న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ప్రభుత్వం నుంచి రక్షణ లభిస్తోందని ఆయన ఆరోపించారు.
ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ విధ్వంసం సృష్టిస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. లారెన్స్ బిష్ణోయ్ బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడని, అక్కడి నుంచే దోపిడీ రాకెట్ నడుపుతున్నాడని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో భద్రతపై అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో ప్రశ్నలను లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఢిల్లీలో చోటుచేసుకున్న పలు సంఘటనలను ఆయన ప్రస్తావించారు.
#WATCH | In the Delhi Assembly, AAP MLA and party's national convener Arvind Kejriwal says, "In the last 10 years, Delhi's law and order is going from bad to worse, especially since 2019 when Amit Shah became the Home Minister...He is unable to handle Delhi...Incidents of murder… pic.twitter.com/vjCa9rGK4h
— ANI (@ANI) November 29, 2024
గత పదేళ్లలో ఢిల్లీలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 2019లో అమిత్ షా హోంమంత్రి అయినప్పటి నుండి ఢిల్లీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. నేరాలను అరికట్టడంలో ఆయన అసమర్థులుగా కనిపిస్తున్నారని, ఢిల్లీలో హత్యాయుత ఘటనలు తరచూ జరుగుతున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని జనానానికి దోపిడీ కాల్స్ వస్తున్నాయని, గ్యాంగ్ వార్, కాల్పులు బహిరంగంగానే జరుగుతున్నాయని ఆయన వాపోయారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment