పోరాటాలతోనే హక్కుల పరిరక్షణ | Agitations leads to Rights protection | Sakshi
Sakshi News home page

పోరాటాలతోనే హక్కుల పరిరక్షణ

Published Fri, Aug 12 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

Agitations leads to Rights protection

మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు
 
గుంటూరు ఎడ్యుకేషన్‌: పోరాటాలతోనే హక్కులను పరిరక్షించుకోగలమని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) 17వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె. నాగ మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కేఎస్‌ లక్ష్మణరావు  ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత చెన్నుపాటి లక్ష్మయ్య కాంస్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగం రాష్ట్ర ఉమ్మడి జాబితాల నుంచి క్రమేణా కేంద్రీకరణ దిశగా, కేంద్ర పెత్తనంలోకి వెళుతోందని, ఇందుకు నీట్‌ ఉదాహరణగా చెప్పవచ్చని అన్నారు.  యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్‌ ఎన్‌. తాండవకృష్ణ మాట్లాడుతూ జాతీయస్థాయి సమస్యల పరిష్కారానికి ఎస్టీఎఫ్‌ఐ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement