలి. ఇవి వాస్తవానికి ఎక్కువ శరీర ద్రవాన్ని కోల్పోయేలా చేస్తాయి. ► అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవద్దు, పాచిపోయిన ఆహారం తినవద్దు. ► పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలు, లేదా పెంపుడు జంతువులను వదిలివేయవద్దు. ► ప్రమాద సంకేతాలు ఉంటే ఏదైనా ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి వెంటనే వైద్యసాయం తీసుకోవాలి. ► గందరగోళం, ఆందోళన, చిరాకు, అటాక్సియా, మూర్ఛ, కోమా వంటి పరిస్థితులు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. ► శరీర ఉష్ణోగ్రత 104 ఫారిన్‌హీట్, తీవ్రమైన తలనొప్పి, కండరాల బలహీనత లేదా తిమ్మిరి, వికారం, వాంతులు, వేగవంతమైన హృదయ స్పందన, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ► ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్లు, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. -
పండ్లకు కవర్ల కవచం
సాక్షి, అమరావతి: మామిడి, జామ, దానిమ్మ, యాపిల్, సీతాఫలంతోపాటు ప్యాషన్, డ్రాగన్ ఫ్రూట్స్ వంటివాటికి కవర్లు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. పండ్ల నాణ్యతను పెంచి రైతులకు అధిక ధరను అందిస్తున్నాయి. ప్రస్తుతం కవర్లు తొడగని బంగినపల్లి మామిడి పండ్లు టన్నుకు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతుండగా... కవర్లు కట్టిన పండ్లకు రూ.80 వేల నుంచి రూ.1.10లక్షలు వరకు ధర పలుకుతోంది. కవర్లు తొడిగిన ఇతర పండ్లకు సైతం 30శాతం అదనపు ధర లభిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యాన పంటల నాణ్యతను పెంచడం ద్వారా ఎగుమతులను రెట్టింపు చేయాలన్న సంకల్పంతో పండ్లకు కవర్లు కట్టేందుకు రైతులకు హెక్టారుకు రూ.28వేలు చొప్పున సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ విధంగా ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో రూ.1.80 కోట్లు సబ్సిడీ సొమ్మును రైతులకు ఇచ్చింది. దీంతో యాపిల్, దానిమ్మ, ద్రాక్షతోపాటు అన్ని రకాల పండ్లకు కవర్లు కట్టేందుకు రైతులు ముందుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా సగటున 10కోట్ల కవర్లు దిగుమతి చేసుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఉద్యానపంటలు సాగుచేసే రైతులే 3కోట్లకుపైగా కవర్లు వినియోగిస్తున్నారు. తెగుళ్లు.. చీడపీడలకు చెక్ సాధారణంగా పిందె, కాయ మీద వర్షం లేదా మంచు పడితే వాటిని శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఆశించి మచ్చలు ఏర్పడతాయి. వాతావరణ పరిస్థితులను బట్టి మంగు, మసి, పండు ఈగ, తామర (త్రిప్స్), పెంకు పురుగులు దాడి చేస్తుంటాయి. వీటి నివారణ కోసం 10 నుంచి 15సార్లు మందుల పిచికారీ కోసం పంటను బట్టి ఎకరాకు రూ.10వేల నుంచి రూ.20వేలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో నాణ్యమైన దిగుబడి, గిట్టుబాటు ధర రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పండ్లకు కవర్లను అమర్చటం వల్ల తెగుళ్లు, చీడపీడలకు చెక్ పెట్టగలుగుతున్నారు. ఒక్కో కవర్ రూ.2 కాగా.. అమర్చేందుకు మరో రూపాయి ఖర్చవుతోంది. 10 నుంచి 15 ఏళ్ల వయసుగల తోటలకు 60 నుంచి 70శాతం, ముదురు తోటల్లో 30 నుంచి 40శాతం కాయలకు కవర్లు కట్టగలుగుతున్నారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న బంగినపల్లితోపాటు రసాలు, సువర్ణరేఖ తదితర మామిడి రకాలకు కవర్లను అమరుస్తున్నారు. రాయలసీమలో దానిమ్మ, జామ, డ్రాగన్ ఫ్రూట్, గోదావరి జిల్లాల్లో సీతాఫలం పండ్లకు కవర్లు కడుతున్నారు. నిమ్మకాయ సైజులోకి వచ్చిన తర్వాత కవర్లు కట్టి కనీసం 40 రోజులపాటు ఉంచితే కాయపై మచ్చలు ఏర్పడవు. వర్షం నీరు కాయకు తాకకుండా కిందికి జారిపోతుంది. ఈదురు గాలులవేళ కాయ రాలడం కూడా ఉండదు. 90 శాతం చీడపీడల నుంచి రక్షణ లభిస్తుంది. కాయల సైజు కూడా కనీసం 20–25 శాతం పెరుగుతుంది. నాణ్యంగా, ఆకర్షణీయంగా మంచి రంగుకొస్తాయి. తొలి కవర్ల తయారీ యూనిట్ ఏపీలోనే.. కవర్లు కట్టే విధానం ఏపీలో శ్రీకారం చుట్టగా.. ఇప్పుడు 12 రాష్ట్రాలకు విస్తరించింది. రాష్ట్రంలో 2వేల టన్నుల పండ్లకు కవర్లు కడుతున్నారు. రానున్న ఐదారేళ్లలో కనీసం లక్ష టన్నులకు కవర్లు కట్టించాలన్న సంకల్పంతో ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. నాలుగేళ్లుగా తైవాన్, చైనా నుంచి కవర్లను దిగుమతి చేసుకుంటుండగా.. దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ వేదికైంది. ఫ్రూట్ టెక్ సొల్యూషన్స్ సంస్థ రూ.10కోట్ల పెట్టుబడితో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి వద్ద దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ కంపెనీని ఏర్పాటు చేసింది. విదేశాల్లో మంచి డిమాండ్ కవర్లు కట్టిన కాయలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మా కంపెనీ ఏటా 50 టన్నుల వరకు యూరప్, యూకే, యూఎస్ఏ దేశాలకు ఎగుమతి చేస్తోంది. డిమాండ్‌కు తగినట్లుగా కవర్లు కట్టిన కాయలు దొరకడం లేదు. – ఉండవల్లి రాజు, యజమాని, మధురమ్స్ లిమిటెడ్ ఉద్యాన పంటలకు ఎంతో ఉపయోగం ఉద్యాన పంటలకు మంచి ధర లభించేందుకు ఫ్రూట్ కవర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ల తయారీ యూనిట్ ఆగిరిపల్లిలో ఏర్పాటుచేశాం. గతేడాది ఏప్రిల్‌లో ఉత్పత్తి ప్రారంభించాం. రోజుకు 2.50లక్షల కవర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ముందుకెళ్తున్నాం. వచ్చే ఐదేళ్లలో కనీసం లక్ష టన్నుల పండ్లకు కవర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. – శరణాల అప్పారావు, ఎండీ, ఫ్రూట్ టెక్ సొల్యూషన్స్ -
Supreme Court: చట్టసభల్లో అవినీతీ... విచారణార్హమే
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధులు రాజ్యాంగ రక్షణ మాటున దాక్కోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టసభల్లో ఓటేయడానికి, మాట్లాడడానికి లంచం తీసుకొనే ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారణ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో వారికి విచారణ నుంచి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందంటూ 1998లో జేఎంఎం లంచం కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలు వరించిన తీర్పును కొట్టేసింది! ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఏకగ్రీవంగా చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చట్టసభల్లోపల ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక అధికారాలను కట్టబెడుతున్న రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105(2), ఆరి్టకల్ 194(2) ఇలాంటి ఆరోపణలకు వర్తించబోవని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయంటూ ధర్మాసనం స్పష్టత ఇవ్వడం విశేషం. ‘‘పార్లమెంటులోనూ, శాసనమండలి, శాసనసభల్లోనూ, సంబంధిత కమిటీల్లోనూ ఏం అంశం మీదైనా సభ్యులు ఒత్తిళ్లకు అతీతంగా స్వేచ్ఛగా చర్చించగలిగే వాతావరణం నెలకొల్పడమే ఆరి్టకల్ 105, 194 ఉద్దేశం. అంతే తప్ప ఓటేయడానికి, సభలో ప్రసంగించడానికి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ నుంచి కాపాడటం కాదు. లేదంటే ఆ వాటి అసలు ఉద్దేశమే నెరవేరకుండా పోతుంది. లంచం తీసుకునే ప్రజాప్రతినిధి నేరానికి పాల్పడ్డట్టే. వారికి ఎలాంటి రక్షణా కలి్పంచలేం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధుల అవినీతి దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులనే పెకిలించి వేస్తుందంటూ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ ఆకాంక్షలను, ఆదర్శాలతో పాటు ప్రజా జీవితంలో విశ్వసనీయతను కూడా దెబ్బ తీస్తుందని ఆవేదన వెలిబుచి్చంది. ‘‘ఆరి్టకల్ 105(2), 194(2) కింద సభ్యుడు కోరే రక్షణ సదరు అంశంపై సభ సమష్టి పనితీరుకు, సభ్యునిగా తాను నెరవేర్చాల్సిన విధులకు పూర్తిగా అనుగుణంగా ఉండాల్సిందే’’ అంటూ రెండు కీలక నిబంధనలను తాజా తీర్పులో పొందుపరిచింది. వాటిని తృప్తి పరిచినప్పుడే సభలో వారు చేసే ప్రసంగానికి, వేసే ఓటుకు చట్టపరమైన విచారణ నుంచి రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ధర్మాసనం తరఫున సీజేఐ 135 పేజీల తీర్పు రాశారు. రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థకి ఓటేసేందుకు జేఎఎం ఎమ్మెల్యే సీతా సొరెన్ లంచం తీసుకున్నారన్న కేసుపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి 2023 అక్టోబరులో తీర్పు రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘ఒక ప్రజాప్రతినిధి చట్టసభలో ఓటేసేందుకు లంచం స్వీకరించిన, స్వీకరించేందుకు అంగీకరించిన క్షణంలోనే నేరానికి పాల్పడ్డట్టు లెక్క. అంతిమంగా ఓటేశారా, లేదా అన్నదానితో నిమిత్తం లేదు. లంచం స్వీకరించినప్పుడే నేరం జరిగిపోయింది’’ అని స్పష్టం చేసింది. ‘‘ఓటేయడానికి, మాట్లాడడానికి లంచం తీసుకుంటే రాజ్యాంగం కలి్పంచిన స్వేచ్ఛాయుత వాతావరణం సభలో కొనసాగకుండా పోతోంది. అలాంటి నేరాలకు సభ్యుడు రాజ్యాంగపరమైన మినహాయింపులు కోరజాలడు. ఆరి్టకల్ 105, 194 రక్షణలు వర్తించబోవు’’ అని స్పష్టం చేసింది. ‘‘ఇలాంటి సందర్భాల్లో కూడా సభ్యుడుకి విచారణ నుంచి మినహాయింపు ఇస్తున్న 1998 నాటి పీవీ నరసింహారావు కేసు తీర్పును పునఃపరిశీలించడం తప్పనిసరి. లేదంటే న్యాయస్థానం తప్పిదానికి పాల్పడ్డట్టే అవుతుంది’’ అని అభిప్రాయపడింది. కేసు పూర్వాపరాలివీ... జార్ఖండ్‌లో 2012లో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా ఓటేసేందుకు ఓ స్వతంత్ర అభ్యర్థి నుంచి జేఎంఎం ఎమ్మెల్యే సీతా సొరెన్ లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ తాను తమ పార్టీ అభ్యరి్థకే ఓటేశానని పోలింగ్ అనంతరం ఆమె తెలిపారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినా ఆమె సొంత పార్టీ అభ్యరి్థకే ఓటేశారు. అయితే సొరెన్ తన నుంచి లంచం తీసుకున్నారంటూ సదరు స్వతంత్ర అభ్యర్థి పోలీసుల్ని ఆశ్రయించడంతో ఆమెపై ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు క్రిమినల్ విచారణ చర్యలు చేపట్టారు. ఆరి్టకల్ 194(2) కింద తనకు రక్షణ ఉంటుంది గనుక ఈ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలంటూ సీతా సొరెన్ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ప్రతికూల నిర్ణయం రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2014 సెపె్టంబరులో కేసు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు వెళ్లింది. అనంతరం 2019 మార్చిలో నాటి సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. 1998 నాటి పీవీ నరసింహారావు కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం వెలువరించిన తీర్పును ఈ కేసు విచారణ సందర్భంగా జార్ఖండ్ హైకోర్టు ఉటంకించినందున విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని నిర్ణయించింది. తదనంతరం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. 1998 నాటి కేసులో సీతా సొరెన్ మామ శిబు సొరెన్‌కు ఇదే తరహా కేసులో ఊరట లభించిందని ఆమె తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ఆ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘‘1998 నాటి పీవీ కేసు తీర్పుతో విభేదిస్తున్నాం. ఆ తీర్పును కొట్టేస్తూ ఏడుగురు న్యాయమూర్తులం ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చాం’’ అని పేర్కొంది. ఏమిటీ పీవీ కేసు... 1993లో కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో శిబు సొరెన్ సహా ఐదుగురు జేఎంఎం ఎంపీలు లంచం తీసుకొని తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఆరి్టకల్ 105(2), ఆర్టికల్ 194(2) కింద సదరు సభ్యులకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఉంటుందంటూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో 1998లో తీర్పు వెలువరించింది. అది పరస్పర విరుద్ధ ఫలితాలకు దారితీసిందని సీజేఐ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ‘‘లంచం తీసుకుని తదనుగుణంగా ఓటేసిన సభ్యులకు విచారణ నుంచి ఆ తీర్పు రక్షణ కలి్పస్తోంది. కానీ లంచం తీసుకుని కూడా మనస్సాక్షి మేరకు స్వతంత్రంగా ఓటేసిన సభ్యులను శిక్షిస్తోంది. తద్వారా ఈ రెండు పరిస్థితుల మధ్య కృత్రిమ భేదాన్ని సృష్టించింది. ఆ తీర్పుతో విభేదిస్తూ ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వెలువరించిన మైనారిటీ తీర్పు దీన్ని ఎత్తి చూపింది కూడా’’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. -
శిశువు రక్షణ అందరి బాధ్యత! కానీ ఇప్పటికీ..
పుట్టిన బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని తల్లితో పాటు ఆ కుటుంబం కూడా తపిస్తుంటుంది. అయితే, ఈ విషయంలో సరైన అవగాహన ఉండటం లేదనేది వైద్యుల మాట. ఎందుకంటే, ఇప్పటికీ భారతదేశంలో నవజాత శిశు మరణాల రేటు ఆందోళనకరంగానే ఉంది. యూరప్‌లో 1990ల మొదట్లో శిశు మరణాల రేటును తగ్గించడానికి చర్యలు తీసుకోవడంలో, అవగాహన కల్పించేందుకు నవంబర్ 7ను శిశు రక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించాయి. ఆ తర్వాత అమెరికా, మిగతా దేశాలు కూడా ఈరోజు శిశు రక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. నవజాత శిశువులలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, శిశు మరణాల రేటును తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం తప్పనిసరి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి ప్రెగ్నెన్సీ అని తెలియగానే కాబోయే తల్లితోపాటు, ఆ కటుంబం కూడా జాగ్రత్త పడాలి. మన దగ్గర రక్తహీనత సమస్య, పోషకాహార లేమి ఎక్కువ. దీనివల్ల బేబీ గ్రోత్ మందగిస్తుంది. గర్భిణుల్లో హైపో థైరాయిడ్ సమస్య ఎక్కువ చూస్తున్నాం. ఐరన్ లోపం, రసాయనాల ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది. తల్లి ఆరోగ్యం సరిగాలేకపోతే లోపల బేబీ శరీర, మానసిక ఎదుగుదలపైన ప్రభావం చూపుతుంది. బీపీ, షుగర్.. వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు ముందునుంచే వైద్యులు చెప్పిన టైమ్‌కి వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. తల్లి మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. అందుకు, సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా తీసుకోవడం ముఖ్యం. వైద్యులు చెప్పిన సూచనలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే కుటుంబం అంతా భవిష్యత్తులో రాబోయే సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. – డాక్టర్ శిరీషా రెడ్డి, గైనకాలజిస్ట్, తార్నాక, హైదరాబాద్ ప్రమాదాలను ముందే పసిగట్టాలి నెలలు నిండకుండా పుట్టడం, బరువు తక్కువుండి పుట్టడం, ఇన్ఫెక్షన్స్, పోషకాహార లోపం వల్ల శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఏడాదిలోపు పిల్లలను నవజాత శిశువులు అంటారు. ఈ సమయంలో సులువుగా ఇన్ఫెక్షన్స్ సోకుతుంటాయి. అందుకే, వీరిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఏడాదిలోపు వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించగలిగితే ఆ తర్వాత వచ్చే సమస్యలను సులువుగా అధిగమించవచ్చు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే పట్టడం అవసరం, ఆరోగ్యం కూడా. ఆ తర్వాత వారికి ఇచ్చే పోషకాహారం చాలా ముఖ్యం. దీంతోపాటు వ్యాక్సినేషన్ చేయించడం ముఖ్యం. ఎందుకంటే, నిమోనియా, డయేరియా వల్ల మరణాలు ఎక్కువ. అందుకే, ప్రభుత్వం కూడా డయేరియా, న్యూమోనియా.. వ్యాక్సినేషన్ జాబితాలో చేర్చింది. పిల్లల వైద్యనిపుణుల పర్యవేక్షణ చాలా అవసరం. కొన్ని గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సౌకర్యం అందుబాటులో లేకపోవచ్చు. కానీ, రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది ముఖ్యం అని తెలుసుకోవాలి. ఇక నవజాత శిశువులకు దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. మంచంపై నుంచి కింద పడటం వంటివి. చిన్న దెబ్బలు కూడా పెద్దవి కావచ్చు. మదర్ పోస్ట్ ప్యాటర్న్ డిప్రెషన్లో ఉన్నప్పుడు బిడ్డను చూసుకునేవారుండరు. ఇలాంటప్పుడు కూడా శిశువు సంరక్షణ ప్రమాదంలో పడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కుటుంబం జాగ్రత్త వహించాలి. – ప్రియాంకరెడ్డి, పిడియాట్రిషియన్, మాదాపూర్, హైదరాబాద్ ఒకరి ద్వారా మరొకరికి సూచనలు మేం గర్భిణులపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. ఎందుకంటే, వారి ఆరోగ్యం బాగుంటేనే పుట్టబోయే బిడ్డ బాగుంటుంది. ఆరోగ్యం, పౌష్టికాహారంతో పాటు ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లేవరకు ఎలా చూసుకోవాలో ఆమెకే కాదు, ఇంటిల్లిపాదికీ కౌన్సెలింగ్ ఇస్తాం. ఎంత చెప్పినా వినిపించుకోని వారు కొందరుంటారు. అయినా వారిని వదలకుండా తల్లి అయిన వారితో కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. చార్ట్ ప్రకారం వాళ్లు తీసుకోవాల్సిన పోషకాహారం, మందులు కూడా అంగన్వాడీ నుంచి ఇస్తుంటాం. చంటిపిల్లల విషయంలో మేం తగు జాగ్రత్తలు చెప్పడంతో పాటు, ఏ సమయానికి వ్యాక్సిన్లు వేయించాలి, ఎలా చూసుకోవాలి అనే విషయాలపైన తల్లులకు ఒకరి ద్వారా మరొకరు సూచనలు చేసుకునేలా కౌన్సెలింగ్ చేస్తుంటాం. దీనివల్ల నవజాత శిశు మరణాల రేటు తగ్గడమే కాకుండా శిశువులు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. – వెంకటరమణ, అంగన్వాడీ టీచర్, ఖాసింపేట, సూర్యపేట జిల్లా (చదవండి: మత్తు కోసం పాము విషమా?..అందుకోసం పార్టీల్లో..) -
చలికాలం చర్మం పెళుసుబారకుండా ఉండాలంటే..!
వేకువ జాముకు చలి తొంగిచూస్తోంది. కిటికీలో నుంచి దొంగలా గదిలో దూరుతోంది. చల్లగా ఒంటికి హాయినిస్తుంది. కానీ చర్మాన్ని పెళుసుబారుస్తుంది కూడా. అందుకే ఆలస్యంగా చర్మసంరక్షణ మొదలవ్వాలి. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాయాలి. గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇది హాట్‌థెరపీ. రోజుకొకసారి ఉదయం స్నానం చేయడానికి ముందు కానీ రాత్రి పడుకునే ముందుకానీ చేయవచ్చు. ఒక కోడిగుడ్డు సొనలో, టీ స్పూన్ కమలారసం, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది పొడిచర్మానికి వేయాల్సిన ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడ నలుపు కూడా వదులుతుంది. పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. ఆయిల్‌ను ఒంటికి రాసి మర్దన చేయాలి. ఫేస్‌ప్యాక్‌లకు బదులుగా స్వచ్ఛమైన ఆముదం ఒంటికి రాసి మర్దన చేసుకోవాలి. ఆముదం వల్ల చర్మం మృదువుగా మారడంతోపాటు అనేక చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. (చదవండి: అలసిన కళ్లకు రిలీఫే ఈ ఐ మసాజర్!) -
డిపాజిటర్ల డబ్బు పరిరక్షణే పవిత్ర విధి
ముంబై: డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం బ్యాంకర్‌కు పవిత్రమైన విధి అని, ఇది మతపరమైన స్థలాన్ని సందర్శించడం కంటే చాలా ముఖ్యమైనదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. చిన్న పొదుపుదారులు, మధ్యతరగతి, పదవీ విరమణ చేసిన వారి నుండి సమీకరించిన డిపాజిట్లపై మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ డబ్బు పరిరక్షణే ప్రధాన పవిత్ర విధిగా భావించాలని ఆయన అన్నారు. ‘‘డిపాజిటర్ల డబ్బును రక్షించడం బ్యాంకు అతి ముఖ్యమైన బాధ్యత. ఇది పవిత్రమైన విధి. గుడి లేదా మసీదు లేదా గురుద్వారాకు నమస్కరించడం కంటే.. డిపాజిటర్ల సొమ్మును పరిరక్షించడం ఎంతో పవిత్రమైన విధి’’ దాస్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలోని ప్రతి ఒక్కరిపై ఉన్న ‘‘అతిపెద్ద బాధ్యత ఇది’’ అని ఇక్కడ నిర్వహించిన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు (యుసీబీ) డైరెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. దాస్ ఆగస్టు 30వ తేదీన ఈ మేరకు చేసిన ఒక ప్రసంగాన్ని ఆర్బీఐ సోమవారం యూట్యూబ్‌లో అప్డేట్ చేసింది. ఆయన ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు... ► డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి అన్ని బ్యాంకులతో కలిసి పనిచేయడం రిజర్వ్ బ్యాంక్ బాధ్యత. అందువల్ల ఈ దిశలో సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. నిబంధనలు, పర్యవేక్షణ చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. ► ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే... సహకార బ్యాంకింగ్ రంగంలో సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా డిపాజిటర్ సొమ్ము నిలిచిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో చాలా వరకూ నిర్వహణలో అక్రమాలే ప్రధాన కారణం. ఇక్కడ మనం యూసీబీ.. పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్‌ను ప్రస్తావించుకోవచ్చు. ► 1,500 పైగా సంస్థలపై మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణ చేయాలన్న ప్రధాన దృక్పథంతో యూసీబీల కోసం ఆర్బీఐ నాలుగు అంచెల పర్యవేక్షణా యంత్రాంగాన్ని రూపొందించింది. ► ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో యూసీబీలు ముఖ్యమైన భాగం. ► యూసీబీలపై ఆర్బీఐ పర్యవేక్షణను పటిష్టం చేయడాన్ని... ఆయా సంస్థలు తమ వృద్ధికి ఆటంకాలు కలిగించే ప్రయత్నంగా చూడవద్దు. యూసీబీల మొండిబకాయిలపై హెచ్చరిక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులలో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (జీఎన్‌పీఏ) 8.7 శాతంగా ఉన్న విషయాన్ని గవర్నర్ ప్రస్తావిస్తూ, దీనిపట్ల సెంట్రల్ బ్యాంక్ ‘‘సౌఖ్యంగా లేదు’’ అని స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల జీపీఎన్ఏలు 2023 మార్చిలో దశాబ్దపు అత్యుత్తమ స్థాయి 3.9 శాతానికి చేరుకున్నాయని, మరింత మెరుగుపడతాయన్న అంచనాలూ ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. ఎన్పీఏల సమస్యను మెరుగుపరచడానికి యూసీబీలూ తగిన కృషి చేయాలని కోరారు. అలాగే యూసీబీలు పాలనా ప్రమాణాలను మెరుగుపరచాలని, డైరెక్టర్లు, అధికారుల వంటి బ్యాంకు నిర్వహణా సంబంధ పార్టీ లావాదేవీలను నివారించాలని, రుణ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు. యూసీబీలు ఇటీవలి కాలంలో బహుళ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని దాస్ పేర్కొన్నారు. మున్ముందు యూసీబీ సెగ్మెంట్.. డిజిటల్, ఫిన్‌టెక్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, సూక్ష్మ రుణదాతలు వంటి టెక్–అవగాహన సంస్థల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొననుందని, అందువల్ల సాంకేతికతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని దాస్ చెప్పారు. అయితే ఈ రంగంలో కొన్ని బ్యాంకులు తగిన విధంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. -
డేటా భద్రత నిబంధనలు: తేడా వస్తే రూ. 250 కోట్ల వరకు జరిమానా
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్ట నిబంధనలకు అనుగుణంగా తమ సిస్టమ్స్‌ను సరిచేసు కునేందుకు వ్యాపార సంస్థలకు కొంత సమయం ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇది సుమారు ఏడాది పాటు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలతో సమావేశం సందర్భంగా ఆయన విలేకరులకు చెప్పారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్ అథారిటీ అయిన డేటా ప్రొటెక్షన్ బోర్డు (డీపీబీ)ని వచ్చే 30 రోజుల్లోగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి తెలిపారు. డేటా భద్రత బోర్డుతో పాటు మార్గదర్శకాలు మొదలైనవన్నీ నెల రోజుల్లోగా సిద్ధం కాగలవని మంత్రి తెలిపారు. మెటా, లెనొవొ, డెల్, నెట్‌ఫ్లిక్స్ సహా పలు కంపెనీలకు చెందిన 125 మంది పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పౌరుల వ్యక్తిగత డేటాను ఆన్లైన్ వేదికలు దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసే దిశగా డేటా భద్రత చట్టాన్ని రూపొందించారు. దీనికవసరమైన 25 నియమాలలో చాలా వరకు ముసాయిదా రూపొందించబడి సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు గతంలో చెప్పారు. సమ్మతి ఆధారిత యంత్రాంగం ద్వారా వినియోగదారుల డేటాను సేకరించడం కంపెనీలకు చట్టం తప్పనిసరి చేసింది, అయితే కొన్ని చట్టబద్ధమైన ఉపయోగాల కోసం, చట్టం కొన్ని సడలింపులను అందిస్తుంది. అమల్లో విఫలమైన సంస్థలకు రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చని చట్టంలో ప్రతిపాదనలు ఉన్నాయి. అంతేకాదు 500 కోట్లకు పెంచవచ్చని కూడా పేర్కొన్నారు. -
సంక్షోభం: చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే సంచలనం
China Evergrande Group bankruptcy protection: చైనీస్ ప్రాపర్టీ దిగ్గజం ఎవర్‌గ్రాండే గ్రూప్ సంచనల విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న చైనా రియల్టీ రంగాన్ని ప్రతిబింబిస్తూ దేశంలోని రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ దివాలా తీసినట్టు ప్రకటించింది. ఈ మేరకున్యూయార్క్ కోర్టులో దివాలా కోసం దాఖలు చేసింది. చైనాలో అగ్రశ్రేణి కంపెనీలు నిర్మాణాలను పూర్తి చేయడానికి డబ్బు కోసం కష్టపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆందోళన రేపింది. (అదానీలో పెట్టుబడుల జోష్: అబుదాబి ఆయిల్ మేజర్ వేల కోట్ల ప్లాన్!) ప్రపంచంలోనే అత్యధికంగా అప్పుల్లో కూరుకుపోయిన ప్రాపర్టీ డెవలపర్ ఎవర్‌గ్రాండే న్యూయార్క్ కోర్టులో చాప్టర్-15 కింద దివాలా రక్షణను దాఖలు చేసింది. వివిధ బ్యాంకులతో పలు మల్టీ మిలియన్ డాలర్ల రుణాల కోసం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అమెరికా తన ఆస్తులను రక్షించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎవర్‌గ్రాండే ప్రస్తుత అప్పులు విలువ 300 బిలియన్ డాలర్లకు పైమాటే. 2021లో కంపెనీల రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థలో భారీ ఆస్తి సంక్షోభాన్ని రేకెత్తించింది. పెరుగుతున్న గృహాల ధరలను అదుపు చేసే ప్రయత్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికంగా రుణాలు తీసుకోవడంపై చైనా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన తర్వాత సంస్థ డిఫాల్ట్ వచ్చింది. (అదిరిపోయే లుక్‌లో మహీంద్ర థార్ ఎలక్ట్రిక్ వెర్షన్) ఈ పరిణామాల నేపథ్యంలో 2022 మార్చి నుంచి కంపెనీ హాంకాంగ్-లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్ నిలిచి పోయింది. అంతేకాదు గతరెండేళ్లలో కంపెనీ ఏకంగా 80 బిలియన్ డాలర్లు నష్ట పోయినట్లు స్వయంగాఎవర్గ్రాండే జూలైలో నివేదించిన సంగతి తెలిసిందే. కంపెనీ వెబ్సైట్ ప్రకారం, ఎవర్‌గ్రాండే 280 కంటే ఎక్కువ నగరాల్లో 1,300 లకు పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది.మరోవైపు చైనా ఆర్థిక వృద్ధి మందగమనంతో ఎగుమతులు కూడా క్షీణించాయి. చైనా యువత నిరుద్యోగం రేటు కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. డాలరు మారకంలో కరెన్సీ పతనమవుతోంది. దీంతో ఇటీవల ద్రవ్యోల్బణాన్ని కట్టి చేసే చర్యల్లో భాగంగా చైనా కేంద్ర బ్యాంకు అనూహ్యంగా కీలక వడ్డీరేట్లను రికార్డు స్థాయికి తగ్గించడం ప్రపంచ దేశాల ఆర్థిక నిపుణులను ఆందోళనలో పడేసింది. -
గ్రహ శకలాలతో భూమికి సౌర కవచం!
వాషింగ్టన్: భూగోళంపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భూమిపై జీవులు భద్రంగా మనుగడ సాగించే పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. దీని పరిష్కారానికి నడుం బిగించారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి సౌర కవచం(సోలార్ షీల్డ్)తో పుడమికి రక్షణ కలి్పంచవచ్చంటున్నారు. దీనికి స్పేస్ బేస్డ్ సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ షీల్డ్ (ఎస్ఆర్ఎం) అని పేరుపెట్టారు. అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ హవాయ్’ ఈ ప్రయోగాన్ని తెరపైకి తెచి్చంది. భూమికి, సూర్యుడికి మధ్య భారీ పరిమాణంలోని గ్రహ శకలాలను గొడుగులా వాడి సూర్యకాంతి నేరుగా భూమిని తాకకుండా నిరోధించవచ్చని తేల్చారు. అయితే, సౌర కవచం కోసం గ్రహ శకలాలను (ఆస్టరాయిడ్లు) ఒకచోటుకి చేర్చడం పెద్ద సవాలేనని సైంటిస్టులు అంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలను ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (పీఎన్ఏఎస్)’లో ఇటీవలే ప్రచురించారు. -
లోక్‌సభలో పాసైన డేటా పరిరక్షణ బిల్లు
ఢిల్లీ: దేశ పౌరుల డిజిటల్హక్కుల్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు.. లోక్‌సభలో ఎట్టకేలకు పాసైంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఆగస్టు 3న లోక్‌సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ‘గోప్యత’ దెబ్బతింటుందన్న విపక్షాల అనుమాన ఆందోళనల నడుమే ఇవాళ బిల్లు పాస్ కావడం గమనార్హం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లు ప్రకారం.. ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా రూ.50 కోట్ల నుంచి గరిష్టంగా 250 కోట్ల రూపాయల జరిమానా విధిస్తారని కేంద్ర ఐటీశాఖ మంత్రి(సహాయ) రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ చట్టం అమలు కోసం డేటా ప్రొటెక్షన్ బోర్డు ఆఫ్‌ఇండియాను ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లులోని నిబంధనం ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బోర్డు రిఫరెన్స్‌తో కేంద్రం ఏదైనా సమాచారాన్ని బ్లాక్ చేసేందుకు పర్మిషన్ ఉంటుంది. ఆన్లైన్ వేదికల్లో.. వ్యక్తుల నుంచి సమాచార దుర్వినియోగం విపరీతంగా జరుగుతుంటుంది. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం గనుక పొందితే.. ప్రతి పౌరుడి డిజిటల్ హక్కులకు రక్షణ లభిస్తుంది అని కేంద్రం చెబుతోంది. కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లుతో సోషల్ మీడియా కంపెనీల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఈ బిల్లు భారతదేశంలోని డిజిటల్ వ్యక్తిగత డేటాను ఆన్లైన్లో సేకరించిన.. ఆఫ్‌లైన్‌లో సేకరించి డిజిటలైజ్ చేయబడిన వాటి ప్రాసెసింగ్‌కు వర్తిస్తుంది. ► వ్యక్తిగత డేటా ఆ వ్యక్తి సమ్మతితో చట్టబద్ధమైన ప్రయోజనం కోసం మాత్రమే ప్రాసెస్ చేయబడుతుంది. వినియోగదారుల డేటాను ఉపయోగించడానికి కంపెనీలు ఇప్పుడు అనుమతి తీసుకోవాలి. ► డేటా విశ్వసనీయులు డేటా ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి, డేటాను సురక్షితంగా ఉంచడానికి, దాని ప్రయోజనం అందించిన తర్వాత డేటాను తొలగించడానికి బాధ్యత వహిస్తారు. ► సమాచారాన్ని స్వీకరించే, సరిదిద్దే, తొలగించే హక్కు, ఫిర్యాదులను పరిష్కరించే హక్కుతో సహా వ్యక్తులకు ఈ బిల్లు నిర్దిష్ట హక్కులను అందిస్తుంది. ► రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్, నేరాల నిరోధం వంటి కారణాలతో బిల్లులోని నిబంధనలను అమలు చేయడం నుంచి ప్రభుత్వ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వవచ్చు. ఇదీ చదవండి: కుటుంబ పాలన.. క్విట్ ఇండియా -
parliament session: డేటా దుర్వినియోగం చేస్తే రూ.250 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: పౌరుల డిజిటల్ హక్కులు, వ్యక్తిగత సమాచార భద్రతకు ఉద్దేశించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుని ద్రవ్య బిల్లుగా తీసుకువచ్చారన్న ఆరోపణల్ని మంత్రి అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు. ఇది సాధారణ బిల్లేనని స్పష్టం చేశారు. పౌరుల వ్యక్తిగత గోప్యతతో ప్రమేయమున్న ఈ బిల్లును హడావుడి ఆమోదించవద్దని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి అన్నారు. గత ఏడాది ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఉంచిన ముసాయిదా బిల్లుపై వచి్చన సలహాలు సూచనలతో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వినియోగదారుల డిజిటల్ డేటాని దుర్వినియోగం చేసేవారిపై కేంద్రం కొరడా ఝళిపించింది. అలాంటి సంస్థలపై రూ.50 నుంచి రూ.250 కోట్ల వరకు జరిమానా విధించనుంది. అంతేకాకుండా ఈ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా డేటా ప్రొటక్షన్ బోర్డుని ఏర్పాటు చేయనున్నట్టుగా బిల్లులో పేర్కొంది. -
డేటా బిల్లుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు (డీపీడీపీ)కి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. జూలై 20 నుంచి ఆగస్టు 11 దాకా జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఈ బిల్లును ప్రవేశపెడతారని అధికార వర్గాల సమాచారం. గోప్యత హక్కులో భాగంగా పౌరుల డేటా సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ విషయంలో ఇంటర్నెట్ కంపెనీలు, మొబైల్ యాప్స్, వ్యాపార సంస్థల్లో జవాబుదారీతనం పెంచడం దీని లక్ష్యం. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గత ఆగస్టులో సుప్రీంకోర్టు ప్రకటించిన అనంతరం డేటా పరిరక్షణ బిల్లు తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు డేటా సేకరణకు ముందు పౌరుల అనుమతి తీసుకోవాలి. -
ఇలా చేస్తే పిడుగులు పడవు..విద్యుత్ తీగల కింద.. టవర్ల దగ్గరలో ఉండొద్దు
సాక్షి, అమరావతి: భూమి, మేఘాల మధ్య విద్యుత్ విడుదల వల్ల మెరుపులు ఏర్పడి.. భూమి మీదకు అవి పిడుగులా ప్రసరిస్తుంటాయి. వానలు కురుస్తున్నప్పుడు పిడుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనీస జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుల బారినుంచి సునాయాసంగా రక్షించుకోవచ్చంటున్నారు. విద్యుత్ భద్రత డైరెక్టర్, ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి జి.విజయలక్ష్మి. ప్రతి ఇంటిపైనా ‘పిడుగు వాహకం’ అమర్చాలని ఆమె స్పష్టం చేశారు. వివరాలు ఆమె మాటల్లోనే.. నిటారుగా నిలబడొద్దు బెంజిమిన్ ఫ్రాంక్లిన్ 1752లో విద్యుత్, మెరుపుల మధ్య సంబంధాన్ని నిరూపించినప్పటి నుంచీ, వాటిని విద్యుత్‌గా మార్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. పిడుగు నుంచి వచ్చే విద్యుత్ నిల్వ చేయగలిగితే ఒక పిడుగు నుంచి 10 కోట్ల వాట్ల విద్యుత్ పొందవచ్చు. అంత శక్తి వాటిలో ఉంటుంది కాబట్టి కేవలం 50 మైక్రో సెకన్లలో పిడుగు ప్రభావం చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 100 పిడుగులు పడుతున్నాయనేది ఓ అంచనా. కాబట్టి పిడుగుల నుంచి రక్షణ పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు, కారు, బస్సు, రైలులో ఉన్నప్పుడు పిడుగుపాటు నుంచి రక్షణ లభిస్తుంది. పిడుగుల శబ్దం వినిపిస్తూ.. వర్షం పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కిందకి పోకూడదు. పిడుగు ఎత్తైన తాటి, కొబ్బరి వంటి చెట్లను వాహకంగా చేసుకుంటుంది. ఎత్తైనవి లేనిచోట ఇతర చెట్లపై పడుతుంది. చెట్టు మీద పిడుగు పడ్డప్పుడు చెట్టు చుట్టూ తడి నేలపై 50 మీటర్ల వరకు కరెంట్ ప్రసరిస్తుంది. తడిసిన పూరి గుడిసెల పైన, గడ్డివాములపైన కూడా పిడుగు పడుతుంది. వాన పడేటప్పుడు చెట్టు కిందకు, ఇలాంటి ప్రదేశాలకు వెళ్లకూడదు. చుట్టూ 500 మీటర్ల వరకు చెట్లు లేనప్పుడు, చెలకల వద్ద నల్లని దట్టమైన మేఘాలు (భూమి నుంచి 2 కి.మీ. ఎత్తు లోపల ఉండే క్యుములోనింబస్ మేఘాలు) వర్షించినప్పుడు నడుస్తున్నా, నిటారుగా నిల్చున్నా పిడుగు మనల్నే వాహకంగా చేసుకుంటుంది. తడిస్తే తడిచామని కింద పాదాలు మాత్రమే నేలకు తాకేలా, ఒకరికొకరు 100 అడుగుల దూరంగా కూర్చుంటే పిడుగుపాటు నుంచి తప్పించుకోవచ్చు. అలాంటి సమయంలో గడ్డపార లాంటి లోహపు వస్తువులు దగ్గర లేకుండా చూసుకోవాలి. పిడుగుల హెచ్చరికలు ఉన్నపుడు ఆరుబయట ఉండకూడదు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో భవనాలలో, సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవాలి. ఉరుముల శబ్దం వినిపించిన వెంటనే పిడుగు పడే అవకాశం ఉందని గమనించాలి. అలాగని వెంటనే చెట్టు కిందకు, పొలాల్లోకి, ఆరుబయటకు వెళ్లకూడదు. ‘లైట్నింగ్ కండక్టర్’ కాపాడుతుంది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్, 2010లోని 74వ నియమం ప్రకారం.. ప్రతి భవన నిర్మాణంలో పిడుగుపాటు నుంచి రక్షణ ఏర్పాట్లు ఉండాలి. ఎత్తైన భవనాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, విద్యుత్ ఉత్పాదక ప్రాంతాలు, సరఫరా టవర్లు, పంపిణీ కేంద్రాలు, సమాచారానికి వినియోగించే టవర్లకు పిడుగు వాహకం (లైట్నింగ్ కండక్టర్) అమర్చుకోవాలి. ఆట స్థలాలకు సమీపంలోని ఎత్తైన ప్రదేశంలో పిడుగు వాహకం అమర్చటం ద్వారా మైదానాల్లో ఆడుకునే చిన్నారులను పిడుగుల నుంచి రక్షించవచ్చు. 11 కేవీ, 33 కేవీ విద్యుత్ తీగల కింద, 132/220 కేవీ సరఫరా టవర్ల దగ్గర్లో నిలబడకూడదు. పెద్దపెద్ద చెట్ల కింద, సముద్రపు ఒడ్డున నిలబడొద్దు. విద్యుత్ వాడకం ఉన్న ప్రతిచోట ఎర్తింగ్ సిస్టం పాటించాలి. పిడుగుపడే సమయంలో విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించడం కూడా మంచిది కాదు. చదవండి: సోషల్ మీడియా 'కట్'.. వినోదానికే 'నెట్'..నివేదికలో ఆసక్తికర విషయాలు.. -
ట్రూకాలర్‌లో అదిరిపోయే ఫీచర్..
స్మార్ట్ ఫోన్ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఎస్సెమ్మెస్ రక్షణ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మోసపూరిత మెసేజ్‌లపై అవగాహన లేని యూజర్లకు ఈ రక్షణ ఫీచర్ ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. ట్రూకాలర్ అంచనా ప్రకారం 100 మిలియన్లకుపైగా యూజర్లు ఆ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. వారు గత మూడు నెలల్లో కనీసం ఒక మోసపూరిత ఎస్సెమ్మెస్ అందుకున్నారు. ఈ మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు ప్రధానంగా విద్యుత్ బిల్లు చెల్లింపులు, బ్యాంకులు, ఉద్యోగ ఆఫర్లు, కేవైసీ సంబంధిత, లోన్లు, ఛారిటీ, లాటరీ వంటి అంశాలకు సంబంధించినవి వస్తున్నాయి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! ట్రూకాలర్ ప్రవేశపెట్టిన ఈ ఎస్సెమ్మెస్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఫోన్లకు వచ్చే మోసపూరిత సందేశాలను తెలివిగా గుర్తించగలదు. యూజర్ రిపోర్ట్లు లేకుండానే ట్రూకాలర్స్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఫ్రాడ్ ఎస్సెమ్మెస్‌లను గుర్తిస్తుంది. కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. ట్రూకాలర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. యూజర్ ఫోన్‌కు మోసపూరిత ఎస్సెమ్మెస్ వచ్చినప్పుడు కొత్త ఫీచర్ ఆధారంగా ట్రూకాలర్ యాప్ ఎరుపు రంగు నోటిఫికేషన్ చూపుతుంది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ నోటిఫికేషన్ మాన్యువల్‌గా తీసేసే వరకు స్క్రీన్‌పై ఉంటుంది. ఒకవేళ యాజర్ పొరపాటున ఆ ఫ్రాడ్ మెసేజ్‌ను ఓపెన్ చేసినా అందులోని లింక్‌లను ట్రూకాలర్ డిసేబుల్ చేస్తుంది. అయితే ఆ మెసేజ్ సురక్షితమే అని యూజర్ స్పష్టంగా గుర్తించినట్లయితే మాత్రమే ఆ ఎస్సెమ్మెస్‌ను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ -
పర్యావరణమే ప్రాణం!
పర్యావరణ పరిరక్షణ కోసం నల్లగొండ పట్టణానికి చెందిన మిట్టపల్లి సురేశ్ గుప్తా విశేష కృషి చేస్తున్నారు. ఉద్యోగాన్ని వదిలేసి, కుటుంబాన్ని పక్కన పెట్టి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి క్షణం పని చేస్తున్నారు. ఉదయం 5 గంటలకు లేచి, మార్కెట్‌కు వెళ్లి, అక్కడ ప్లాస్టిక్ కవర్లతో ఎవరు ఎదురుపడినా, వారికి ఓ జూట్ బ్యాగ్/క్లాత్ సంచి ఇవ్వడంతో ఆయన దిన చర్య ప్రారంభం అవుతుంది. ఇక పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే వారిని శాలువాతో సత్కరించడం ఆయన ప్రత్యేకత. అంతేకాదు భూగర్భ జలాల పెంపునకు సొంతంగా ఇంకుడు గుంతలు తవ్వించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, చేనేత వస్త్రాల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గుప్తా పని చేస్తున్నారు. తాను కూడా చేనేత బనియన్, దోవతి ధరించడం ప్రారంభించారు. ఇవన్నీ చేస్తున్న ఆయనేం కోటీశ్వరుడు కాదు. ఉద్యోగాలు చేయగా వచ్చిన డబ్బునంతా లక్ష్యం కోసమే ఖర్చు చేశారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను భార్యకు అప్పగించి.. దాతలను వెతికి, సమయానికి దొరక్కపోతే అప్పు చేసి మరీ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మలుపు తిప్పిన సంఘటన 2008లో ఒక ఆవు చెత్త కుప్పలో వేసిన ఆహార పదార్థాలతో పాటు ప్లాస్టిక్ కవర్లను తినడం గుప్తా చూశారు. ఆ ఆవుకు ఆపరేషన్ చేసినప్పుడు కడుపు నిండా ప్లాస్టిక్ కవర్లు ఉండటం చూసి చలించిపోయారు. ప్లాస్టిక్ వల్ల జీవరాశికి ప్రమాదం పొంచి ఉందని అప్పుడే గ్రహించారు. దాని వాడకాన్ని తాను నిషేధించలేను కాబట్టి కనీసం వినియోగాన్ని అయినా తగ్గించేందుకు తనవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. నాటి నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటూ ఎక్కడ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు జరిగినా, పండుగలు జరిగినా అక్కడికి వెళ్లి ప్లాస్టిక్‌ను వాడొద్దని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఉద్యోగాన్ని వదిలేసి.. 1999లో నల్లగొండలో ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్న సురేశ్ గుప్తా వద్దకు ఏపీఆర్‌ఎల్‌పీ ప్రాజెక్టు ఉద్యోగులు వస్తుండేవారు. తర్వాత తమ ప్రాజెక్టులో పని చేసేవారు కావాలని వారు గుప్తాను తీసుకున్నారు. కొన్ని రోజుల అనంతరం హైదరాబాద్‌కు రావాలని చెప్పడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత నల్లగొండలోనే ఒకటి రెండు ఉద్యోగాలతో పాటు 2013 నుంచి 2017 వరుకునల్లగొండ సుధా బ్యాంకు మేనేజర్‌గా పని చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తూనే ఈ ఉద్యోగాలన్నీ చేశారు. అయితే తాను చేస్తున్నది సరిపోదని, ఈ దిశగా మరింత కృషి చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి, పూర్తిగా పర్యావరణ పరిరక్షణకే జీవితాన్ని అంకితం చేశారు. నీటి పరిరక్షణపైనా శ్రద్ధ ఓసారి ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన.. వర్షపు నీరు వృథాగా పోతుండటాన్ని గమనించి సొంత డబ్బులతో ఇంకుడు గుంతలను తవ్వించారు. భవిష్యత్ అవసరాలకు నీటిని పరిరక్షించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు జీవనోపాధి కరువైన చేనేత కార్మికులను ఆదుకోవాలని, చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలనే లక్ష్యంతో పని చేయడం ప్రారంభించారు. ఇందుకు తానే ఓ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. మరోవైపు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ప్లేటు, గ్లాసు సంచిలోనే.. ఎక్కువ ప్రాంతాల్లో తిరుగుతూ పర్యావరణంపై ప్రచారం చేసేందుకు మోటారు సైకిల్ వాడక తప్పడం లేదు. అది వెలువరించే పొగతో వాతావరణం కలుషితం అవుతోంది. అందుకే నాకు నేనే శిక్ష వేసుకున్నా. చెప్పులు లేకుండా తిరగాలని నిర్ణయించుకున్నా. ఇక నేను తినే ప్లేటు, నా గ్లాసు నా సంచిలోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా నా ప్లేట్లోనే భోజనం చేస్తా. పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పని చేస్తా. – మిట్టపల్లి సురేశ్ గుప్తా షాక్ తగిలినా..కోలుకుని.. సురేశ్ గుప్తా తన కుటుంబ బాధ్యతను పూర్తిగా గెస్ట్ లెక్చరర్‌గా పనిచేసే తన భార్య కల్పనపైనే మోపారు. ఆ విధంగా దొరుకుతున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, తనకు ఆహ్వానం లేకపోయినా అక్కడికి వెళ్లిపోయేంత ప్రేమికుడిగా మారిపోయారు. అయితే 2018 మే 22వ తేదీన రోజున జరిగిన ఓ సంఘటన తన కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తుతుందని ఆయన ఊహించలేదు. వార్షిక పరీక్షల చివరి రోజు కావడంతో ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కుమారుడు ప్రణీత్‌ను తీసుకువచ్చేందుకు హైదరాబాద్‌కు బయలుదేరిన గుప్తా.. అతని వద్దకు వెళ్లకుండా స్థానికంగా వరల్డ్ ఎర్త్ డే కార్యక్రమం వద్దే ఆగిపోయారు. అదే సమయంలో కొడుక్కి యాక్సిడెంట్ అయిందని, చనిపోయాడని ఫోన్ వచ్చింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి గుప్తాతో పాటు కుటుంబానికి చాలా రోజులు పట్టింది. -
వందల ఏళ్లుగా భూగర్భంలో ‘సేఫ్టీ ల్యాంప్’.. అసలు దీని కథేంటి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భంలో పనిచేసే గని కార్మికులకు ప్రాణదీపంగా వందల ఏళ్ల నుంచి సేప్టీల్యాంప్ రక్షణ వెలుగులను పంచుతోంది. బొగ్గు గనుల్లో కాలక్రమేణా అనేక ఆధునిక యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చినా ఈ బత్తిదీపం ప్రాధాన్యత నేటికీ తగ్గడం లేదు. ఈ దీపం ఆవిష్కరణకు ముందు పలువురు భూగర్భంలోనే విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు. ఈ దీపం రాకతో గనుల్లో రక్షణ ప్రమాణాలు మెరుగయ్యాయని సింగరేణి అధికారులు చెబుతున్నారు. బొగ్గు గాలితో నిత్యం ఆక్సిడేషన్ జరిపి స్వయంగా నిప్పు రాజేస్తుంది. అలా బొగ్గు మండినప్పుడు మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, ఇతర విషవాయువులు వెలువడుతాయి. ఆ సమయంలో కార్మి కులు పనిచేస్తే శ్వాస సమస్య ఏర్పడి నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు. అలాంటి ప్రమాద పరిస్థితులను ముందే గుర్తించేందుకు పూర్వం కెనరీ పక్షులను పంజరాల్లో భూగర్భంలోకి తీసుకెళ్లేవారు. పక్షిరెక్కలు కొట్టుకోవడం, కదలికల ఆధారంగా వాయువులను గుర్తించేవారు. ప్రతిసారీ పక్షులను బంధించి గనిలోకి తీసుకెళ్లడం, రావడంతో అవి అస్వస్థతకు గురై అనారోగ్యంతో చనిపోయేవి. బ్రిటన్ కు చెందిన హంప్రి డేవీ 1815లో బొగ్గు గనుల్లో రక్షణ కోసం సేఫ్టీ ల్యాంప్‌ను కనుగొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు గనుల్లో విషవాయువులను గుర్తించడంలో సమర్థంగా పనిచేయడంతో ఈ ల్యాంప్ ప్రామాణికంగా మారింది. ఎలా పని చేస్తుందంటే.. ‘వైర్ గాజేస్’సూత్రంతో పనిచేసే ఈ సేప్టీ ల్యాంప్ 2.5 కిలోల బరువు, 10 సెం.మీ. పొడవు ఉంటుంది. మంట వెలిగేందుకు కిరోసిన్/పెట్రోల్‌ను వాడతారు. ఇది బానేట్, ఇనుప జాలీలు, వాషర్, గ్లాసు, చెక్నట్, నూనె బుడ్డితో నిర్మితమై ఉంటుంది. ఈ ల్యాంప్‌ను గనిలోకి ఓవర్‌మెన్, మైనింగ్ సర్దార్లు తీసుకెళ్లి బొగ్గు తీసే ముందు అక్కడి వాయువుల శాతాన్ని పరీక్షిస్తారు. మీ«థేన్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్ తదితర వాయువుల శాతాన్ని తెలుసుకుంటారు. పనిచేసేందుకు అనువుగా ఉంటే ఉత్పత్తి మొదలుపెడతారు. మొదట గనుల్లోకి సాధారణ స్థాయిలో మంట వెలుగుతూ ఉంటుంది. వెలుగుతున్న దీపాన్ని వాయువులు తాకగానే మంటలో మార్పు మొదలవుతుంది. ఉదాహరణకు మీథేన్ ఒక శాతం ఉంటే 0.10 అంగుళాల ఎత్తుతో మంట పక్కవైపులకు వెలుగుతూ కనిపిస్తుంది. 1.5 శాతం ఉంటే 0.15 ఇంచు ఎత్తులో మంట టోపీ ఆకారంలో కనిపిస్తుంది. ఇలా ఎరుపు, నీలిరంగు మంటల కదలికలు, కనిపించే ఆకారాలను బట్టి అక్కడ మీథేన్ గ్యాస్ ఏ మోతాదులో ఉందో గుర్తిస్తారు. ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే మంట ఆరిపోతుంది. ఇలా ఆ వాతావరణంలో పైన, కింద, వివిధ ఎత్తుల్లో దీపంతో పరిశీలిస్తారు. ప్రస్తుతం గనుల్లో 1.25 శాతం మీథేన్ ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కార్మి కులను అలర్ట్ చేసి బయటకు పంపుతున్నారు. సింగరేణివ్యాప్తంగా జీఎల్–50, జీఎల్–60 రకం ల్యాంప్‌లను వాడుతున్నారు. జీఎల్–60లో ఒకవేళ మంట ఆరిపోతే తనంతట తానే వెలుగించుకొనే సాంకేతికత ఉంది. వాయువులను గుర్తించేందుకు డిజిటల్ పరికరాలైన మీౖథెనోమీటర్, ఆక్సీమీటర్, మల్టీడిటెక్టర్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒక్కోసారి ఈ పరికరాలు భూగర్భంలో సాంకేతిక సమస్యలతో పని చేయకపోవచ్చు. కానీ సేఫ్టీ ల్యాంప్ మాత్రం 100 శాతం కచ్చితత్వంతో పనిచేస్తోంది. దీంతో నేటికీ ఈ దీపం వాడకాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం అధికారులు, కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ల్యాంప్ నిర్వహణ, మరమ్మతులకు ఓ ఇన్చార్జి ఉంటారు. రక్షణలో ఇప్పటికీ ఇదే కీలకం.. బొగ్గుగనుల్లో రక్షణ విషయంలో సేఫ్టీల్యాంప్ కీలకంగా పనిచేస్తోంది. ప్రాణనష్టం జరగకుండా విషవాయువులను గుర్తించేందుకు బాగా ఉపయోగపడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా పలు డిజిటల్ పరికాలు వచ్చినా, సేఫ్టీల్యాంప్ వాడకం మాత్రం కొనసాగుతోంది. –సీహెచ్.సమ్మయ్య, హెడ్ ఓవర్‌మెన్, వీటీసీ, శిక్షకుడు ఇలా మంటలో మార్పుని బట్టి గ్యాస్ మోతాదును గుర్తిస్తారు. సింగరేణిలో ఒక్కో భూగర్భ గనిలో సగటున 12 నుంచి 14 వరకు దీపాలు అవసరమవుతాయి. -
అంబర్‌పేట్‌లో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయం ప్రారంబోత్సవం
-
ఆనందం మాటున పొంచి వున్న ప్రమాదాలు
రాజంపేట టౌన్ : గత రెండేళ్లుగా వేసవి, సంక్రాంతి, దసరా వంటి సెలవులు వచ్చినప్పటికీ.. కరోనా కారణంగా ప్రజలు ఎవరూ కూడా ఆనందంగా గడిపి ఆస్వాదించలేక పోయారు. ఇక విద్యార్థులు కూడా సెలవుల్లో ఆటలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు లేకపోవడంతో దసరా సెలవుల్లో విద్యార్థులు తమకు తోచిన రీతిలో ఆనందంగా గడపాలన్న ఉత్సుకతతో ఉంటారు. అయితే సంతోషం మాటునే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి వుంటాయన్న విషయాన్ని ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది. పిల్లలు ఆనందంగా గడిపేందుకు వారికి స్వేచ్ఛను ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అయితే వారిని ఒక కంటి కనిపెట్టి ఉంచాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులపై ఎంతైనా ఉందనే చెప్పాలి. సెలవుల్లో చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు వెళుతుంటారు. మరికొంత మంది విహార యాత్రల పేరిట వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు నీటిలో దిగి ఈతకొట్టడం, బైక్ నడపడం నేర్చుకొని.. బైక్ నడిపేందుకు ఎంతో ఇష్టపడతారు. సెలవుల్లో ఈ విషయాలపైనే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండాలి. లేకుంటే ఆనందమయం కావాల్సిన సెలవులు విషాదమయం కాగలవు. సెలవుల సందర్భంగా విద్యార్థులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ సంఘటనలు అన్నమయ్య జిల్లాలో అనేకం ఉన్నాయి. పిల్లల పట్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ► ఆడుకోవడానికి ఎక్కువ దూరం పంపకూడదు. ► సమీపంలో ఉండే క్రీడామైదానాల్లోకి వెళ్లినా, వారి వెంట పెద్దలు ఎవరో ఒకరు వెళ్లాలి. ► క్రీడామైదానాల సమీపంలో, ఆడుకునే ప్రాంతాల సమీపంలో చెరువులు, బావులు, తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు వంటివి ఉంటే పిల్లలను క్రీడా మైదానాలకు కూడా పంపక పోవడమే మంచిది. ► ఎత్తయిన భవనాల పైన, శిథిలావస్థలో ఉండే భవనాల్లో ఆటలు ఆడకుండా చూడాలి. ► యువకులు చిన్నపాటి వీధుల్లో కూడా బైక్‌లను వేగంగా నడుపుతుంటారు. అందువల్ల పిల్లలు వీధుల్లోని రోడ్లపై ఆడుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఓ మోస్తారు పిల్లలు బైక్‌లను నడిపేందుకు ఎక్కువ ఇష్టపడతారు. అందువల్ల తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు బైక్‌లను తీసుకెళ్లి ప్రమాదాల బారిన పడే ప్రమాదముంది. అందువల్ల పిల్లలు బైక్‌లను తీసుకెళ్లకుండా ఉండేందుకు బైక్ తాళాలను పిల్లలకు అందుబాటులో ఉంచకుండా చూసుకోవాలి. ► ప్రస్తుతం చాలా మంది పిల్లలు సెల్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. సెలవుల్లో పిల్లలు సెల్‌ఫోన్‌ను ఎక్కువ చూసే అవకాశమున్నందున, సెల్‌ఫోన్‌పై వ్యాపకం లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలి. ఇలా చేస్తే మంచిది ► సెలవుల్లో విద్యార్థులు ఇంటి పట్టునే ఉండి ఆడుకునేందుకు క్యారమ్స్, చెస్, వంటి క్రీడలు ఆడుకునేలా తల్లిదండ్రులు ఏర్పాట్లు చేయాలి. ► ఇరుగు, పొరుగున ఉన్న పిల్లలందరికీ కూడా క్యారమ్, చెస్ బోర్డులను అందుబాటులో ఉంచితే పిల్లలు ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఆడుకుంటూ ఉంటారు. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. ► తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి సమయం ఉంటే పిల్లలను క్రీడా మైదానాలకు తీసుకెళ్లి క్రికెట్, కబడ్డీ, రన్నింగ్ వంటివి ప్రాక్టీస్ చేయిస్తే మరింత మంచిది. ఎందుకంటే ఈ క్రీడలు ఆరోగ్యాన్ని, మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. ► ఈతకు వెళ్లడం, బైక్‌లను నడపడం వంటివి చేస్తే చోటు చేసుకునే ప్రమాదాలగురించి పిల్లలకు సున్నితంగా తెలియజేయాలి. ► పిల్లలను ఎగ్జిబిషన్, పార్కులు వంటి ప్రదేశాలకు తీసుకెళ్లాలి. సెలవుల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన వారికి సమీపంలో ఉండే చారిత్రాత్మక ప్రదేశాలకు తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల ఒంటరిగా బయటకు వెళ్లాలన్న ఆలోచనలు రావు. ► జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన విషయాలను తెలియ చేయాలి. అలాగే పేదరికం నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్న వారి విజయగాధలను విషదీకరించి చెప్పాలి. ఇవి పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తాయి. ► పడుకునే సమయంలో పిల్లలకు మంచి విషయాలను చెబుతుండాలి. పూర్వం ఉండిన ఉమ్మడి కుటుంబాలు, అప్పట్లో ఉన్న అనుబంధాలు, ఆప్యాయతలపై తెలియ చేయాలి. ఇవి సన్మార్గం వైపు నడిచేందుకు దోహద పడగలవు. (క్లిక్: విషాదయాత్రగా మారిన విహార యాత్ర.. 21 మంది విద్యార్థుల్లో..) తల్లిదండ్రులు స్నేహితుల్లా వ్యవహరించాలి తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహితుల్లా వుండాలి. అప్పుడే ఎక్కడికి వెళ్లినా, ఏమి చేసినా తల్లిదండ్రులకు నిర్భయంగా తెలపగలరు. అంతేకాక చెప్పిన విషయాలను కూడా చక్కగా ఆలకిస్తారు. ముఖ్యంగా సెలవుల సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అప్పుడే పిల్లలు బయటికి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వీలవుతుంది. సెలవుల సమయంలో పిల్లల గురించి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – శివభాస్కర్‌రెడ్డి, డీఎస్పీ, రాజంపేట -
గల్ఫ్ దేశాల్లో 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' ఉండాలి!
ఆసియా-గల్ఫ్ వలసల కారిడార్ దేశాలలో వేతనాల చెల్లింపులపై ఉత్తమ ఆచరణపై ఖతార్ రాజధాని దోహాలో వలసలపై జరుగుతున్న సమావేశంలో మంగళవారం చర్చ జరిగింది. ముఖ్యంగా వేతనాల ఎగవేత, ఇతర వేతన సమస్యల పరిష్కార విధానాలపై చర్చ సాగింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం), మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) లు సంయుక్తంగా ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఖతార్‌లో సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి ఖతార్ ప్రభుత్వం అధికారిక ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి, ప్రవాసి కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్ల ఐక్యరాజ్య సమితి ప్రవాసి కార్మికులకు వేతన రక్షణ నిధి ఏర్పాటు, వలస కార్మికులను రక్షించడానికి కార్మికులను పంపే మూలస్థాన దేశాలు ఏవైనా విధానాలు, శాశ్వత పరిష్కార వ్యవస్థలను కలిగి ఉన్నాయా? అనే ప్రశ్నించారు. నష్టపోయిన కార్మికులను, విదేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికుల రక్షణకోసం మూలస్థాన దేశాలు పునరావాసం, పునరేకీకరణ కోసం ఒక విధానం, శాశ్వత యంత్రాంగం కలిగి ఉండాలని స్వదేశ్ కోరారు. 32 సంవత్సరాల క్రితం 1990-91లో ఇరాక్ - కువైట్ గల్ఫ్ యుద్ధం కారణంగా లక్షలాది మంది వలసదారులు కువైట్ నుండి వారి స్వదేశాలకు తిరిగి పంపబడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుబంధ సంస్థ 'ది యునైటెడ్ నేషన్స్ కంపెన్సేషన్ కమిషన్' (పరిహార కమిషన్) కువైట్‌పై ఇరాక్ దాడికి సంబంధించి 52.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చెల్లింపులను పూర్తి చేసిందని స్వదేశ్ గుర్తు చేశారు. అలాగే ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఇరాక్, లిబియా, యెమెన్ లాంటి దేశాలలో యుద్ధ పరిస్థితులు, దివాళా తీసిన కంపెనీలను మూసివేయడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించి, వీసా గడువు ముగిసిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్షలు లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు 4-5 ఏళ్లకు ఒకసారి క్షమాభిక్ష (అమ్నెస్టీ) ప్రకటించడం, కోవిడ్19 మహమ్మారి లాంటి విపత్తు వలన వలస కార్మికులను బలవంతంగా ఆయా దేశాల నుండి కట్టుబట్టలతో స్వదేశీలకు పంపించివేస్తున్నారని స్వదేశ్ పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇలా జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు తగిన రక్షణ చర్యలతో సన్నద్ధంగా ఉండాలని సూచించారు ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖలో వేతన రక్షణ విభాగం అధినేత మహమ్మద్ సైద్ అల్ అజ్బా, ఖతార్ లోని ఫిలిప్పీన్ రాయబార కార్యాలయం కార్మిక అధికారి డాన్ ఆల్బర్ట్ ఫిలిప్ సి. పాన్కోగ్, ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) రీజనల్ కోఆర్డినేటర్ విలియం గోయిస్, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ సుమన్ సొంకర్, ఖతార్‌లోని హమద్ బిన్ ఖలీఫా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.రే జురీడిని పానెల్ ప్రవాసుల వేతన సమస్యలపై ప్రసంగించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) అరబ్ దేశాల వలస నిపుణుడు రిసార్డ్ చోలెవిన్స్కీ మోడరేటర్ గా వ్యవహరించారు. వలస కార్మికుల వేతనాలపై కోవిడ్-19 ప్రభావం, దీనిక అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై ప్యానల్ వక్తలు ప్రసంగించారు. అలాగే కోవిడ్19 మహమ్మారి సంక్షోభం కంటే ముందు గమ్యస్థాన గల్ఫ్ దేశాలు కార్మికులకు 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' (వేతనాల భరోసా రక్షణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి ప్రయోగాలు చేశాయి. వేతన చెల్లింపులను పర్యవేక్షించడం, అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేశాయని వక్తలు తెలిపారు. -
Himalayas: హిమాలయాలను కాపాడుకోవాలి
మళ్లీ హిమాలయ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. హిమాలయాలలో తరచూ జరిగే నష్టాలే ఇవి. పర్యావరణం మీద మానవుల అశ్రద్ధ దీనికి కారణం కావచ్చు. నష్టాల నివారణకు తీసుకోవలసిన చర్యలను తెలుసుకోవడం ఈ సందర్భంగా చాలా ముఖ్యం. హిమాలయాల నిర్మాణం మిలియన్ల ఏళ్లుగా కొనసాగుతోంది. అందుకే ప్రతి ఏడాదీ హిమాలయాలు, కొన్ని సెంటిమీటర్ల ఎత్తు పెరుగుతున్నాయి. ఈ పర్వతాల్లో జన్మించిన నదుల ద్వారా కొట్టుకువచ్చిన రాళ్లు, ఒండ్రు వంటి వాటితో దిగువన ఉన్న తక్కువ లోతైన టెథిస్ సముద్రం నిండి పోయి ప్రపంచంలోనే అతిపెద్ద సారవంతమైన గంగా–సింధు మైదానం ఏర్పడింది. హిమాలయాలు దేశానికి పెట్టని గోడల్లాగా, ఉత్తర దిశలో నేలమార్గంలో వచ్చే శత్రువులనుండి కాపాడుతున్నాయి. సైబీరియా నుండి వచ్చే అతి శీతల గాలుల నుండి భారత ద్వీపకల్పాన్ని కాపాడుతున్నాయి. సింధు, గంగ, బ్రహ్మపుత్ర జీవనదులకు జన్మనిచ్చి; 40 శాతం భారతీయుల తాగు నీరు, సాగునీరు, పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలు తీరుస్తున్నాయి. ఆపిల్ పండ్లనూ, న్యూస్ ప్రింట్, ఆయుర్వేద మూలికలనూ అందించే అడవులనూ దేశానికిస్తున్నాయి. ప్రపంచంలోనే అందమైన పర్యాటక ప్రదేశాలు కశ్మీర్, కులూ, మనాలి, సిమ్లా, ముస్సోరీ, డార్జిలింగ్లకు పుట్టినిల్లుగా ఉన్నాయి. ఋతుపవనాలకు సహాయం చేస్తున్నాయి. ఇటువంటి హిమాలయాలు లేకపోతే భారతదేశం లేదనటంలో అతిశయోక్తి లేదు. అయితే హిమాలయాల్లో అభివృద్ధి పేరిట, పుణ్యస్థలాల పేరిట, పర్యాటకం పేరిట; రోడ్లు వెడల్పు చేయటం, రైల్వేవంతెనలు, జలవిద్యుత్ కేంద్రాలు, సొరంగాలు (టన్నెళ్లు) వంటి వాటిని నిర్మించడం కోసం భారీ బ్లాస్టింగ్లు చేస్తున్నారు. హిమాలయాల్లో ఉన్న రాయి దక్కన్ పీఠభూమిలో ఉన్న గ్రానైట్ రాయిలాగా గట్టిది కాదు. బలహీనమైన మట్టిదిబ్బలు. లూజు రాళ్లు రప్పలతో ఏర్పడిన ఈ ముడుత పర్వతాల చరియలు భారీ పేలుళ్ల కారణంగా విరిగిపడుతున్నాయి. (క్లిక్: గొంతు చించుకొని అడగాల్సిందే!) మానవుడు సృష్టిస్తున్న శక్తిమంతమైన విస్ఫోటనాలు హిమాలయాల భౌతిక స్వరూపాన్నే మార్చేలా తయారయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊహించని విపత్తులు ఎన్నయినా సంభవించే ఆస్కారం ఉంది. పర్యావరణ ప్రేమికులూ, భూ శాస్త్రవేత్తలూ; ఆ ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంపై విషయాలను సానుకూలంగా ఆలోచించి నష్టనివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. తద్వారా హిమాలయాలనూ, అక్కడి పుణ్యక్షేత్రాలనూ, పర్యాటక ప్రదేశాలనూ... చివరగా దేశాన్నీ కాపాడుకుందాం. - మరింగంటి శ్రీరామ రిటైర్డ్ చీఫ్ జీఎం, సింగరేణి కాలరీస్, కొత్తగూడెం -
మొదటికొచ్చిన ‘డేటా’ బిల్లు
పార్లమెంటు కారిడార్‌లో దాదాపు దశాబ్దకాలంగా వినబడుతున్న డేటా పరిరక్షణ బిల్లు వ్యవహారం మొదటికొచ్చింది. పాతికేళ్లుగా భౌగోళిక సరిహద్దులకు అతీతంగా సమాచార ప్రవాహం నిరంతరం దేశంలోకి వస్తూ పోతూ ఉంది. పౌరుల భద్రతకూ, వారి వ్యక్తిగత గోప్యతకూ కలిగే ముప్పు గురిం చిన భయాందోళనలు అడపాదడపా వ్యక్తమవుతూనే ఉన్నాయి. అవి కేవలం భయాందోళనలు కాదు, చేదు నిజాలని రుజువవుతూనే ఉన్నాయి. గూగుల్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటివి ఎందుకో, ఏమిటో చెప్పకుండా కోట్లాదిమంది ఖాతాదార్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని రాబడు తున్నాయి. అలా సేకరించిన సమాచారాన్ని ఫేస్బుక్ సంస్థ 2015లో కేంబ్రిడ్జి ఎనలిటికా(సీఏ) సంస్థకు చడీచప్పుడూ లేకుండా అమ్ముకున్న సంగతి తెలియంది కాదు. కానీ మనకు డేటా పరిరక్షణ కోసం ఇంతవరకూ చట్టం లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ బిల్లు తెస్తామని చెప్పారు. ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోకుండానే ఆధార్ పేరుతో దేశ పౌరుల డేటా సేకరణ మొదలు పెట్టారు. గోప్యతను పౌరుల ప్రాథమిక హక్కుగా సర్వోన్నత న్యాయస్థానం గుర్తించి, అందుకోసం చట్టం అవసరమని సూచించి ఈ నెల 24కు అయిదేళ్లవుతోంది. అయినా చట్టం సాధ్యపడలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఏడాదిపాటు అనేకమంది నిపుణులనూ, సంస్థలనూ సంప్రదించి, విదేశాల్లో అమలవుతున్న చట్టాలను అధ్య యనం చేసి ముసాయిదా బిల్లు సమర్పించి నాలుగేళ్లు కావస్తోంది. అనంతరం 2019 డిసెంబర్లో కేంద్రం పార్లమెంటులో బిల్లుకూడా ప్రవేశపెట్టింది. తీరా మూడేళ్లు గడిచాక ఇప్పుడు ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంటులో ప్రకటించారు. చెప్పాలంటే డేటా పరిరక్షణ బిల్లుపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం తన సహజ ధోరణికి భిన్నంగా ఈ బిల్లు గురించి ఉభయ సభల్లో వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేసీపీ)కి ఇవ్వడానికి అంగీకరించింది. ఆ కమిటీ గత రెండేళ్లుగా క్షుణ్ణంగా చర్చించి బిల్లుకు 81 సవరణలు సూచించింది. అరడజను సిఫార్సులు చేసింది. ఫలితంగా బిల్లు పరిధి పూర్తిగా మారిపోయింది. వ్యక్తిగత డేటా పరిరక్షణ కాస్తా విస్తృత డేటా పరిరక్షణగా మారింది. సైబర్ ప్రపంచంలో ప్రవహించే డేటాను వ్యక్తిగత, వ్యక్తిగతేతర సమా చారంగా వర్గీకరించారు. స్మార్ట్ ఫోన్లలో ‘విశ్వసనీయమైన’ హార్డ్‌వేర్‌ను మాత్రమే వాడాలన్న నిబంధన, సామాజిక మాధ్యమ సంస్థల నియంత్రణకు సంబంధించిన నిబంధనలు, మధ్యవర్తులుగా వ్యవహరించని సామాజిక మీడియా సంస్థల్లో వచ్చే వార్తలకూ, వ్యాఖ్యలకూ ఆ సంస్థలను బాధ్యత వహించేలా చేయడం వంటివి సిఫార్సుల్లో ఉన్నాయి. వీటిలో కొన్నిటికి కొత్తగా తీసుకురాబోయే బిల్లులో చోటిచ్చే అవకాశం ఉంది. అలాగే ఎప్పటికప్పుడు వచ్చిపడే డేటాను నిక్షిప్తం చేయడం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాల్సివుంది. ఈ దేశంలో రూపొందే సమస్త డేటానూ ఇక్కడి సర్వర్లలోనే సామాజిక మాధ్యమ సంస్థలు భద్రపరచాలని ప్రభుత్వం మొదట్లో చెప్పినా వ్యక్తుల సున్నిత సమాచారాన్ని, కీలక సమాచారాన్ని ఇక్కడ సర్వర్లలోనే ఉంచాలని పాత బిల్లు నిర్దేశించింది. ఇప్పుడు దాన్ని సవరించి భారత ప్రభుత్వం విశ్వసించే మరేదైనా ప్రాంతంలో కూడా ఈ సర్వర్లు ఉండొచ్చని, నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వం కోరిన సమాచారాన్ని అందజేస్తే సరిపోతుందని నిబంధన విధించవచ్చంటున్నారు. ఎవరికైనా క్షణంలో అందుబాటులోకొచ్చే సైబర్ ప్రపంచంలో వ్యక్తిగత డేటా పరిరక్షణ కత్తి మీద సాము వంటిదే. పౌరుల గోప్యతకు సామాజిక మాధ్యమాల వల్ల మాత్రమే కాదు... ప్రభుత్వాల నుంచి సైతం ముప్పువాటిల్లితే పౌరులకుండే ఉపశమనం ఏమిటన్నది కూడా బిల్లు చెప్పగలగాలి. పౌరుల ప్రాథమిక హక్కుతో ముడిపడి ఉండే డేటా పరిరక్షణ వంటి అంశాల్లో పాలకులు ఉదారంగా ఉంటారనుకోవడం అత్యాశ. వ్యక్తుల డేటాపై ఏదోమేర ఆధిపత్యం, నియంత్రణ సాధించేందుకు వారు ప్రయత్నిస్తారు. 2019 నాటి బిల్లు వాలకాన్ని గమనించిన జస్టిస్ శ్రీకృష్ణ ‘నా ముసాయిదాకూ, బిల్లుకూ పోలికే లేద’ని వ్యాఖ్యానించిన సంగతీ, ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం డేటాపై సమస్త అధికారాలనూ దఖలు పరుచుకుందని చెప్పడమూ ఎవరూ మరిచిపోరు. డేటా పరిరక్షణ అథారిటీ(డీపీఏ) చైర్పర్సన్ ఎంపిక కోసం ఏర్పాటయ్యే కమిటీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నామినేట్ చేసే న్యాయమూర్తి ఆధ్వర్యం వహించాలన్న నిబంధనకు కూడా మంగళం పాడారు. వీటన్నిటికీ మించి అసలు గత మూడేళ్లలో సైబర్ ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ–కామర్స్, డిజిటల్ మార్కెట్, డిజిటల్ సర్వీసులు వగైరావెన్నో వచ్చాయి. పాత బిల్లు వీటిలో చాలా అంశాలను స్పృశించలేదు. వీటన్నిటికీ ఒక్క చట్టంలో చోటీయడం అసాధ్యమేకాక, అనవసరం కూడా. అందుకోసం యూరప్ దేశాల మాదిరిగా విడివిడి చట్టాలు అవసరం. లేనట్టయితే అయోమయం నెలకొంటుంది. ఎటూ కొత్తగా బిల్లు తెస్తున్నారు గనుక పౌరుల వ్యక్తిగత గోప్యత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు స్ఫూర్తికి అనుగుణంగా దాన్ని రూపొందించాలని కేంద్రం గుర్తించడం అవసరం. చట్టం దుర్వినియోగం కాకుండా, అస్పష్టతకు చోటీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సైబర్ ప్రపంచం పౌరులకు సురక్షిత ప్రదేశంగా మారుతుంది. -
PDP Bill: ‘గోప్యత’ బిల్లు మళ్లెప్పుడో!
దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి పరిరక్షించడమే లక్ష్యంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యక్తిగత సమాచార పరిరక్షణ (పీడీపీ) బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. 2019 డిసెంబర్ 11న లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపారు. ఏళ్ల తరబడి సాగిన తర్జనభర్జనల అనంతరం జేపీసీ 81 సవరణలు ప్రతిపాదించింది. దీంతో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ కొత్త బిల్లును మళ్లీ ప్రవేశపెడతామనీ, ప్రస్తుతానికి ఉపసంహరించుకుంటున్నామనీ ప్రకటించింది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ తర్వాత రెండేళ్లకు ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. ఇది పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఇందుకు కారణం కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు లభించడమే. (క్లిక్: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి) ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోప్యత కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. కానీ జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలు – జాతీయ భద్రత, శాంతి భద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇస్తోంది. అయితే జేపీసీ వివిధ రంగాల నిపుణులు, భాగస్వామ్య సంస్థలతో చర్చించి బిల్లులో అనేక మార్పుచేర్పులు సూచించడంతో... ప్రభుత్వం తాత్కాలికంగా బిల్లును వెనక్కి తీసుకుంది. – డా. ఎం. సురేష్ బాబు, ప్రజా సైన్సు వేదిక అధ్యక్షులు -
ప్రయాణ బీమా.. టూరుకు ధీమా!
అన్ని సమయాల్లోనూ బీమా రక్షణ ఉంటేనే నిశ్చింత. విదేశీ ప్రయాణం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అందరూ తీసుకోరు. కానీ, ప్రతి ప్రయాణికుడు తప్పకుండా తీసుకోవాల్సిన ప్లాన్ ఇది. ఊహించని అత్యవసర పరిస్థితుల్లో మనల్ని ఆదుకునే రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నది పూర్తి అధ్యయనం తర్వాతే తీసుకోవాలి. ఏదో ఒకటి తీసుకుంటే అవసరంలో ఆదుకోకపోవచ్చు. ఆదుకున్నా, సంపూర్ణంగా ఉండకపోవచ్చు. విదేశాలకు వెళుతున్న వారు, అసలు ఎటువంటి రిస్క్‌లను ఎదుర్కోవాల్సి వస్తుందో అవగాహన కలిగి ఉండాలి. ఆ రిస్క్‌లు అన్నింటికీ ప్లాన్‌లో కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను నిజాయితీగా వెల్లడించాలి. ఈ అంశాల పరంగా జాగ్రత్తగా, నిజాయితీగా వ్యవహరించినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంతో ఉపయోగకరం అవుతుంది. ప్రయాణ సమయంలో లగేజీ పోవచ్చు. ప్రమాదం జరగొచ్చు. ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. దాడికి గురికావచ్చు. ఏ రూపంలో రిస్క్ ఎదురవుతుందో ఊహించడం కష్టం. అందుకుని తీసుకునే ప్లాన్‌లో కవరేజీ సమగ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. రిస్క్‌లకు కవరేజీ ఇచ్చేదే బీమా పాలసీ. రిస్క్‌లు అన్నవి తెలియకుండా వస్తాయి. కానీ, రిస్క్‌కు దారితీసే అంశాలపై ఎవరికైనా అవగాహన ఉంటుంది. ఈ రిస్క్ అంశాలనేవి పాలసీ దారఖాస్తు పత్రంలో వెల్లడించడం వల్ల, వీటికి కవరేజీ ఇస్తూ, ప్రీమియం సహేతుకంగా నిర్ణయించేందుకు బీమా సంస్థకు అవకాశం ఉంటుంది. కనుక వీటిని దాచకూడదు. ఇందులో ప్రధానమైనది ముందు నుంచి ఉన్న వ్యాధులు. మెడికల్ కవరేజీ ఉన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్.. విదేశీ పర్యటన సమయంలో ఏదైనీ కారణంతో అత్యవసరంగా ప్రయాణికుడు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే కవరేజీ ఇస్తుంది. ముందు నుంచి ఉన్న వ్యాధులను వెల్లడించలేదని అనుకుందాం. అప్పుడు ముందు నుంచి ఉన్న వ్యాధి వల్ల హాస్పిటల్లో చేరినట్టు వైద్యుడు నిర్ధారిస్తే కవరేజీ సమస్యాత్మకంగా మారొచ్చు. వైద్యుల నోట్ ఆధారంగా సదరు క్లెయిమ్‌ను బీమా కంపెనీ తిరస్కరిస్తుంది. అదే ముందస్తు వ్యాధులను (ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్/పీఈడీ) వెల్లడించి, వాటికి కూడా పాలసీలో కవరేజీ ఉంటే ఈ సమస్య ఎదురుకాదు. పీఈడీలను వెల్లడించడం వల్ల ప్రీమియం కొంచెం పెరుగుతుంది అంతే. పీఈడీని పాలసీలో చేర్చకపోతే వైద్య వ్యయాలు భారీగా ఉండే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరైనా కానీ, తమకు అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కలిగి ఉంటారు. కానీ, వాటి కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని ఎవరికీ తెలియదు. అందుకే తెలిసిన వివరాలను పూర్తిగా వెల్లడించాల్సిందే. సాహస క్రీడలకూ ఇదే వర్తిస్తుంది. సాహస క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లేవారు వాటికి సంబంధించిన పాలసీలను ఎంపిక చేసుకోవాలి. 70 ఏళ్లకు పైన వయసులో విదేశాలకు వెళ్లొచ్చే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. ఈ వయసులో ఉన్న వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ పరంగా పరిమితులు ఉన్నాయి. బీమా సంస్థలు 10,000–20,000 డాలర్లకే కవరేజీని పరిమితం చేస్తున్నాయి. వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కేవలం కొన్ని బీమా కంపెనీలే ఈ వయసు వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయి. టీపీఏ, నెట్వర్క్ ఆసుపత్రులు బీమా సంస్థలు స్వయంగా అందించే సేవలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) రూపంలో అందించే సేవలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. అందుకని పాలసీదారులు టీపీఏను ఎలా సంప్రదించాలన్నది ముందే తెలుసుకోవాలి. చికిత్స అవసరమైనప్పుడు ముందుగా సంప్రదించాల్సింది టీపీఏనే. క్లెయిమ్‌తోపాటు, బీమా సంస్థ అందించే సేవలకూ టీపీఏనే అనుసంధానకర్తగా ఉంటారు. టీపీఏ లేనప్పుడు నేరుగా బీమా కంపెనీలను సంప్రదించాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆమోదించే నెట్వర్క్ హాస్పిటల్స్ పాత్ర కీలకం అని చెప్పుకోవాలి. విదేశానికి వెళ్లినప్పుడు వైద్య సాయం అవసరమైతే బీమా కార్డుతో నెట్వర్క్ ఆసుపత్రిని సంప్రదిస్తే చాలు. అయితే, అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లడం సాధ్యపడకపోవచ్చు. అయినా కానీ, దీనికి ప్రాధాన్యం ఎక్కువే. ఎందుకంటే నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఖరీదైన వైద్యం పొందొచ్చు. ముందుగా డబ్బులు చెల్లించి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవడం కంటే, నగదు రహిత బీమా కవరేజీ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో చిన్న పాటి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా బిల్లు 10,000–20,000 డాలర్లు అవుతోంది. కనుక ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు ముందుగానే తగిన కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లో ఎన్నో వేదికలు ఈ విషయంలో తగిన సమాచారాన్ని అందిస్తున్నాయి. టీపీఏ సేవల తీరు, నెట్వర్క్ హాస్పిటల్స్ సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఊహించని అవరోధాలు.. ప్రయాణ సమయంలో ఎన్నో ఊహించని రిస్క్‌లు ఎదురవుతుంటాయి. అందుకని పాలసీ తీసుకోవడానికి ముందే అన్ని రిస్క్‌లను అధ్యయనం చేసి, ఎక్కువ వాటికి కవరేజీ ఇచ్చే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. యుద్ధం, వాతావరణం, దాడుల వల్ల విదేశీ ట్రిప్‌కు ఆటంకాలు ఏర్పడవచ్చని భావిస్తే.. ఫ్లయిట్ రద్ధు అయితే ఎక్కువ పరిహారాన్ని ఇచ్చే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఫ్లయిట్ రద్ధయితే ఇచ్చే పరిహారం 5 లక్షల డాలర్ల ప్లాన్‌లో 1,000–2,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒకవేళ విదేశాలకు వెళ్లిన తర్వాత పర్యటనను పొడిగించుకోవాలని భావిస్తే టీపీఏను ఎలక్ట్రానిక్ రూపంలో సంప్రదించాల్సి ఉంటుంది. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ గడువును పొడిగించుకునేందుకు బీమా సంస్థలు అనుమతిస్తాయి. కొన్ని అనుకోని పరిణామాలు.. ఉదాహరణకు యుద్ధం, అంటువ్యాధులు తదితర పరిస్థితుల్లో బీమా సంస్థలే ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఏడు రోజుల వరకు ఆటోమేటిక్‌గా పొడిగిస్తుంటాయి. ప్రయాణంలో సొంతంగా కారు నడపేది ఉంటే, అప్పుడు తీసుకునే ట్రావెల్ ప్లాన్ థర్డ్ పార్టీ లయబిలిటీతో ఉండేలా జాగ్రత్త పడాలి. బ్యాగేజీకి కూడా కవరేజీ ఉంటుంది. ప్రయాణించే సమయంలోనే కాకుండా, ట్రిప్ మొత్తంలో బ్యాగేజీకి ఈ కవరేజీ వర్తిస్తుంది. కాకపోతే బ్యాగేజీ రక్షణకు తనవైపు నుంచి తగినన్ని చర్యలు తీసుకున్నట్టు పాలసీదారు నిరూపించుకోవాలి. అప్పుడే పోయిన బ్యాగేజీకి నష్ట పరిహారాన్ని అందుకోగలరు. అందుకని ప్లాన్ తీసుకునే వారు తప్పనిసరిగా నియమ, నిబంధనలతో కూడిన డాక్యుమెంట్‌ను చదవాలి. అప్పుడే వేటికి కవరేజీ లభిస్తుంది, పరిమితులు ఏవైనా ఉన్నాయా? షరతుల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. -
బ్లాక్‌క్యాట్, బీఎస్ఎఫ్ జవాన్, మార్షల్స్‌తో ఎంపీకి పటిష్ట భద్రత
సాక్షి, నిజామాబాద్: తన జిల్లా పర్యటనలో ప్రతిసారి టీఆర్ఎస్ శ్రేణులు ఆటంకాలు కలిగించడం.. వాగ్వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో బీజేపీ ఎంపీ అర్వింద్ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యాలయం సూచనల మేరకు వీఆర్ఎస్ తీసుకున్న బ్లాక్‌క్యాట్, బీఎస్ఎఫ్ జవాన్‌తో పాటు నలుగురు మార్షల్స్‌తో ఎంపీ సొంత డబ్బులతో భద్రత కల్పించుకున్నారు. కాగా రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ముక్కో ణపు పోటీ నడుస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున ధర్మపురి అర్వింద్, కల్వకుంట్ల కవితపై అనూహ్యంగా విజయం సాధించారు. అప్పటి నుంచి బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఘర్షణల దాకా వెళ్లింది. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇతర అంశాలపై బీజేపీ ఆందోళ నలు చేస్తే, ప్రతిగా టీఆర్ఎస్ శ్రేణులు పసుపు బోర్డు విషయంలో ఆందోళనలు చేస్తూ ఎంపీ అర్వింద్‌ను అ డ్డుకుంటూ వచ్చాయి. ఈ క్రమంలో ఆరు నెలల కా లంలో ఇరుపార్టీల శ్రేణుల మధ్య పలుసార్లు ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. కొన్ని నెలలుగా ఎంపీ పర్యటన చేసిన ప్రతిసారి టీఆర్ఎస్ శ్రేణు లు మోహరిస్తుండడంతో ని యంత్రించడం పోలీసులకు కష్టసాధ్యమైపోతోంది. రెండు సందర్భాల్లో పోలీసులు సైతం తీవ్రంగా గాయపడడం గమనార్హం. చదవండి: (ఎంపీ అర్వింద్ ఇప్పటికీ మభ్యపెడుతూనే ఉన్నాడు: ఎమ్మెల్సీ కవిత) ఇటీవల కాలంలో ఎంపీ అర్వింద్ పలుచోట్ల పర్యటనలు, ప్రారంభో త్సవాలు చేసేందుకు, మరి కొన్నిచోట్ల ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాలు ఆవిష్కరించేందుకు వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వరుసగా ఇందల్వాయి మండలం గన్నారం, ధర్పల్లి మండల కేంద్రంలో, భీంగల్ మండలం బాబాపూర్‌లో ఉపాధ్యాయురాలు మరణించిన సందర్భంలో, ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి ప్రాంతంలో ఎంపీ అర్వింద్ పర్యటన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ లు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండడంతో పోటాపోటీ నెలకొంది. ఎంపీ అర్వింద్ ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ విషయంలో పోలీసు లు టీఆర్ఎస్కు సహకరించి తన భద్రతకు సహకరించలేదంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా నిజామాబాద్ పోలీసు కమిషనర్‌పై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎంపీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. అధికారికంగా హోంశాఖ నుంచి భద్రత కల్పించే విషయంలో ఆలస్యం అయ్యే నేపథ్యంలో అమిత్‌షా కార్యాలయం సూచనల మేరకు ఎంపీ అర్వింద్ వీఆర్ఎస్ తీసుకున్న బ్లాక్‌క్యాట్ కమెండో, బీఎస్ఎఫ్ జవాన్‌తో పాటు నలుగురు మార్షల్స్‌ను తన భద్రతా వలయంగా నియమించుకున్నారు. అలాగే కిలోమీటర్ రేడియస్‌లో పనిచేసే విధంగా 5 వాకీటాకీలు, మూడు ప్రత్యేక వాహనాలు, అడ్వాన్స్డ్ వెపన్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి తన పర్యటనలో దాడులకు పాల్పడితే టీఆర్ఎస్ వాళ్లకు తూటాలు దిగుతాయని ఎంపీ అర్వింద్ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. -
ప్రేమించుకున్నాం.. రక్షణ కల్పించండి..
తాడిమర్రి(శ్రీసత్యసాయి జిల్లా): కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలంటూ తహసీల్దార్‌ను ఆశ్రయించారు. వివరాలు... తాడిమర్రి మండలం దాడితోటకు చెందిన ఎం.కుళ్లాయప్ప కుమారుడు రాజ్‌కుమార్ టైల్స్ పరిచే పనిచేస్తున్నాడు. చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కలకు చెందిన తలారి శ్రీనివాసులు కుమార్తె మౌనిక, రాజ్‌కుమార్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదవండి👉: మేము చనిపోతున్నాం.. ఎవరూ వెతకొద్దు.. కాపాడొద్దు ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా కడపలో టైల్స్ పరిచేందుకు వెళ్లిన రాజ్‌కుమార్ వద్దకు ఈ నెల 4న మౌనిక ఒంటరిగా వెళ్లింది. అదే రోజు కడపలోని దుర్గమ్మ గుడిలో వీరు వివాహం చేసుకున్నారు. అయితే మౌనిక కనిపించడం లేదంటూ తండ్రి శ్రీనివాసులు చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమ జంట ఈ నెల 24న తాడిమర్రి పోలీసు స్టేషన్లో హాజరై తాము వివాహం చేసుకున్న సంగతి తెలిపారు. అనంతరం మంగళవారం తహసీల్దార్ హరిప్రసాద్‌ను కలిసి అమ్మాయి తరఫు కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తగిన రక్షణ కల్పించాలంటూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు హరిప్రసాద్, సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
insurance: ప్రీమియం తక్కువ.. రక్షణ ఎక్కువ
రోజుకు ఒక దోశ కోసం చేసే ఖర్చు.. పావు లీటర్ పెట్రోల్‌కు అయ్యే వ్యయం.. 30–50 రూపాయలు నావి కావంటూ వచ్చిన ఆదాయం నుంచి పక్కన పెడితే కుటుంబానికి చక్కటి రక్షణ కల్పించుకోవచ్చు. కానీ, మనం సామాన్యులం. జీవితానికి రక్షణ ఇచ్చే బీమా విషయంలోనూ పిసినారి తనం ప్రదర్శిస్తుం టాం. అనుకోనిది జరిగితే.. విధి ఎదురు తిరిగితే అప్పుడు మన కుటుంబం పడే కష్టాలను చూడ్డానికి మనం ఉండం. నిండు మనసుతో ప్రేమించే మనవారి కోసం ఒక్క టర్మ్ ప్లాన్ రక్షణగా ఇవ్వలేమా? అది లేకుండా వారి పట్ల ఎంత ప్రేమ చూపించినా తామరాకుపై నీటిబొట్టు చందమే అవుతుంది..! టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది స్వచ్ఛమైన, సూటైన బీమా ప్లాన్. ఇందులో ఎటువంటి గందరగోళం ఉండదు. అందుకే దీన్ని ప్రొటెక్షన్ ప్లాన్ అంటారు. జీవితానికి రక్షణ కల్పించేది. కుటుంబానికి ఆధారమైన ప్రతి వ్యక్తి ఈ ఒక్క బీమా ప్లాన్ తీసుకుంటే చాలు. పాలసీదారు వయసు, ఆరోగ్య చరిత్ర, ఎంచుకున్న కాలం (ఏ వయసు వరకు బీమా కావాలి) ఈ అంశాల ఆధారంగా ప్రీమియం ఏటా ఎంత కట్టాలన్నది బీమా కంపెనీ నిర్ణయిస్తుంది. ఏటా ఆ మేరకు చెల్లిస్తూ వెళ్లాలి. పాలసీ కాలవ్యవధి ముగిసేలోపు ఎప్పుడైనా పాలసీదారు ఏ కారణం వల్లనైనా మరణిస్తే.. అతని కుటుంబ సభ్యులు పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు పరిశీలన అనంతరం బీమా సంస్థ పరిహారాన్ని నామినీకి లేదంటే వారసులకు చెల్లిస్తుంది. మరి పాలసీ కాలవ్యవధి ముగిసేవరకు నిక్షేపంగా జీవించి ఉంటే? ఉదాహరణకు 75 ఏళ్ల వయసు వచ్చే వరకు రక్షణను ఎంపిక చేసుకున్నారనుకోండి? అప్పటికీ పాలసీదారు జీవించి ఉన్నారనుకుందాం. టర్మ్ ప్లాన్ కనుక రూపాయి కూడా తిరిగి రాదు. పాలసీ ముగిసిపోతుంది. అన్నేళ్లపాటు వేల రూపాయలు కడితే రూపాయి తిరిగి రాదా..? కొందరికి ఇది అస్సలు నచ్చదు. అందుకే వారు మాకొద్దు టర్మ్ పాలసీ అంటుంటారు. ఇక్కడ కావాల్సింది కుటుంబానికి రక్షణ, రాబడి కాదు. రాబడుల కోసం వేరే మార్గాలున్నాయి. ఒకవేల కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే.. అప్పటి వరకు కట్టినదంతా మరణించిన కుటుంబాలకు పరిహారంగా వెళ్లిందనుకుంటే ఆ సంతృప్తి వేరు. కనుక బీమా రక్షణ కోరుకునే వారు ముందుగా తీసుకోవాల్సింది టర్మ్ ప్లాన్. దీనికంటే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రీమియం ధరల పరిస్థితి ఇదీ... టర్మ్ ప్లాన్ల విషయంలో బీమా సంస్థల మధ్య ఆరోగ్యకర పోటీయే నడుస్తోంది. కరోనా రాకతో బీమా క్లెయిమ్‌లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. చెల్లింపుల భారంతో రీఇన్సూరెన్స్ సంస్థలు (బీమా సంస్థల పాలసీలపై బీమా ఇచ్చేవి) ప్రీమియంను గత ఆరు నెలల్లో పెంచేశాయి. కొన్ని బీమా కంపెనీలు పెరిగిన రీఇన్సూరెన్స్ రేట్ల మేర తమ పాలసీలపైనా అమలు చేశాయి. కొన్ని కంపెనీలు మాత్రం మార్కెట్ పెంచుకునేందుకు పాత ప్రీమియం ధరలనే కొనసాగిస్తున్నాయి. పాలసీ ప్రీమియం రేటు అనేది దరఖాస్తుదారుల వయసు, హెల్త్ రిస్క్, ఎంపిక చేసుకున్న కవరేజీ, కాలవ్యవధి అంశాల ఆధారంగా మారిపోతుంటుంది. పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేస్తే.. వయసు పెరుగుదల ఫలితంగా ప్రీమియం కూడా అధికమవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తితో పోలిస్తే 35 ఏళ్ల వ్యక్తికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 22 శాతం అధిక ప్రీమియం వసూలు చేస్తోంది. జీవనశైలి అలవాట్లు ప్రీమియం ధరలను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైనవి. ఉదాహరణకు పొగతాగడం, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం, మద్యం సేవించడం ఇవి ప్రీమియంను భారీగా పెంచే అంశాలు. పొగతాగే అలవాటు ఉందని వెల్లడిస్తే ఆరోగ్యవంతులతో పోలిస్తే ప్రీమియం 20 అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విద్యార్హతలు కూడా ప్రీమియంను 34 శాతం మేర ప్రభావితం చేస్తున్నాయి. అందుకునే ఇలాంటి అలవాట్లు, ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా కానీ నిజాయితీగా వెల్లడించడమే మంచిది. ప్రీమియం పెరిగినా వెల్లడించడం మానొద్దు. ఎందుకంటే భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు గురి కాకూడదంటే వెల్లడించాలి. ఇక ప్రీమియం తక్కువగా ఉండాలంటే ఉన్న ఏకైక మార్గం చాలా చిన్న వయసులో తీసుకోవడమే. అప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎంపిక చేసుకున్న కవరేజీ (బీమా రక్షణ రూపాయిల్లో) కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తుంది. బీమా కవరేజీ అన్నది అన్ని వయసులకు ఒకటే కాకుండా.. మధ్య వయసు నుంచి బాధ్యతలు పెరిగి వృద్ధాప్యానికి చేరువ అయ్యే క్రమంలో తగ్గిపోతాయి. కనుక కవరేజీ కూడా ఏటేటా కొంత శాతం చొప్పున మొదటి 15–20 ఏళ్లు పెరుగుతూ వెళ్లి.. ఆ తర్వాత తగ్గుతూ ఉండేలా ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తాయి. పరిహారం ఏక మొత్తంలో కావాలా? లేక సగం పరిహారం చెల్లించి మిగిలినది ప్రతీ నెలా నిర్ణీత కాలం వరకు చెల్లించేలా ఎంపిక చేసుకోవాలా? ఇది కూడా ప్రీమియంపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు ఇండియా ఫస్ట్ లైఫ్ రూ.కోటి కవరేజీని పాలసీ ముగింపు సమయానికి 2 కోట్లకు వెళ్లే ఆప్షన్ ఇస్తోంది. సాధారణ పాలసీతో పోలిస్తే ప్రీమియం 50 శాతం ఎక్కువ. 100 ఏళ్ల వయసు వచ్చే వరకు కవరేజీ ఎంపిక చేసుకున్నా.. ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కట్టిన ప్రీమియం కాలవ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే టర్మ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటి ప్రీమియం కూడా 50–100 శాతం వరకు అధికంగా ఉంటోంది. కానీ, ప్రీమియం వెనక్కి వచ్చే టర్మ్ ప్లాన్ లాభసాటి కానేకాదు. దీన్ని ఎంపిక చేసుకోవద్దు. దీనికి బదులు సాధారణ పాలసీ ఎంపిక చేసుకుని ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. టర్మ్ ప్లాన్ అన్నది తమపై ఆధారపడిన వారి భవిష్యత్తు ఆర్థిక రక్షణ కోసమే. 70 ఏళ్లు వచ్చే సరికి ఈ బాధ్యతలు దాదాపుగా ముగిసిపోతాయి. కనుక 100 ఏళ్లకు టర్మ్ ప్లాన్ ఉపయోగం లేని ఆప్షనే. పాలసీకి అనుబంధాలు.. యాడ్ ఆన్స్ పేరుతో పలు రైడర్లు టర్మ్ పాలసీకి అనుబంధంగా తీసుకోవచ్చు. వీటితో కవరేజీ విస్తృతి పెరుగుతుంది అంతే. ఉదాహరణకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఒకటి. తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే ఏక మొత్తంలో ఈ కవరేజీ కింద పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు రూ.5 లక్షల క్రిటికల్ ఇల్నెస్ కవర్ కోసం ఏటా రూ.2,000 ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. ఇలాంటి రైడర్లు అన్నవి పాలసీదారులు తమ అవసరాలను విశ్లేషించుకుని తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్‌నెస్‌లు ఏవన్నవి ప్రతి బీమా సంస్థ ఓ జాబితాను నిర్వహిస్తుంటుంది. అందులో ఉన్న వాటికే కవరేజీ వస్తుంది. ఇందులోనూ ఇండెమ్నిటీ, బెనిఫిట్ అని ఉన్నాయి. ఆస్పత్రిలో చేరితేనే పరిహారం ఇచ్చేవి ఇండెమ్నిటీ. బెనిఫిట్ ప్లాన్ అన్నది నిర్ధారణ అయిన వెంటనే ఏక మొత్తంలో చెల్లించేది. యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్ కూడా టర్మ్ ప్లాన్‌తో తీసుకోవచ్చు. ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే బీమాకు అదనంగా, ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర అదనపు పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం కారణంగా వైకల్యం పాలైనా పరిహారం చెల్లిస్తుంది ఈ రైడర్. పాలసీ డాక్యుమెంట్లో వైకల్యాన్ని తెలిపే వివరాలు ఉంటాయి. ఈ యాడ్ ఆన్ ప్రీమియం రూ.2,000లోపే ఉంటుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ అయితే సమగ్ర ప్రమాద బీమా రూ.కోటి కవరేజీకి రూ.6,000 వరకు చార్జ్ చేస్తోంది. పిల్లలు, భార్య రక్షణకు సంబంధించి యాడ్ఆన్స్ కూడా ఉన్నాయి. పాలసీదారు మరణిస్తే వీటి కింద ప్రత్యేక పరిహారం మంజూరవుతుంది. అప్పుడు పిల్లల విద్య, జీవిత భాగస్వామి పోషణ అవసరాలకు పరిహారం వినియోగమవుతుంది. దంపతుల్లో భార్య కూడా ఉద్యోగం చేస్తున్నట్టయితే తమ అవసరాలకు అనుగుణంగా విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఒకవేళ గృహిణి అయితే టర్మ్ ప్లాన్ రాదు. అలాంటప్పుడు జాయింట్ టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. బజాజ్ అలియాంజ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఎడెల్వీజ్ టోకియో లైఫ్ తదితర సంస్థలు జాయింట్ టర్మ్ ప్లాన్ అందిస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్లు హెల్త్ ప్లాన్ అనుబంధంగా కూడా లభిస్తాయి. బీమా సంస్థ పాలసీ కంటే ముందు చూసేది బీమా కంపెనీ గురించే. అవసరమైన సందర్భంలో పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా కంపెనీపై ఉంటుంది. ఆ బాధ్యతల్లో బీమా సంస్థ ఏ మేరకు నిజాయితీగా ఉంటుందన్నది చూడాలి. క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎటువంటి సమస్యల్లేకుండా సాఫీగా జరిగిపోవాలి. ఏ సంస్థ ఆర్థిక పరిస్థితి అయినా వచ్చే రెండు సంత్సరాల తర్వాతి కాలం గురించి విశ్లేషించడం అంత సులభం కాదని నిపుణులే అంటుంటారు. అందుకుని అప్పటి వరకు ఆ బీమా కంపెనీ పూర్వపు చరిత్రే ప్రామాణికం అవుతుంది. ఎల్ఐసీ ప్రభుత్వరంగ బీమా సంస్థ. అంతేకాదు ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలో ఎల్ఐసీకి వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. ఇక ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు బీమా కంపెనీలు ఎస్బీఐ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఇండియా ఫస్ట్ (బీవోబీ, యూనియన్ బ్యాంకు),కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ (కెనరా బ్యాంకు) విషయంలోనూ దీర్ఘకాలానికి సంబంధించి అంత ఆందోళన అక్కర్లేదు. బ్యాంకింగ్ అనుభవంతో అవి అండర్‌రైటింగ్ నైపుణ్యాలు ప్రదర్శంచగలవు. ప్రముఖ ప్రైవేటు బీమా కంపెనీలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, కోటక్ మహీంద్రా సైతం వాటి బ్యాంకింగ్ అనుభవాలపై ఆధారపడగలవు. దేశీ బీమా సంస్థల్లో ఎక్కువ కంపెనీలు విదేశీ భాగస్వామ్య సంస్థలతో కలసే బీమా వ్యాపారం నిర్వహిస్తున్నాయి. బీమా సంస్థ నిర్వహణలోని ఆస్తులు, విదేశీ భాగస్వామితో ఎంత కాలం నుంచి వ్యాపారం చేస్తోంది? సేవల నాణ్యత ఇలాంటి అంశాలన్నింటినీ తరచి చూడాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పాలసీ నిబంధనలకు బీమా సంస్థ ఎంత నిజాయతీగా కట్టుబడి ఉంటుందన్న దానిపైనే బీమా పరిహారం చెల్లింపులన్నవి ఆధారపడి ఉంటాయి. దీనికి ప్రామాణిక కొలమానమే క్లెయిమ్ చెల్లింపుల రేషియో. ఒకవేళ ఎక్కువ క్లెయిమ్‌లను తిరస్కరించినట్టయితే ఆ సంస్థ అండర్‌రైటింగ్ ప్రమాణాల నాణ్యతను సందేహించాల్సిందే. ఎం దుకంటే పాలసీదారు రిస్క్‌ను బీమా సంస్థ ముందే సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైనట్టుగానే చూడాలి. అందుకే క్లెయిమ్ చెల్లింపుల చరిత్ర బీమా సంస్థ నిజాయితీకి దర్పణం పడుతుంది. క్లెయిమ్‌ల పరిష్కార రేషియో అంటే.. మరణ పరిహారం కోరుతూ బీమా సంస్థకు వచ్చిన మొత్తం అభ్యర్థనల్లో ఎన్నింటిని ఆమోదించిందన్నది తెలిపే నిష్పత్తి. సాధారణంగా ఇది 94 శాతం నుంచి 98 శాతం మధ్యలో ఉంటోంది. ఎన్నింటిని తిరస్కరించింది? ఎన్నింటిని పెండింగ్‌లో పెట్టిందన్నది కూడా చూడాలి. వ్యక్తుల స్థాయిలో క్లెయిమ్ తిరస్కరణ రేటు గతంలో సగటున 0.6 శాతంగా ఉంటే, అది 5.5 శాతానికి పెరిగిపోయింది. గతంతో పోలిస్తే తిరస్కరణ రేటు పెరిగినట్టు తెలుస్తోంది. బీమా సంస్థల మధ్య ఇది భిన్నంగా ఉంటుంది. కరోనా సమయంలో క్లెయిమ్‌లకు సంబంధించి ప్రమాణాలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) కఠినతరం చేసింది. దీంతో ఎల్ఐసీ సగటు చెల్లింపుల రేషియో 2018–19లో 97.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి 98.6 శాతానికి మెరుగుపడింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా సంస్థల సగటు చెల్లింపుల రేషియో 96.6 శాతం నుంచి 97 శాతానికి పుంజుకుంది. క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ అన్నది ప్రీమియం ధరలపై ప్రభావం చూపించదు. పాలసీదారులు క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తికి అదనంగా.. క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ ఎంత సులభంగా ఉందన్నది విచారించుకోవాలి. ఆన్లైన్లో ఇందుకు సంబంధించి యూజర్ల రివ్యూలు లభిస్తాయి. జీవితానికి విలువ కట్టగలమా..? బీమాకు సంబంధించి జీవిత విలువ అనేది ముఖ్యం. అప్పుడే ఎంత విలువకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోగలం. పాలసీ తీసుకునే వారి భవిష్యత్తు ఆదాయ సామర్థ్యాన్ని అంచనా వేసి, ఆ విలువకు సరిపడా బీమా రక్షణ (సమ్ అష్యూర్డ్) కల్పించుకోవాలి. బీమా సంస్థల ఆన్లైన్ పోర్టళ్లలో కొటేషన్ చూసుకునే సమయంలో మనం చెప్పిన ఆదాయాన్ని బట్టి అర్హత మేరకు గరిష్ట బీమా కవరేజీని చూపిస్తున్నాయి. కాకపోతే ఎవరికి వారు వారి వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని నిర్ణయించుకోవాలి. వ్యక్తి వార్షిక జీవన అవసరాలు ఎంతో చూడాలి. అప్పటికే రుణ బాధ్యతలు (గృహ రుణం, వ్యక్తిగత రుణం, వ్యాపార రుణం, విద్యా రుణం ఇలా ఏవైనా) ఉంటే వాటిని కలుపుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని విస్మరించకూడదు. ఇలా వచ్చిన మొత్తానికి కనీసం 6 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ముడి పెట్టి, సరైన కవరేజీపై నిర్ణయానికి రావాలి. అంతేకానీ, రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి ఇలాంటి కవరేజీల్లో ప్రీమియంను బట్టి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం సరైన రక్షణ అనిపించుకోదు. -
దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్స్ ప్రొటెక్షన్ సెల్
సాక్షి,హైదరాబాద్: ట్రాన్స్‌జెండర్స్ రక్షణ కోసం మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘ప్రైడ్ ప్లేస్’పేరుతో దేశంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్స్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం లక్డీకపూల్‌లోని మహిళా భద్రతా విభాగం కార్యాలయంలో‘ప్రైడ్ ప్లేస్’లోగోను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..ట్రాన్స్జెండర్ల సమస్యలను పరిష్కరించడంలో ‘ప్రైడ్ ప్లేస్’చాలా ఉపయోగపడుతుందన్నారు. వివక్షకు గురికాకుండా వారి రక్షణకు అన్ని చర్యలను ఈ సెల్ చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, కొంతమంది కానిస్టేబుళ్లు బృందంగా పనిచేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రత్యేక సెల్ ఎప్పటికప్పుడు సంబంధిత కమ్యూనిటీతో చర్చలు జరుపుతూ రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో అధికారులకు, సిబ్బందికి రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు. 2019లో ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ సెల్ ఏర్పాటుకు కృషి చేసిన మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ బి.సుమతి, తరుణి ఎన్జీవో బాధ్యులు మమతా రఘువీర్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ప్రతినిధులను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
హీరో సూర్య ఇంటికి పోలీసు భద్రత
ప్రముఖ సినీ నటుడు సూర్య ఇంటి ముందు తుపాకీ కలిగిన పోలీసులతో భద్రతకు ఏర్పాటు చేశారు. తాజాగా ఆయన నటించిన ఎదుర్కుమ్ తునిందవన్ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని పీఎంకే పార్టీ నాయకులు, వన్నియర్ సంఘంకు చెందిన వారు వ్యతిరేకిస్తున్నారు. పైగా కడలూరు, విల్లుపురం జిల్లాలలో సినిమా విడుదలపై నిషేధం విధించాలని వారు కడలూరు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. దీంతో చెన్నైలోని సూర్య నివాసం వద్ద తుపాకీ కలిగిన పోలీసులతో భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.గతంలోనూ సూర్య నటించిన జై భీమ్ సినిమా వివాదాస్పదం కావడంతో అతని ఇంటికి భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. -
కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. మంత్రికి షాక్ ఇచ్చిన కూతురు!
ప్రేమించిన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకున్న యువతి.. ప్రాణ భయంతో పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె పక్క రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి కూతురని తేలడంతో పోలీసులు కంగుతిన్నారు. హై ప్రొఫైల్ కేసుగా ఇప్పుడిది మీడియాకు ఎక్కింది. ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత.. తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు కుమార్తె డాక్టర్ జయకళ్యాణి ప్రేమవివాహం చేసుకుంది. బెంగళూరులోని ఓ హిందూ ధార్మిక సంస్థలో సోమవారం సతీష్‌ను ఆమె వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఆరేళ్లుగా తాము ప్రేమించుకున్నామని, పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఈ పని చేశామని జయకళ్యాణి వివరణ ఇచ్చింది. అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఈ కొత్త జంట.. బెంగళూరు సిటీ కమిషనర్ కమల పంత్‌ను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కిడ్నాప్ కేసు! కూతురు కనిపించకుండా పోయేసరికి మంత్రి శేఖర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ అందులో పేర్కొన్నారు. దీంతో మంత్రి కూతురి కిడ్నాప్ తమిళ మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారింది. ఇంకోపక్క పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. ఈ లోపు పక్క రాష్ట్రంలో పోలీసుల ముందు ప్రత్యక్షమై ట్విస్ట్ ఇచ్చింది జయకళ్యాణి. బంధించారు.. వేధించారు సతీష్ ఆ ఇంటి డ్రైవర్. పైగా దళితుడు. కొన్ని నెలల క్రితం జయకళ్యాణిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రి మంత్రి శేఖర్‌ను అడిగాడు. డ్రైవర్, పైగా కులాంతర వివాహం కావడంతో మంత్రి ఒప్పుకోలేదు. పైగా సతీష్‌ను రెండు నెలల పాటు తమిళనాడు పోలీసుల సాయంతో అక్రమంగా నిర్బంధించాడు కూడా. ఇందుకు సంబంధించి గతంలో సతీష్ రిలీజ్ చేసిన ఓ వీడియో మీడియా వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు తాము మేజర్లు అయినందున పెళ్లి చేసుకున్నామని తెలిపింది జయకళ్యాణి. The News Minute సౌజన్యంతో వీడియో తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని తమ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని.. కాబట్టి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు ఆమె మీడియా ముందు పోలీసులను వేడుకుంటోంది. కాగా తమిళనాడు హిందూ రెలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ మినిస్టర్ అయిన శేఖర్‌బాబు.. సీఎం స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. -
Pudami Sakshiga:అడవి సృష్టికర్త "దుశర్ల సత్యనారాయణ"
-
స్క్రీన్ కష్టాలు.. చెక్ పెట్టండిలా!
కంప్యూటర్ ముందు పని చేసే ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. ఎక్కువ సమయం తదేకంగా స్క్రీన్‌ను చూడడం ఆరోగ్యానికి హానికరం. కన్ను, మెడ సమస్యలు ఎదురవుతాయి. అందుకే త్రీ ట్వంటీస్ (20–20–20) రూల్ ఒక మంచి ఆలోచన. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి పనిలో బ్రేక్ తీసుకుని కంప్యూటర్ స్క్రీన్ మీద నుంచి దృష్టి మరల్చి 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకన్ల పాటు చూడాలి. ఇదే 20–20–20 రూల్. పక్కన ఉన్న ఫొటోను గమనించండి. ∙కంప్యూటర్ బాధితులకు మరో సూచన... కంప్యూటర్ స్క్రీన్ నుండి వచ్చే లైట్ వలన కంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే యాంటీ గ్లేర్ గ్లాసెస్ ధరించాలి. అలాగే మరో సంగతి... కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి కంప్యూటర్ నుంచి వెలువడే కాంతి కంటే ఎక్కువ కాంతిలో ఉండాలి. అప్పుడు కంప్యూటర్ నుంచి వెలువడే కిరణాల దుష్ప్రభావం తీవ్రత తగ్గుతుంది. ఈ స్క్రీన్ కష్టాల్లో కొన్ని ఉద్యోగ, వృత్తుల రీత్యా తప్పని సరి అవుతుంటే మరికొన్ని మనకు మనంగా తెచ్చుకుంటున్న కష్టాలూ ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి స్మార్ట్ ఫోన్‌తో కొనితెచ్చుకునే ఇక్కట్లు. ∙నిద్రపోయే ముందు గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా స్మార్ట్ ఫోన్ చూస్తుంటారు. నిద్ర వచ్చే వరకు మాత్రమే అనుకుంటూ చాటింగ్, గేమ్స్, వీడియోలు చూడడం మొదలుపెడతారు. అది అరగంటకు పైగా సాగుతూనే ఉంటుంది. గేమ్ ఆడుతున్నంత సేపూ మెదడు చురుగ్గా ఉంటుంది. ఇక నిద్ర ఎలా వస్తుంది? -
National Bird Day 2022: బుల్లి గువ్వా.. ఎక్కడమ్మా నీ సవ్వడి
సాక్షి, హైదరాబాద్: పొద్దున్నే లేవగానే ఉదయిస్తున్న సూర్యుడినీ, అప్పుడే విచ్చుకుంటున్న పువ్వుల్ని, పసి పాపల నవ్వుల్ని చూస్తే మనసుకు భలే హాయిగా ఉంటుంది కదా. అలాగే బాల్కనీలో కూర్చుని వేడి వేడి కాఫీ తాగుతూ చిరప్ చిరప్ అంటూ ఎగిరే బుజ్జి బుజ్జి పిట్టల్ని, పావురాల్ని, పిచ్చుకల్ని చూస్తోంటే వచ్చే ఆనందాన్ని మీరు ఎపుడైనా ఆస్వాదించారా? ఆ ఇపుడు అవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటారా? ఆ ఆవేదన నుంచి వచ్చిందే జాతీయ పక్షుల దినోత్సవం. అంతరించిపోతున్న పక్షుల్ని, కాపాడుకునేందుకు, పక్షుల అవసరం, ఉనికిపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతీ ఏడాది జనవరి 5న నేషనల్ బర్డ్ డే ని పాటిస్తాం. పెంపుడు జంతువులైన కోళ్లు, బాతులతో పాటు పావురాలు, నెమళ్లు, చిలుకలు, పిచ్చుకలు, కోకిల. కాకులు, వడ్రంగిపిట్టలు, గద్దలు, డేగలు తదితర పక్షులు జీవన పరిణామ క్రమంలో, మానవ జీవితాల్లో, మనుషుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. కానీ. పర్యావరణ వ్యవస్థలలో కాలానుగుణ మార్పులతో దురదృష్టవశాత్తూ చాలా పక్షులు అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా నశించిపోతున్న అడవులు, సెల్ టవర్లు, ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పిచ్చుకలు పూర్తిగా కనుమరుగవుతున్న సందర్భంలో మనం ఉన్నాం. దీనికి తోడు చట్టవిరుద్ధమైన పెంపుడు జంతువుల వ్యాపారం కారంణంగా మరింత ప్రమాదం కలుగుతోంది. నిజానికి చాలా పక్షులు, పిట్టల పేర్లు నేటి తరానికి తెలియవు. కేవలం పుస్తకాల్లోనో, కంప్యూటర్ గ్రాఫిక్స్‌లోనో చూసి తెలుసుకోవాల్సిన దుస్థితి. భారత్‌లో తగ్గిపోతున్న పక్షుల జాబితాలో గద్దలు, రాబందులు, పిచ్చుకలు, ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఉగాది సందేశాన్ని అందించే కోకిలమ్మను వెతుక్కోవాల్సిన పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్న అనేక వాగులు, చెరువుల్లోకి వలస వచ్చే పక్షులు కూడా భారీ తగ్గుదల కనిపిస్తోందని పలు అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య జీవావరణ శాస్త్రవేత్తలను కలవర పెడుతోంది. అమెరికా, కెనడాల్లో 300 కోట్ల పక్షుల మాయమైపోయాయట. అలాగే ఒకప్పుడు ఆస్ట్రేలియా ఆగ్నేయ భాగంలో ఎక్కువగా కనిపించే రీజెంట్ హనీఈటర్ అనే పక్షి అంతరించిపోతున్న జీవ జాతుల జాబితాలోకి చేరిపోయింది. అంతేకాదు ఆడపక్షుల్ని తమ పాటతో ఆకట్టుకునే మేల్ హనీఈటర్ పక్షులు తమ సహజసిద్ధమైన పాటను కూడా మర్చిపోతున్నాయంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రోజుకురోజుకు ఈ ముప్పు మరింత ముంచుకొస్తోంది. ఒకప్పుడు పావురాలు ప్రేమ సందేశాల్ని పంపేందుకు మాత్రమే కాదు కీలక సమాచారాన్ని చేరవేసే వార్తాహరులుగా పనిచేశాయి. సప్తవర్ణ రంజితమై పురి విప్పి ఆడే నెమలి నాట్యం, చిలుకలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాగే గూడు కట్టుకోవడంలో చాలా పక్షుల నైపుణ్యానికి మన ఆధునిక ఇంజనీర్లు కూడా అబ్బురపడాల్సిందే. ఇక గిజిగాడు గూడు.. అదేనండి పిచ్చుక గూళ్లతో ప్రతీ పల్లె కళకళలాడుతూ ఉండేది. అంతేనా ఆకు ఈనెలతో తోకను చక్కగా అలంకరించుకునే చిలుకలు, చక్కటి గూడు అల్లుకునే బుజ్జిపిట్టలు.. అచ్చం చిన్నపిల్లల ఏడుపులా అరిచే పిట్టలు..అంతెందుకు పక్షిని చూసే కదా మన రైట్ బ్రదర్స్ విమానాల్ని సిద్ధం చేసింది. ఇలా మనం గమనించాలే గానీ ప్రకృతి అంతా టెక్నాలజీ మయం. ఇకనైనా కనుమరుగవుతున్న వందల జాతుల పక్షుల మనుగడ కోసం పక్షి ప్రేమికుల్లాగా కృషి చేద్దాం. అన్నట్టు బర్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్. తెలంగాణ అటవీ శాఖ బర్డ్ వాక్ సెకండ్ యానివర్సరిలో భాగంగా జనవరి 8-9 తేదీల్లో 250 కంటే ఎక్కువ రకాల పక్షులను చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. లెట్స్ గో అండ్ ఎంజాయ్.. -
టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటి చాలదా..?
జీవిత బీమా సాధనాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ సాధనం ఎంతో కీలకమైనది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీనిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వారు, సంపాదించే శక్తి కలిగిన వారు టర్మ్ ఇన్సూరెన్స్‌తో తమవారికి తగినంత రక్షణ కల్పించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో ఇప్పటికీ ఎక్కువ మందికి టర్మ్ బీమా ప్లాన్లు లేవు. కొందరికి ఒకటికి మించి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటి ఉంటే సరైనది.. రెండుంటే ప్రతికూలమని చెప్పడానికి లేదు. ఏ ప్రయోజనాలను ఆశించి ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు తీసుకున్నామనే స్పష్టత అయితే ఉండాలి. వాస్తవానికి ఎక్కువ ప్లాన్లను కలిగి ఉండడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, ఎన్ని ఉన్నా.. కవరేజీ తగినంత ఉండడం కీలకమని గుర్తుంచుకోవాలి. ఒకటికి మించిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో ఉండే లాభ, నష్టాలపై అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది దీర్ఘకాలానికి తీసుకోతగిన బీమా సాధనం. పాలసీదారు ఏదేనీ కారణంతో మరణించినట్టయితే.. ఆ వ్యక్తిపై ఆధారపడినవారు, కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకునే సాధనం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. సరైన బీమా రక్షణతో తీసుకోవడమూ అంతే కీలకం. పాలసీదారు లేని పరిస్థితుల్లో కుటుంబ అవసరాలు, బాధ్యతలు, స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాలన్నింటినీ బీమా పరిహారం తీర్చేదిగా ఉండాలి. పాలసీ తీసుకునే సమయంలో ఎంత మొత్తంకావాలన్నది నిర్ణయించుకోవడం కొంచెం క్లిష్టమైన పనే. దీంతో ఎక్కువ మంది అవసరానికంటే తక్కువ మొత్తానికే కవరేజీతో సరిపెట్టుకుంటుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్‌లో మాదిరిగా లైఫ్ ఇన్సూరెన్స్‌కు టాపప్ సదుపాయం ఉండదు. కనుక ఒక్కసారి టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాత తదనంతర పరిస్థితుల్లో కవరేజీ చాలదని గుర్తించినట్టయితే అదనంగా మరొక టర్మ్ ప్లాన్‌ను జోడించుకోవడం మినహా మరో మార్గం లేదు. ఒకటికి మించి టర్మ్ ప్లాన్లను తీసుకోవడం మన దేశంలో చట్టబద్ధమే. ఎన్నో రకాల ప్రయోజనాలు వాటితో వస్తాయి. గరిష్ట కవరేజీ, భిన్నమైన ప్రయోజనాలు ఆయా ప్లాన్లతో ఏర్పాటు చేసుకోవచ్చు. రెండో టర్మ్ ప్లాన్ తీసుకోవాలని భావించినట్టయితే.. నేరుగా బీమా కంపెనీ నుంచి తీసుకోవడం మంచిది. వివిధ కంపెనీలు ఆఫర్ చేసే ప్లాన్లలో భిన్నమైన ప్రయోజనాలు, సదుపాయాలు, మినహాయింపలు, జోడింపులు ఉంటాయి. కనుక వేర్వేరు కంపెనీల నుంచి టర్మ్ ప్లాన్ ఉండడం ఒక విధంగా లాభదాయకమే. కాకపోతే మొదటి పాలసీ తర్వాత నుంచి ఎన్ని పాలసీలు తీసుకున్నా కానీ, అంతకుముందు బీమా పాలసీల గురించి తప్పకుండా ప్రపోజల్ పత్రంలో పేర్కొనాలి. ఈ సమాచారంతోనే కంపెనీలు రిస్క్‌ను మదింపు వేసుకుని, తమ నిర్ణయాన్ని తెలియజేయగలవు. అప్పటి వరకు ఉన్న ప్లాన్ల వివరాలను దాచి పెడితే భవిష్యత్తులో క్లెయిమ్‌ల సమయంలో ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అందువల్ల గత ప్లాన్ల వివరాలు దాచిపెట్టవద్దు. వయసు ఆధారంగా.. వయసు ఆధారంగా బీమా కవరేజీని నేడు బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు 18–35 ఏళ్ల వయసు వారు వార్షికాదాయానికి గరిష్టంగా 25 రెట్ల బీమా కవరేజీకి అర్హులు. 36–40 ఏళ్ల వయసు వారు వార్షిక ఆదాయానికి 20 రెట్లు.. 41–50 ఏళ్ల గ్రూపులో ఉన్న వారు వార్షిక ఆదాయానికి 10–15 రెట్ల వరకు కవరేజీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క పాలసీ అయినా, ఒకటికి మించి టర్మ్ ప్లాన్లు అయినా వార్షిక ఆదాయ రుజువును చూపించాల్సిందే. ఎక్కువ ప్లాన్లు ఎందుకు? ఒకటి చాలక ఇంకొకటి తీసుకుంటున్నారా..? లేక వేరే ప్రయోజనాల కోసం ఒకటికి మించి ప్లాన్లను తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు కచ్చితంగా పాలసీదారులు సమాధానం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్క ప్లాన్‌లో తగినంత కవరేజీ తీసుకుంటే అయ్యే ప్రీమియంతో పోలిస్తే.. అంతే కవరేజీని ఒకటికి మించి ప్లాన్ల రూపంలో తీసుకోవాలంటే కాస్త అధిక ప్రీమియం భరించాల్సి రావచ్చు. అయినప్పటికీ ఒకటికి మించి ప్లాన్లతో ఉంటే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే అదే మంత భారం అనిపించదు. ఒకటికి మించిన ప్లాన్లను వేర్వేరు సంస్థల నుంచి తీసుకోవడం వల్ల.. బీమా కవరేజీలో వైవిధ్యానికి చోటు ఇచ్చినట్టు అవుతుంది. ఉదాహరణకు శాంతన్ అనే వ్యక్తి తనకు రూ.కోటి బీమా రక్షణ అవసరమని భావించాడనుకుంటే.. రూ.కోటి కవరేజీతో ఒక సంస్థ నుంచి టర్మ్ ప్లాన్ తీసుకున్నాడనుకోండి. క్లెయిమ్ సమయంలో వివాదం లేదా సమస్య ఏర్పడి సకాలంలో పరిహారం అందకపోతే అతడి కుటుంబం ఇబ్బంది పడాల్సి వస్తుంది. రూ.కోటి సమ్ అష్యూరెన్స్‌ను ఒకటికి మించిన పాలసీల పరిధిలో వేర్వేరుగా తీసుకుంటే.. అప్పుడు కనీసం ఒక సంస్థ నుంచి అయినా సకాలంలో పరిహారం లభిస్తుంది. ఇది మరణించిన వ్యక్తి కుటుంబానికి ఉపశమనాన్నిస్తుంది. అలాగే, శాంతన్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకుంటే.. రూ.కోటి కవరేజీకి బీమా కంపెనీలు అంగీకరించకపోవచ్చు. అటువంటి సందర్భాల్లోనూ ఒకటికి మించిన సంస్థల నుంచి తక్కువ మొత్తాలతో బీమా ప్లాన్‌ను తీసుకోవచ్చు. అలా గరిష్ట కవరేజీకి అవకాశం లభిస్తుంది. రుణ భారం అప్పటికే ఒక టర్మ్ ప్లాన్ ఉన్నా కానీ, మరొక పాలసీ తీసుకోవాల్సిన ప్రత్యేక సందర్భాలు కూడా ఉంటాయి. మొదటి టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాతి కాలంలో.. ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటే కచ్చితంగా అదనపు కవరేజీ అవసరం ఏర్పడుతుంది. రుణానికి సమాన స్థాయిలో కవరేజీతో మరొక ప్లాన్‌ను తీసుకోవాలి. గృహ రుణం, వ్యాపారం కోసం రుణాలను తీసుకుంటే, వెంటనే ఆ రుణ భారానికి సమాన స్థాయిలో టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. అలా కాకుండా అప్పటికే ఒక బీమా ప్లాన్ ఉందిలేనని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ముందు తీసుకున్న టర్మ్ ప్లాన్ కుటుంబ అవసరాల కోసమని గుర్తు పెట్టుకోవాలి. రుణాలకు ప్రత్యేకమైన కవరేజీ లేకపోతే.. అప్పుడు కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న టర్మ్ ప్లాన్.. పాలసీదారు మరణించిన తర్వాత రుణ భారాలను చెల్లించడానికి కరిగిపోవచ్చు. ముఖ్యంగా టర్మ్ ప్లాన్ కవరేజీ ‘హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ’ (హెచ్ఎల్వీ)ను మించి ఉండాల్సిన అవసరం లేదు. వ్యక్తి ఆదాయం, పొదుపు, బాధ్యతలన్నింటినీ కలిపితే వచ్చేదే హెచ్ఎల్వీ. దీనిని బట్టి ప్లాన్ ప్రణాళిక ఉంటే సరిపోతుంది. భారం దించుకోవచ్చు.. అలాగే ఎక్కువ టర్మ్ ప్లాన్లను కలిగి ఉంటే.. 50 వసంతాలను దాటి, తమపై బాధ్యతలు తగ్గిపోతున్న తరుణంలో ఒకటి, రెండు టర్మ్ ప్లాన్లను నిలిపివేసుకోవడం వల్ల కొంత ఆదా చేసుకోవచ్చు. లేదా ప్రీమియం భరించలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం ఒక ప్లాన్‌ను అయినా సరెండర్ చేయడం ద్వారా కొంత భారాన్ని దించుకోవచ్చు. అలా కాకుండా అధిక కవరేజీతో ఒక్కటే ప్లాన్ ఉంటే రక్షణ కోసం కచ్చితంగా దాన్ని కొనసాగించుకోక తప్పదు. మరోవైపు బీమా పరిశ్రమ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతోంది. పాలసీల పరంగా భిన్నమైన ప్రయోజనాలు, సదుపాయాలతో కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. పాలసీదారులకు భిన్నమైన సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఉత్పత్తులతో పోలిస్తే.. 5–10–20 ఏళ్ల క్రితం ప్లాన్లు చాలా సాధారణంగానే ఉండేవి. ప్రస్తుతం టర్మ్ ప్లాన్లలో జీవిత భాగస్వామి (గృహిణులకు సైతం)కి సైతం కవరేజీని తీసుకునే అవకాశం ఉంది. అలాగే, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ రైడర్, ప్రమాద మరణం, ప్రమాద వైకల్యం, చిన్నారుల భవిష్యత్తు ప్రయోజనాలను రైడర్ రూపంలో చాలా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పాలసీదారు తన ఆర్థిక, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా టర్మ్ ప్లాన్ కవరేజీలను ఎంపిక చేసుకోవాలి. -
తల్లి వద్దు.. ప్రియుడే కావాలి..
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): తల్లి మాటను కాదని ప్రియుడే కావాలని నిర్ణయించుకుంది ఓ డిగ్రీ విద్యార్థిని. కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపంలోని కరవిలగం ప్రాంతానికి చెందిన రామచంద్రన్ కుమారుడు సజిన్ (25), కరంగల్ ప్రాంతానికి చెందిన డిగ్రీ సెకండియర్ చదువుతున్న రాజేంద్రన్ కుమార్తె అబిషా (21) ప్రేమించుకున్నారు. ఇద్దరు ఇంట్లో నుంచి లేచిపోయి ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. రక్షణ కల్పించాలని మార్తాండం పోలీసులను ఆశ్రయించారు. ఇన్స్పెక్టర్ సెంథిల్‌వేల్ వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. చదువు పూర్తయిన తరువాత ప్రియుడి ఇంటికి వెళ్లాలని తల్లి, పోలీసులు అమ్మాయికి సలహా ఇచ్చారు. ఆ అమ్మాయి తన మెడలో ఉన్న నగలను తీసి తల్లికి ఇచ్చి ప్రియుడు వెంట వెళ్లేందుకు సమ్మతించింది. చదవండి: ముందస్తు ‘కుట్ర’తోనే రైతులను తొక్కించారు -
పర్సనల్ డేటా ప్రొటెక్షన్
సాక్షి, న్యూఢిల్లీ: పౌరుల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ‘పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు–2019 (పీడీపీ)’ ముసాయిదాకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఉభయ సభల ముందుకు రానుంది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన అనంతరం 2019 డిసెంబర్లో ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోపత్య కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నా అంశాలు, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆనాడు ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు నివేదించారు. దీనిపై పలువురు విపక్ష ఎంపీలు తమ అసమ్మతి తెలుపుతూ జేపీసీ చైర్మన్ చౌదరికి లేఖ రాశారు. కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, వివేక్ టాంకా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా, బిజూ జనతాదళ్ ఎంపీ అమర్ పట్నాయక్ జేపీసీ నిర్ణయంతో విభేదించారు. వేర్వేరుగా తమ అసమ్మతి నోట్లను ప్యానెల్ ఛైర్మన్‌కు పంపారు. ఏదైనా నేరం జరిగే ఆస్కారం ఉందని భావించినా దాన్ని నిరోధించడానికి, ఆ విషయంలో తదుపరి దర్యాప్తు చేయడానికి, సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడానికి వ్యక్తిగత డాటాను విశ్లేషించే అధికారాన్ని ఈ చట్టంలో దర్యాప్తు సంస్థలకు వీలు కల్పించారు. ఈడీ, సీబీఐలతో సహా తమ దర్యాప్తు సంస్థలకు వ్యక్తిగత గోప్యత రక్షణ హక్కు చట్టం నుంచి మినహాయించే అపరిమిత అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టడాన్ని విపక్షాలు తీవ్రం ఆక్షేపించాయి. ఇలా మినహాయింపు ఇవ్వడానికి పార్లమెంటు ఆమోదం తీసుకోవాలని, అప్పుడే సిసలైన జవాబుదారీతనం ఉంటుందని విపక్షాలు కోరినా ప్రభుత్వం అంగీకరించలేదు. చట్టం స్ఫూర్తికే దెబ్బ.. కమిటీ సిఫార్సుల్లో రెండు మినహా మిగతా అంశాలపై అభ్యంతరం లేదని జైరాం రమేశ్ పేర్కొన్నారు. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో సంబంధాలు, శాంతిభద్రతలకు సంబంధించి కేంద్రం, ప్రభుత్వ ఏజెన్సీలు తమని తాము మినహాయించుకోవడానికి అనుమతించే బిల్లులోని క్లాజ్ 35ను పలువురు విపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ చట్టం నుంచి ప్రభుత్వం, ప్రభుత్వ చట్టబద్ధ సంస్థలకు(పోలీసులు, సీబీఐ, ఈడీ, రా, ఐబీ, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) మినహాయింపు లభించనుంది. ట్విట్టర్, ఫేసుబుక్ వంటి వాటిని సామాజిక ప్రసార మాధ్యమ వేదికలుగానే పరిగణించాలని తేల్చిచెప్పింది. వాటికి మధ్యవర్తిత్వ హోదా (ఇంటర్మీడియటరీ హోదా... ఎవరైనా వినియోగదారుడు సదరు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకమైన అంశాలను పోస్టు చేసే వాటికి ఈ సోషల్ మీడియా సంస్థ బాధ్యత ఉండదు) తొలగించి వాటిని సైతం ఈ చట్టం కిందికి తీసుకురావాలని సూచించింది. బిల్లులోని క్లాజ్ 35 ప్రకారం.. పౌరుల అనుమతి లేకుండానే వారి వ్యక్తిగత డేటాను ప్రభుత్వం, ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు విశ్లేషించవచ్చు. ఐటీ శాఖతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా మినహాయింపు ఇవ్వాలని జేపీసీ పేర్కొంది. -
అటవీ పరిరక్షణపై రాజీపడొద్దు!
చిన్న అవసరాలు తీర్చడం నుంచి, ఆహారం, పశుగ్రాసం, వైద్యానికి పనికొచ్చే మొక్కలు, వంటచెరుకు లాంటివాటిని నిరంతరాయంగా ఇస్తూ అడవులు లక్షలాది మందికి జీవనాధారంగా నిలుస్తున్నాయి. అయితే అటవీశాఖ అనుమతులను సాధించాల్సిన అవసరం లేకుండానే అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు మినహాయింపులు కలిగించే వాతావరణం దేశంలో పెరుగుతోంది. అటవీ పరిరక్షణ చట్టానికి తాజాగా ప్రతిపాదించిన సవరణలు చట్టరూపం దాల్చితే, దేశంలోని అటవీ భూములను భారీ స్థాయిలో ఇతర ఉపయోగాలకు వాడుకోవడానికి మార్గం ఏర్పడినట్లే. కొత్త విద్యుత్ కర్మాగారాలు, హైవేలు, బుల్లెట్ ట్రెయిన్ కారిడార్లను ఏర్పాటుచేయడానికి అడవులను అడ్డంకిగా భావించకుండా– వాటిని మనం కాపాడుకోవాల్సిన ఉమ్మడి పర్యావరణ వారసత్వంగా పరిగణించాలి. స్వల్పకాలిక లక్ష్యాల కోసం విధానాలను మార్చుకోవడం ప్రమాదకరం. అనేక సందర్భాల్లో అటవీశాఖ అనుమతులను సాధించాల్సిన అవసరం లేకుండానే అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు మినహాయింపులు కలిగించే వాతావరణం దేశంలో పెరుగుతోంది. 1980లో అటవీ పరిరక్షణ చట్టం ఉనికిలోకి రాకముందు సేకరించిన భూమిని వివిధ ప్రాజెక్టులకు మళ్లించడం జరుగుతున్నా, దానిలో చాలా భాగాన్ని ఇప్పటికీ వినియోగించడం లేదు. గత సంవత్సరం పర్యావరణ ప్రభావిత అంచనా (ఇఐఏ) చట్టాల్లో మౌలిక మార్పులను ప్రారంభించడం ద్వారా దేశ పర్యావరణ పరిరక్షణ చట్టాలపై బహుముఖ దాడికి రంగం సిద్ధమైంది. 1980 అటవీ పరిరక్షణ చట్టం స్వయంగా ఈ దాడిలో బాధితురాలు కాబోతోంది. ఆనాటి చట్టం భారత పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 1980 అటవీ పరిరక్షణ చట్టంలో తీవ్రమార్పులను ప్రతిపాదించింది. కేంద్ర మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఈ మార్పులను ఇటీవలే ప్రజా పరిశీలన నిమిత్తం బహిరంగపర్చారు. సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ప్రభావితం చేసేలా అటవీ పరిరక్షణ చట్టానికి విస్తృతమైన భాష్యాన్ని బలహీన పర్చేలా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ప్రతిపాదించిన సవరణలు చట్టంలో భాగంగా మారితే, దేశంలోని అటవీ భూములును భారీ స్థాయిలో ఇతర ఉపయోగాలకు వాడుకోవడానికి మార్గం ఏర్పడినట్లే. భారతదేశంలో పర్యావరణ వ్యవస్థ అంత పాతదేమీ కాదు. ఆర్థిక పురోగతిలో పర్యావరణ అంశాలను మేళవించడం అనే భావన తొలిసారిగా నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలంలో (1969–1974) తీసుకొచ్చారు. ఆనాటివరకు రాజకుటుంబాలు, విదేశీ పర్యాటకులు సఫారీ పేరుతో జంతువుల వేటను తీవ్రస్థాయిలో కొనసాగించేవారు. అప్పట్లో వన్యప్రాణుల విభాగం వ్యవసాయ మంత్రిత్వ కార్యాలయానికి అనుసంధానమై ఉండేది. ఇది వలసపాలనా కాలం నాటి చట్టాలతోటే నడిచేది. 1973లో ప్రారంభించిన టైగర్ ప్రాజెక్టు దేశంలో ప్రప్రథమ వన్యప్రాణి పరిరక్షణ ప్రాజెక్టుగా రికార్డుకెక్కింది. తదనంతరం మంత్రిత్వ శాఖగా మారిన పర్యావరణ విభాగం 1980లో ఉనికిలోకి వచ్చింది. అదే సమయంలో రిజర్వ్ చేసిన అడవులను రిజర్వ్డ్ పరిధిలోంచి తీసివేయాలన్నా, అటవీ భూములను అటవీయేతర ప్రయోజనాలకు ఉపయోగించాలన్నా కేంద్రప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని నాటి కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అలాంటి అనుమతుల విషయంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ఒక సంప్రదింపుల కమిటీని కూడా నెలకొల్పారు. దీంతో చట్టబద్ధమైన ఆదేశంతో అటవీ పరిరక్షణ విధానానికి నాంది పలికినట్లయింది. అలాగే అటవీ భూములను మరే ఇతర ప్రాజెక్టుకోసమైనా మళ్లించడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ చట్రం క్రమానుగతంగా రూపొందుతూ వచ్చింది కానీ అది ఎల్లప్పుడూ పర్యావరణ మెరుగుదలకు తోడ్పడలేదు. పర్యావరణ పరిరక్షణ అనే భావనను అవసరమైన దుష్టురాలిగా ప్రభుత్వాలు చూడసాగాయి. ఫలితంగా అటవీ పరిరక్షణ చట్టం 1980ల నుంచి అనేక మార్పులకు గురవుతూ వచ్చింది. పైగా అనేక వివాదాలకు, లావాదేవీలకు ఇది కేంద్రబిందువైంది. 1996 డిసెంబరులో సుప్రీంకోర్టు వెలువరించిన ఒక తీర్పు ఈ చట్టం పరిధిని విస్తృతం చేసింది. యాజమాన్యం, గుర్తింపు, వర్గీకరణలతో పనిలేకుండా ప్రభుత్వ రికార్డులో ’అడవి’గా నమోదైన అన్ని ప్రాంతాలకు ఇది వర్తిస్తుందని ఈ తీర్పు వ్యాఖ్యానించింది. ఈ అంశానికి కట్టుబడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత అటవీ చట్టం, 1927, రాష్ట్ర ప్రభుత్వ చట్టాల కింద గుర్తించిన ప్రాంతాలను మాత్రమే అడవులుగా అన్వయిస్తూ వచ్చాయి. అయితే అడవులు అంటే నిఘంటువుల్లో ఉన్న అర్థాన్ని నిర్దారించే ప్రాంతాలను కూడా అటవీ పరిరక్షణ చట్టం కిందికి తీసుకురావాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. అయితే పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ అనేక ఉదంతాల్లో అటవీ శాఖ ఆమోదం పొందనవసరం లేనివిధంగా ప్రాజెక్టు ప్రతిపాదనలకు మినహాయింపు నిచ్చేలా పలు లొసుగులను సృష్టిం చాలని ఇప్పుడు ప్రయతిస్తూ ఉండటం గమనార్హం. అయితే 1980లో అటవీ పరిరక్షణ చట్టం ఏర్పడక ముందు సేకరించిన భూమి అటవీ భూమి అయినప్పటికీ దానికి, 1996 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎలాంటి అనుమతులూ పొందనవసరం లేదు. లేదా దీన్ని రక్షిత అటవీప్రాతంగా దీన్ని గుర్తించాల్సిన అవసరం లేకుండా పోయింది. అదే విధంగా 1996 సుప్రీం తీర్పుకు ముందు రెవిన్యూ రికార్డుల్లో అడవిగా వర్గీకరించిన భూమిని అటవీ పరిరక్షణ చట్టం పరిధికి ఆవల ఉంచేయడం జరిగింది. అడవుల పెంపకం ఫలితంగా పెరిగిన కొత్త అడవులను వాస్తవానికి అడవులుగా గుర్తించ కూడదని కేంద్ర మంత్రిత్వ శాఖ భావిస్తోంది. మరొక మినహాయింపు ఏమిటంటే, అటవీ భూమిని వ్యూహా త్మక, రక్షణ ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలకు నేరుగా అనుమతి నివ్వడం. అలాంటి ప్రాజెక్టుల గురించి సరైన నిర్వచనం ఇవ్వని నేపథ్యంలో అటవీ భూములను కొత్త ప్రాజెక్టులకు ఉపయోగించుకోవడానికి అడ్డదారులకు భారీగా అవకాశం ఇచ్చేశారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ గణాం కాల ప్రకారం– అటవీ నిర్మూలనను అరికట్టడంలో అటవీ పరిరక్షణ చట్టం(ఎఫ్సీఏ) గొప్ప పాత్ర పోషించింది. 1951 నుంచి 1976 మధ్య ప్రతి సంవత్సరం 1.6 లక్షల హెక్టార్ల అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్లించడం జరిగేది. కానీ అటవీ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంతో 1980 నుంచి 2011 మధ్య ఈ సంఖ్య ఏటా 32,000 హెక్టార్లకు తగ్గిపోయింది. కాబట్టి ఈ చట్టాన్ని నీరుగార్చే ఏ చర్య అయినా నిర్వనీకరణకు కారణం అవుతుంది. చిన్న అవసరాలు తీర్చడం నుంచి, ఆహారం, పశుగ్రాసం, వైద్యానికి పనికొచ్చే మొక్కలు, వంటచెరుకు లాంటివాటిని నిరంతరాయంగా ఇస్తూ అడవులు లక్షలాది మందికి జీవనాధారంగా నిలుస్తున్నాయి. కార్బన్ గ్రాహకాలుగా పనిచేస్తున్నాయి. అటవీ నిర్మూలన, అడవుల్లో జీవవైవిధ్యాన్ని దిగజార్చే ఏ చర్య అయినా కార్బన్ ఉద్గారాలకు కారణం అవుతుంది. వాతావరణ మార్పును నిరోధించాలంటే, అడవులను కాపాడుకోవడం, మరిన్ని అదనపు అడవులను సృష్టిం చడం తప్పనిసరి. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి విధానపరమైన సదస్సుకు అనుగుణంగా చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం కూడా ఇండియా దానికి కట్టుబడి ఉండాలి. కొత్త విద్యుత్ కర్మాగారాలు, హైవేలు, బుల్లెట్ ట్రెయిన్ కారిడార్లను ఏర్పాటుచేయడానికి అడవులను అడ్డంకిగా భావించకుండా– వాటిని కాపాడుకోవాల్సిన, విస్తరించాల్సిన ఉమ్మడి పర్యావరణ వారసత్వంగా పరిగణించాలి. సహజ వనరుల నియంత్రణ కోసం ముక్కలు ముక్కల ధోరణి కాకుండా అవిభాజ్యమైన కొనసాగింపు విధానం ఉండాలి. భారతదేశంలో అటవీ, వృక్ష ఆచ్ఛాదన ప్రస్తుతం ఒక భౌగోళిక ప్రాంతంలో ఉండాల్సిన 33 శాతం కాకుండా 25 శాతం కంటే తక్కువగా ఉంది. చెప్పాలంటే, అటవీ ఆచ్ఛాదనకు సంబంధించిన శాస్త్రీయమైన ఆడిట్ కూడా జరగాలి. చట్టంలో మార్పులకు సంబంధించి స్థానిక సమాజాలు, పౌర సమాజం, రాష్ట్రాలు, ఇతర పక్షాలతో కూడిన విస్తృతమైన ప్రజాబాహుళ్యంలో చర్చ జరగాలి. స్వల్పకాలిక లక్ష్యాలకు సరిపడేలా విధానాలను మార్చుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం. – దినేష్ శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యాఖ్యాత -
తిరిగి రండి.. మీకు పూర్తి రక్షణ కల్పిస్తాం: అఫ్గన్ ప్రధాని
కాబూల్: అఫ్గనిస్తాన్ ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్లు అఫ్గన్‌ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశంలో పరిస్థితులు తారుమారయ్యాయి. గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులు ఎవరు విధులకు హాజరవ్వడం లేదు.. చాలా మంది దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ప్రస్తుత అఫ్గన్ ప్రధాని ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ ప్రభుత్వ అధికారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని.. తిరిగి దేశానికి రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు అఖుంద్ బుధవారం ఓ ప్రకటన చేశారు. (చదవండి: కొత్త కోణం: అఫ్గాన్ సింహాలు తలవంచేనా!) అఖుంద్ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్‌లో అధికారంలోకి రావడానికి మేం భారీ మూల్యం చెల్లించాం. దేశ పునర్నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదుర్కొబోతున్నాం. ఈ సందర్భంగా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. దేశం విడిచిపోయిన అధికారులు తిరిగి వచ్చేయండి. మీకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాం. యుద్ధంలో ధ్వంసమైన అఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో అనేక సవాళ్లను చవి చూడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మీ అవసరం చాలా ఉంది. మీ రక్షణ బాధ్యత మాదే.. తిరిగి దేశానికి వచ్చేయండి’’ అని పిలుపునిచ్చాడు. (చదవండి: Afghanistan: అఫ్గాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం) తాజాగా అఫ్గనిస్తాన్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో ఎక్కువగా అంతర్జాతీయ ఉగ్రవాదులు, వారి తలపై రివార్డులు ఉన్న వారు గ్వాంటనామా జైళ్లలో మగ్గి వచ్చిన వారే ఉండటం గమనార్హం. ఈ ప్రభుత్వ ఏర్పాటులో పాక్ కీలక పాత్ర పోషించింది. అఫ్గన్ కేబినెట్ మంత్రులు సెప్టెంబర్ 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9/11 దాడులకు ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో అఫ్గన్ కేబినెట్ మంత్రులు ఆ రోజే తమ ప్రమాణ స్వీకారానికి ఎన్నుకోవడం గమనార్హం. -
AP: బడుగుల భద్రతలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: దళితులు, గిరిజనులకు పూర్తి భద్రత.. సామాజికంగా భరోసా.. రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ.. ఇదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపడుతోంది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడినా పర్వాలేదనే టీడీపీ ప్రభుత్వ హయాంలోని పరిస్థితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమూలంగా సంస్కరించింది. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అప్రతిహతంగా సాగిన దళితులు, గిరిజనుల హక్కుల హననానికి అడ్డుకట్ట వేసింది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలను తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నది. 2014–19 మేతో పోలిస్తే 2019 జూన్ నుంచి 2021 జూలై వరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై నేరాలు తగ్గాయి. ఎస్సీ, ఎస్టీలకు భద్రత కల్పించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరుస్తోందని జాతీయ క్రైమ్‌రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించడం రాష్ట్ర ప్రభుత్వ సమర్థతకు తార్కాణంగా నిలుస్తోంది. 2019 నుంచి తగ్గిన కేసులు రాష్ట్రంలో 2015–19తో పోలిస్తే 2019–21లో దళితులు, గిరిజనులపై దాడులు, ఇతర వేధింపులు గణనీయంగా తగ్గాయి. గత ఆరేళ్లలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు అత్యల్పంగా 2021లోనే నమోదు కావడం విశేషం. 2015తో పోలిస్తే 2020లో దళితులు, గిరిజనులపై నేరాలు 13శాతం తగ్గాయి. ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసులను కేటగిరీలవారీగా పరిశీలిస్తే నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. 2019తో పోలిస్తే 2020లో హత్య కేసులు 40శాతం, అత్యాచారం కేసులు 15శాతం తగ్గాయి, దాడులు 6శాతం, గృహదహనాలు 38శాతం, ఎస్సీ, ఎస్టీ వేధింపులు 18శాతం, ఇతర కేసులు 12శాతం తగ్గడం ప్రాధాన్యం సంతరించుకుంది. తప్పు చేస్తే పోలీసులైనా కఠిన చర్యలే.. ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడితే పోలీసులయినాసరే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్నిచ్చింది. శ్రీకాకుళంజిల్లాలో కాశీబుగ్గ సీఐను 24 గంటల్లోనే అరెస్టు చేసింది. రాజమహేంద్రవరంలోని సీతానగరం పోలీస్ స్టేషన్లో ఓ ఎస్ఐను ఘటన జరిగిన రోజే అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల టూ టౌన్ ఎస్ఐను అరెస్టు చేసి చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. బాధితులకు పరిహారం పెంపు నేరాలకు గురయిన దళితులు, గిరిజనులను ఆదుకోవడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోంది. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని పెంచింది. 2014–2019లో టీడీపీ ప్రభుత్వం బాధిత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేవలం రూ.52.32 కోట్లు మాత్రమే పరిహారంగా అందించింది. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 జూన్ నుంచి 2021 జూలై వరకు బాధిత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.87.70కోట్లు పరిహారంగా అందించడం విశేషం. అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు సత్వరం పరిహారం అందేలా చొరవ చూపిస్తోంది. దేశంలోనే భేష్.. ఎస్సీ, ఎస్టీల రక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సమర్థంగా వ్యవహరిస్తోందని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో లక్షమందిజనాభాలో ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసులను ప్రమాణంగా తీసుకుని ఎన్సీఆర్బీ ఈ నివేదిక వెల్లడించింది. ► ఎస్సీలపై అత్యధికంగా నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రతి లక్ష ఎస్సీలలో రాజస్థాన్‌లో 55.6, మధ్యప్రదేశ్‌లో 46.7, బిహార్‌లో 39.5మందిపై నేరాలకు పాల్పడుతున్నారు. గుజరాత్లో 34.8మందిపై, తెలంగాణలో 31.1మందిపై ఉత్తర ప్రదేశ్‌లో 28.6మందిపై, కేరళలో 28.2మందిపై, ఒడిశాలో 26.2మందిపై నేరాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్షమందికి 24.5 మందిపై మాత్రమే నేరాలు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. ► ఎస్టీలపై అత్యధికంగా నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రతి లక్షమంది ఎస్టీలకు ఉత్తరప్రదేశ్‌లో 63.6మందిపై, కేరళలో 28.9మందిపై, రాజస్థాన్‌లో 19.5మందిపై నేరాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో 16.1మంది ఎస్టీలు దాడులకు గురవుతున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్షమందికి కేవలం 12.5 మందిపైనే నేరాలు జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. సమర్థంగా కేసుల పరిష్కారం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై నేరాల దర్యాప్తును వేగవంతం చేసి దోషులను సకాలంలో గుర్తించి శిక్షలు పడేలా చేస్తోంది. దాంతో ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడాలంటే భయపడే పరిస్థితిని తీసుకువచ్చింది. గత రెండేళ్లలో ఏకంగా 94శాతం కేసుల్లో దోషులను గుర్తించడం రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. రికార్డు వేగంతో దర్యాప్తు దళితులు, గిరిజనులపై నేరాల కేసులను పోలీసు శాఖ రికార్డు వేగంతో దర్యాప్తు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలపై కేసుల దర్యాప్తును టీడీపీ ప్రభుత్వంలో కంటే 78శాతం తక్కువ రోజుల్లోనే పూర్తి చేస్తుండడం జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ► కేసుల వారీగా చూస్తే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో దళితులు, గిరిజనుల అత్యాచారాలు, హత్యల కేసుల దర్యాప్తునకు సగటున 240 రోజులు పట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 జూన్ నుంచి 2022 జూలై వరకు సగటున 55 రోజుల్లోనే విజయవంతంగా దర్యాప్తు పూర్తి చేస్తున్నారు. ► 2014 నుంచి 2019 మే వరకు సామూహిక అత్యాచారం కేసుల దర్యాప్తునకు సగటున 279 రోజులు పట్టి్టంది. కాగా 2019 జూన్ నుంచి 2020 వరకు దర్యాప్తును సగటున 153 రోజుల్లోనే పూర్తి చేశారు. 2021లో అయితే 44 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయడం విశేషం. ► 2014 నుంచి 2019 మే వరకు పోస్కో చట్టం కేసుల దర్యాప్తునకు సగటున 192 రోజులు పట్టాయి. 2019 జూన్ నుంచి 2020 వరకు దర్యాప్తును సగటున 133 రోజుల్లోనే పూర్తి చేశారు. 2021లో కేవలం 53 రోజుల్లోనే దర్యాప్తును పూర్తి చేయడం పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. ► 2014 నుంచి 2019 వరకు అత్యాచారం కేసుల దర్యాప్తునకు సగటున 266 రోజులు పట్టాయి. 2019 జూన్ నుంచి 2020 వరకు సగటున 111 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. ఇక 2021లో కేవలం 46రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ► ఇక టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మే వరకు ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు సంబంధించిన కేసులను పెండింగ్‌లో ఉంచగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ కేసులను సమర్థంగా దర్యాప్తు చేసి పూర్తి చేశారు. ఆ విధంగా అత్యాచారం– హత్య కేసులు 3, సామూహిక అత్యాచారం కేసులు 2, పోస్కో చట్టం కేసులు 19, అత్యాచారం కేసులు 64ను దర్యాప్తు పూర్తి చేయడం గమనార్హం. -
ఆడపిల్ల పుట్టిందా.. ఇష్టం లేకపోతే, ఈ ఊయలలో వేయండి!
సాక్షి,సంగారెడ్డి: ఇప్పటికీ సమాజంలో ఆడపిల్లలంటే చిన్న చూపే. ప్రసవ వేదన ఎంతైనా భరిస్తారు కానీ ఆడపిల్ల పుట్టిందంటే మాత్రం భరించరు. ఆసుపత్రిలో మహిళకు ప్రసవం కాగానే అమ్మాయి పుడితే మీకు లక్ష్మీ దేవి పుట్టిందని సిబ్బంది చెప్తారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు, అత్తా మామలు ఆమ్మో ఆడ పిల్లా అని నిర్వేదానికి గురవుతారు. ఇంకొంతమంది అయితే వాళ్లలో రాక్షసత్వాన్ని బయటకి తీసి రెండు మూడు రోజుల వయసున్న ఆడ పిల్లలలను కూడా ముళ్లపొదల్లో, చెత్తకుప్పల్లో వదిలేసి వెళ్తారు. ఈనేపథ్యంలో మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అలా ఒక్క ఆడ బిడ్డ కూడా చనిపోవద్దని సంగారెడ్డి జిల్లాలో చిన్నారులను కాపాడటానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డు మహిళా ప్రాంగణం ఆవరణలో మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఊయలను ఏర్పాటు చేశారు. ఎవరికైనా పిల్లలను పెంచటం ఇష్టం లేకపోతే వారిని పడెయ్యొద్దని, ఈ ఊయలలో ఉంచి వెళ్లాలని వారిని ప్రభుత్వం చూసుకుంటుందని మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి పద్మావతి తెలిపారు. -
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె ఇంటి వద్ద పోలీసు భద్రత
వైఎస్సార్ కడప: వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. తక్షణమే శాశ్వత పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తన ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారని.. ఎస్పీకి వైఎస్ సునీతారెడ్డి లేఖ రాశారు. లేఖలో ఫిర్యాదు అంశాలపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించారు. -
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మరింత రక్షణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా ముప్పు ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదు. ముఖ్యంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది భవిష్యత్తులో పీపీఈ కిట్లు, శానిటైజర్లు తొడుక్కునే విధులు నిర్వహిస్తున్నారు. అయితే పీపీఈ కిట్లను సురక్షితంగా వదిలి, వైరస్‌ను ఇంటికి తీసుకెళ్లకుండా ఉండేందుకు వీలుగా త్వస్త మ్యాన్యు ఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్, సెయింట్ గోబెన్ కంపె నీలు కొత్త ఆవిష్కరణ చేశాయి. త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత ద్వారా డాఫింగ్ యూనిట్లను రూపొందించారు. ఏమిటీ డాఫింగ్ యూనిట్లు..? ఆరోగ్య సిబ్బంది తమ పీపీఈ కిట్లు, గ్లోవ్స్‌ను సురక్షితంగా వదిలిపెట్టేందుకు ఉపయోగపడే నిర్మాణమే డాఫింగ్ యూనిట్. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు స్థాపించిన త్వస్త మ్యాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్, సెయింట్ గోబెన్ సంయుక్తంగా 2 యూనిట్లు తయారు చేశారు. ఒకదాన్ని కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేశాయి. రెండో యూనిట్‌ను చెన్నైలోని ఒమండురార్ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నిర్మాణంలో ఉన్న మూడో యూనిట్‌ను తిరువళ్లువార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేయనున్నారు. అతినీల లోహిత కిరణాలు, సీ స్టెరిలైజేషన్ బాక్స్, ఆటోమెటిక్ శానిటైజర్, సోప్ డిస్పెన్సర్ వంటి సౌకర్యాలు ఇందులో ఉంటాయి. ఇవీ ప్రయోజనాలు.. డాఫింగ్ యూనిట్లో పీపీఈ కిట్లు, ఇతర వస్తువులను సురక్షితంగా విడిచిపెట్టొచ్చు. వైద్యులు, సిబ్బంది షిఫ్ట్‌లు ముగించుకుని వెళ్లేటప్పుడు లేదా విధుల్లోకి చేరేటప్పుడు తమను తాము శానిటైజ్ చేసుకునేందుకూ ఇవి ఉపయోగపడతాయి. త్వస్త మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూష న్స్ అభివృద్ధి చేసిన టెక్నాలజీకి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందించామని సెయింట్ గోబెన్ తెలిపింది. -
దిశ యాప్‌తో 6 నిమిషాల్లోనే యువతికి రక్షణ
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): అక్కచెల్లెమ్మల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌తో వారికి క్షణాల్లోనే రక్షణ అందుతోందని మరోసారి రుజువైంది. వేధింపులకు గురైన యువతి దిశ యాప్ ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని రక్షించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దేవీనగర్‌కు చెందిన యువతి (19) ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న ఆకాష్ ఆమెను ప్రేమ పేరుతో నిత్యం వేధిస్తున్నాడు. అతడిపై యువతి తన తండ్రికి, కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో వారు యువకుడిని పలుమార్లు హెచ్చరించారు. అయినా ఆకాష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. యువతి శుక్రవారం మధ్యాహ్నం కళాశాలలో పరీక్ష రాసి తండ్రితో కలసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా ఆకాష్ ద్విచక్రవాహనంపై వెంటపడుతూ వేధింపులకు గురిచేశాడు. దీంతో యువతి దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసింది. మధ్యాహ్నం 12.31కి దిశ కాల్ సెంటర్‌కు సమాచారం రాగానే వెంటనే స్పందించిన సత్యనారాయణపురం పోలీసులు 12.37కి ఘటనా స్థలానికి చేరుకుని యువతిని రక్షించారు. నిందితుడు ఆకాష్‌ను అదుపులోకి తీసుకుని 483, 354డి, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి: ఐఏఎస్ అధికారి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న యువ ఐఏఎస్ అధికారి ఒకరు తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉంది.. పోలీసు ప్రొటేక్షన్ కల్సించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సదరు ఐఏఎస్ అధికారి సిగ్నల్ యాప్ మెసేజింగ్ గ్రూప్‌లో రాష్ట్ర అధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో సదరు ఐఏఎస్ అధికారికి బెదిరంపు కాల్స్ వస్తున్నాయట. ఈ క్రమంలో తనకు, తన కుటుంబానికి పోలీస్ ప్రోటెక్షన్ కల్సించాల్సిందిగా కోరుతున్నాడు. ఆ వివరాలు.. 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి లోకేశ్ కుమార్ జంగిడ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ కుమార్ ఓ మేసేజింగ్ గ్రూప్‌లో కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. అవి కాస్త లీక్ అవ్వడంతో ఇప్పటికే ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణారహిత్య చర్యలుగా పేర్కొంటూ.. వారం లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో ఓ కొత్త నంబర్‌నుంచి తనకు కాల్ వచ్చిందని.. ఫోన్లో సదరు వ్యక్తి తనను మీడియాతో మాట్లాడటం మానేయాలని.. ఆరు నెలల పాటు లీవ్ మీద వెళ్లాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించినట్లు లోకేశ్ కుమార్ తెలిపాడు. ఈ క్రమంలో తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని.. పోలీస్ ప్రోటెక్షన్ కల్సించాల్సిందిగా కోరుతూ లోకేశ్ కుమార్, మధ్యప్రదేశ్ డీజీపీకి వివేక్ జోహ్రికి లేఖ రాశారు. భోపాల్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఇక వ్యక్తిగత కారణాలను చూపుతూ లోకేశ్ తన సొంత రాష్ట్రం మహారాష్ట్రకు తనను డిప్యూటేషన్ మీద పంపించాల్సిందిగా కోరాడు. ఇక లీకైన చాట్‌లో లోకేశ్ తాను అవినీతిని ఏమాత్రం సహించలేనని.. అందుకే తనను తరచుగా బదిలీ చేస్తారని తెలిపారు. నాలుగేళ్ల తన సర్వీసులో ఇప్పటికే తనను 9సార్లు ట్రాన్స్ఫర్ చేశారని తెలిపాడు. చదవండి: ఐఏఎస్ భావోద్వేగం.. ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా -
ఈ ‘కాక్టెయిల్’తో కరోనాకు చెక్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్సలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్ డ్రగ్’ ప్రభావవంతంగా పనిచేస్తోందని వైద్యులు చెప్తున్నారు. రాష్ట్రంలోని ఏఐజీ, యశోద ఆస్పత్రుల్లో రెండు వారాలుగా ఈ మందును ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఔషధంతో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, సైడ్ ఎఫెక్టులు తక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెప్తున్నారు. తమ పరిశీలన వివరాలను ‘సాక్షి’కి వెల్లడించారు. ఏమిటీ కాక్టెయిల్ డ్రగ్? కసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్ ఔషధాలను కలిపి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్గా రూపొందించారు. కరోనా స్పైక్ ప్రొటీన్, దాని అటాచ్మెంట్ మానవ కణాల్లోకి ప్రవేశించకుండా ఈ మందు అడ్డుకుంటుంది. వివిధ వేరియంట్లపై ఇది సమర్థంగా పనిచేస్తోందని, పేషెంట్లు ఆస్పత్రి లో చేరాల్సిన పరిస్థితి తక్కువగా ఉందని, మరణాలు 70 శాతం వరకు తగ్గుతున్నాయని వైద్యులు తేల్చారు. కరోనా పాజిటివ్‌గా తేలగా నే ఈ మందు తీసుకోవాలి. మూడో వేవ్ ముంగిట.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇంజెక్షన్ తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది. తాజాగా మన దేశంలో ఈ మందు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. కరోనా మూడో వేవ్ రావొచ్చన్న అంచ నాల నేపథ్యంలో.. కోవిడ్‌ను తొలిదశలోనే నియంత్రించే మందు అందుబాటులోకి రావడం మంచిదని వైద్యులు చెప్తున్నారు. మోనోక్లోనల్ కాక్టెయిల్ డ్రగ్‌తో లాభం ఏమిటి? నాగేశ్వర్‌రెడ్డి: కోవిడ్ సోకాక హైకోమార్బిడ్ కండిషన్ ఉన్న 65 ఏళ్లపై వయసువారు, స్థూలకాయులు, టైప్–2 డయాబెటీస్, కిడ్నీ వ్యాధులు, రోగనిరోధకశక్తి చాలా తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక తీవ్ర అనారోగ్య సమస్యలున్న పేషెంట్లలో 30 శాతం వరకు సీరియస్ అవుతున్నారు. మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటి వారిని ఈ ఇంజెక్షన్ ఆదుకుంటుంది. సీరియస్ కాకుండా కాపాడుతుంది. ఇది కోవిడ్ చికిత్సలో గేమ్ చేంజర్ అవుతుంది. ఇంజెక్షన్ వేశాక ఫలితాలు ఎలా ఉన్నాయి? అమెరికాలో ఈ మందు ఖరీదు చాలా ఎక్కువ. ఒక ఇంజెక్షన్ కు దాదాపు 20 వేల డాలర్లు అంటే.. మన కరెన్సీలో రూ.14 లక్షలు అవుతుంది. ధర ఎక్కువ, బీమాలో కవర్ కాకపోవడంతో అక్కడ ఎక్కువగా తీసుకోవడం లేదు. ఇండియాలో రూ.60 వేలకే ఇది అందుబాటులోకి వస్తోంది. మా ఆస్పత్రుల్లో సీరియస్ కండిషన్ ఉన్న 45 మందికి ఈ ఇంజెక్షన్ ఇచ్చాం. వారికి 24 గంటల్లోనే జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గాయి. దుష్ప్రభావాలు ఏమీ కనిపించలేదు. అందరికీ వారంలోనే కరోనా నెగెటివ్ వచ్చింది. సీరియస్ కేసులుగా మారడం లేదు. కొత్త వేరియంట్లపై పనిచేస్తుందా? బ్రిటన్ , దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు ఇంతకుముందే తేలింది. భారత్‌లోని వేరియంట్ల విషయంగా పరిశోధన చేస్తున్నాం. ఇప్పటికైతే బాగా పనిచేస్తున్నట్టు గుర్తించాం. మరో రెండు వారాల్లో పూర్తి స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే విస్తృతంగా వినియోగించే వీలుంటుంది. ఎవరెవరు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి? మేం చాలా జాగ్రత్తగా, నిబంధనల మేరకు ఎవరికి అవసరమో వారికే ఇస్తున్నాం. స్వల్ప లక్షణాలుండగానే తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది కదా అని భావించొద్దు. స్టెరాయిడ్స్ మాదిరిగా దీనిని కూడా ఎక్కువగా ఉపయోగించేస్తే.. కొత్త వేరియంట్లు ఏర్పడి, సమస్య వస్తుంది. అందువల్ల అనవసరంగా తీసుకోవద్దు. ఎవరికి అవసరమనేది వైద్యులు నిర్ధారిస్తారు. ఆక్సిజన్ అవసరమైన పేషెంట్లు, ఐసీయూ, వెంటిలేటర్లపై ఉన్న వారికి ఇది ఉపయోగపడదు. సరిపడా ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయా? ఇప్పటిదాకా అమెరికాలో రోష్ కంపెనీ ఒక్కటే ఈ ఇంజక్షన్లను ఉత్పత్తి చేసింది. ఇటీవలే ఇలాయ్లిలీ కంపెనీకి కూడా అనుమతినిచ్చారు. మన దేశంలో జైడస్ కంపెనీకి అనుమతి లభించినట్టు చెప్తున్నారు. ఇండియన్ కంపెనీలు దీనిని తయారు చేస్తే పది పదిహేను వేలకే ఇంజెక్షన్ అందుబాటులోకి రావొచ్చు. ఒకవేళ మూడో వేవ్ వస్తే ఈ ఔషధంతో బాగా ప్రయోజనం ఉంటుంది. కంట్రోల్ చేస్తుంది కాక్టెయిల్ యాంటీబాడీస్ ఎందుకు? కరోనా వైరస్ జతకట్టే స్పైక్ ప్రోటీన్‌కు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అతుక్కుని కలిసిపోతాయి. అయితే సింగిల్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇస్తే కొన్నిసార్లు దానిని తట్టుకునే వేరియంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వేలాది మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను తీసుకుని.. వైరస్ ప్రొటీన్‌కు అతుక్కోగలిన వాటిని ఎంపిక చేశారు. వీటిలో ఒకటి తప్పిపోయినా రెండోది జత కలిసేందుకు వీలుగా రెండింటినీ కలిపి కాక్టెయిల్గా తయారుచేశారు. కొన్ని రకాల వేరియంట్లపై ఇది సమర్థవంతగా పనిచేస్తున్నట్టు తేలింది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా? నిజానికి ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు. వైరస్ సోకిన తొలిదశనే తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. మా ఆస్పత్రుల్లో వంద మంది దాకా ఈ మందు ఇచ్చాం. ఒకే ఒక్క పేషెంట్‌కు కాస్త జ్వరం వచ్చి తగ్గిపోయింది. మరో పేషెంట్‌కు సీటీ స్కాన్ లో కొంత ఇన్ఫెక్షన్ పెరిగినట్టు అనిపించినా త్వరగా రికవరీ అయ్యారు. ఈ ఇంజెక్షన్ ఇచ్చాక మళ్లీ హాస్పిటల్‌కు వచ్చిన వారెవరూ లేరు. ఈ మందును వ్యాక్సిన్‌తో పోల్చవచ్చా? ఈ కాక్టెయిల్ డ్రగ్ వ్యాక్సిన్ లా పనిచేస్తోందని ఒక పరిశోధనలో గుర్తించారు. ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబంలో.. ఒకరికి పాజిటివ్ రాగానే మిగతా వారికి ఈ మందు ఇచ్చి పరీక్షించారు. వారందరిలో యాంటీబాడీస్ ఏర్పడి కరోనా రాకుండా నియంత్రించినట్టు తేలింది. అంటే ముందస్తు జాగ్రత్తగా దీనిని వ్యాక్సిన్‌లా వాడొచ్చని వెల్లడైంది. ఏ వయసు వారికి ఈ ఇంజెక్షన్ వేయొచ్చు? పన్నెండేళ్ల వయసు పైబడిన అందరికీ (కనీస బరువు 40 కిలోలు ఆపై ఉండాలి) మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవ్వొచ్చు. పేషెంట్ల అవసరాన్ని బట్టి వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. పిల్లల్లో టైప్–1 డయాబెటీస్, సికిల్‌సెల్, పుట్టుకతోనే గుండెజబ్బు, రోజూ మందులు వాడే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల రోగులు తదితర తీవ్ర జబ్బులున్న వారికి కూడా కరోనా నివారణ కోసం ఈ ఇంజెక్షన్ ఇచ్చేందుకు అనుమతి ఉంది. -యశోద ఆస్పత్రి చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ హరికిషన్ గోనుగుంట్ల చదవండి: COVID Vaccine: వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకిందా? -
మైనర్ బాలిక రెండో పెళ్లి.. రక్షణ కావాలంటూ కోర్టు మెట్లెక్కింది
చత్తీస్‌గఢ్: సాధారణంగానే మైనర్ల వివాహం చట్ట విరుద్ధం, పైగా చెల్లదు కూడా. అలాంటిది ఓ మైనర్ బాలిక వివాహం చేసుకోవడమే గాక రక్షణ కావాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాలిక తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందున ఆమెకు వారి నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. బాలిక ఇంకా మైనర్ కాగా తనకు ఇది రెండో వివాహమని పిటిషన్లో పేర్కోవడం గమనార్హం. అయితే బాలిక పిటిషన్‌ను స్వీకరించిన పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో జస్టిస్ సుధీర్ మిట్టల్ ధర్మాసనం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మైనార్టీ తీరకుండానే పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. కాగా బాల్యవివాహాల నిషేధ చట్టం, 2006 లోని సెక్షన్ 12 కింద ఈ వివాహం చెల్లదు. ఇదీ గాక సదరు బాలిక తనకిది రెండో వివాహం అని పిటిషన్లో పేర్కొనడంపై విచారణ జరపాలని తెలుపుతూ తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ బాలికకు, వివాహం చేసుకున్న యువకుడికి ప్రభుత్వం రక్షణ కల్పించాలంటూ స్పష్టం చేసింది. బాలిక నివాసానికి సమీపంలోని నారి నికేతన్‌లో ఉంచి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే క్రమంలో ప్రభుత్వం పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలి. ఇరువురి తల్లిదండ్రులు, బంధువులను పిలిపించి వారి సమక్షంలోనే సదరు బాలికకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. కౌన్సెలింగ్ తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నివేదిక రూపంలో జూలై 23 లేదా అంతకంటే ముందే హైకోర్టుకు అందజేయాలి' అని ధర్మాసనం తీర్పునిచ్చింది. మైనార్టీ తీరకుండానే రెండు సార్లు వివాహం చేసుకున్న సదరు బాలిక పిటిషన్‌పై హైకోర్టు తుది తీర్పుపై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చదవండి: గొడవతో మహానదిలో దూకిన దంపతులు.. అంతలోనే.. -
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోమన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: 7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ! -
Double Masking: రెండు మాస్కులు ధరిస్తే కరోనా రాదా?
వాషింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు కచ్చితంగా ధరించాలని అందరికీ తెలుసు. రెండు మాస్కులు ధరిస్తే రెండింతల రక్షణ లభిస్తోందని తెలుసా? ఇలా ధరిస్తే వైరస్ బారినపడే అవకాశాలే లేవని అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజా పరిశోధనలో తేలింది. రెండు టైట్ ఫిట్ మాస్కులు సార్స్–కోవ్–2 సైజ్ వైరస్‌ను సమర్థంగా ఫిల్టర్ చేస్తాయని, నోరు, ముక్కులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని ఈ పరిశోధన చెబుతోంది. డబుల్ మాస్కుల వాడకం మంచిదే.. ►మాస్కుల్లో ఎక్కువ బట్ట పొరలు వాడడం వల్ల వాటి మధ్య ఖాళీ స్థలం తగ్గిపోతుంది. ఖాళీ లేకపోతే లోపలికి వైరస్ ప్రవేశించే ఆస్కారం ఉండదు. కనుక వైరస్ కణాలను ఇది సాధ్యమైనంత వరకు అడ్డుకుంటుంది. ►మాస్కు ముఖానికి సరిగ్గా అమరకపోతే రక్షణ పెద్దగా ఉండదు. కనుక డబుల్ మాస్కును ధరించడం వలన ముఖ భాగాన్ని వీలైనంత కవర్ చేస్తుంది. ఇందులో బట్ట పొరలను ఖాళీ లేకుండా బిగువుగా కలిపి కుట్టిన మాస్కు ఉత్తమమైనదని చెప్పారు. ►సాధారణ క్లాత్‌మాస్క్ 56.1 శాతం రక్షణ కల్పిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్ మాస్కు అయితే 51.4 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్ మాస్కుపై క్లాత్‌మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ 85.4 శాతం వరకు ఉంటుందన్నారు. క్లాత్ లేదా సర్జికల్ మాస్కు వలన 77 శాతం రక్షణను ఇస్తుంది. ప్రయోజనాలు.. ►డబుల్ మాస్కులు వాడకం వలన మీకు శ్వాస పీల్చుకోవడంలో ఏ రకంగాను ఇబ్బందులు ఉండవు. ► డబుల్ మాస్కులు ధరించి సులభంగా మాట్లాడుకోవచ్చు. చేయకూడనవి.. ►వాడేసిన మాస్కులు రెండింటినీ గానీ, సర్జికల్ మాస్కులు రెంటిని కలిపి డబుల్ మాస్కులా వాడకూడదు ►మార్కెట్లో దొరుకుతున్న ఎన్95 మాస్క్‌ను ఏ ఇతర మాస్కు తో ఉపయోగించరాదు. ►రసాయన పదార్థాలను మాస్కు కు కలిపి ఉపయోగించరాదు. ►పాడైన, రంధ్రాలు పడినమాస్కులను వాడరాదు డబుల్ మాస్కును సరైన రీతిలో వాడుతున్నామనడానికి ఉదాహరణ ►మనం గాలి పీలుస్తున్నప్పుడు, మన మాస్కు లోపల వైపుకు వెళ్తున్నట్లు ఉండాలి ►అద్దాలు వాడే వారు గాలి వదిలినప్పుడు పొగతో వారి అద్దాలు కమ్ముకోవడం. ►అద్దం ముందు నిల్చుని మనం గాలిని బలంగా వదిలినప్పుడు మన కళ్లకు ఆ గాలి తగలడం. (చదవండి: ‘ఊపిరి’కి ఎందుకీ కష్టం?) -
నాపై నిఘా పెట్టారు.. భద్రత అక్కర్లేదు: టీఎంసీ ఎంపీ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. తనకు భద్రత కావాలని కోరలేదని.. కానీ తన నివాసం వద్ద బీఎస్ఎఫ్ జవాన్లను మోహరించారని వెల్లడించారు. ఇంత సడెన్‌గా తన ఇంటి వద్ద బీఎస్ఎఫ్ అధికారులను నియమించడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే వారిని ఉపసంహరించుకోవాలని ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో తెలిపారు. సాధారణ పౌరురాలిగా ఉండాలని కోరకుంటున్నాను. నాకు ఎలాంటి భద్రత వద్దన్నారు మహువా. ఇక బీఎస్ఎఫ్ కదలికలు చూస్తుంటే తనపై నిఘా ఉంచినట్టు అనిపిస్తోందంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎన్ఎన్ శ్రీవాస్తవకు రాసిన లేఖలో పేర్కొన్నారు మహువా మొయిత్రా. శుక్రవారం సాయంత్రం 4.30గంటల సమయంలో తన అధికారిక నివాసానికి ఎస్‌హెచ్‌వో వచ్చారనీ.. ఆ తర్వాత రాత్రి 10గంటల సమయంలో ముగ్గురు బీఎస్ఎఫ్ అధికారులను ఇంటి బయట ఉంచినట్టు లేఖలో తెలిపారు. తన భద్రత కోసమే వచ్చినట్టు జవాన్లు చెబుతున్నారని పేర్కొన్నారు. 3 BSF men w/ assault rifles outside my home. Say they are from Barakhamba Road police station for my “protection”. Still outside my home. Am a free citizen of India - people will protect me. Request Honb’le HM @AmitShah Ji & @HMOIndia to remove immediately pic.twitter.com/7nQLy323Xv — Mahua Moitra (@MahuaMoitra) February 13, 2021 ఈ దేశ సాధారణ పౌరురాలిగా ఉండాలనుకుంటున్నానన్న మహువా.. తనకు భద్రత కావాలని ఎవరినీ అడగలేదన్నారు. తన ఇంటి వద్ద ఉన్న జవాన్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని పోలీసులను కోరారు. ఈ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనను కాపాడేందుకే ప్రజా ధనాన్ని వృథా చేయొద్దని సూచించారు. అందరికీ రక్షణ కల్పించాలి తప్ప తనకేమీ ప్రత్యేకంగా అవసరం లేదన్నారు మహువా. తనపై నిఘా పెట్టాలంటే తనను అడగాలని, తానే చెబుతానని తెలిపారు. మహువా బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 3 BSF men w/ assault rifles outside my home. Say they are from Barakhamba Road police station for my “protection”. Still outside my home. Am a free citizen of India - people will protect me. Request Honb’le HM @AmitShah Ji & @HMOIndia to remove immediately pic.twitter.com/7nQLy323Xv — Mahua Moitra (@MahuaMoitra) February 13, 2021 -
ప్రమాదాలు జరగకుండా శునకాల మెడలో..
వర్సోవా: రాత్రి వేళల్లో శునకాలకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాటి మెడలో ‘నైట్ రిప్లెక్టర్ బెల్ట్’ వేయాలని బోరివలికి చెందిన మాణుస్కి (మానవత్వం) అనే సేవా సంస్థ నిర్ణయం తీసుకుంది. శునకాల మెడలో రిప్లెక్టర్ బెల్ట్ వేయడంవల్ల వాటికి జరిగే ప్రాణహానితోపాటు వాహనాలకు జరిగే ప్రమాదాలు కూడా అదుపులోకి వస్తాయని సంస్థ భావిస్తోంది. పెంపుడు కుక్కలు ఇళ్లకే పరిమితమైనప్పటికీ ఊర కుక్కలు మాత్రం నగర రోడ్లపై తిరుగుతుంటాయి. రాత్రి వేళ్లలో అవి అరుస్తూ అటూ, ఇటూ పచార్లు కొట్టడం, పరుగులు తీయడం లాంటివి చేస్తాయి. రాత్రి సమయంలో అకస్మాత్తుగా కుక్కలు వాహనాల ముందుకు రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధ్యమైనంత వరకు డ్రైవర్లు వాటిని తప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ, కొన్ని సందర్భాలలో వాటిని ఢీ కొట్టి పోతుంటారు. అంతేగాకుండా కుక్కలను తప్పించే ప్రయత్నంలో వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇలా జరిగిన ప్రమాదల వల్ల కొన్ని శునకాలు మృతి చెందగా మరికొన్ని తీవ్రంగా గాయపడుతున్నాయి. రాత్రులందు కొన్ని కుక్కలు రోడ్డుపై లేదా రోడ్డు పక్కన, సందుల్లో నిద్రపోతుంటాయి. చీకట్లో సరిగా కానరాక డ్రైవర్ వాటి మీదుగా పోనిస్తారు. పార్కింగ్ చేసే క్రమంలో కూడా నిద్రపోతున్న కుక్కల పైకి వాహనాలు ఎక్కించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు బోరివలికి చెందిన మాణుస్కి (మానవత్వం) అనే సేవా సంస్థ కుక్కల మెడలో నైట్ రిప్లెక్టర్ బెల్ట్ వేయాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి సమయంలో వాహనాల హెడ్‌లైట్ వెలుగుకు కుక్కల మెడలో ఉన్న రిప్లెక్టర్ మెరుస్తుంది. దీంతో వాహనాల డ్రైవర్లు దూరం నుంచి పసిగట్టి అప్రమత్తమవుతారు. ఫలితంగా ప్రమాదాలు అదుపులోకి వస్తాయని సంస్థ తెలిపింది. -
పాములను పట్టేందుకు సొంత ఖర్చులతో
పాము కనపడగానే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. భయంతో దానిని చంపేయాలని చూస్తాం. మరోవైపు పాము కాటుకు అనేక మంది మృత్యువాత పడుతుండటం చూస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన చదలవాడ క్రాంతి అనే యువకుడికి పాము నుంచి మనిషికి, మనిషి నుంచి పాముకు రక్షణ కల్పించాలనే ఆలోచన కలిగింది. దీంతో అతను స్నేక్ సేవియర్‌గా మారాడు. జంగారెడ్డిగూడెం: క్రాంతి జనావాసాల మధ్యకు వచ్చిన వేలల్లో పాములను పట్టుకుని రక్షించాడు. ఇతను స్నేక్ సేవియర్స్ సొసైటీ స్థాపించి నాలుగేళ్లు పూర్తయింది. క్రాంతి ప్రస్థానాన్ని చూస్తే.. పేరంపేటకు చెందిన కూలీలైన చదలవాడ రాజారావు, వెంకాయమ్మ దంపతుల కుమారుడు క్రాంతికుమార్. తల్లితండ్రుల అండతో అతను బీఎస్సీ పూర్తిచేశాడు. చిన్ననాటి నుంచి వన్య ప్రాణులపై మక్కువ ఎక్కువ. దీంతో 2008లో పాములను పట్టుకోవటంలో శిక్షణ పొందాడు. శిక్షణ అనంతరం విశాఖపట్టణంలోని స్నేక్ సేవియర్స్ సొసైటీలో పాములపై పరిశోధన చేశాడు. అతి తక్కువ కాలంలోనే పాములను సురక్షితంగా పట్టుకోవడంలో అనుభవం గడించాడు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా ప్రజలు వారి ప్రాణాలు ఎలా రక్షించుకోవచ్చనే విషయంపై అనేక గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాడు. 2016 డిసెంబర్ 30న స్నేక్ సేవియర్స్ సొసైటీని క్రాంతి స్థాపించారు. ఇప్పటివరకు అతను జనావాసాలు, ఇళ్లలోకి వచ్చిన 10,900 పాములను పట్టుకుని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. జిల్లాలో అనేక మండలాల్లో ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పాము కనిపిస్తే గుర్తుకొచ్చేది క్రాంతి పేరు. ఫోన్ చేయగానే ఆ ప్రాంతానికి వెళ్లి పామును పట్టుకుని అటవీ శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సమక్షంలో అటవీ ప్రాంతాల్లో విడిచి పెడుతుంటాడు. దూర ప్రాంతాలకు పాములను పట్టేందుకు సొంత ఖర్చులతో వెళుతుంటాడు. పామును పట్టినందుకు ఫోన్ చేసిన వ్యక్తులు ఖర్చులకు డబ్బులు ఇస్తే తీసుకుంటాడేగానీ డిమాండ్ మాత్రం చేయడు. క్రాంతి చేస్తున్న ఈ పనికి ప్రజలతోపాటు అటవీశాఖాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. స్నేక్ సేవియర్స్ సొసైటీ వార్షికోత్సవంలో భాగంగా పేదలకు, వృద్ధులకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేస్తూ సేవాభావాన్ని చాటుతున్నాడు క్రాంతి. కార్యాలయానికి స్థలం కేటాయించండి ఆర్థిక వనరుల విషయంలో స్నేక్ సేవియర్స్ సొసైటీకి ఇబ్బందులున్నా అధిగమిస్తూనే ఇంతకాలం సంస్థను ముందుకు తీసుకెళుతున్నాం. ప్రభుత్వ సహకారం ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సేవలు అందించటానికి సిద్ధంగా ఉన్నా. స్నేక్ సేవియర్స్ సొసైటీ కార్యాలయ భవనానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నా. కార్యాలయం ఏర్పడితే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. పాము కనిపిస్తే 83869 84869, 80998 55153 నంబర్లకు ఫోన్ చేయండి. – చదలవాడ క్రాంతి, డైరెక్టర్, స్నేక్ సేవియర్స్ సొసైటీ -
కార్డులు, ఖాతాలు భద్రంగా ఉన్నాయా?
మొబైల్ ఫోన్ నుంచే వ్యాలెట్ల వినియోగం, బ్యాంకింగ్ సేవలు, డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగం బాగా విస్తృతమవుతోంది. అత్యాధునిక టెక్నాలజీలతో.. వినియోగదారులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల నుంచి డిజిటల్ లావాదేవీలు చక్కబెట్టేస్తున్నారు. ఈ కామర్స్ షాపింగ్ కూడా మొబైల్ ఫోన్ల నుంచే ఎక్కువగా కొనసాగుతోంది. ఆర్థిక లావాదేవీలు కానీయండి.. వినోదం, షాపింగ్, విద్య ఇలా ఒకటేమిటి ఎన్నో అవసరాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడడం పట్టణ, నగర జీవనంలో భాగంగా మారిపోయింది. దీంతో సమాచారానికి భద్రతా రిస్క్ నెలకొంది. మొబైల్ ఫోన్ అయినా, కంప్యూటర్ అయినా.. సైబర్ నేరగాళ్లు కీలక సమాచారాన్ని కొల్లగొట్టేందుకు ఎన్నో మార్గాలు వెతుక్కుంటున్నారు. కనుక వినియోగదారులుగా మన బ్యాంకు ఖాతాలు, కార్డులు, ఫోన్లు, వ్యాలెట్లకు తగినంత భద్రత ఉందా? అన్నది సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇటీవలే ఓ ఈ కామర్స్ పోర్టల్‌కు సంబంధించి 2 కోట్ల వినియోగదారుల వ్యక్తిగత వివరాలు లీకయ్యాయి. వెంటనే డార్క్ వెబ్‌లో ఈ వివరాలను అమ్మకానికి పెట్టడం కూడా జరిగిపోయింది. అదే విధంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో 3,69,000 బ్యాంకింగ్ ఖాతాదారుల వివరాలను చోరీ చేసే ప్రయత్నం చోటు చేసుకుంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాయే హ్యాకింగ్‌కు గురైందంటే సామాన్యుల ఖాతాలకు రక్షణ ఏ పాటిది? ఈ ఉదాహరణలన్నీ కూడా డిజిటల్ వేదికలపై మన సమాచారం చోరీకి గురికాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసేవే. కవరేజీ అన్నింటికీ కాదు.. ఉద్దేశపూర్వక, నేరపూరిత, మోసపూరిత తదితర చర్యలకు పాలసీ కవరేజీ ఉండదు. అలాగే, ఈ ప్లాన్లు పాలసీదారులకు అయ్యే గాయాలకు గానీ, మానసిక, భావోద్వేగ ఇబ్బందులు తదితర వాటికి పరిహారం ఇవ్వవు. కంప్యూటర్లు, పరికరాలకు వాటిల్లే నష్టానికీ పరిహారం రాకపోవచ్చు. కనుక పాలసీ డాక్యుమెంట్‌ను ముందే పూర్తిగా చదవడం అవసరం. క్లెయిమ్ ప్రక్రియ ఇతర సాధారణ బీమా పాలసీల మాదిరే క్లెయిమ్ ప్రక్రియ ఉంటుంది. పోలీసు లేదా సైబర్ సెల్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని, దానిని క్లెయిమ్ ఫామ్‌కు జత చేసి బీమా కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. లావాదేవీలకు సంబంధించిన రుజువులను కూడా చూపించాలి. సైబర్ దాడి లేదా చోరీ జరిగిన వెంటనే బీమా సంస్థకు ఫోన్ రూపంలో లేదా ఈ మెయిల్ ద్వారా వెంటనే తెలియజేయడం మంచిది. కస్టమర్లు తమ సంస్థ పోర్టల్‌పై క్లెయిమ్ నమోదు చేసుకోవచ్చని లేదా కస్టమర్‌కేర్ విభాగానికి సమాచారం తెలియజేయవచ్చ ని ఐసీఐసీఐ లాంబార్డ్‌కు చెందిన సంజయ్‌దత్తా సూచించారు. క్లెయిమ్స్ మేనేజర్, సైబర్ నిపుణులు ఈ విషయంలో పాలసీదారుకు అవసరమైన సహకారాన్ని అందిస్తారని చెప్పారు. రక్షణ కావాల్సిందే.. స్మార్ట్ పరికరాలను వాడే వారిలో అధిక శాతం మందికి.. మాల్వేర్, ఫైర్‌వాల్స్ విషయంలో రక్షణ గురించి అవగాహన లేదు. కార్యాలయాల్లో మనం వినియోగించే పరికరాలకు ఎక్కువ భద్రతే ఉంటుంది. కానీ, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇంటి నుంచే పని విధానం (వర్క్ ఫ్రమ్ హోమ్) పెరిగిపోయింది. అందుకే ఇటీవలి కాలంలో సైబర్ ఇన్సూరెన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఉదాహరణకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఇండివిడ్యువల్ సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీ కోసం వివరాలు కోరే వారు 2020–21తొలి 6 నెలల్లో 20% అధికంగా ఉన్నట్టు కంపెనీ తెలియజేసింది. ఇక ఫ్యూచర్ జన రాలి ఇండియా ఇన్సూరెన్స్ సైబర్ పాలసీలకూ డిమాండ్ 30–40% అధికమైంది. ‘‘సైబర్ దాడుల నుంచి సైబర్ ఇన్సూరెన్స్ మీకు రక్షణ ఇవ్వదు. కాకపోతే ఈ తరహా సైబర్ దాడుల కారణంగా మీకు వాటిల్లే నష్టానికి పరిహారాన్ని అందించే విధంగా ఉంటుంది. కీలకమైన సమాచారాన్ని చోరీ చేసినా, దుర్వినియోగం చేసినా లేక మీ ప్రతిష్టకు నష్టం కలుగజేసినా కవరేజీనిస్తుంది’’ అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ టీఏ రామలింగం తెలిపారు. పాలసీ తీసుకునే ముందు ► రిస్క్‌ల మదింపు: ఆన్లైన్లో సైబర్ రిస్క్ ఏ స్థాయిలో ఉంది? డిజిటల్ లావాదేవీలను ఏ స్థాయిలో చేస్తున్నారు.. ఎన్ని రోజులకోసారి లేదా రోజువారీగా చేస్తున్నారా అన్నది పరిశీలించాలి. అదే విధంగా సోషల్ మీడియా ఖాతాల వినియోగం, డిజిటల్ లాకర్లు, డిజిటల్ స్టోరేజీలను కూడా వాడుతున్నారేమో చూసుకోవాలి. ► సరైన కవరేజీ: మీకున్న రిస్క్ స్థాయిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత అవసరమైనంత కవరేజీతో పాలసీని తీసుకోవాలి. సాధారణంగా సైబర్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వ్యక్తులకు అయితే రూ.50వేల నుంచి రూ.2 కోట్ల వరకు కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. ► సరైన సంస్థ: మీ అవసరాలన్నింటికీ కవరేజీనిచ్చే పాలసీని ఎంపిక చేసుకోవడం ముఖ్యమైన అంశం అయితే.. ఆ పాలసీని ఏ బీమా సంస్థ నుంచి తీసుకోవాలన్నది కూడా చాలా కీలకం అవుతుంది. ఇందుకోసం బీమా సంస్థ చెల్లింపుల చరిత్ర మంచిగా ఉన్నదా, లేదా అన్నది పరిశీలించాలి. తక్కువ చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థ నుంచి పాలసీని తీసుకుంటే.. ఆ తర్వాత మీకు క్లెయిమ్ అవసరం ఏర్పడినప్పుడు సమస్యలు ఎదురుకావచ్చు. ► సరైన కవరేజీలు: మీరు తీసుకునే పాలసీ సమగ్ర కవరేజీతో కూడిన ప్లాన్ అయి ఉండాలి. అందులో అవసరమైన కవరేజీలు అన్నీ ఉండేలా చూసుకోవాలి. సరైన కవరేజీ సైబర్ ఇన్సూరెన్స్ అన్నది.. సైబర్ దాడి లేదా సమాచార చోరీ అనంతరం అవసరమైన న్యాయ, రక్షణ, విచారణ ఖర్చులను చెల్లిస్తుంది. కోర్టు విచారణకు హాజరు అయ్యేందుకు ఖర్చులను కూడా చెల్లిస్తుంది. చోరీకి గురైన డేటాను తిరిగి పొందడంతోపాటు, ఇన్‌స్టాలేషన్‌కు అయ్యే వ్యయాలను కూడా చెల్లిస్తుంది. గోప్యత, సమాచార ఉల్లంఘనల్లో మూడో పక్షానికి వాటిల్లే నష్టానికి కూడా పరిహారం అందిస్తుంది. అంతేకాదు ఆర్థికంగా ఏర్పడే నష్టాన్ని కూడా (మీరు తీసుకున్న కవరేజీకి లోబడి) భర్తీ చేస్తుంది. ‘‘కరోనా మహమ్మారి సమయంలో చాలా వరకు సంస్థలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నమూనాను అనుసరించాయి. దీంతో సంస్థలు తమ ఐటీ అప్లికేషన్ల సేవలను, డేటాబేస్లను క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లపైకి మళ్లించడంతో సైబర్ దాడుల రిస్క్ పెరిగింది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు ఉపయోగించే నెట్‌వర్క్‌లు పూర్తి స్థాయి రక్షణతో ఉన్నవి కావు. దీంతో సైబర్ దాడుల బారిన పడే రిస్క్ ఎక్కువైంది’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్ అండర్‌రైటింగ్, క్లెయిమ్స్, రీఇన్సూరెన్స్ చీఫ్ సంజయ్‌దత్తా వివరించారు. వీటిని మర్చిపోవద్దు.. సైబర్ బీమా తీసుకుంటే చాలులే అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. ప్రతీ ఒక్కరూ తమకంటూ ఉన్న రిస్క్‌లు ఏవేవి? అన్నది పరిశీలించుకుని, వాటికి కవరేజీనిచ్చే పాలసీని ఎంచుకోవడం కీలకం అవుతుంది. అంతేకాదు, అవసరమైన యాడాన్ కవరేజీలను కూడా జోడించుకోవాలి. ఇందులో ముఖ్యంగా రిస్క్ పరిమాణాన్ని అంచనా వేయాలి. ఇందుకుగాను ఇంటర్నెట్ వేదికపై ఎంత విలువ మేర ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నదీ చూడాల్సి ఉంటుంది. తరచూ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను, అదే విధంగా కార్డు చెల్లింపులు, ఈ వ్యాలెట్లను వినియోగించే వారు అయితే సైబర్ ఇన్సూరెన్స్‌ను తప్పకుండా తీసుకోవడం మంచిదని ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీరాజ్ దేశ్‌పాండే సూచించారు. రక్షణ చర్యలు సైబర్ బీమా తీసుకోవడం ఒక విధమైన రక్షణ అయితే.. మరోవైపు ఈ సైబర్ దాడుల బారిన పడకుండా మనవంతు రక్షణ చర్యలు తీసుకోవడం కూడా అవసరమే. ఇందుకోసం ఏం చేయాలంటే.. ► కంప్యూటర్‌కు రక్షణ: మొదటగా చేయాల్సింది ఇదే. కంప్యూటర్ నుంచి ఇంటర్నెట్ను యాక్సెస్ చేసే వారు తప్పకుండా యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కువ రక్షణనిచ్చే సాఫ్ట్‌వేర్‌ను ఎంచుకోవాలి. దీనిని ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేసుకోవాలి. ► పటిష్ట పాస్వర్డ్లు: కొంత మంది అయితే పాస్‌వర్డ్‌లను ఎప్పటికీ మార్చకుండా వాటినే వినియోగిస్తుంటారు. కానీ ఇది చాలా రిస్క్‌తో కూడినది. పాస్‌వర్డ్‌లను ఇంకొకరు సులభంగా ఊహించే విధంగా ఉండకుండా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. పాస్‌వర్డ్‌లో నంబర్లు, ప్రత్యేక క్యారెక్టర్లు తప్పక ఉండాలి. ఎప్పటికప్పుడు పాస్‌వర్డ్‌లను మార్చుకుంటూ ఉండాలి. ► సోషల్ మీడియా ఖాతాలకు రక్షణ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై మీ ప్రొఫైల్‌ను ప్రైవేటు అకౌంట్స్ కోసమే అని ఎంచుకోవాలి. దాంతో మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే వాటిని చూడగలరు. అకౌంట్‌ను ప్రైవేటుగా ఎంచుకునే ఆప్షన్ అన్ని ప్లాట్‌ఫామ్‌లపైనా ఉంది. ► ఫిషింగ్ ఈమెయిల్స్‌తో జాగ్రత్త: ఈ మెయిల్స్‌కు వచ్చే ప్రతీ సందేశంపైనా క్లిక్ చేయకూడదు. క్లిక్ చేసే ముందు సోర్స్ చూడాలి. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? మీకు తెలిసిన వేదిక నుంచేనా అన్నది పరిశీలించుకోవాలి. బహుమతులు, మంచి ఆఫర్లు అంటూ తెలియని వేదికలు, కొత్త వేదికల నుంచి వచ్చే మెయిల్స్‌ను కూడా ముట్టుకోకుండా ఉండడమే మంచిది ► డేటా రక్షణ: మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఫైల్స్‌కు ఎన్క్రిప్షన్ ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు బ్యాకప్ కూడా తీసుకోవడం మర్చిపోవద్దు. ► మొబైల్ ఫోన్‌కు రక్షణ: మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు కూడా మంచి యాంటీ వైరస్ అవసరం ఎంతో ఉంది. -
కర్ణాటక పశు సంరక్షణ
నిరసనలు, గందరగోళం మినహా చర్చేమీ లేకుండా కర్ణాటక అసెంబ్లీ బుధవారం పశు వధ నివా రణ, సంరక్షణ బిల్లును ఆమోదించింది. శాసనమండలిలో తగిన బలం లేకపోవడంతో ప్రస్తుతానికి అక్కడ వాయిదా వేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో అమలవుతున్న గోవధ నిషేధ చట్టాల పనితీరు ఎలావుందో పరిశీలించి, చట్టం తీసుకొస్తామని ఆమధ్య కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రంలో 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకొచ్చినప్పటి నుంచీ గో సంరక్షణపై సంఘ్ పరివార్ సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. గో సంరక్షణ కోసమంటూ రోడ్డెక్కే నిఘా బృందాల వల్ల పలు రాష్ట్రాల్లో సమస్యలు ఏర్పడ్డాయి. అందులో కర్ణాటక కూడా వుంది. ఇప్పుడు తాజాగా ఆమోదం పొందిన బిల్లులో ‘సదుద్దేశంతో పశు రక్షణకు పూనుకొనే వ్యక్తులను కాపాడే’ నిబంధన పొందు పరిచారు. కర్ణాటక బిల్లు కేవలం ఆవులు, దూడలు, ఎద్దులేకాక గేదెలు, దున్నపోతుల వధను కూడా నిషేధిస్తోంది. బిల్లు చట్టంగా మారాక దాన్ని ఉల్లంఘించినట్టు రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల వరకూ శిక్ష, రూ. 50,000 నుంచి ఏడు లక్షల వరకూ జరిమానా విధించేలా నిబంధనలున్నాయి. వధించే ఉద్దేశంతో పశువును విక్రయించేవారికి, ఉద్దేశపూర్వకంగా పశువును చంపినవారికి కూడా ఇందులో శిక్షలు, జరిమానాలు వున్నాయి. అలాగే పోలీసులు సోదా చేసేందుకు, పశువుల్ని స్వాధీనం చేసు కునేందుకు వీలు కల్పిస్తున్నారు. 2010లో అధికారంలో వుండగా యడ్యూరప్ప ఈమాదిరి బిల్లే రూపొందించారు. అనంతరకాలంలో ప్రభుత్వం మారడంతో అది మూలనబడింది. కర్ణాటకలో ప్రస్తుతం 1964నాటి గోసంరక్షణ చట్టం అమల్లోవుంది. చట్టాల మాటెలావున్నా పశుమాంసం ఎగుమతుల్లో ప్రపంచంలో బ్రెజిల్ తర్వాత స్థానం మనదే. దేశంలో పశ్చిమబెంగాల్, కేరళ, గోవా, ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో పశు వధ నిషేధ చట్టాలు అమల్లోవున్నాయి. దేశమంతా వర్తించే విధంగా గోవధ నిషేధ చట్టం తీసుకురావాలన్న ప్రయత్నాన్ని 1955లో అప్పటి ప్రధాని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ అంశం రాష్ట్రాలకే విడిచిపెట్టడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో సైతం ఆవు, దూడ, ఎద్దు వగైరాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, వాటి వధను నివారించాలని వుంది. నిరుపయోగంగా మారిన పశువుల్ని కబేళాలకు తరలించరా దన్న వాదన తప్పని 1961లో ఒక కేసులో తీర్పునిచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. అందువల్ల ఆ పశు యజమానులకే కాక, మొత్తం సమాజంపై భారం పడే ప్రమాదం వుంటుందని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్ చట్టం అమలు తీరెలావుందో పరిశీలిస్తామని కర్ణాటక తెలిపింది గనుక ఈమధ్యే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును చూడాలి. యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగమవుతోందని, మాంసాన్ని ఫోరెన్సిక్ లాబొరేటరీ పరీక్షలకు పంపకుండానే అమాయకుల్ని నిందితులుగా ఇరికిస్తున్నారని న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ వ్యాఖ్యానించారు. గోశాలల్లో వట్టి పోయిన ఆవుల్ని, వయసు ముదిరిన ఆవుల్ని నిరాకరించడంతో అవి బయట సంచరిస్తూ సమా జానికి సమస్యగా మారుతున్నాయని అన్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో తెలియదు. ఇక యూపీలో గోసంరక్షణ పేరుతో వ్యక్తుల్ని కొట్టిచంపడం, విధ్వంసాలకు పాల్పడటం ఎక్కువే. రెండేళ్లక్రితం బులంద్‌షహర్ సమీపంలో ఆవు కళేబరాలు కనబడ్డాయని రెచ్చిపోయిన దుండగులు శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమైన ఒక ఇన్స్పెక్టర్ను కాల్చిచంపారు. విధ్వంసానికి దిగి అక్కడి అవుట్‌పోస్టుకు నిప్పెట్టడంతోపాటు అనేక వాహనాలు తగలబెట్టారు. ఆ కేసు ఇప్పటికీ ఎటూ తేలలేదు. నిందితులు చాన్నాళ్లక్రితమే బెయిల్‌పై విడుదల య్యారు. బయట సంచరించే పశువుల్ని సంరక్షించడానికి అవసరమైన షెడ్ల నిర్మాణంకోసం యూపీ ప్రభుత్వం మద్యం, టోల్ గేటు పన్నులపై ‘గో కల్యాణ్ సెస్’ను 0.5 శాతం విధించింది. అలాగే హోల్‌సేల్ మార్కెట్ల ఆదాయంపై ఒక శాతం లెవీ వసూలు చేస్తోంది. గోవధకు పాల్పడ్డారన్న ఆరోపణపై 76మందిని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. పశువుల పరిరక్షణ భావన ఉన్నతమైనదని కర్ణాటక పాలకులు అనుకుంటూండవచ్చు. కానీ అందువల్ల ఉత్పన్నమయ్యే సమస్యలేమిటన్నది చూడాల్సిన బాధ్యత కూడా వారిపై వుంది. వట్టి పోయిన, సాగుకు పనికిరాని పశువుల్ని రైతులు ఏం చేయవచ్చునో బిల్లు చెప్పడం లేదు. కొత్త పశు వుల్ని కొనుగోలు చేయాలంటే పాతవాటిని అమ్మడమే ఏరైతుకైనా వుండే మార్గం. వాటివల్ల రాబడి వచ్చినంతకాలం మాత్రమే ఆ పశువులను రైతులు పోషించగలరు. హైబ్రీడ్ రకం పశువులకు దాణా కోసం రైతు కనీసం రోజుకు రూ. 200 వెచ్చించాల్సివస్తుందని ఒక అంచనా. పాలకులకుండే ‘సదుద్దేశం’ నెరవేరడం కోసం రైతులు అంత వ్యయం భరించాలనడం ఏం న్యాయం? దేశ జనా భాలో 15 శాతంమందికి పశు మాంసం ఆహారంగా వుంది. వీరంతా అట్టడుగు వర్గాలవారే. వీరికి తక్కువ ఖర్చుతో లభించే పోషకాహారం పశు మాంసం ఒక్కటే. అలాంటి వారికి ప్రభుత్వం చూపే ప్రత్యామ్నాయం ఏమిటో తెలియదు. అసలు ఏం తినాలో నిర్ణయించుకోవడమనేది పూర్తిగా వ్యక్తి గత విషయం. ఎవరింట్లో ఏం వండుకుంటున్నారో, ఎవరి రిఫ్రిజిరేటర్లో ఏముందో చూడటం వారి వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడం అవుతుంది. పశు సంరక్షణ పేరుతో కొందరు దుండగులు అకారణంగా దాడి చేసిన ఉదంతాలు కర్ణాటకలో కూడా తక్కువేమీ కాదు. వాటి గురించి తెలిసి కూడా పశు సంరక్షకులకు రక్షణ వుంటుందనడం సబబో కాదో ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటి కైనా మించిపోయింది లేదు... అన్ని వర్గాల అభిప్రాయం తెలుసుకుని, చట్టసభల్లో కూలంకషంగా చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని కర్ణాటక సర్కారు గుర్తించాలి. -
ఆ బ్రిడ్జి కేవలం చిన్న జంతువులకు మాత్రమే
నైనిటాల్ : అటవీ ప్రాంతాల్లో ఉండే రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాల వల్ల అక్కడ ఉండే చిన్ని ప్రాణులు మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై అలా జరగకుండా వాటిని కాపాడేందుకు ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ అటవీశాఖ వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే స్థానిక అటవీశాఖ అధికారులు కలాదుంగి- నైనిటాల్ జాతీయ రహదారిలో మొట్టమొదటి ఎకో బ్రిడ్జిని రూపొందించారు. ఈ ఎకో బ్రిడ్జిని రోడ్డు నుంచి 90 మీటర్ల ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో నిర్మించారు.(చదవండి : వైస్ ప్రిన్సిపల్‌కే షాకిచ్చిన స్టూడెంట్స్) దీనిపై కలాదుంగి ఫారెస్ట్ రేంజ ఆఫీసర్ అమిత్ కుమార్ గ్వాస్కోటి స్పందిస్తూ.. 'తరచుగా అటవీ ప్రాంతాల్లో ఉండే రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాల ద్వారా చిన్న ప్రాణులు అనేకం బలవుతున్నాయి. ఇలాంటివి జరగకూడదనే ఎకో బ్రిడ్జిని రూపొందించాం. సిమెంట్, ఐరన్ లాంటి వస్తువులను వాడకుండా కేవలం వెదురు, గడ్డి ఉపయోగించి ఈ ఎకో బ్రిడ్జిని తయారు చేశాం . అటవీ ప్రాంతాల్లో ఉండే చిన్న జాతి జంతువులైన ఉడుత, పాములు లాంటవి వీటిపై నుంచి వెళితే ప్రమాదాల బారి నుంచి తప్పించే అవకాశం ఉంది.'అని ఆయన పేర్కొన్నారు.