agitations
-
పోరాడితేనే కాపాడుకోగలం!
మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామిగా చేరినప్పటి నుంచి రైతాంగం, వ్యవసాయ రంగం పరిస్థితి మరింత వేగంగా క్షీణించడం ప్రారంభమైంది. 2022 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ సిఫారసుల ప్రకారం వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని నమ్మబలికిన ఎన్డీయే పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గెలిచే వరకు మద్దతు ధర గురించి ఊదరగొట్టి, గెలిచిన తర్వాత సి2 + 50 సూత్రం (ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు అదనంగా అందులో సగభాగం కలిపి ఆ మొత్తంపై లెక్కగట్టటం) ప్రకారం తాము కనీస మద్దతు ధర ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు ఎన్డీఏ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించడం ద్వారా తన రైతు వ్యతిరేక విధానాన్ని బయట పెట్టుకొన్నది.ఇప్పటికే దేశంలోని 52 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయని, వారి నెత్తిపై సగ టున 74,121 రూపాయల అప్పు ఉందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో పంటల ధరలు గిట్టుబాటు కాక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల సుడి గుండంలో చిక్కుకుంటున్న రైతు కుటుంబాల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. 2013 నుండి 2022 వరకు అధికారిక లెక్కల (ఎన్సీఆర్బీ) ప్రకారమే గత పదేళ్లలో లక్షా ఇరవై వేల మందికి పైగా రైతులు ఆత్మ హత్య చేసుకున్నారంటే రైతాంగం పరిస్థితి ఎంత దయ నీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ పంటలపై కార్పొరేట్ శక్తులకు అధి కారాన్ని కట్టబెట్టే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉరితాళ్ల వంటి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు ఢిల్లీ కేంద్రంగా రైతులు వీరోచితంగా పోరాడారు. ఫలితంగా ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టబద్ధత అవకాశాల పరిశీలన కోసం ఉద్యమ నాయ కత్వానికి రాతపూర్వక హామీ ఇచ్చింది. అయితే మూడు సంవత్సరాలు దాటినా దీనిపై ఎలాంటి పురోగతి లేకపోగా తిరిగి దొడ్డి దారిన ఆ మూడు నల్ల చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దానిలో భాగంగానే కొత్త వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. అటవీ సంరక్షణ నియమాల పేరుతో 2006 అటవీ హక్కుల చట్టానికి పాతరేయటానికి పూనుకున్నది. అటవీ సంరక్షణ నియమాల బిల్లు ఆమోదం పొందితే అడవులకు, అడవుల్లో నివసించే జన సమూహాల హక్కులకు ముప్పు ఏర్పడుతుందని పార్లమెంట్ సభ్యులకు కాన్స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూపు తరపున 155 మంది మాజీ ఐఏఎస్ అధికారులు తమ సంతకాలతో లేఖ రాశారు. అయినా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఆ బిల్లును ఆమోదింప చేసు కుంది. మరోవైపు విద్యుత్ బిల్లు–2020ని చట్టం చేయడా నికి మార్గం సుగమం చేసుకుంది. కచ్చితంగా ఇది వ్యవ సాయ రంగంపై పెను భారం మోపే బిల్లు అనొచ్చు.వ్యవసాయ రంగంలో పని చేసే వారంతా రైతులే. వీరిలో కౌలు రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దారుణంగా వుంది. రైతును, వ్యవసాయ రంగాన్ని రక్షించుకోలేక పోతే దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం వుంది. ఇప్పటికైనా రైతులు, రైతు సంఘాలు మేల్కొనాలి. ప్రమాదంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి. ఉద్యమ శక్తుల ఐక్యత ద్వారానే రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్నీ కాపాడుకోగలుగుతాం. ‘అఖిలభారత రైతుకూలీ సంఘం’ అనే పేరుతో కొనసాగుతూ వస్తున్న రెండు వేర్వేరు నిర్మాణాలు ఈ నేపథ్యంలోనే ‘ఆలిండియా కిసాన్ మజ్దూర్ సభ’ (ఏఐకేఎంఎస్)గా ఒకటి అవుతున్నాయి. ఆదివారం మహబూబాబాద్‌లో విలీన సభ జరుపుకొంటున్నాయి.– గౌని ఐలయ్య,ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల హింస.. మరో 18 మంది మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల కోటాలో సంస్కరణలను కోరుతూ బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. గురువారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో మరో 18 మంది చనిపోగా 2,500 మంది వరకు గాయపడ్డారు. దీంతో, ఈ ఆందోళనల మృతుల సంఖ్య 25కు చేరింది. గురువారం ఆందోళనకారులు ఢాకాలో ప్రభుత్వ టీవీ కార్యాలయం ముందుభాగాన్ని ధ్వంసం చేశారు. పార్కు చేసిన వాహనాల్ని తగులబెట్టారు. దీంతో, ఉద్యోగులతోపాటు జర్నలిస్టులు లోపలే చిక్కుబడిపోయారు. ఢాకాతోపాటు ఇతర నగరాల్లో ఉన్న వర్సిటీల్లో వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. ఆందోళనకారులు భద్రతా సిబ్బంది, అధికార పార్టీ అనుకూలురతో బాహాబాహీగా తలపడ్డారు. ఘర్షణల్లో 18 మంది చనిపోగా 2,500 మందికి పైగా గాయపడినట్లు డెయిలీ స్టార్ పత్రిక తెలిపింది. ఢాకాలోనే 9 మంది చనిపోయినట్లు పేర్కొంది. దాంతో రైళ్లతో పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. -
ఆందోళనలు, అరెస్టులు
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, ఢిల్లీ రాష్ట్ర మంత్రులు బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు, నిరసనలతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో ఆందోళనకు దిగిన ఆప్ నేతలను పోలీసులు అరెస్ట్‌చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆప్, బీజేపీ ప్రధాన కార్యాలయాలు ఉన్న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ సమీప ఐటీఓ ఇంటర్సెక్షన్ కూడలి వద్దకు ఆప్ నేతలు, కార్యకర్తల పెద్ద సంఖ్యలో చేరుకుని మోదీ సర్కార్ వ్యతిరేక నినాదాలు చేశారు. ‘అరవింద్ మీరు సంఘర్షణను కొనసాగించండి. మేం మీకు తోడుగా ఉంటాం’ అని నినదించారు. ట్రాఫిక్ స్తంభించడంతో ధర్నాకు దిగిన వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నంచేశారు. అక్కడే ఆందోళనకు దిగిన ఢిల్లీ రాష్ట్ర మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లో వేరే చోట్లకు తరలించారు. దీంతో తమ నేతలను విడుదలచేయాలంటూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలుచేశారు. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు పారామిలటరీ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధించారు. ఐటీవో స్టేషన్‌ను సాయంత్రందాకా ఢిల్లీ మెట్రో రైల్ మూసేసింది. ఈడీ ప్రధాన కార్యాలయం, బీజేపీ ఆఫీస్‌ల వద్ద భారీగా బలగాలను మొహరించారు. ‘‘తప్పుడు కేసులతో నిన్న సీఎంను అరెస్ట్‌చేశారు. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే’’ అంటూ మంత్రులు ఆతిశీ, సౌరభ్ మండిపడ్డారు. కస్టడీలో కేజ్రీవాల్‌కు రక్షణేది: ఆతిషి ధర్నాకు ముందు మంత్రి ఆతిషి పత్రికాసమావేశంలో మాట్లాడారు. ‘‘సీఎం హోదాలో కేజ్రీవాల్ చుట్టూ నిరంతరం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు ఈడీ కస్టడీలో కేంద్రం ఆయనకు అంతటి భద్రత కల్పిస్తోందా? ఆయన భద్రతకు జవాబుదారీ ఎవరు? ఈడీ ఆఫీస్ లాకప్‌లోకి ఎవరెవరు వస్తున్నారు? అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లపై కేంద్రం ప్రకటన చేయాలి’ అని ఆతిషి డిమాండ్ చేశారు. -
కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. పార్టీ పిలుపుమేరకు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల ప్రధాని మోదీ దిష్టి బొమ్మల దహనం, రాస్తారోకోలు, ధర్నాలతో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు నిరసన తెలిపాయి. ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల శనివారం తెల్లవారుజాము నుంచే పార్టీ ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు సిరిసిల్ల, సిద్దిపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వనపర్తి, నల్లగొండ తదితర చోట్ల నిరసనలు మి న్నంటాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ ఆగ్ర హం వ్యక్తంచేసింది. లోకసభఎన్నికల ముందు బీఆర్ ఎస్‌ను మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచనతో కుట్ర పన్నుతున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నిరసనలో అపశృతి సిరిసిల్ల: కవిత అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో శనివారం చేపట్టిన ధర్నాలో భాగంగా ప్రధాని మోదీ ఫ్లెక్సీపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఈ క్రమంలో కోడం సాయి (30) అనే యువకుడికి మంటలంటుకున్నాయి. వెంటనే మంటలార్పి అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇదే ఆందోళన కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మహిళా ఎంపీపీలు పరస్పరం ఘర్షణపడి ఒకరినొకరు కొట్టుకోబోయారు. నేతలు వారిని వారించారు. -
Parliament security breach: భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి పొగపెట్టిన ఘటనను తీవ్రమైన అంశంగా ప్రధాని మోదీ ఆదివారం అభివరి్ణంచారు. గత బుధవారం జరిగిన ఈ ఘటనపై ఓ హిందీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తొలిసారిగా స్పందించారు. ‘‘పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశమే. ఈ ఘటన నన్నెంతగానో బాధించింది. దీనిపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు చేస్తూ అనవసర వాదులాటకు దిగడం వ్యర్థం. ఈ చొరబాటు వెనుక ఉన్న శక్తుల గుట్టుమట్లు బయటపెడతాం. ఇవి పునరావృతం కాకుండా ఉమ్మడిగా పరిష్కారం కనుగొందాం’’ అని సూచించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో ముఖ్యమంత్రులైన వారు కొత్తవాళ్లు కాదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. సుప్రీంకోర్టు నేపథ్యంలో 370ను ఎవరూ ఎప్పటికీ తిరిగి అమల్లోకి తేలేరన్నారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేయబోతోంది. ఇకనైనా విపక్ష పారీ్టలు తమను ప్రజలు ఎందుకు గెలిపించట్లేదనే ఆత్మావలోకనం చేసుకుంటే మంచిది’ అని సూచించారు. ప్రధాని పారిపోతున్నారు: కాంగ్రెస్ లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై చర్చించకుండా ప్రధాని పారిపోతున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిందితులకు లోక్‌సభలోకి పాస్లిచ్చింది బీజేపీ ఎంపీ కావడమే ఇందుకు కారణమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. కాలిన ఫోన్లు స్వా«దీనం లోక్‌సభలో కలకలం ఘటనలో నిందితుల తాలూకు కాలిన ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఘటన సూత్రధారి లలిత్ ఝా బసచేసిన రాజస్తాన్‌లోని నాగౌర్‌లో అవి లభించాయి. వాటిని కాల్చేయడంతో సాక్ష్యాధారాల ధ్వంసం సెక్షన్లను ఎఫ్ఐఆర్కు జతచేశారు. ఈ ఘటనలో సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, లలిత్ ఝా, మహేశ్ కుమావత్‌లను అరెస్ట్ చేసి కఠిన ఉపా చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం తెలిసిందే. లోక్‌సభ ఛాంబర్లో మనోరంజన్, సాగర్‌శర్మ, పార్లమెంట్ ప్రాంగణంలో నీలం దేవి, అమోల్ షిండే పొగ గొట్టాలు విసిరి కలకలం రేపడం తెలిసిందే. సంబంధిత వీడియోలను వైరల్ చేయాలంటూ లలిత్ తన మిత్రుడు సౌరవ్‌కు పంపాడు. తర్వాత రాజస్థాన్‌లోని నాగౌర్‌లో తమ ఫోన్లను తగలబెట్టాడు. ఢిల్లీ వచ్చి లొంగిపోయాడు. -
కాంగ్రెస్‌కు అసంతృప్తుల కాక
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మూడో జాబితాపై కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. జాబితాలో పేర్లు లేని ఆశావహులు, వారి అనుచరులు ఆందోళనలు చేపట్టారు. అటు గాంధీభవన్, ఇటు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఈ ఆందోళనలు జరిగాయి. జి చిన్నారెడ్డి (వనపర్తి), సంజీవరెడ్డి (నారాయణఖేడ్), కాట శ్రీనివాస్‌గౌడ్ (పటాన్చెరు), బెల్లయ్య నాయక్ (డోర్నకల్), మానవతా రాయ్ (సత్తుపల్లి)లు తమ అనుచరులతో కలిసి, వ్యక్తిగతంగా తమ నిరసనలు పార్టీ అధిష్టానానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గాం«దీభవన్‌లోని ప్రధాన గేటులో ఒకదానికి తాళం వేయగా, జూబ్లీహిల్స్‌లో రేవంత్ నివాసానికి వెళ్లే నాలుగువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. చిన్నారెడ్డి అనుచరుల నిరసన వనపర్తి టికెట్ ఆశించిన చిన్నారెడ్డి అనుచరులు ఉదయం రేవంత్ ఇంటివద్ద ఆందోళనకు దిగారు. తమ నాయకుడికి ఇచ్చిన టికెట్‌ను మార్చి ఇతరులకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వినతిపత్రం సమర్పించారు. రేవంత్ మాట్లాడుతూ చిన్నారెడ్డి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి గాందీభవన్‌కు చేరుకున్న చిన్నారెడ్డి అనుచరులు మెట్లపై కూర్చొని తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో చిన్నారెడ్డి జోక్యం చేసుకొని వారిని వారించారు. ఇలావుండగా వనపర్తి టికెట్ దక్కించుకున్న మేఘారెడ్డికి బీ ఫాం అందింది. మంగళవారం గాందీభవన్‌లో మేఘారెడ్డి సోదరుడు మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి బీ ఫాం అందజేశారు. కాట వర్గీయుల మండిపాటు పటాన్చెరు టికెట్ ఆశించిన కాట శ్రీనివాస్‌గౌడ్ అనుచరులు సోమవారం అర్ధరాత్రే స్థానికంగా నిరసనలకు దిగారు. పార్టీ జెండాలను దహనం చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి ఇంటిని, గాం«దీభవన్‌ను ముట్టడించారు. రేవంత్ ఆలంపూర్ పర్యటనకు వెళ్లిన తర్వాత ఆయన నివాసం వద్దకు వచ్చిన శ్రీనివాస్‌గౌడ్, అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీలో కొత్తగా చేరిన నీలం మధుకు టికెట్ ఎలా ఇస్తారంటూ లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకొని వారిని అక్కడి నుంచి పంపించారు. అనంతరం వారు గాందీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. పారాచూట్లకు టికెట్లు అమ్ముకున్నారంటూ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు రామచంద్రాపురంలోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పటాన్చెరు టికెట్‌ను అమ్ముకున్నారని ఆరోపించారు. అధినాయకత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో శ్రీనివాస్‌గౌడ్‌కు ఫోన్ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ టికెట్ విషయంలో భరోసా ఆందోళన విరమించారు. కాగా నారాయణఖేడ్ టికెట్ ఆశించి భంగపడిన సంజీవరెడ్డి అనుచరులు కూడా గాందీభవన్ వేదికగా ఆందోళనకు దిగారు. ఖేడ్‌లోనూ నిరసన వ్యక్తం చేశారు. టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్యకూ వెనుకాడను తెలంగాణ కాంగ్రెస్ ఎస్టీ విభాగం చైర్మన్‌గా ఉన్న తనకు టికెట్ కేటాయించకపోవడంపై బెల్లయ్య నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్, డోర్నకల్‌లలో ఎక్కడా టికెట్ ఇవ్వకుండా మోసం చేశారంటూ గాంధీ బొమ్మ ఎదుట దీక్షకు దిగారు. తనకు అవకాశం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడనని హెచ్చరించడంతో పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. బరిలోకి దిగేది ఖాయం: మానవతారాయ్ సత్తుపల్లి విషయంలో నిర్ణయాన్ని 24 గంటల్లోగా మార్చుకొని తనకు పార్టీ బీఫాం ఇవ్వకపోతే 9, 10 తేదీల్లో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఓయూ విద్యార్థి నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కె మానవతారాయ్ హెచ్చరించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొంటూ రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. భీం భరత్‌కు ఎట్టకేలకు బీ ఫాం చేవెళ్ల టికెట్‌ను భీం భరత్‌కు ఇస్తామని ప్రకటించిన అధిష్టానం బీ ఫాం మాత్రం ఇవ్వలేదు. దీంతో రెండు మూడురోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఆయన మంగళవారం పార్టీ పెద్దలను కలిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే బీఫాం అందజేయడతో గందరగోళానికి తెరపడింది. దామోదర వర్సెస్ జగ్గారెడ్డి మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి మధ్య విభేదాలు పొడ చూపాయి. పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ నీలం మధు ముదిరాజ్‌కు దక్కడంలో తన ప్రమేయం ఉందంటూ కాట శ్రీనివాస్‌గౌడ్ కుటుంబ సభ్యులతో రాజనర్సింహ తనను బద్నాం చేయిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని, దమ్ముంటే రాజకీయంగా తేల్చుకోవాలే తప్ప వ్యక్తిగతంగా డ్యామేజీ చేసేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. మరోవైపు తన అనుచరులు కాట శ్రీనివాస్‌గౌడ్, సంజీవరెడ్డిలకు టికెట్లు దక్కకపోవడంపై రాజనర్సింహ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తన నియోజకవర్గం మునిపల్లి మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. -
‘నీట్’ నుంచి మినహాయించేదాకా ఉద్యమిస్తాం
చెన్నై: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) నుంచి తమిళనాడును మినహాయించేదాకా తమ ఉద్యమం ఆగదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేల్చిచెప్పారు. ‘నీట్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార డీఎంకే నేతృత్వంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను, ఆందోళనలు నిర్వహించారు. నిరాహార దీక్షలు సైత చేపట్టారు. నీట్ రద్దు అనేది రాజకీయపరమైన డిమాండ్ కాదని, అందిరికీ సమాన అవకాశాలు లభించాలన్నదే తమ ఉద్దేశమని స్టాలిన్ చెప్పారు. ఈ పరీక్ష నుంచి తమిళనాడు మినహాయించేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఈ ధర్నాలో పాల్గొనాలని విపక్ష ఏఐఏడీఎంకేకు స్టాలిన్ సూచించారు. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే నీట్‌ను తీసుకొచ్చానని ఏఐఏడీఎంకే నేత, మాజీ సీఎం పళనిస్వామి గుర్తుచేశారు. -
ఇజ్రాయెల్.. ‘సంస్కరణం’
నిరసనలు, ఆందోళనలు, సమ్మెలతో గత మూడు నెలలుగా ఇజ్రాయెల్ అట్టుడికిపోతోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది జనం నిత్యం వీధుల్లోకి వస్తున్నారు. బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. కార్మికులు సమ్మె ప్రారంభించారు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం. ఇవి గొప్ప సంస్కరణలని నెతన్యాహూ అనుకూల వర్గాలు ఊదరగొడుతున్నప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదు. న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తలపెట్టిన మార్పులు దేశ ప్రజాస్వామ్య పునాదులను కదిలిస్తాయని, తాము హక్కులు కోల్పోతామని వారు ఆరోపిస్తున్నారు. మార్పులకు వ్యతిరేకంగా గళమెత్తిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్ గల్లాంట్ను ఆదివారం హఠాత్తుగా పదవి నుంచి తొలగించడం మరింత అగ్గి రాజేస్తోంది. నెతన్యాహూ సర్కారు నియంతృత్వ ధోరణిపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తలపెట్టిన మార్పులు, వాటిపై ప్రజల భయాందోళన వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం.. ఏమిటీ సంస్కరణలు ► 1948లో ఆవిర్భవించిన ఇజ్రాయెల్‌లో లిఖిత రాజ్యాంగం లేదు. ► నోటిమాటగా కొన్ని రాజ్యాంగ ప్రాథమిక చట్టాలు అమలవుతూ వస్తున్నాయి. ఈ చట్టాల ప్రకారం ఇజ్రాయెల్‌లో సుప్రీంకోర్టే శక్తివంతం. ► ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన ‘నేస్సెట్’పై నియంత్రణ అధికారం సుప్రీంకోర్టుకే ఉంది. ► నెతన్యాహూ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నకొత్త సంస్కరణల ప్రకారం మొత్తం న్యాయ వ్యవస్థపై పార్లమెంట్‌కే అధికారాలు ఉంటాయి. అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలదే అసలు పెత్తనం. ► న్యాయమూర్తులను ఎలా నియమించాలి? ఎలాంటి చట్టాలు తీసుకురావాలి? అనేది పార్లమెంటే నిర్ణయిస్తుంది. అంతేకాదు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలల్లో మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. ► ఇజ్రాయెల్ జ్యుడీషియరీలో ఇలాంటి భారీ మార్పులను ప్రతిపాదిస్తుండడం ఇదే మొదటిసారి. ► సుప్రీంకోర్టు అనేది ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధం లేని గ్రూప్‌గా మారిపోయిందని నెతన్యాహూ మద్దతుదారులు వాదిస్తున్నారు. న్యాయస్థానం పరి ధి మీరి వ్యవహరిస్తోందని, సంబంధం లేని వ్యవహారాల్లో తలదూరుస్తోందని విమర్శిస్తున్నారు. ► ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వంలో న్యాయస్థానం జోక్యం ఏమిటని వారు మండిపడుతున్నారు. ► అమెరికా లాంటి దేశాల్లో జడ్జీల నియామక వ్యవస్థను రాజకీయ నాయకులే నియంత్రిస్తారని నెతన్యాహూ గుర్తుచేస్తున్నారు. తద్వారా తన చర్యలను సమర్థించుకుంటున్నారు. ► ఇజ్రాయెల్‌లో జడ్జీలను నియమించే తొమ్మిది మంది సభ్యుల కమిటీలో మెజార్టీ సభ్యులు ప్రభుత్వ ప్రతినిధులే ఉండేలా ఆయన ఒక బిల్లును తీసుకొచ్చారు. ► పార్లమెంట్ చేసిన కొన్ని చట్టాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పులు వెలువరించింది. అలాంటి చట్టాలను మళ్లీ ఆమోదించే అధికారం పార్లమెంట్‌కు ఉండాలని(ఓవర్‌రైడ్ క్లాజ్) నెతన్యాహూ ప్రతిపాదిస్తున్నారు. ► పదవిలో ఉన్న ప్రధానమంత్రిని కుర్చీ నుంచి దించేయాలంటే మంత్రివర్గంలో మూడింట రెండొంతుల మంది మద్దతు తప్పనిసరిగా ఉండాలన్నది మరో కీలక ప్రతిపాదన. ► శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా లేకపోతేనే ప్రధానమంత్రిని తొలగించాలని, ఇతర కారణాలతో కాదని ఇంకో ప్రతిపాదన చేశారు. నెతన్యాహూకు ప్రయోజనమేంటి? ► ప్రధానమంత్రి నెతన్యాహూపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయనపై మోసం, లంచం తీసుకోవడం, విశ్వాస ఘాతుకానికి పాల్పడడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ► తాను ఏ తప్పూ చేయలేదని నెతన్యాహూ చెబుతున్నప్ప టికీ ఆయన పదవి నుంచి దిగిపోవాల్సిందేనని ప్రత్య ర్థులు డిమాండ్ చేస్తున్నారు. ► పదవిని కాపాడుకోవడానికే న్యాయ వ్యవస్థలో సంస్కరణల పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపిస్తున్నారు. ► అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న నెతన్యాహూ సుప్రీంకోర్టుతో ఓ ఒప్పందానికి వచ్చి ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆయన ప్రభుత్వం తీసుకొనే విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కాకూడదు. కానీ, న్యాయ వ్యవస్థలో సంస్కరణలంటూ విధానపరమైన నిర్ణయంతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందున ప్రధానిగా ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి ఏం జరగొచ్చు? జ్యుడీషియరీలో మార్పుల ప్రతిపాదనలను ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకొనేదాకా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రజలు తేల్చిచెబుతున్నారు. పోరాటం మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు. ప్రజలు తమను ఎన్నుకున్నది చట్టాలు చేయడానికేనని ప్రభుత్వం చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు ప్రజామోదం లభించిందని నెతన్యాహూ అనుచరులు పేర్కొంటున్నారు. అయితే జనాందోళనకు తలొగ్గి, సంస్కరణలను నెలపాటు వాయిదా వేస్తున్నట్టు నెతన్యాహూ తాజాగా ప్రకటించారు. మరోవైపు ఈ ఉదంతంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. అంతర్గత సంఘర్షణ నెలకొనే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. ప్రత్యర్థుల అభ్యంతరాలు జడ్జీలను నియమించే అధికారం నెతన్యాహూ, ఆయన మిత్రుల చేతుల్లో ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు తప్పదని ప్రత్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకూలంగా పనిచేసే జడ్జీలను నియమించుకొని, అవినీతికి సంబంధించిన కేసుల నుంచి బయటపడి, అధికారంలో సుదీర్ఘ కాలం కొనసాగాలన్నదే నెతన్యాహూ ఎత్తుగడ అని ఆరోపిస్తున్నారు. న్యాయ వ్యవస్థ సర్వ స్వతంత్రంగా పనిచేయాలని, అందులో ఇతరుల పాత్ర ఉండరాదని నెతన్యాహూ గతంలో గట్టిగా వాదించారు. ఇండిపెండెంట్ జ్యుడీషియరీకి మద్దతు పలికారు. ఇప్పుడు స్వప్రయోజనాల కోసం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థులు ఆక్షేపిస్తున్నారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే హద్దుల్లేని, నియంత్రణ లేని న్యాయ వ్యవస్థ కాదని నెతన్యాహూ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజలకు నష్టమే! ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థ బలహీనపడితే కేవలం ఇజ్రాయెల్ పౌరులకే కాదు, పాలస్తీనా ప్రజలకు సైతం నష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న వెస్ట్‌బ్యాంక్‌లో పెద్ద సంఖ్యలో పాలస్తీనా పౌరులు ఉన్నారు. వారికి రెసిడెన్సీ కార్డులు ఉన్నాయి. హక్కులకు విఘాతం కలిగినప్పుడు, ప్రభుత్వం నుంచి వేధింపులు పెరిగినప్పుడు, ప్రమాదంలో ఉన్నామని భావించినప్పుడు ప్రజలు ఇకపై కోర్టులను ఆశ్రయించలేరని, ఒకవేళ కోర్టుకెళ్లినా న్యాయం జరుగుతుందన్న భరోసా ఉండదని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం చెప్పినట్లే కోర్టులు ఆడాల్సి ఉంటుందని, అవి ప్రజలకు రక్షణ కల్పించలేవని అభిప్రాయపడుతున్నారు. కోర్టులపై రాజకీయ నాయకుల పెత్తనం మొదలైతే ఇజ్రాయెల్‌లోని మైనార్టీల హక్కులకు, జీవితాలకు రక్షణ ఉండదని అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Brazil and Peru: ఆ లాటిన్ అమెరికా దేశాల్లో... ‘లా’వొక్కింతయు లేదు!
దక్షిణ అమెరికాలో ముఖ్య దేశాలైన బ్రెజిల్, పెరు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. బ్రెజిల్లో మాజీ అధ్యక్షుడే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ దేశాన్ని రావణకాష్టం చేస్తుండగా, పెరులో పదవీచ్యుతుడైన అధ్యక్షునికి మద్దతుగా ప్రజలే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో రోడ్లెక్కుతున్నారు! బ్రెజిల్లో నిరసనకారులు అధ్యక్ష భవనంతో పాటు ఏకంగా పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థల భవనాలపైనే దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. పెరులోనూ జనం రాజధానితో పాటు దేశమంతటా భారీగా ఆందోళనలకు దిగుతూ అట్టుడికిస్తున్నారు. వీటికి సమీప భవిష్యత్తులో కూడా తెర పడే సూచనలు కన్పించడం లేదు! బ్రెజిల్ బేజారు బోల్సొనారో అనుయాయుల అరాచకం కొత్త అధ్యక్షుడు డ సిల్వా ఆపసోపాలు దక్షిణ అమెరికాలో కొంతకాలంగా ‘గులాబి గాలి’ వీస్తోంది. చాలా దేశాల్లో ప్రధానంగా వామపక్ష భావజాలమున్న పార్టీలే అధికారంలోకి వస్తున్నాయి. ఈ ఖండంలోని అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌లోనూ అదే జరిగింది. గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో రైట్ వింగ్ నాయకుడైన జెయిర్ బోల్సొనారో వెంట్రుకవాసి తేడాలో ఓటమి చవిచూశారు. 51 శాతం ఓట్లతో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా నెగ్గారు. కానీ ఈ ఫలితాలను ఒప్పుకుని గద్దె దిగేందుకు బోల్సొనారో ససేమిరా అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వాటికి సుప్రీంకోర్టు మద్దతూ ఉందని ఆరోపణలు గుప్పించారు. ఈవీఎంలపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాతి పరిణామాల్లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, అవినీతి ఆరోపణలపై విచారణను తప్పించుకునేందుకు అంతిమంగా అమెరికాలో తేలారు! కానీ, ‘‘అధికారం మీ చేతుల్లోనే ఉంది. సైన్యం ఇప్పటికీ నా మాటే వింటుంది. దొంగల పాలనను కూలదోయండి’’ అంటూ అక్కడినుంచే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ వస్తున్నారు. ఫలితంగా కొంతకాలంగా బ్రెజిల్ అల్లర్లు, ఆందోళనలు, గొడవలతో అట్టుడుకుతోంది. పార్లమెంటుపై దాడులు ముఖ్యంగా జనవరి 8న కరడుగట్టిన బోల్సొనారో మద్దతుదారులు ఉన్నట్టుండి వేల సంఖ్యలో అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. సైన్యం తిరగబడి ఎన్నికల ఫలితాలను రద్దు చేసి బోల్సొనారోను తిరిగి అధ్యక్షున్ని చేయాలనే డిమాండ్‌తో అరాచకానికి దిగారు. ఆ సమయంలో భద్రతా దళాలు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. పైగా ఆందోళనలు జరుగుతుండగానే పలువురు నేతలు, అధికారులు నవ్వుతూ ఫొటోలు తీసుకుంటూ కన్పించారు! నిజానికి అప్పటికి పది వారాలుగా నిరసనకారులు ఏకంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందే టెంట్లు వేసుకుని మరీ ఆందోళనలు చేస్తున్నా వాటిని ఆదిలోనే తుంచేసేందుకు డ సిల్వా పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. తిరుగులేని ప్రజాదరణ లులా డ సిల్వా సొంతమైనా కీలక సైన్యం మద్దతు ఆయనకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపించాయి. దాంతో పరిస్థితిని ఏదోలా అదుపులోకి తెచ్చేందుకు డ సిల్వా కిందా మీదా పడుతున్నారు. ► మాజీ న్యాయ మంత్రి ఆండెర్సన్ టోరెస్‌తో పాటు పలువురు బోల్సొనారో సన్నిహితులను అరెస్టు చేశారు. ► సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందన్న వార్త నేపథ్యంలో జనవరి 8 ఆందోళనలకు బాధ్యున్ని చేస్తూ ఆర్మీ చీఫ్‌ను తాజాగా తొలగించారు. ► అల్లర్ల వెనక బోల్సొనారో హస్తంపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఏం జరగనుంది... పరిస్థితులను చూస్తుంటే దేశంలో అల్లర్లకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే సూచనలు కన్పించడం లేదు. అవినీతి ఆరోపణలపై ఇటీవలే ఏడాదిన్నర పాటు ఊచలు లెక్కించిన డ సిల్వాకు దేశాన్ని పాలించే అర్హత లేదంటూ బోల్సొనారో మద్దతుదారులు ఇప్పటికీ దేశవ్యాప్తంగా చెలరేగిపోతూనే ఉన్నారు. సైన్యం పూర్తి మద్దతు లేకపోతే వాటికి డ సిల్వా ఏ మేరకు అడ్డుకట్ట వేయగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలుమార్లు సైనిక కుట్రలను, నియంతల పాలనలను చవిచూసిన బ్రెజిల్లో మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తుతాయో, ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాల్సిందే. పెరు.. పేదల తిరుగుబాటు అధ్యక్షురాలు బొలార్టేపై వెల్లువెత్తిన వ్యతిరేకత మాజీ అధ్యక్షుడు కాస్టిలోకు మద్దతుగా ఆందోళనలు ఆమె పేరు మార్గరిటా కొండొరీ. పెరులో ఆండీస్ పర్వత శ్రేణుల్లోని అత్యంత వెనకబడ్డ పునో ప్రావిన్స్‌లో స్థానిక అయ్మారా తెగకు చెందిన వృద్ధురాలు. వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా రెండు రోజుల పాటు అత్యంత కఠినమైన బస్సు ప్రయాణం చేసి మరీ రాజధాని లిమా చేరుకుంది. ‘‘మేమంతా పేదరికంలో మగ్గుతున్నాం. మాపై ఉగ్రవాద ముద్ర వేసినా పర్లేదు. బొలార్టే రాజీనామా చేసేదాకా రాజధాని నుంచి కదిలే ప్రసక్తే లేదు’’ అంటూ సహచర ఆందోళనకారులతో కలిసి పెద్దపెట్టున నినదిస్తోంది. పెరులో దాదాపు ఆరు వారాలుగా ఇదే పరిస్థితి! స్థానిక తెగలకు చెందిన వామపక్ష ఫైర్ బ్రాండ్ నాయకుడు కాస్టిలోను అధ్యక్ష పదవి నుంచి కూలదోసి జైలుపాలు చేసి ఉపాధ్యక్షురాలు దినా బొలార్టే గత డిసెంబర్ 7న అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటినుంచీ ఆమెకు వ్యతిరేకంగా మొదలైన ప్రజాందోళనలు నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. దేశమంతటికీ వ్యాపించడమే గాక హింసాత్మకంగా మారుతున్నాయి. మార్గరిటా మాదిరిగా అత్యంత మారుమూల ప్రాంతాల నుంచి కూడా జనం అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి మరీ లిమాకు ప్రవాహంలా వచ్చి పడుతున్నారు. బొలార్టే తప్పుకుని ఎన్నికలు ప్రకటించే దాకా దాకా ఇంచు కూడా కదిలేది లేదని భీష్మిస్తున్నారు. భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏమిటి సమస్య? ప్రపంచంలో రెండో అతి పెద్ద రాగి ఉత్పత్తిదారు అయిన పెరులో 1990 నుంచి దశాబ్దకాలపు నియంతృత్వ పాలన అనంతరం 2000లో ప్రజాస్వామ్య పవనాలు వీచాయి. 2001 నుంచి 2014 దాకా జోరుగా సాగిన ఖనిజ నిల్వల ఎగుమతితో జీడీపీ రెట్టింపు వృద్ధి రేటుతో దూసుకుపోయింది. కార్మికుల వేతనాలూ ఇతోధికంగా పెరిగాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు మాత్రం బాగా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాయి. సంపదంతా ప్రధానంగా నగర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. మరోవైపు అవినీతి, అవ్యవస్థ నానాటికీ పెచ్చరిల్లాయి. స్థానిక ప్రభుత్వ పెద్దలు బడ్జెట్ కేటాయింపులను ఇష్టారాజ్యంగా భోంచేయడం ప్రారంభించారు. దాంతో కొన్నేళ్లుగా దేశంలో రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. గత రెండేళ్లలోనే ఏకంగా ఐదుగురు అధ్యక్షులు మారారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో లెఫ్టిస్టు అయిన కాస్టిలోపైనా పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణల దాకా వెళ్లడమే గాక రెండుసార్లు అభిశంసన ప్రయయత్నాలూ జరిగాయి. గత డిసెంబర్లో మరోసారి అభిశంసనకు రంగం సిద్ధమవడంతో కాంగ్రెస్‌ను రద్దు చేసి డిక్రీ ద్వారా పాలించేందుకు కాస్టిలో విఫలయత్నం చేశారు. అదే అభియోగంపై చివరికి ఆయన్ను పదవి నుంచి దింపి ఖైదు చేసి బొలార్టే పదవిలోకి వచ్చారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పేదల్లో కాస్టిలోకు విపరీతమైన ఆదరణ ఉండటంతో ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలకు ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 50 మందికి పైగా బలయ్యారు. అల్లకల్లోలం ► ఆందోళనల దెబ్బకు దేశంలో అవ్యవస్థ రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఎమర్జెన్సీ విధించారు. రోడ్డు, రైలు, విమాన తదితర రవాణా సేవలన్నీ స్తంభించాయి. ► మైనింగ్ తదితర కార్యకలాపాలకూ తీవ్ర విఘాతం కలిగింది. ► అపారమైన ఖనిజ నిల్వలున్నా పేదరికంలో మగ్గుతున్న దక్షిణ ప్రాంతాల్లో నిరసనలు బాగా జరుగుతున్నాయి. ► వీటిపై బొలార్టే బలప్రయోగానికి దిగుతున్నారు. అవసరమైతే ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తున్నారు. ఇది మరింత అస్థిరతకు, సామాజిక విభజనకు దారి తీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనాలో ఉక్కుపాదం!
బీజింగ్: చైనాలో జీరో కొవిడ్ పాలసీపై దేశవ్యాప్తంగా తీవ్ర రూపు దాల్చిన ఆందోళనలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న తీరుతో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉలిక్కిపడింది. వాటిని తక్షణం కట్టడి చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగింది. నిరసనలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనకారులను పోలీసులు భారీ సంఖ్యలో అరెస్టు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని తక్షణం డిలీట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. లేదంటే నిర్బంధం తప్పదంటూ బెదిరిస్తున్నారు. ఆదివారం షాంఘైలో నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్టు ఎడ్ లారెన్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సందర్భంగా ఆయన్ను విచక్షణారహితంగా కొట్టడంతో పాటు తన్నారని బీబీసీ ఆరోపించింది. కొద్ది గంటల నిర్బంధం అనంతరం వదిలేశారు. ఆయన్ను పోలీసులు హింసించడం అవాస్తవమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లీ జియాన్ అన్నారు. తమ జీరో కోవిడ్ విధానం సరైందంటూ సమర్థించుకున్నారు. మీడియా చెబుతున్న స్థాయిలో నిరనసలు జరగడం లేదంటూనే, ‘‘జనాల్లో కాస్తంత వ్యతిరేకత ఉండొచ్చు. అందుకే క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్టుగా జీరో కొవిడ్ విధానంలో మార్పులు తెస్తున్నాం’’ అని అంగీకరించారు. మరోవైపు కరోనా ఆంక్షలపై దేశమంతటా జనాగ్రహం కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్, దేశంలో అతి పెద్ద నగరం షాంఘైతో పాటు పలు నగరాల్లో ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ వీధుల్లోకి వచ్చి ఆంక్షలపై గళమెత్తుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై అణచివేత చర్యలకు దిగొద్దని చైనాకు ఐక్యరాజ్యసమితి హితవు పలికింది. వారి హక్కులను గౌరవించాలని సూచించింది. మళ్లీ 40 వేల కేసులు మరోవైపు సోమవారం చైనాలో 39,452 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. బీజింగ్‌లో వరుసగా ఐదో రోజూ 4,000 కేసులొచ్చాయి. లాక్డౌన్లు, సరకు రవాణా ఆంక్షల కారణంగా ప్రస్తుతం 41.2 కోట్ల మంది ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నట్లు బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనావేసింది. వైట్ పేపర్ రివల్యూషన్ దేశంలో తమకు ఏ మాత్రమూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవని చెప్పేందుకు చైనా యువత, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు ప్రతీకాత్మకంగా తెల్ల కాగితాలను ప్రదర్శిస్తున్నారు. ‘వైట్ పేపర్ రివల్యూషన్’ పేరుతో ఇది దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది. అలెక్స్ డిమినార్‌ను ఓడించి 122 ఏళ్ల డేవిస్‌కప్ చరిత్రలో కెనడాకు తొలిసారి టైటిల్ అందించాడు. 2019లో కెనడా ఫైనల్‌కు చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. -
నేడు ఆందోళనలకు పిలుపు ఇచ్చిన టీఆర్ఎస్
-
ధరలపై మూడంచెల పోరు
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. ‘ధరాభారం లేని భారత్’పేరిట మూడంచెల పోరుకు దిగుతామని ప్రకటించింది. ‘‘తొలి దశలో కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్యులు మార్చి 31న తమ ఇళ్ల బయట ఆందోళనలు చేస్తారు. ఎల్పీజీ సిలిండర్లకు పూలదండలు వేసి చెవిటి బీజేపీ ప్రభుత్వానికి వినపడేలా డప్పులు, గంటలు మోగిస్తూ నిరసన తెలుపుతారు. తర్వాత మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 దాకా దేశవ్యాప్త ర్యాలీలు, ఆందోళనలుంటాయి. ఏప్రిల్ 2 నుంచి 4 దాకా స్వచ్ఛంద సంస్థలు, మత, సామాజిక సంస్థలు, సంక్షేమ సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ధర్నాలుంటాయి. ఏప్రిల్ 7న అన్ని రాష్ట్రాల పార్టీ ప్రధాన కార్యాలయాల్లో ‘ధరాభారం లేని భారత్’ధర్నాలు చేపడతాం’’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. మోదీ సర్కారు దేశ ప్రజలను వంచించిందని ఆయన మండిపడ్డారు. ‘‘ఐదు రాష్ట్రాల్లో ఓట్ల కోసం నాలుగు నెలలకు పైగా పెట్రో, ఎల్పీజీ, సీఎన్జీ తదితరాల ధరలను పెంచలేదు. అవి పూర్తవుతూనే వాటి ధరలను రోజూ ఎడాపెడా పెంచుతూ సామాన్యుని నడ్డి విరుస్తోంది. జనాన్ని పిండి ఖజానా నింపుకునే సూత్రం పాటిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు సమావేశమై పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో చర్చించిన మీదట దీనిపై భారీ ఉద్యమానికి నిర్ణయించాం’’అని వివరించారు. నిస్సిగ్గు దోపిడీ ఆగాల్సిందే: రాహుల్ ప్రజలను నిస్సిగ్గుగా దోచుకుంటున్న కేంద్రానికి ముకుతాడు వేయాల్సిందేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. జనం అష్టకష్టాలు పడుతుంటే రాజు బేపర్వాగా తన ప్రాసాదాన్ని అలంకరించుకుంటున్నారంటూ ప్రధాని మోదీనుద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో తేదీలు మారుతున్నా సమస్యలు మాత్రం యథాతథమంటూ సుర్జేవాలా ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ ఓవైపు జనాన్ని బాదుతూ, మరోవైపు ప్రమాణ స్వీకారాలు జరుపుకుంటోంది. పెట్రోల్, డీజిల్‌కు భారత్‌లో రోజుకో కొత్త రేటు. ఐదు రోజుల్లో నాలుగు దాడులు’’అని ధరల పెంపునుద్దేశించి విమర్శలు సంధించారు. -
హాంకాంగ్ విమానాశ్రయంలో నిరసనలు
హాంకాంగ్: నిరసనకారుల సెగ హాంకాంగ్ విమానాశ్రయాన్ని తాకింది. విమానాశ్రయంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆ దేశ పోలీసులకు వ్యతిరేకంగా గళం విప్పారు. నల్లటి దుస్తులు ధరించి ఫ్లకార్డులు ప్రదర్శించారు. విమానాశ్రయం లోపల ఇంత పెద్ద స్థాయిలో ఆందోళనలు జరపడం ఇదే తొలిసారి. నిరసన తెలుపుతోన్న ఓ మహిళపై ఆదివారం పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ వారు ఆందోళన నిర్వహించారు. పోలీసుల దాడిలో రక్తమోడుతున్న మహిళ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడిలో మహిళ కంటిచూపు కోల్పోయిందని వారు ఆరోపించారు. ఆమెకు మద్దతుగా కంటికి బ్యాండేజీలు కట్టుకుని నిరసన తెలిపారు. హాంకాంగ్ పోలీసులకు మతి భ్రమించిందని, వారు తమ పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘హాంకాంగ్ పోలీసులు మమ్మల్ని చంపేస్తున్నారు’, ‘హాంకాంగ్ సురక్షిత స్థలం కాదు’, ‘హాంకాంగ్ ప్రజలారా మేల్కోండి.. భయపడాల్సిన అవసరం లేదు’ అని ఫ్లకార్డులు ప్రదర్శించారు. నల్లటి దుస్తులు ధరించిన వేలాది మంది నిరసనకారులతో విమానాశ్రయ ప్రాంగణ మంతా నలుపు రంగును పులముకున్నట్లు అయింది. నిరసనకారుల దెబ్బకు హాంకాంగ్ నుంచి బయలుదేరాల్సిన, అక్కడికి రావాల్సిన అన్ని విమానాలను రద్దు చేశారు. నిరసనకారులు ఉగ్రవాదులే: చైనా పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న హాంకాంగ్ నిరసనకారులపై చైనా మండిపడింది. నిరసనకారుల చర్యలు ఉగ్రవాద చర్యల్లాగే ఉన్నాయని, ఇప్పుడిప్పుడే ఉగ్రవాదం పురుడు పోసుకుంటోందని వ్యాఖ్యానించింది. -
భగ్గుమన్న ‘బాసర’ విద్యార్థులు
నిర్మల్: తమ సమస్యల పరిష్కారం కోసం బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన రెండోరోజూ కొనసాగింది. ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న ‘ట్రబుల్స్’పై ట్రిపుల్ ఐటీయన్లు గళమెత్తారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఉదయం నుంచి మంగళవారం రాత్రి వరకు ఆందోళనలు నిర్వహించారు. దీంతో అధికారులు సోమ వారం రాత్రి నిరవధిక సెలవులు ప్రకటించి, మెస్‌లను మూసివేశారు. అయినా విద్యార్థులు ఇళ్లకు వెళ్లకుండా మంగళవారం అక్కడే బైఠాయించారు. గవర్నర్ నరసింహన్, ఐటీ మంత్రి కేటీఆర్ వచ్చేంత వరకు కదిలేది లేదని భీష్మిం చు కొని కూర్చున్నారు. చివరకు విద్యార్థుల పలు డిమాండ్లకు ఇన్చార్జి వీసీ అశోక్ ఒప్పుకున్నా వారు సంతృప్తి చెందలేదు. సొమ్మసిల్లిన విద్యార్థులు అధికారులు సెలవులు ప్రకటించడంపై విద్యార్థులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత కళాశాలతో పాటు మెస్‌లను మూసి వేసినా ఇళ్లకు వెళ్లకుండా రోజంతా ఎండలోనే బైఠాయించారు. పలుమార్లు ఇన్చార్జి వీసీ అశోక్ సంప్రదింపులు జరిపినా విద్యార్థులు స్పందించలేదు. ఎండలో తిండి లేకుండా ఉండటంతో చాలామంది విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని అప్పటికప్పుడు తోటి విద్యార్థులే గదుల్లోకి తీసుకెళ్లి సపర్యలు చేశారు. ఇంత జరిగినా అధికారులు మెస్‌లను తెరవకపోవడం, తమకు భోజనం అందించకపోవడంతో విద్యార్థులు మరింత ఆగ్రహించారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం రాత్రి పలువురు విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి.. తమ సమస్యలపై ఆర్జీయూకేటీ విద్యార్థులు నేరుగా మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా వినతులను పంపించారు. దీనికి స్పందించిన కేటీఆర్ సోమవారం రాత్రి వీసీతో మాట్లాడి, తన వద్దకు విద్యార్థుల బృందాన్ని పంపాలని, వారి తో మాట్లాడి పరిష్కరిస్తానని సూచించినట్లు తెలిసింది. సమస్యల పరిష్కారానికి కృషి: ఈటల జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌ను మోత్కులగూడెం చౌరస్తా వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. బాసర ట్రిపుల్ ఐటీలో తమ పిల్లలకు తాగునీరు లేక అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈటల హామీ ఇచ్చారు. రాత్రి మెస్‌లు తెరిచిన అధికారులు బాసర: విద్యార్థుల ఆందోళనతో మంగళవారం రాత్రి మెస్‌లు తెరిపించారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం వెళ్లిపోవాలని సూచించారు. సెలవులు ఎప్పటి వరకు అన్నది త్వరలో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. -
లేడీస్ హాస్టల్లో విద్యార్థినీల ఆందోళన
కావలి : నెల్లూరు జిల్లా కావలిలోని విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్లో విద్యార్థినీలు బుధవారం ఆందోళనకు దిగారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆందోళన నిర్వహించారు. వారం రోజులుగా మేనేజ్మెంట్కు తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి మీడియా కళాశాల దగ్గరకు వివరణ కోరేందుకు వెళ్లగా యాజమాన్యం అడ్డుకుంది. కళాశాలలోకి రాకుండా గేట్లు వేసింది. -
కావలి విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
-
కడప కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
-
కడప కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, కడప: జిల్లాలోని కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని హౌసింగ్ శాఖ ఇన్స్పెక్టర్లు ఆందోళనకు దిగారు. కలెక్టర్ కార్యాలయం ఎక్కి నిరసన తెలిపారు. నిరసన కారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది హౌసింగ్ శాఖ ఇన్స్పెక్టర్లు కలెక్టర్ కార్యాలయం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హౌసింగ్ శాఖ ఇన్స్పెక్టర్లు మీడియాతో మాట్లాడుతూ..వేతనాలు సమయానికి ఇవ్వడంలేదని వాపోయారు. వేతనాలు అడిగితే కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వక్యం చేశారు. -
ఆందోళనలకు సహకరిస్తాం : చంద్రబాబు
-
ఆందోళనలకు సహకరిస్తాం : చంద్రబాబు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగే ఆందోళనలు చేసేందుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రం కోసం ఎవరు ఆందోళనలు చేపట్టినా సహకరిస్తామని సాధికార మిత్ర సదస్సులో తెలిపారు. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే చర్చించడానికి ఎందుకు అంత ఇబ్బందిపడుతున్నారని ప్రశ్నించారు. అవిశ్వాసానికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయించడం ఎంతవరకూ సమంజసమని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా రాష్ట్రం కోసం చేసే ప్రతి ఆందోళనకూ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. -
వైద్యుల ఆందోళనలు.. రోగులకు ఇబ్బందులు
ముంబై: మహారాష్ట్రలో వైద్యులకు కోపం వచ్చింది అంతే ఒకేసారి మూకుమ్మడి సెలవులు పెట్టారు. ఈ సెలవులు వరుసగా రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇటీవల రెసిడెంట్ డాక్టర్లపై రోగుల బంధువులు దాడి చేసిన ఘటనలు అధికమవ్వడంతో డాక్టర్లు మూకుమ్మడి సెలవులు ప్రకటించారు. వైద్యులకు భద్రత కల్పించాలని, దాడిచేసే వారిపై కఠిన శిక్షలు అమలు చేసే చట్టాలు రూపోందించాలని రెసిడెంట్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 3000 మంది రెసిడెంట్ డాక్టర్లు క్యాజువల్ లీవ్ తీసుకున్నట్లు మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు స్వప్నిల్ మెశ్రామ్ తెలిపారు. కాగా వీరి ఆందోళనలకు వ్యతిరేకంగా ఓ సంఘ కార్యకర్త హైకోర్టులో ప్రజావాజ్యం పిటీషన్ దాఖలు చేశారు. గత వారం రోజుల్లో రెసిడెంట్ వైద్యులపై అయిదు దాడులు జరిగాయని, గడిచిన 48 గంటల్లోనే రెండు దాడులు జరిగాయని భారత మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ తెలిపారు. అయితే సోమవారం ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ( బీఎంసీ) డాక్టర్లకు రక్షణగా కొన్ని ప్రతిపాదనలను సూచించింది. పేషంట్‌తో ఇద్దరు మాత్రమే ఉండాలిని, కుటుంబ సభ్యులను ఎవరిని అనుమతించవద్దనే నియమాన్ని ప్రవేశ పెట్టింది. ఎవరైన వెళ్లాలంటే ప్రత్యేక పాస్‌లు పొందాలని సూచించింది. బీఎంసీ కమిషనర్ ఐఏ కుందన్ మాట్లాడుతూ.. 4000 మెడికోలు క్యాజువల్ లీవ్‌లు ప్రకటించారని, వారితో చర్చలు జరుపుతున్నామని, వైద్యుల డిమాండ్లకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రుల వద్ద మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్‌ను నియమిస్తామని కుందన్ చెప్పారు. డాక్టర్ల ఆందోళనతో రోగులు చికిత్సకు దూరమై దయనీయ పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. సుమారు 500 సర్జరీలు వాయిదా పడ్డాయి. -
అదే తీరు.. నిరసనల జోరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జన్మభూమి గ్రామ సభల్లో నిరసనలు, నిలదీతలు కొనసాగుతున్నాయి. ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుందనుకున్న చోట ముందస్తుగా అరెస్ట్‌లు చేయించి గొడవలు జరగకుండా చూస్తున్నారు. నిడమర్రు మండలం అడవికొలనులో ఆక్వా మాఫియా దెబ్బకు పంట పొలాలు దెబ్బతిన్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ సమస్యపై రైతులు ఆందోళనలు చేశారు. గురువారం ఆ గ్రామంలో జన్మభూమి సభ సందర్భంగా రైతులు నిలదీస్తారన్నభయంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. మిగిలిన వారిని బెది రించారు. రద్దు చేసిన వృద్ధాప్య పిం ఛన్లు పునరుద్ధరించాలని కోరుతూ ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో వృద్ధులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. గ్రామంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన సాలా దానయ్య, అంపా ముత్యాలు, తాడిపర్తి రామారావు, కంతే వెంకటస్వామి, తాడిపర్తి సుబ్బారావు, జంపా కొండయ్య తదితరులు జన్మభూమి గ్రామ సభ ఎదుట ప్ల కార్డులు చేతబూని తమ పింఛన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమకు 2014 వరకూ రూ.200 చొప్పున పింఛను ఇచ్చారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పేరుతో రద్దు చేశారని వారు వాపోయారు. చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెం జన్మభూమి గ్రామ సభను గిరిజనులు అడ్డుకున్నారు. నాయకపోడు గిరిజనులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు అధికారులను సభలోకి వెళ్లనీయలేదు. గిరిజనుల సమస్యలు పరిష్కరించని కారణంగా సర్పంచ్ మేడి రాములు, ఎంపీటీసీ సత్యవతి జన్మభూమి గ్రామ సభనుంచి వాకౌట్ చేశారు. వెంకటాపురం గ్రామ సభలో చింతలపూడి–నామవరం రహదారి నిర్మాణంౖ కోసం ప్రజలు అధికారులను నిలదీశారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో జెడ్పీ స్కూల్లో మధ్యా హ్న భోజనం సరిగా ఉండటం లేదని విద్యార్థులు ఆరోపించారు. దేవరపల్లి మండలం పల్లంట్లలో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లస్థలాల కోసం అధికారులను నిలదీశారు. అర్హులకు పథకాలు మంజూరు చేయకుండా అనర్హులకు మంజూరు చేస్తున్నారని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు పంచాయతీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. వీరవాసరం మండలం రాయకుదురులో అర్హత ఉన్నా తమకు పింఛన్లు ఎందుకివ్వడం లేదని పలువురు వృద్ధులు అధికారులను నిలదీశారు. -
రగడ.. రగడ
జన్మభూమి–మా ఊరు గ్రామ సభలు రెండో రోజైన మంగళవారం వేడెక్కాయి. ప్రతిచోట నిలదీతలు, నిరసనలు మార్మోగాయి. సమస్యలు పరిష్కారం కాలేదంటూ బీజేపీ నాయకులు జన్మభూమి సభలో నిరసన వ్యక్తం చేయగా.. మరోచోట అవినీతిపై టీడీపీలోని రెండు వర్గాలు రోడ్డెక్కాయి. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న కంసాలి బేతపూడి గ్రామస్తులు గ్రామసభను అడ్డుకున్నారు. పోలీసులు ఉద్యమకారులను అరెస్ట్ చేసి నరసాపురం తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుట సీపీఎం నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు : టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ షాక్ ఇచ్చింది. మొగల్తూరు మండలం మోడి గ్రామంలో ప్రధానమైన వియర్ చానల్ పనులు పూర్తికాకపోవడం, «గ్రామంలోని దర్భరేవు డ్రెయిన్‌పై వంతెన నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బీజేపీ నాయకులు ముందుగానే ప్రకటించారు. అధికారులెవరినీ సభకు రానివ్వకుండా ప్రాంగణం గేట్లకు తాళాలు వేశారు. వేదిక వద్ద బల్లలు, కుర్చీలను విసిరేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆ సభకు హాజరుకాకుండా మొహం చాటేశారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ తరలింపు విషయంలో ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలంటూ నరసాపురం మండలం కంసాలి బేతపూడిలో జన్మభూమి సభను గ్రామస్తులు అడ్డుకున్నారు. నీటిసంఘం అధ్యక్షుడు పొత్తూరి రామరాజు, అధికారులు, ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి గోబ్యాక్, గోబ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉద్యమకారులను అరెస్ట్ చేసి జీపులో ఎక్కించారు. గ్రామస్తులు, మహిళలు పోలీసు జీప్ ఎదుట బైఠాయించగా.. కానిస్టేబుళ్ల సాయంతో మహిళలను పక్కకు లాగి జీపును పోనిచ్చారు. నిరసనకారులను వదలకపోవడంతో సీపీఎం నాయకులు నరసాపురం వెళ్లి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంలో సీపీఎం నాయకులు, రూరల్ ఎస్సై కె.సతీష్‌కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు పోలీసులు అందరినీ చెదరగొట్టారు. ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అవినీతి బట్టబయలైంది. ఉంగుటూరు మండలం వెల్లమిల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో టీడీపీ సీనియర్ నాయకుడు బండి స్వరూప్, అదే పార్టీకి చెందిన సర్పంచ్ సర్లమామిడి నాగేశ్వరరావు వర్గాల మధ్య జన్మభూమి సభలో వివాదం తలెత్తింది. సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని, కనీసం క్యూరింగ్ కూడా చేయలేదని బండి స్వరూప్ వర్గీయులు సర్పంచ్ నర్లమామిడి నాగేశ్వరరావును నిలదీశారు. దీంతో సర్పంచ్ వర్గీయులు నీరు–చెట్టు పథకంలో మట్టిని అమ్ముకున్నారంటూ బండి స్వరూప్‌పై విరుచుకుపడ్డారు. ఇరువర్గాలు పోట్లాడుకుని వారి అవినీతిని బయటపెట్టుకున్నారు. యలమంచిలి మండలం చించినాడలో జన్మభూమి కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజలు ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలంటూ మహిళలు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పాలకవర్గానికి బాసటగా నిలిచారు. వారిని అడ్డుకోవడానికి జెడ్పీటీసీ బోనం వెంకట నరసింహరావు, తహసీల్దార్ వంటెద్దు స్వామినాయుడు ప్రయత్నించడంతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వేలేరుపాడు మండలం రుద్రమకోట గ్రామసభలో రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వటం లేదని తహసీల్దార్‌ను, ఇతర అధికారులను గ్రామస్తులు నిలదీ శారు. టి.నరసాపురం మండలం బండదవారిగూడెంలో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించే విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రెండు గంటలపాటు వాగ్వివాదం చోటుచేసుకోవడంతో జన్మభూమి సభ ఆలస్యమైంది. చింతలపూడి మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో ఇళ్లు, పెన్షన్లు, చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న వారికిచ్చే పరిహారంపై అధికారులను రైతులు నిలదీశారు. యర్రంపల్లిలో చింతలపూడి ఎత్తిపోతల పథకంతోపాటు పీహెచ్సీ భవనాన్ని ఎందుకు ప్రారంభించ డం లేదని సీపీఐ, వైఎస్సార్ సీపీ నాయకులు అధికారులను నిలదీశారు. ఊటసముద్రంలో నిర్వహించిన గ్రామసభలో నాయకపోడు గిరి జనులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ జన్మభూమి గ్రామసభను అడ్డుకున్నారు. దాదాపు 2 గంటలకు పైగా సభను జరగనివ్వకుండా కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేశారు. జిల్లా అధికారులు ఇచ్చిన హామీ మేరకు ఆందోళన విరమించారు. జీలుగుమిల్లిలో కార్డులు ఇచ్చి కదలాలంటూ తహసీల్దార్‌ను ఘెరావ్ చేశారు. -
వెన్నుపోటు బ్రదర్స్ చంద్రబాబు, వెంకయ్య
-
వెన్నుపోటు బ్రదర్స్ చంద్రబాబు, వెంకయ్య
– వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సాక్షి, తిరుమల: ‘ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు జరుగుతుంటే, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యలు వెన్నుపోటు పొడుస్తున్నారు.’ అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. గురువారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీకి నాడు పదేళ్లు హోదా కావాలన్న వెంకయ్య, కాదు పదిహేనేళ్లు కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబులే హోదా రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హోదా కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను జైల్లో పెడుతుండడం బాధాకరమన్నారు. జిల్లాలో ఏర్పాటైన మన్నవరం ప్రాజెక్టు తరలిపోతుంటే ఈ జిల్లాకు చెందిన సీఎం చంద్రబాబు చేతకాని దద్దమ్మలా నోరు మెదపకుండా చూస్తున్నారన్నారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన చంద్రబాబు వల్లే ప్రతిష్టాత్మకమైన మన్నవరం ప్రాజెక్టు తరలిపోతోందన్నారు. కనీసం ప్రత్యేక హోదా అయినా వస్తే ఉన్న ప్రాజెక్టులతోపాటు కొత్త ప్రాజెక్టులు వస్తాయన్న వాస్తవాన్ని సీఎం ఎందుకు గుర్తించటం లేదని ఆమె ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన ఆయన కేంద్రం వద్ద నోరు మెదపటం లేదన్నారు. రాష్ట్రంలో డెంగీ, విష జ్వరాలతో జనం అల్లాడుతుంటే సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు కానినేని శ్రీనివాస్, నారాయణ దోమలపై దండయాత్ర పేరుతో ప్లకార్డులు పట్టుకుని ప్రచారం చేస్తున్నారన్నారు. అనంతపురంలో హెల్త్ ఎమెర్జెనీ ప్రకటించినా అక్కడికి వైద్యశాఖ మంత్రి వెళ్లకపోవటం దారుణమన్నారు. చంద్రబాబు దత్తత తీసుకున్న అరకులోయలో గిరిజనం విషజ్వరాలతో మరణిస్తున్నా సీఎంకు చీమకుట్టినట్లైనా లేదన్నారు. విశాఖలోని బాకై ్సట్ గనులపై ఉన్న ప్రేమ గిరిజనుల ఆరోగ్యంపై లేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని యువత ఎదురు చూస్తోందని, అయితే బాబు వచ్చినా జాబు మాత్రం రాలేదన్నారు. హోదాతోనైనా ఫ్యాక్టరీలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయనే సత్సంకల్పంతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హోదా సాధన కోసం నిరంతరం పోరాటాలు సాగిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. హోదా సాధించుకునేంత వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఆపే ప్రసక్తేలేదన్నారు. -
పాకిస్తాన్ జెండా దగ్ధం
జిల్లాలో వెల్లువెత్తిన నిరసనలు దుబ్బాక: పాకిస్థాన్ దుశ్చర్యపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దుబ్బాక, మెదక్ తదితర ప్రాంతాల్లో బీజేపీ నాయకులు పాకిస్థాన్ జెండాలను తగలబెట్టారు. కౌడిపల్లిలో విద్యార్థులు సైనికుల మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
పోరాటాలతోనే హక్కుల పరిరక్షణ
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గుంటూరు ఎడ్యుకేషన్: పోరాటాలతోనే హక్కులను పరిరక్షించుకోగలమని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) 17వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె. నాగ మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కేఎస్ లక్ష్మణరావు ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత చెన్నుపాటి లక్ష్మయ్య కాంస్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగం రాష్ట్ర ఉమ్మడి జాబితాల నుంచి క్రమేణా కేంద్రీకరణ దిశగా, కేంద్ర పెత్తనంలోకి వెళుతోందని, ఇందుకు నీట్ ఉదాహరణగా చెప్పవచ్చని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎన్. తాండవకృష్ణ మాట్లాడుతూ జాతీయస్థాయి సమస్యల పరిష్కారానికి ఎస్టీఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. -
ద్విజాతి ఛాయలో కశ్మీర్ లోయ
జాతిహితం అవమానభారంతో కుంగిపోతున్నవారి, ఆగ్రహంతో ఉన్న వారి మనసులను సైన్యాలు గెలవలేవు. శత్రువును నిరోధించాలంటే లేదా ఓడించాలంటే సైన్యాన్ని ఉపయోగించాలి. అలా కాకుండా అన్యమనస్కంగా ఉన్న సోదరుడిని తిరిగి దారికి తెచ్చుకోవాలంటే పెద్ద మనసు అవసరం. ఇది పని చేయగలదా? ఒక్క వాక్యంతో వాజ్‌పేయి తీసుకువచ్చిన నాటకీయ మార్పును గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యాంగ పరిధిలోనే ఎందుకు, నేను మానవత్వం పరిధి నుంచి మీతో మాట్లాడతాను అన్నారాయన. కశ్మీర్ లోయలో జరుగుతున్న తాజా పరిణామాలన్నీ మన లోలోపలి వికృ తాలే. ఇది కశ్మీర్ భూభాగం గురించి కూడా కాదు. లేదా కశ్మీరీల గురించి అయినా కాదు. లేదంటే భారత్, పాకిస్తాన్ల వ్యవహారం కూడా కాదు. ఇప్పుడు ఇది హిందువులు, ముస్లింల గొడవగా తయారయింది. ఎవరికీ లబ్ధి చేకూర్చని ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది? మిగతా విషయాలు పక్కన పెట్టి ఇలాంటి వాదనలో ఉన్న కనీస తర్క బద్ధ వాస్తవాలనైనా చూద్దాం. మొదట: బుర్హన్ వనిని సాయుధదళాలు కాల్చి చంపడంతో తాజా కల్లోలం ఆరంభమైంది. ఈ పరిణామం సంభవించ కూడ నిదేమీ కాదు. అతడు రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, సోషల్ మీడియాలో హల్చల్ చేసినప్పుడే చావుకు అత్యంత సమీపంగా వచ్చాడని అర్థమైంది. నిజానికి ఇంతకాలం జీవించి ఉన్నాడంటే అదంతా అతడి చాక చక్యమే. పెద్ద వింత కూడా. సాయుధబలగాల దృష్టిలో పడి, వారు వెతుకు తున్న వారి ‘ఏ’ జాబితాలో పేరు ఎక్కిన ఆరేళ్ల తరువాత కూడా బతికి బట్ట కట్టడం మామూలుగా సాధ్యంకాదు. అతడి పట్ల నేను సానుభూతితో ఉండాలా? సోదర భారతీయుడు ఎవరు మరణించినా నేను దుఃఖిస్తాను. అయితే బుర్హాన్ వని పట్ల కొంత వరకు నేను సానుభూతి చూపాలి. ఇలాంటి ప్రాణాంతకమైన మార్గంలోకి అతడు వెళ్లేటట్టు మిత్రులు, కుటుంబం అతడిని అనుమతించినందుకు, బహుశా అలాంటి దానికి ప్రోత్సహించినందుకు కూడా నేను సానుభూతి చూపవచ్చు. అతడు మరణించిన తీరుకు కూడా సానుభూతితో ఉండవచ్చు. కానీ ఒకసారి ఆయుధం చేపట్టి జనాన్ని చంపడం మొదలుపెట్టిన తరువాత చట్టేతర విధానాలతో చంపుతున్నారంటూ అవతలి వారిని ఆరోపించే కనీస నైతిక అర్హత కోల్పోయినట్టే. అయినా అలాంటి చావును అతడు స్వచ్ఛందంగా కోరుకున్నాడు. ఇది విషాదం. తరువాత డజన్ల కొద్దీ సాధారణ పౌరులు, యూనిఫారాలలో ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఇది మరింత విషాదం. నా వరకు, ఇంకా అశేష భారతీయ జనాభా, ధైర్యం చేసి జేఎన్‌యూ ప్రాంగణంలో నేను చెప్పినట్టు ఎలాంటి సంకోచాలు లేని వాస్తవం- కశ్మీర్, ప్రస్తుతం దేశం అధీనంలో ఉన్న ఇతర భూభాగాలు భారత్ నుంచి అవిభా జ్యాలు. గణతంత్ర భారత్‌లోని అంతర్భాగాలు. అలాగే, కొంతమంది తిట్టినా, పాకిస్తాన్, చైనాల ఆక్రమణలో ఉన్న ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం ఉన్నప్ప టికీ పాకిస్తాన్ చేతిలో ఉన్న భూభాగాలు అక్కడే ఉంటే ఉండనివ్వమనే నేనంటాను. అణ్వాయుధాలు కలిగి ఉన్న మూడు ఇరుగు పొరుగు దేశాలు కూడా యుద్ధం ద్వారా ఇతరుల భూభాగాలను దఖలు పరుచుకోలేవు. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ మూడు దేశాలలో రెండు దేశాలకు వ్యతి రేకంగా ఎవరు వ్యవహరించినా కశ్మీర్ భూభాగం, కశ్మీర్ ప్రజానీకం ఆ మూడు దేశాల దాయాదుల చిరకాల పోరులో చిక్కుకోవడం తథ్యం. కాబట్టి ఎవరూ తొందరపడరు. ఆఖరికి డజను తాజా యుద్ధాలు చేసుకున్నా, భారత్-పాక్ తమ అణ్వాయుధాలు మొత్తం వినియోగించినా కూడా ఎటు వైపు వారైనా కూడా వారి వైపు ఉన్న కశ్మీరాలను కోల్పోరని నేను పందెం కట్టి మరీ చెబుతాను. భద్రతా మండలి తీర్మానాలు కూడా పాకిస్తాన్ లేదా భారత్ లకే అవకాశం కల్పించాయి. పాకిస్తాన్ చెబుతున్న ఆజాద్ కశ్మీర్, ప్రజా భిప్రాయ సేకరణ, ఆజాదీకి మద్దతు ఇవేమీ ఇక్కడ వర్తించవు. ఇవన్నీ కపట నాటకాలే. ఆజాదీ ఏమీ లేదు. స్కాట్లాండ్ లేదు. క్విబెక్ లేదు. ఆఖరికి బ్రిక్జిట్ కూడా ఇక్కడ లేదు. ఏది ఏమైనా ఐక్యరాజ్య సమితి తీర్మానాలను, సిమ్లా ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కినది పాకిస్తానే తప్ప భారత్ కాదు. ఏడేళ్లకు ముందు సైన్యం సహాయంతో కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుందామని ఆ దేశం యత్నించి పూర్తిగా విఫలమైంది. కశ్మీర్‌ను కోల్పోతున్నామని భారతీయులు ఎప్పటికీ విచారించవలసిన అవసరం లేదు. అక్కడ చాలినంత సైన్యం ఉంది. మన భూభాగంలోని ఆ లోయను రక్షించుకోవాలన్న మన ఆశయం వజ్ర సదృశంగా ఉంది. ‘‘మన’’ కశ్మీరీలు అనేది ఇప్పుడు ఒక అంశమే కాదు, అంతకు మించిన వివాదాస్పద అంకంలోకి ప్రవేశిస్తున్నాం. పౌరులనీ, భూభాగాలనీ సైన్యాలు కాపాడగలవు. కానీ ఆగ్రహంతో ఉన్నవారి మనసును సైన్యం మార్చలేదు. ఈ మాటని చాలా మంది సైనికులు, మిత్రులు వెంటనే అంగీకరిం చలేరు. అవమానభారంతో కుంగిపోతున్నవారి, ఆగ్రహంతో ఉన్న వారి మనసులను సైన్యాలు గెలవలేవు. శత్రువును నిరోధించాలంటే లేదా ఓడించా లంటే సైన్యం ఉపయోగించాలి. అలా కాకుండా అన్యమనస్కంగా ఉన్న సోదరుడిని తిరిగి దారికి తెచ్చుకోవాలంటే పెద్ద మనసు అవసరం. ఇది పని చేయగలదా? ఒక్క వాక్యంతో వాజ్‌పేయి తీసుకువచ్చిన నాటకీయ మార్పును గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యాంగ పరిధిలోనే ఎందుకు, నేను మానవత్వం పరిధి నుంచి మీతో మాట్లాడతాను అన్నారా యన. అదే ఆరేళ్ల పాటు రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పింది. ఆ బాటలోనే మన్మోహన్సింగ్ ప్రయాణించారు. భారతదేశ సంకీర్ణ ప్రభుత్వాల చరిత్రలోనే అసంభవం అనదగ్గ తీరులో ముఫ్తీ స్థాపించిన పీడీపీతో బీజేపీ జత కట్టిన దృష్ట్యా నరేంద్ర మోదీ కూడా ఇలాగే వ్యవహరించగలరని మనం ఊహించాం. కశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి పరిస్థితులు ఇంతగా విషమించడానికి కారణం- సంకీర్ణం ఏర్పాటు చేయడంలోని ఉద్దేశం గురించి బీజేపీ తన కార్యకర్తలకు సరిగా ప్రచారం చేయలేదు. మరీ ముఖ్యంగా తన సిద్ధాంతకర్తలకీ, మేధావి వర్గానికీ, అజెండా నిర్ణేతలకీ కూడా ఉద్దేశాన్ని ఎరుక పరచలేదు. సైద్ధాంతికంగా ఎడమొహం పెడ మొహంగా ఉండే రెండు విభిన్నశక్తులు జాతీయతా సూత్రంతో (ముఫ్తీ గురించి ఆయన రాజకీయాల గురించి కూడా నేను ఇదే చెబుతాను) ఒకే తాటిపైకి వచ్చాయి. ఎన్నికలు తెచ్చిన విభజనను అధిగమించి ఐక్యత సాధించే ఉద్దేశంతో అవి ఈ పనిచేశాయి. అందుకే ఈ సంకీర్ణం భేషజంతో కాకుండా, రాజనీతిజ్ఞతతో వచ్చిందని అంటాను. జమ్మూ కశ్మీర్లో ద్విజాతి సిద్ధాంతంతో సమానమైన సిద్ధాంతానికి తెర తీసిన ఎన్నికలవి. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలలో ఒక రకంగాను, ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మరో తీరు లోను ఓటింగ్ జరిగింది. పీడీపీతో భాగస్వామ్యానికి నరేంద్ర మోదీ చొరవ చూపినప్పటికీ, ఆయన పార్టీ కార్యకర్తల సిద్ధాంతం, మోదీ రాజకీయ వాస్త వాలు ఆయనను వెనక్కు తగ్గేటట్టు చేశాయి. బాధితుల పట్ల చిన్నపాటి సానుభూతి మాట కూడా చెప్పకుండా, వారు దేని గురించి అడుగుతున్నారో కూడా ప్రస్తావించకుండా కశ్మీర్లో భద్రతాదళాల కార్యకలాపాలను సమర్థించ డానికి రోజూ సాయంకాలం మోదీగారి పార్టీ వక్తలు టీవీ స్టూడియోల చుట్టూ ఎలా తిరుగుతున్నారో మనమంతా చూస్తున్నాం. సంకీర్ణ భాగస్వామిని ఆదు కోవడమన్న పేరుతో బీజేపీ చేస్తున్న ఈ పని వికృతమైనదే కాదు, స్వీయ విధ్వంసకమైనది కూడా. కశ్మీర్ మొత్తం మనదే అంటూ నినదించేవారు, గుండెలు బాదుకునే వారు కశ్మీర్ అంటే వారి దృష్టిలో ఒక్క భూభాగమా లేక కశ్మీరీలు కూడానా? అన్న ప్రశ్న వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే తమకు విధేయులుగా (హిందు వులు, బౌద్ధులు) ఉండేవారేనా? అని కూడా ప్రశ్నించుకోవాలి. అలాగే ముస్లింలు కోరుకుంటే వారు పాకిస్తాన్ వెళ్లిపోవాలన్నదే తమ వాంఛితమా? వాస్తవంగా మనసులో ఉన్నది అదే అయితే, విభజన తరువాత అసం పూర్ణంగా మిగిలిన అజెండాయే కశ్మీర్ అంటూ పాకిస్తాన్ ఇప్పటివరకు అడ్డూ అదుపు లేకుండా దేని గురించి మాట్లాడుతున్నదో మీరు కూడా అదే మాట్లా డుతున్నారు. ఆ భూభాగాన్ని, కొంత జనాన్ని (ముస్లింలు) వారు కోరు తున్నారు. మనం కూడా అంతే, ఆ భూభాగం, కొంత జనం కావాలని కోరు తున్నాం. విభజించు పాలించు అన్న సూత్రం మనకి బ్రిటిష్ జాతి నేర్పింది. మనం మాత్రం విభజించు- వదులుకో అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం. నిజానికి 97 శాతం ముస్లింలు భారతదేశంలోని ప్రధాన భూభాగంలోనే నివశిస్తున్నారు. వీరి దేశభక్తిని నిరంతరం శంకించినప్పటికీ వీరు ఏనాడూ కశ్మీరీల నినాదంతో గొంతు కలపలేదు. ఆఖరికి కొత్త సున్నీ రైట్ సిద్ధాంత కర్తలు, అంటే జకీర్ నాయక్ వంటి వారు కూడా కశ్మీర్ అంశం గురించి ఆచి తూచి మాట్లాడుతున్నారు. ఆ సమస్యను లోయకు పరిమితంగా ఉంచడానికి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తున్నది ఇదే. ఈ మార్గం గురించి ఆలోచించండి. పాకిస్తాన్ వెళ్లిపోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే సరిహద్దులు తెరిచి ఉన్నాయి అని ముస్లింలతో భారత్ చెప్పవలసి వస్తే ఎలా ఉంటుంది? ఏ ఒక్కరు భారత భూభాగం విడిచి వెళ్లరు. నా అనుమానం ఏమిటంటే, మంచి జీవనం కోసం పాకిస్తాన్, బంగ్లాల నుంచే ఇంకొందరు ముస్లింలు ఇక్కడికే రావచ్చు. రాజకీయ, ఆర్థిక స్థిరత్వాలే మనం ఎక్కడ ఉండాలి అన్న విషయాన్ని నిర్ధారిస్తాయి. కశ్మీర్ సరిహద్దులలో కూడా ఇదే చెబితే? ఆజాదీ కశ్మీర్ గురించి కల్పనలు ఉన్న వారు, జీహాదీల వలలో పడినవారు ఏ కొందరో మినహా ఎవరూ దేశం విడి చిపోరు. కశ్మీర్లో ‘మన జనం’ అంటూ మాట్లాడేవారే ఇంకో ప్రశ్నను కూడా వేసుకోవాలి. ‘మన’ కశ్మీరీలు ‘వారి’ భూభాగంలో ఉండాలా? లేకపోతే భూభాగం ఇక్కడ వదిలి పాకిస్తాన్ వెళ్లిపోవాలా? దీనికి నిజాయితీతో కూడిన సమాధానం రాబట్టుకోవడం నా ఉద్దేశం కాదు. హిందూ-ముస్లిం పరి భాషతో కశ్మీర్ సమస్యను పునర్ వ్యాఖ్యానిస్తే వచ్చే ప్రమాదం ఏమిటో ఆలో చించాలనే నా ఉద్దేశం. అలాగే కనుక ఆలోచిస్తే కశ్మీర్‌ని పోగొట్టుకోకపోవచ్చు. కానీ కశ్మీరీలను పోగొట్టుకుంటాం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
ఎందుకు దక్షిణ కశ్మీరం రగిలిపోతోంది?
శ్రీనగర్: కొన్నేళ్ల నుంచి ప్రశాంత పరిస్థితులతో కొనసాగుతున్న దక్షిణ కశ్మీరం ఇప్పుడు కల్లోలంగా మారింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు మిలెటెన్సీ పురివిప్పింది. యువకులు వీధుల్లోకి వచ్చి రాళ్లు రువ్వటం, మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్లు నిత్యకృత్యం అయ్యాయి. సోషల్ మీడియా ద్వారా విశేష ప్రాచుర్యం సంపాదించుకన్న హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ 21 ఏళ్ల బుర్హాన్ వనిని శుక్రవారం సైనిక బలగాలు ఎన్కౌంటర్ చేయడంతో తాజా హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఈ తాజా హింసాకాండలో ఇప్పటికే 21 మంది మరణించారు. ఈ ఏడాది కాశ్మీర్ మొత్తంలో 89 మంది స్థానిక మిలిటెంట్లు క్రియాశీలక పాత్ర నిర్వహిస్తుండగా, వారిలో 60 మంది దక్షిణ కాశ్మీర్‌కు చెందిన వారే. పోలీసుల లెక్క ప్రకారం మొత్తం కశ్మీర్లో 70 మంది విదేశీ మిలిటెంట్లు పనిచేస్తుండగా, వారిలో దాదాపు 25 మంది దక్షిణ కశ్మీర్లో పనిచేస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, అనంత్‌నాగ్, సోఫియాన, కుల్గామ్ ప్రాంతాలు మిలిటెన్సీతో రగిలిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? దక్షిణ కశ్మీర్ మిలిటెన్సీకి ఎందుకు హాటబెడ్గా మారిపోయింది? 2014 చివరలో జరిగిన కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే దక్షిణ కశ్మీర్లో మిలిటెన్సీ పెరుగుతూ వచ్చింది. నాటి ఎన్నికల్లో జమాతి ఇస్లామి పార్టీకి చెందిన మెజారిటీ వర్గం ముఫ్తీ కుటుంబం నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలో చేరిపోయింది.‘ఆజాది’ నినాదంతో ముందుకొచ్చిన జమాతి ఇస్లామి పార్టీ హిజ్బుల్ ముజాహిదీన్లకు బహిరంగంగానే మద్దదిస్తున్న విషయం తెల్సిందే. ఎన్నికల అనంతరం పీడీపీ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అటు పీడీపీలోని జమాతీ ఇస్లామీలోని మాజీలకు, ఇటు జమాతీ ఇస్లామీ పార్టీ క్యాడర్‌కు మింగుడు పడలేదు. దక్షిణ కశ్మీర్‌లోనే ఎక్కువ పట్టు కలిగిన ఈ వర్గం మిలెటెన్సీ వైపు మళ్లీ మొగ్గుచూపింది. భద్రతా బలగాలు మానవ హక్కులను హరించివేయడం కూడా వారి మిలిటెన్సీకి ఆజ్యం పోసింది. ప్రస్తుతం దక్షిణ కశ్మీర్‌లోని క్రియాశీలకంగా పనిచేస్తున్న మిలెటెంట్లలో ఎక్కువ మంది జమాతీ కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. 1941లో లాహోర్‌లో ప్రాణం పోసుకున్న జమాతీ ఇస్లామీ 1953లో జమ్మూ కశ్వీర్‌లో తన యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇది క్రమంగా విస్తరిస్తుండడంతో 1975లో ఎమర్జెన్సీ సందర్భంగా అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఈ సంస్థను నిషేదించింది. మళ్లీ అది 1989లో మరోసారి విజృంభించింది. హిజ్బుల్ ముజాహిదీన్లకు అప్పుడు బహిరంగంగా మద్దతు ప్రకటించింది. 1990లో భారత ప్రభుత్వం మరోసారి దీన్ని నిషేధించింది. అప్పటి నుంచి సంస్థ నాయకులపై అణచివేత పెరుగుతూ వచ్చింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జమాతీ ఇస్లామీ మద్దతుదారులు ముఫ్తీ కుటుంబం నాయకత్వంలోని పీడీపీకి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ ఎన్నికల అనంతరం బీజీపీతో పొత్తుపెట్టుకోవడం వారికి కోపం తెప్పించింది. వారంతా మళ్లీ దక్షిణ కశ్మీర్లో ఆయుధాలు పట్టుకున్నారు. -
హెచ్‌సీయూలో పరిస్థితి చక్కబెట్టేందుకు కమిటీ
హైదరాబాద్: హెచ్‌సీయూలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు చక్కదిద్దేందుకు యూనివర్సిటీ స్థాయి కమిటీని వేశారు. రోహిత్ ఆత్మహత్య ఘటన అనంతరం కొనసాగుతున్న ఆందోళనను విరమింపజేసి తిరిగి యధాస్థితికి తెచ్చేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో తెలియజేసేందుకు ప్రొఫెసర్ కామయ్య చైర్మన్ గా ఏడుగురితో కమిటీని వేశారు. ఈ నెల 24న నిర్వహించిన సమావేశంలో కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఈ నెల 26న వీసీ ఆమోద ముద్ర వేశారు. అయితే, దీనిపై మాత్రం రిజిస్ట్రార్ సంతకం ఉంది. ఈ కమిటీలో సభ్యులుగా ఎవరున్నారంటే.. 1. ప్రొఫెసర్ బీ కామయ్య, డీన్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (కమిటీ చైర్మన్) 2. ప్రొఫెసర్ జీ సుదర్శనం(పొలికల్ సైన్స్) 3. ప్రొఫెసర్ చంద్రశేఖర్ రావు(సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ హెడ్) 4. ప్రొఫెసర్ ఎన్ సుధాకర్ రావ, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆంత్రోపాలజీ 5. ప్రొఫెసర్ సరత్ జ్యోత్స్న రాణి, డిపార్ట్ మెంట్ తెలుగు 6. ప్రొఫెసర్ మీనా హరిహరణ్ (సెంటర్ ఫర్ హెల్త్ సైకాలజీ హెడ్) 7. డాక్టర్ నియాజ్ అహ్మద్, బయో టెక్నాలజీ, బయో ఇన్‌ఫార్మటిక్ హెడ్. వీరంతా విద్యార్థి నాయకులతో, జేఏసీ నాయకులతో చర్చించి వారి ప్రధాన డిమాండ్లు ఏమిటో తెలుసుకుంటారు. అనంతరం పరిష్కార మార్గాలు సూచిస్తారు. -
గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణపై నిరసనల వెల్లువ
కృష్ణా: గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణపై ఆదివారం కృష్ణా జిల్లాలో నిరసనల జ్వాల వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో నాలుగు రెవెన్యూ గ్రామాల్లో గ్రామ సభలను బహిష్కరించినట్టు తెలుస్తోంది. బుద్ధవరం, దావోజీగూడెం, అజ్జంపూడి, ఒటుపల్లి పలు ప్రాంతాల రైతులు నిరసనకు దిగారు. గన్నవరం విమానశ్రయం విస్తరణ విషయంలో భూ సమీకరణను నిరసిస్తూ రైతులు సభలను బహిష్కరించారు. -
కాపు ఉద్యమంతో ఇరకాటంలో టీడీపీ
హైదరాబాద్ : చట్టపరమైన రిజర్వేషన్లు కావాలని కాపు సామాజిక వర్గం సాగిస్తున్న ఉద్యమంపై అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఉద్యమాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంటే... మరోవైపు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిగా డీల్ చేయలేదన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ విషయంలో తొలి నుంచి దాటవేత ధోరణి ఇంతటి పరిస్థితికి తెచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తునిలో చోటు చేసుకున్న ఘటనలతో పాటు తాజాగా ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ముద్రగడ పద్మనాభం ప్రకటించడంపై టీడీపీ నేతల్లో తీవ్ర చర్చ సాగుతోంది. రాజకీయంగా పార్టీకి ఈ పరిణామం ఒక పెద్ద దెబ్బగా ఆ పార్టీ నేతలు అంచనాకొచ్చారు. ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలన్న తర్జనభర్జన సాగిస్తున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పార్టీలో కొందరు సన్నిహిత నేతలు, కాపు సామాజిక వర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తన క్యాంపు కార్యాలయానికి పిలిచి ఉద్యమానికి కౌంటర్ ఎలా ఇవ్వాలన్న దానిపై సమాలోచనలు జరిపారు. కాపు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు దగ్గరపడుతున్నా ఉద్యమం చేస్తామన్న ప్రకటన వెలువడిన తర్వాత కాపు కార్పొరేషన్ పదవిని భర్తీ చేయడంపై టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఒక సామాజిక వర్గంపై తక్కువ అభిప్రాయం, తప్పుడు అంచనాలే ఇంతవరకు తెచ్చాయని అంటున్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులందరినీ సమావేశపరిచి ఉంటే విషయం ఇంతదాకా వచ్చేది కాదని సీనియర్ నేత ఒకరన్నారు. పైగా రిజర్వేషన్లపై కమిషన్ ఏర్పాటు చేసే విషయంలో కాలయాపన చేయడం కూడా నష్టం తెచ్చిందని, ఇంతజరిగిన తర్వాత చట్టంలో ఉన్న ప్రతిబంధకాల గురించి ముఖ్యమంత్రి చెప్పడం ఆ సామాజిక వర్గాల్లో మరింత కోపం తెప్పించేదిగా ఉందని సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. -
'దళితులకు భూమి' కోసం ఆందోళనలు
మందమర్రి: ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ హామీని నెరవేర్చడంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విఫలమయ్యారని తెలంగాణ ప్రజా ప్రంట్ (టీపీపీ) విమర్శించింది. హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు అన్ని జిల్లాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆదివారం మందమర్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో టీపీపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ ప్రకటించారు. -
బాబు రాజీనామా చేయాల్సిందే
- రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలు సాక్షి, విజయవాడ బ్యూరో: ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గళమెత్తారు. మంగళవారం రాష్ర్టవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించినా మహిళలు, రైతులు, రైతు కూలీలు నిరసనల్లో పాల్గొన్నారు. పలు పార్టీల సానుభూతిపరులు కూడాబాబుకు వ్యతిరేకంగా నినదించారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. పోలీసులు పలుచోట్ల ముందస్తు అరెస్టులు చేసి కేసులు పెట్టారు. అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు దిష్టిబొమ్మ దహనాలు జరిగాయి. మానవహారాలు నిర్మించి అవినీతి చంద్రబాబు ఇంకొద్దు అంటూ నినదించారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే ఏమాత్రం అడ్డుకోని పోలీసులు, మంగళవారం వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయడానికి ప్రయత్నించగా అడ్డుకోవడమే కాకుండా ఆందోళన చేస్తున్న వారిని స్టేషన్‌కు తరలించారు. -
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాలు
హైదరాబాద్: పొన్నాల అరెస్టును నిరసిస్తూ రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలు నియోజకవర్గ కేంద్రాల్లో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్న నిరసిస్తూ పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు గాయలైన విషయం తెలిసిందే. ఈ స్థితిలో ఉన్న ఆయన్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. శనివారమే తెలంగాణ శాసనసభ ప్రతిపక్షనేత కుందూరు జానారెడ్డి గోషా మహల్ పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేయగా.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్, అదిలాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ప్రధాన పట్టణాలలో రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. -
కుదుటపడుతున్న విజయనగరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం/విశాఖపట్నం : ఆందోళనలతో అట్టుడికిన విజయనగరం క్రమేపీ కుదుటపడుతోంది. కర్ఫ్యూ నీడ కొనసాగుతోంది. పట్టణంలో గురువారం ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనా చోటుచేసుకోలేదు. గురువారం ఉ. 7 నుంచి 9 వరకు, మ. 2 నుంచి 4 వరకు కర్ఫ్యూను సడలించారు. మరోవైపు పట్టణంలోని రైతుబజార్లన్నింటినీ మూసేసి సిబ్బంది, రైతులు నిరసన తెలపడంతో కర్ఫ్యూ సడలించినా ప్రజలకు ఉపయోగంలేకుండా పోయింది. కూరగాయల ధరలు నింగినంటడంతో అవస్థలు పడ్డారు. శుక్రవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ కర్ఫ్యూను సడలిస్తున్నట్లు కలెక్టర్ కాంతిలాల్ దండె, ఎస్పీ కార్తికేయ తెలిపారు. ముగ్గురు సీఐల సరెండర్ : విజయనగరంలో సమైక్య నిరసనలను అదుపు చేయడంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన సీఐలు డి. లక్ష్మణరావు, వెంకట అప్పారావు, రమణమూర్తిలను బాధ్యులుగా చేస్తూ డీఐజీ కార్యాలయానికి సరెండర్ చేసి వారి స్థానంలో మరో ముగ్గురిని తాత్కాలికంగా నియమిస్తూ విశాఖ రేంజ్ డీఐజీ ఉమాపతి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. -
తుఫాను వచ్చింది.. విధుల్లోకి రండి: మర్రి శశిధర్ రెడ్డి
తుఫాను తీవ్రస్థాయిలో ఉండటం వల్ల సమ్మెలో ఉన్న ఉద్యోగులంతా మానవతా దృష్టితో వెంటనే విధులకు హాజరు కావాలని జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రాబోయే రెండు రోజుల పాటు తుఫాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని, దీంతోపాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశాపై కూడా ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రస్థాయిలో సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉండటం వల్ల నాలుగు రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యత్ సరఫరా లేదు. అయితే, ఇప్పుడు తుఫాను ముప్పు పొంచి ఉన్నందువల్ల విద్యుత్ శాఖ ఉద్యోగులతో పాటు రెవెన్యూ తదితర శాఖల వారు కూడా వెంటనే విధుల్లోకి వచ్చి, బాధితులను ఆదుకోవాలని మర్రి శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
నివురుగప్పిన నిప్పులా..!
సాక్షిప్రతినిధి, విజయనగరం: విజయనగరం పూర్తిగా పోలీసుల దిగ్బంధంలో ఉంది. ఏ వీధిలో చూసినా పోలీసులు, సీఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల బూట్ల చప్పుడే వినిపిస్తోంది. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉంది. రెండ్రోజులుగా పోలీసుల మీద రాళ్లతో విరుచుకుపడిన ఉద్యమకారులు కాస్త నెమ్మదించారు. ఇదే తరుణంలో భద్రతా బలగాలు వీధివీధినా జల్లెడపట్టి అనుమానం వచ్చిన వారందర్నీ వ్యాన్లలో ఎక్కించి పోలీస్స్టేషన్లకు తరలిం చారు. అయితే ఎంతమందిని అదుపులోకి తీసుకున్నదీ పోలీసులు వెల్లడించడం లేదు. ఆదివారం ఉదయం నుంచీ కర్ఫ్యూ అమలు చేయగా సోమవారం సైతం అదే పరిస్థితి కొనసాగించారు. దీంతో పట్టణం మొత్తం నిర్మానుష్యంగా మారింది. భద్రతా బలగాల బూట్ల చప్పుళ్లు, వారి వాహనాల రొద మినహా ఇతరత్రా శబ్దాలేమీ వినిపించడం లేదు. నిత్యావసరాలు, పాలు సైతం దొరక్క ప్రజలు అవస్థలు పడ్డారు. దీనికితోడు విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోవడంతో ప్రజల బాధలు వర్ణనాతీతం. రెండురోజుల పాటు ఉద్యమకారులు, పోలీసులకు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగినా సోమవారానికి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. రోడ్లమీద కొందరు యువకులు సంచరించడాన్ని గుర్తించిన బలగాలు ఆయా కాలనీలు, ఇళ్లలోకి చొరబడి చితకబాదడం మొదలెట్టారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనంతరం కొందరు యువకులు వీధుల్లోకి వచ్చి పోలీసుల మీదకు రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జొన్నగుడ్డి కాలనీలో పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ షెల్ సరాసరి నాలుగు నెలల పసిపాప ముందు పడడంతో ఆ చిన్నారి ఊపిరి తీసుకోవడం కష్టమై అస్వస్థతకు గురైంది. ఈపాపతోబాటు మరో ఇద్దరు చిన్నారులు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. దీంతో కాలనీవాసులు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చి నిరసన తెలిపారు. ఇంతలో స్థానిక ఎస్ఐ కృష్ణ కిశోర్ వచ్చి బలగాలకు సర్దిచెప్పి, చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఎస్పీ నవీన్ గులాటీ తదితరులు అక్కడికి వచ్చి స్థానికులకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద యువకులు రాళ్లు రువ్వడంతో కొద్దిపాటి ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు నియంత్రించారు. మండపం వీధి వద్ద పోలీసు జీపు మీదకు ఓ ఆకతాయి రాయి విసరడంతో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. మొత్తానికి రెండు రోజులుగా విధ్వంసాలతో అట్టుడికిన విజయనగరంలో ఇప్పుడిప్పుడే ప్రశాంతత నెలకొంటోంది. బొత్స దిష్టిబొమ్మతో శవయాత్ర విజయనగరం యుద్ధభూమిలా మారేందుకు బొత్స సత్యనారాయణే కారణమని ఆరోపిస్తూ పట్టణ శివారు బీసీ కాలనీలో ఆయన దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి అంత్యక్రియలు నిర్వహించారు. పదవి కోసం తన స్వలాభం కోసం రాష్ట్ర విభజనకు బొత్స కుట్రపన్నారని స్థానికులు ఆరోపించారు. ఆయన స్వార్థానికి ప్రజలు బలైపోతున్నారని ఆవేదన చెందారు. నేడు కర్ఫ్యూ సడలింపు ఇదిలా ఉండగా రెండ్రోజులుగా అమలవుతున్న కర్ఫ్యూను మంగళవారం గంటసేపు సడలించనున్నట్లు కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఉదయం 7నుంచి 8 గంటల వరకూ కర్ఫ్యూ సడలిస్తామని, ఈ సమయంలో నిత్యావసరాలు కొనుక్కోవాలని ప్రజలకు సూచించారు. పరిస్థితిని బట్టి సడలింపు పెంచుతామన్నారు. -
హింసకు పాల్పడితే సహించం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయని, మిగతా జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి ప్రసాదరావు తెలిపారు. హింసకు పాల్పడితే సహించబోమని, హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సీమాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 45 కంపెనీల పారా మిలటరీ దళాలకు అదనంగా 34 కంపెనీలను మోహరిస్తున్నట్లు వివరించారు. రాజీనామా చేయని ప్రజాప్రతినిధుల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ప్రజలు దాడులుచేస్తున్నందున ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భ ద్రతను పెంచామన్నారు. విజయనగరంలో పరిస్థితి చేయిదాటడంతో ఆంధ్రా రీజియన్ ఐజీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు స్వయంగా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఆందోళనల్లోకి అసాంఘిక శక్తులొచ్చాయనే కోణంలో పరిశీలన జరుపుతున్నామని డీజీపీ తెలిపారు. హైదరాబాద్‌లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఏపీఎస్పీ, పారా మిలటరీ బలగాలను సిద్ధంగా ఉంచామన్నారు. జగన్ దీక్షకు భద్రత కల్పిస్తున్నాం: సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ నిరశనకు భద్రత కల్పిస్తున్నారని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. లోటస్‌పాండ్‌లోని తన ఇంటి వద్దే జగన్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినందున పోలీసుల అనుమతి అవసరం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
కట్టలు తెంచుకున్న సమైక్యాగ్రహం
సమైక్య వాదుల సహనం కట్టలు తెంచుకుంది. దాదాపు 60 రోజులకు పైగానే అత్యంత శాంతియుతంగా ఉద్యమం సాగించిన సమైక్య వాదులు.. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం, వెనువెంటనే మంత్రుల కమిటీని ఏర్పాటుచేయడం లాంటి చర్యలతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఇన్నాళ్లూ ఒక్క హింసాత్మక సంఘటనకు కూడా పాల్పడకుండా, తమ జీతాలు వదులుకుని, కడుపులు ఎండబెట్టుకుని, పిల్లల చదువులను సైతం త్యాగం చేసిన సమైక్యవాదులు.. క్రమంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు. గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన ఆవేదన.. ఆగ్రహంగా మారి ఆవేశం రూపంలో బయటకు వచ్చింది. రాష్ట్ర విభజన జరిగినా పర్వాలేదు, తెలుగు మాట్లాడేవాళ్లకు రెండు రాష్ట్రాలుంటే తప్పేంటంటూ ముందునుంచి వాదించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీద ముందుగా సమైక్యవాదులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అసలు విభజనకు కారకుడు బొత్సేనంటూ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో మినీ సామ్రాజ్యం ఏర్పాటుచేసుకున్న బొత్సపై విరుచుకుపడ్డారు. ఆయన ఇల్లు, కాలేజి, లాడ్జి, స్టోన్ క్రషర్.. ఇలా ప్రతి ఒక్క ప్రాంతంలోనూ దాడులు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించినా, టియర్ గ్యాస్ ప్రయోగించినా, గాల్లోకి కాల్పులు జరిపినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. బొత్స ఇంటిని ముట్టడించేందుకు పదేపదే ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులను సైతం తోసేసి, వాళ్ల ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. మరోవైపు విజయనగరం జిల్లాకే చెందిన మరో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, తూర్పుగోదావరి జిల్లాలో కేంద్ర మంత్రి పళ్లంరాజు, పశ్చిమగోదావరి జిల్లాలో మరో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కూడా సమైక్యవాదుల ఆగ్రహావేశాలకు గురయ్యారు. వాళ్లందరి ఇళ్లపైనా సమైక్యవాదులు విరుచుకుపడ్డారు. రాజమండ్రిలో ఎంపీ జీవీ హర్షకుమార్కు చెందిన కళాశాలను ముట్టడించగా, అది ఉద్రిక్తతకు దారితీసింది. హర్షకుమార్ కుమారులు సమైక్యవాదులపై ఎదురుదాడికి దిగడం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు హర్షకుమార్ సమైక్యవాదులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. విశాఖ జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయంపై సమైక్యవాదులు దాడిచేసి అక్కడున్న ఫర్నిచర్ ధ్వంసం చేసి ఫ్లెక్సీలు చించేశారు. మరోవైపు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాయలంలో వాహనాలకు నిప్పుపెట్టారు. దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. శాంతికాముకులైన కోస్తా ప్రాంత ప్రజలను తీవ్రంగా రెచ్చగొట్టి, విధ్వంసాలకు పాల్పడేలా చేసింది కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులేనని సమైక్యవాదులు ఆరోపించారు. రెండు నెలల పాటు ఒక్క హింసాత్మక సంఘటన కూడా లేకుండా తమను తాము శిక్షించుకుంటూ ఆందోళన చేస్తుంటే అదేమీ పట్టకుండా నియంతృత్వ ధోరణితో రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. ఇక ముందు కూడా నాయకులకు ఇలాంటి శాస్తి తప్పదని హెచ్చరించారు. -
సీఎం కార్యాలయం ఎదుట సీమాంధ్ర ఉద్యోగుల నిరసన
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర కోరుతూ సచివాలయం ఉద్యోగులు ఆందోళనలను మరింత తీవ్రతరం చేశారు. గురువారం ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం సమత బ్లాక్ వద్దకు దూసుకొచ్చి బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాన్ని విభజిస్తే ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. కొన్నాళ్ళుగా విధులకు దూరంగా ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా సమత బ్లాక్ వద్దకు ప్రదర్శనగా బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గని ఉద్యోగులు పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ సమత బ్లాక్ వద్దకు చేరుకుని, అక్కడే బైఠాయించి సాయంత్రం వరకూ నిరసన తెలిపారు. కాగా, సమత బ్లాక్ వద్ద ఆందోళన సందర్భంగా సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆర్గనైజింగ్ సెక్రటరీ బెన్సన్ స్పృహ కోల్పోవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: మురళీకృష్ణ సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీకృష్ణ వెల్లడించారు. ఉద్యోగుల సర్వసభ్య సమావేశం డీ బ్లాక్‌లోని సమావేశ మందిరంలో దాదాపు ఐదు గంటల పాటు జరిగింది. తెలంగాణ ప్రక్రియపై కేంద్రం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు చేపట్టాలనే అంశంపై ఈ సందర్భంగా అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం దిగివచ్చే వరకూ ఆందోళన చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్టు వెల్లడించారు. సమైక్యవాదుల మనోభావాలను గుర్తించాలని, సమైక్యవాదాన్ని కోరుకునే ఏ పార్టీకైనా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. -
ఉధృతంగా సమైక్య సమ్మె.. కార్యాలయాల మూత
సమైక్య రాష్ట్ర సాధన కోసం సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా 2,700 అడుగుల జాతీయజెండాతో వస్త్రవ్యాపారులు ప్రదర్శన నిర్వహించారు. పశుసవంర్థక శాఖ, ఎన్జీవోల ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ప్రదర్శన చేశారు. నెల్లూరు బ్రాహ్మణసంఘం, అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వచ్చేనెల 2 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని వైఎస్ఆర్ సీపీ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మరోవైపు విశాఖలో సమైక్యాంధ్రకు మద్దతుగా చోడవరం వైఎస్ఆర్ సీపీ నేత సత్యారావు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు 34వ రోజుకు చేరాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉరవకొండ జైనబి దర్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గుంటూరు జిల్లా మాచర్లలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా నందిగామలో ఆంధ్రాబ్యాంక్ మూసేయాలంటూ ఏపీఎన్జీవోలు ధర్నా చేశారు. విజయవాడ బందరు రోడ్డులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఐటీ కార్యాలయాన్ని ఏపీఎన్జీవోలు మూసివేయించారు. బీఆర్టీఎస్ రోడ్డులో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థి జేఏసీ వీధిబడి కార్యక్రమం నిర్వహించింది. కైకలూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ నేత డీఎన్ఆర్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు 52వ రోజుకు చేరాయి. -
సమ్మెపై విచారణ సోమవారానికి వాయిదా
ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లుగా అధికారికంగా ఆధారమేమీ లేదని హైకోర్టు తెలిపింది. రాష్ట్రాన్ని విభజిస్తున్న విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తదితరులు బహిరంగంగా చెప్పారని ఏపీఎన్జీవోలు కోర్టుకు తెలిపారు. వాస్తవానికి రాష్ట్రాన్ని విభజించేటట్లయితే అలాంటి ప్రకటనను ప్రధాన మంత్రే చేయాల్సి ఉంటుందని.. ఈ సందర్భంగా కోర్టు ఏపీ ఎన్జీవోలకు తెలిపింది. అయితే... విభజన ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకునే వరకు సమ్మెను మాత్రం తాము కొనసాగించి తీరుతామని ఏపీఎన్జీవోలు తెలిపారు. కానీ, ఏపీ ఎన్జీవోలు.. ఇతరులు చేస్తున్న సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల సమ్మె విరమించాలని కోర్టు వారికి సూచించింది. -
సమ్మెను మీరు సమర్థిస్తున్నారా?
ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఏపీఎన్జీవో, ఇతర ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శిక్షార్హమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోందంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సమ్మె విషయంలో సర్కారు అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టింది. ప్రభుత్వ చర్యలను గమనిస్తుంటే అవి సమ్మెను సమర్థిస్తున్నట్లు కనిపిస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోందని మండిపడింది. సమ్మె నివారణకు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతున్న చర్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. సమ్మెపై తీసుకున్న చర్యలను వివరిస్తూ డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి కౌంటర్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు కనీసం సెక్రటరీ స్థాయి అధికారి కూడా ముందుకు రాకపోవడం చూస్తుంటే ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం.. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో చర్చలు జరపడాన్ని ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం, ఏ నిబంధనకు లోబడి సమ్మె చేస్తున్న ఉద్యోగులతో మంత్రుల బృందం చర్చలు జరిపిందని, సమ్మె చేస్తున్న వారిని చర్చలకు ఆహ్వానించడంలో ఉన్న ఆంత్యర్యమేమిటని నిలదీసింది. ప్రభుత్వ చర్యలు చట్ట ప్రకారం లేనప్పుడు, అవి ఎంత మాత్రం సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలుగా చెప్పలేమని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం సమ్మె జరగడానికి వీల్లేదని, అయినా సమ్మె జరుగుతోందని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన వివరణలను ఆశిస్తున్నామని పేర్కొంది. సమ్మెను ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారా..? లేదా..? సూటిగా చెప్పాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన రాష్ట్ర విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను సోమవారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఇందులో భాగంగా ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరఫున వీసీ.హెచ్.నాయుడు, ఏపీఎన్జీవోల తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమే: సత్యంరెడ్డి తొలుత సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఒకవేళ ఈ విధులను నిర్వర్తించకపోతే అది ప్రభుత్వ వైఫల్యమే అవుతుందని తెలిపారు. సమ్మెను విరమించాలని ఉద్యోగులను, విరమించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం న్యాయస్థానాలకు ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వెలువరించిన పలు తీర్పులను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సర్వీసు నిబంధనలను ఉద్యోగులు ఉల్లంఘిస్తే ఏం చేయాలో చెప్పండి..? అని సత్యంరెడ్డికి సూచించింది. ఈ విషయంలో స్పష్టతనిచ్చే నిబంధనలేవీ లేవని సత్యంరెడ్డి చెప్పగా, అయితే ఈ కేసులో తాము చేయగలిగింది ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్ (సీసీఏ) నిబంధనల ప్రకారం సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకోవచ్చునని, ప్రభుత్వం మౌనంగా ఉండటానికి వీల్లేదని ఆయన చెప్పారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని సత్యంరెడ్డి తెలిపారు. ఈ వ్యాజ్యాలను ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది: వీసీహెచ్ నాయుడు ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని సాధారణ పరిపాలనశాఖ తరఫు న్యాయవాది వీసీహెచ్.నాయుడుని ధర్మాసనం కోరింది. (అత్యంత ముఖ్యమైన ఇలాంటి కేసులో సాధారణంగా అడ్వొకేట్ జనరల్ హాజరవుతారు. ఆయన బీజీగా ఉంటే కనీసం అదనపు ఏజీలైనా వస్తారు. అయితే అటు ఏజీగానీ, ఇటు అదనపు ఏజీలుగానీ ఈ కేసులో వాదనలు వినిపించేందుకు ఇప్పటి వరకు రాలేదు. దీంతో ప్రభుత్వ న్యాయవాదే ఈ కేసులో వాదనలు వినిపించాల్సి వస్తోంది.) అంతేకాక ఈ వ్యాజ్యాలను వ్యతిరేకిస్తున్నారా..? సమర్థిస్తున్నారా..? చెప్పాలని నాయుడికి స్పష్టం చేసింది. ఇందుకు ఈ వ్యాజ్యాలను తాము వ్యతిరేకిస్తున్నామని నాయుడు సమాధానమిచ్చారు. సమ్మె విషయంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, ఇప్పటికే ఆయా శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. పిటిషనర్ రవికుమార్ సైతం ప్రభుత్వాన్ని తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారని, తాము అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం తరఫున డిప్యూటీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌ను చదివి వినిపించారు. ఈ సమయంలో ధర్మాసనం... కౌంటర్‌ను డిప్యూటీ కార్యదర్శి పేరు మీద దాఖలైన విషయాన్ని గమనించింది. ‘‘ఓ డిప్యూటీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారన్న మాట. కనీసం కార్యదర్శి కూడా ముందుకు రాలేదన్న మాట..! ప్రధాన కార్యదర్శి గానీ, ముఖ్య కార్యదర్శి గానీ ముందుకు రాకపోవడాన్ని చూస్తుంటే సమ్మెను ప్రభుత్వం సమర్థిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్నట్లు చెబుతున్న చర్యలను చూస్తే అవి హాస్యాస్పదంగా ఉన్నాయి’’ అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో చర్చించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశామని, ఆ బృందం రెండు దఫాలుగా ఉద్యోగులతో చర్చలు జరిపిందని నాయుడు చెప్పగా.. అసలు ఏ చట్టం ప్రకారం, ఏ నిబంధనకు అనుగుణంగా సమ్మె చేస్తున్న వారితో మంత్రుల బృందం చర్చలు జరిపిందని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘సమ్మె చేస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారో ఎక్కడా మీ కౌంటర్లో చెప్పలేదే. ఇది సమర్థనీయమా..? మీ బాధ్యత ఏమైంది.? మీరు చర్యలు తీసుకున్న తర్వాత కూడా వారు (ఉద్యోగులు) సమ్మె చేస్తుంటే వారి సంగతి మేం చూసుకునే వాళ్లం. సమ్మెను ఆపేందుకు మీరు చర్యలు తీసుకుంటారా..? లేదా..? సూటిగా, స్పష్టంగా చెప్పండి’’ అని నాయుడికి స్పష్టం చేసింది. కొంత గడువిస్తే ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలతో మరో అఫిడవిట్‌ను కోర్టు ముందుంచుతామని నాయుడు చెప్పగా.. గడువు ఇచ్చేది లేదని, గడువు కావాలంటే ప్రతీ వాయిదాకు రూ.2 లక్షల చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం శిక్షార్హమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోన్నట్లు కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం సమ్మె చేయరాదు. ఆయినా కూడా ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు..? మీరు మాత్రం సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలన్న ఈ వ్యాజ్యాలను కొట్టివేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో స్పష్టతనివ్వండి. పిటిషన్లను కొట్టివేయాలా..? వద్దా..?’’ అని ధర్మాసనం నాయుడిని కోరింది. చివరకు నాయుడు ఈ వ్యాజ్యాలను కొట్టివేయాలని చెప్పడంతో.. ఇక ప్రభుత్వ వాదనలు ముగిసినట్లేనని, వాదనలు వినిపించాలని మోహన్‌రెడ్డిని ధర్మాసనం కోరింది. సమ్మెపై ఎక్కడా నిషేధం లేదు: సి.వి.మోహన్‌రెడ్డి సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఈ వ్యాజ్యాన్ని పిటిషనర్ సొంత ప్రయోజనాల కోసం, దురుద్దేశాలతో దాఖలు చేశారని, ఇలాంటి పిటిషన్లకు అసలు విచారణార్హత ఉండదని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వెలువరించిన తీర్పులను చదివి వినిపించారు. పిటిషనర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారని, అప్పుడు అతనికి కనిపించని ప్రజల ఇబ్బందులు, ఇప్పుడు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, విచారణార్హత తదితర అంశాలపై తర్వాత వాదనలు వింటామని, ముందు కేసు పూర్వాపరాల ఆధారంగా వాదనలు వినిపించాలని మోహన్‌రెడ్డికి సూచించింది. కోర్టు ఇచ్చే ఉత్తర్వుల వల్ల పిటిషనర్‌కు మాత్రమే లబ్ధి చేకూరుతుందా..? లేక ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుతుందా..? అన్న అంశమే తమకు ప్రధానమని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయకూడదని ఏ నిబంధనల్లోనూ లేదని, సమ్మె చేస్తే ఏం చేయాలి..? ఏం చేయకూడదన్నది మాత్రమే ఉంటుందంటూ, సీసీఏ నిబంధనలను చదవి వినిపించారు. సమ్మె చేస్తే తలెత్తే పర్యవసానాల గురించి ఎక్కడా చర్చించలేదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లోఉద్యోగులందరూ సమ్మె చేస్తే.. వారిపై చర్యలు తీసుకునే అవకాశం లేదని ఆయన తెలిపారు. సీసీఏ నిబంధనల్లో పెనాల్టీల గురించి చర్చించారే తప్ప సమ్మెపై నిషేధం గురించి ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేవలం ఎస్మా కింద మాత్రమే సమ్మెపై నిషేధం ఉందని, నిబంధనల్లో ఎక్కడా లేదని పేర్కొన్నారు. అంతేకాక సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినంత మాత్రనా, ఉద్యోగులపై చర్య తీసుకోవడానికి వీల్లేదని వివరించారు. అప్పటితో కోర్టు పనివేళలు ముగియడంతో, విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. -
మరింత ఉధృతంగా ఉద్యమం : సమైక్య జేఏసీ
30వ తేదీ దాకా కార్యక్రమాల ఖరారు 24 సీమాంధ్ర బంద్.. 25, 26 ప్రైవేట్ ట్రావెల్స్ నిలిపివేత 23-30 ప్రైవేట్ విద్యా సంస్థల మూత 4 రోజులు బ్యాంకులు, కేంద్ర కార్యాలయాల బంద్ హైదరాబాద్: సమ్మె స్థాయిని కూడా మించి సమైక్యోద్యమాన్ని ఉధృతం చేసే దిశగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఉద్యమం ఏకరీతిగా సాగడమే లక్ష్యంగా కార్యాచరణను ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ జేఏసీ రూపొందించింది. జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అధ్యక్షతన జేఏసీ సోమవారం సమావేశమైంది. ఏపీ ఎన్జీవో, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ఆర్టీసీఈయూ, ఎన్ఎంయూ, డిప్యూటీ కలెక్టర్ల సంఘం, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, మున్సిపల్ ఉద్యోగుల సంఘం, ట్రెజరీ ఉద్యోగుల అసోసియేషన్, గెజిటెడ్ అధికారుల సంఘం, అన్ని సంక్షేమ శాఖల ఉద్యోగుల సంఘం, సీమాంధ్ర ఉపాధ్యాయుల పోరాట సమితి.. ఇలా దాదాపు 145 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగులు, కార్మిక సంఘాలు సమ్మెతోనే సరిపెట్టొద్దని, కేంద్రంపై ఒత్తిడి పెరిగేలా కార్యాచరణ ఉండాలని అభిప్రాయం వ్యక్తమయింది. ఉద్యమంలో పాల్గొనని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆందోళనలో భాగస్వాములను చేసే లక్ష్యంతో ప్రణాళిక రూపొందింది. వివరాలిలా ఉన్నాయి... - సెప్టెంబర్ 19, 20న కేంద్ర ప్రభుత్వ కార్యాయలయాలు, బ్యాంకుల దిగ్బంధం - 21న సాయంత్రం 6-8 గంటల మధ్య సీమాంధ్ర అంతటా లైట్లు ఆర్పి నిరసన - రాష్ట్ర సమైక్యత ఆవశ్యకతను వివరిస్తూ 22, 23ల్లో జిల్లా కేంద్రం నుంచి గ్రామ స్థాయి దాకా అవగాహన సదస్సులు - 23 నుంచి 30వ తేదీ దాకా ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ - 24న సీమాంధ్ర బంద్, రహదారుల దిగ్బంధం. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలనూ అడ్డుకోవాలని నిర్ణయం - 25, 26ల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బంద్ - 27, 28ల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ - రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ 30వ తేదీలోగా సీమాంధ్రలోని అన్ని పంచాయితీలూ తీర్మానాలు చేసి ప్రధానికి పంపాలి -
‘సమ్మె’పై సర్కారు బాధ్యతేమిటి?
ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? పిటిషనర్‌కు హైకోర్టు ప్రశ్నలు విచారణ నేటికి వాయిదా హైదరాబాద్: ‘ప్రభుత్వోద్యోగులు తమ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించి సమ్మె చేస్తే తలెత్తే పరిణామాలేమిటి? వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఈ విషయంలో ప్రభుత్వానికున్న బాధ్యత, అధికారం ఏమిటి?’’ అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మూడింటికీ పూర్తి వివరాలతో సంతృప్తికరమైన సమాధానాలు చెప్పాలని పిటిషనర్‌ను ఆదేశించింది. రాజకీయాంశమైన రాష్ట్ర విభజనపై సమ్మె చేసే హక్కు ప్రభుత్వోద్యోగులకు లేదంటూ రవికుమార్ అనే న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం దీనిపై సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఏపీ ఎన్జీవోల పేరుతో ప్రభుత్వోద్యోగులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. వారికి సమ్మె చేసే హక్కు లేదని కోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు 2003లో ఈ మేరకు స్పష్టమైన తీర్పు వెలువరించిందన్నారు. తమిళనాడు ప్రభుత్వం 2 లక్షల మంది ప్రభుత్వోద్యోగులను సర్వీసు నుంచి తప్పించడంపై సుప్రీం ఇచ్చిన తీర్పును చదివి విన్పించారు. కారణాలేవైనా ప్రభుత్వోద్యోగులు మాత్రం సమ్మె చేయడానికి వీల్లేదని అందులో కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ‘‘ఆగస్టు 12 నుంచి రాష్ట్రంలో ఏపీ ఎన్జీవోలు చేస్తున్న నిరవధిక సమ్మె వల్ల జనజీవనం స్తంభించింది. ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం వేసిన మంత్రుల బృందం ఒక్కసారి కూడా ఆ పని చేయలేదు. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని చెప్పడమే తప్ప సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. ఏపీ ఎన్జీవోలు, సమ్మె చేస్తున్న ఇతర ప్రభుత్వోద్యోగులతో ప్రభుత్వం కుమ్మక్కైంది’’ అని ఆరోపించారు. అలా కుమ్మక్కైందని అఫిడవిట్లో ఎక్కడైనా రాశారా అని ధర్మాసనం ప్రశ్నించింది. అఫిడవిట్లో రాయలేదని, ప్రభుత్వ కౌంటర్‌కు సమాధానంగా దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్లో రాశామని సత్యంరెడ్డి చెప్పగా, ‘రిప్లై అఫిడవిట్‌తో మాకు సంబంధం లేదు. అఫిడవిట్లో ప్రస్తావించని అంశాల గురించి మాట్లాడొద్దు. వాటిని మేం పరిగణనలోకి తీసుకోబోం. మీరు చెప్పేదేమిటి? సమ్మె చేస్తున్న వారి విషయంలో ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోవడం లేదంటారు. సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరుతున్నారు. అంతేనా?’’ అని ప్రశ్నించింది. అవునని సత్యంరెడ్డి బదులిచ్చారు. సమ్మె వల్ల రాష్ట్రంలో పాలన స్తంభించిందని, వ్యవహారాలన్నీ గందరగోళంగా తయారయ్యాయని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఫిడవిట్లో ఎక్కడ చెప్పారో చూపాలని ధర్మాసనం తిరిగి ప్రశ్నించింది. అసలిలాంటి పరిస్థితుల్లో కోర్టులు ఏం చేయగలవో చెప్పాలని కోరింది. సమ్మెను ఆపాల్సిందిగా ప్రభుత్వోద్యోగులను, తన బాధ్యతలను నిర్వర్తించి తీరాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చని సత్యంరెడ్డి బదులిచ్చారు. దాంతో, ‘అసలు సమ్మె విషయంలో జోక్యం చేసుకోవడం ప్రభుత్వ బాధ్యతని ఎక్కడుంది? ప్రభుత్వానికి ఏ రకమైన బాధ్యతలు ఉంటాయో చెప్పండి. వాటి గురించి ఎక్కడ రాసి ఉందో చూపండి’ అని ధర్మాసనం కోరింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
పార్ట్ టైం స్వీపర్ల వెట్టిచాకిరి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేల మంది పార్ట్‌టైం స్వీపర్లతో విద్యాశాఖ వెట్టిచాకిరి చేయిస్తోంది. పేరుకు పార్ట్‌టైం ఉద్యోగులే అయినా ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు (ఫుల్‌టైం) అన్ని పనులూ వారితోనే చేయి స్తూ శ్రమ దోపిడీ చేస్తోంది. పాఠశాలల్లో రూ. 75 వేతనంతో పార్ట్‌టైం స్వీపర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం నెలకు రూ. 1,623 చెల్లిస్తోంది. అది కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోకపోయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నారు. తీరా ఆ కొద్ది వేతనమైనా గత ఏడాది డిసెంబర్ నుంచి చెల్లించకపోవడంతో పార్ట్‌టైం స్వీపర్లంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారికి సంబంధించిన వేతనాలు చెల్లించే పద్దును ఆర్థిక శాఖ రద్దు చేయడమే ఇందుకు కారణం. వేతనాల కోసం వారంతా గత 9 నెలలుగా ఆర్థిక శాఖ, విద్యాశాఖ, రాజీవ్ విద్యామిషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అవి పట్టించుకోవట్లేదు. ఏటా ఆర్థిక శాఖ పార్ట్‌టైం స్వీపర్ల వేతనాలను 2202-01-103-05-310/312 పద్దు కింద విడుదల చేస్తోంది. 2012-13 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా మొదటి, రెండో త్రైమాసిక వేతనాలను ఇదే పద్దు కింద విడుదల చేసింది. అయితే డిసెంబర్ చివరలో రావాల్సిన మూడో త్రైమాసిక, ఏప్రిల్‌లో రావాల్సిన నాలుగో త్రైమాసిక వేతనాలను నిలిపేసింది. ఆర్థిక శాఖ 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆ పద్దును రద్దు చేయడంతో అంతకుముందు సంవత్సరపు వేతనాలూ ఆగిపోయాయి. ఈ విషయమై స్వీపర్లు ప్రభుత్వానికి, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు విన్నవించారు. అయితే ప్రభుత్వం ఆర్వీఎం/ఆర్‌ఎంఎస్‌ఏ నిధులను తీసుకోవాలని సూచించడంతో పాఠ శాల విద్యాశాఖ ఆర్వీఎంకు లేఖ రాసింది. కానీ ఆర్వీఎం తమ నిధుల నుంచి వారి వేతనాలు ఇవ్వడం కుదరదని తెగేసిచెప్పింది. -
రోజురోజుకూ రగులుతున్న నిరసనాంధ్ర
సాక్షి నెట్వర్క్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వేర్పాటు ప్రకటన వచ్చిన దరిమిలా సరిగ్గా నెలరోజుల కిందట ఎగసిన సమైక్య ఉద్యమం రోజురోజుకూ బలపడుతూ తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ సీమాంధ్ర జిల్లాల్లో ప్రతినిత్యం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తెలుగు భాషా, క్రీడా దినోత్సవమైన గురువారంనాడు కూడా రోజూమాదిరిగానే ధర్నాలు, రాస్తారోకోలు, వినూత్న ఆందోళనలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు దద్దరిల్లాయి. అనంతపురం జిల్లా కదిరిలో జేఏసీ చేపట్టిన ‘ఖాద్రీ లక్ష జన గర్జన’ విజయంతమైంది. జై సమైక్యాంధ్ర అంటూ లక్ష గొంతులు నినదించాయి. ఎస్కేయూలో జేఏసీ నాయకులు, విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ యూత్ విభాగం ఆధ్వర్యంలో మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో మునిసిపల్ కమిషనర్, గుంటూరు జిల్లా తెనాలి గాంధీచౌక్ సెంటర్లో మునిసిపల్ ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. గుంటూరులో భారీ మానవహారంగా ఉద్యమకారులు ఏర్పడ్డారు. రాజకీయ జేఏసీ నేతృత్వంలో ప్రైవేటు ఉపాధ్యాయుల రిలేదీక్షల శిబిరాన్ని వైఎస్ఆర్ సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆర్టీసీ కార్మికులు శరీరానికి చెట్ల కొమ్మలు చుట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు భారీ ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో ఐదుగురు విద్యుత్ కార్మికుల అరెస్టును నిరసిస్తూ రెండు వేల మందికి పైగా ఆర్టీపీపీ కార్మికులు, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, లింగారెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి నేతృత్వంలో పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. దీంతో చేసేదేమి లేక పోలీసులు వారిని విడుదల చేశారు. రైల్వేకోడూరులో అర్ధ లక్ష గళ గర్జన పేరుతో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖలో వ్యవసాయశాఖ అనుబంధశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో గడ్డి తినే కార్యక్రమం జరిగింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మూడురోడ్ల జంక్షన్లో ఉపాధ్యాయులు మోకాళ్లతో నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం బెండమూరులంకలో రైతులు రోడ్డుపై పశువులను ఉంచి దిగ్బంధం చేశారు. స్పోర్ట్స్ డే సందర్భంగా కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్లో పీఈటీలు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. కాకినాడలో ఉపాధ్యాయులు భారీ బైక్ ర్యాలీ చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వికలాంగులు ర్యాలీ చేపట్టి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని గురువారం చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్‌తోపాటు పలువురు జేఏసీ నేతలు రోడ్డుపైనే క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడారు. శ్రీకాకుళంలో 500 మంది డ్వాక్రా సంఘాల మహిళలు నిండు బిందెలతో ర్యాలీగా వెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. నరసన్నపేటలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 10 వేల మంది విద్యార్థులతో గళార్చన కార్యక్రమం జరిగింది. కృష్ణాజిల్లా బెజవాడ దుర్గమ్మ గుడి అర్చకులు, వేద పండితులు ప్రవచనాలు చెప్పి నిరసన తెలిపారు. గుడివాడలో మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 4 వేల మంది డ్వాక్రా మహిళలతో ర్యాలీ జరిపారు. తెలంగాణ-రాయలసీమ రహదారి దిగ్బంధం తెలంగాణ-రాయలసీమ సరిహద్దు గ్రామమైన శ్రీశైలం వద్ద సమైక్యవాదులు రహదారిని దిగ్బంధించారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ, విద్యార్థి జేఏసీ, శ్రీశైలం మండల జర్నలిస్ట్‌ల ఆసోసియేషన్ల ఆధ్వర్యంలో వాహనాలను అడ్డుకున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కేసీఆర్, సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, న్యాయశాఖ మంత్రి ఏరాసుప్రతాపరెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ‘మెగా’ సినిమాలను అడ్డుకుంటాం: సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ సమైక్యాంధ్రకు కట్టుబడి కేంద్రమంత్రి చిరంజీవి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేదంటే ఆయన కుటుంబ సభ్యుల సినిమాల విడుదలను అడ్డుకుంటామని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు డి.అంజయ్య బుధవారం నెల్లూరులో హెచ్చరించారు. తిరుపతి, చిత్తూరు దిగ్బంధం.. విజయవంతం సమైక్యాంధ్ర జేఏసీల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు నగరాల్లో 48 గంటల పాటు చేపట్టిన దిగ్బంధనం విజయవంతంమైంది. బుధ, గురువారాలు రెండు రోజులు సమైక్యవాదులు ద్విచక్ర వాహనాలను మినహా ఏ వాహనాన్నీ తిరగనివ్వలేదు. ఫలితంగా తిరుపతి, చిత్తూరు శివారు ప్రాంతంలో తమిళనాడు, కర్ణాటక వైపు వెళ్లివచ్చే వాహనాలు కిలోమీటర్ల మేర రోడ్లపై నిలిచిపోయాయి. మందుల షాపులు మినహా ఆసుపత్రులు, సినిమాహాళ్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు తాళాలు వేశారు. కూరగాయల మార్కెట్లు కూడా మూసివేశారు. అరెస్టు చేస్తే కరెంట్ కట్ చేస్తాం: విద్యుత్ జేఏసీ సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసే విద్యుత్ ఉద్యోగులను, జేఏసీ నేతలను అరెస్టుచేస్తే ఆయా పోలీసుస్టేషన్లు, ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలకు కరెంట్ తీసేస్తామని విద్యుత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కోలాకి శ్రీనివాసరావు గురువారం విశాఖలో హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లా కడపలోని రాయలసీమ థర్మల్ పవర్స్టేషన్కి చెందిన పది మంది కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు గురువారం అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. 5 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి ఇంటర్ అధ్యాపకులు రానున్న సెప్టెంబర్ 5వ తేదీ గురుపూజోత్సవం అర్ధరాత్రి నుంచి ఇంటర్అధ్యాపకులంతా సమ్మెలోకి వెళ్లనున్నుట్టు ఇంటర్మీడియేట్ అధ్యాపక జేఏసీ కన్వీనర్ వి.రవి ప్రకటించారు. విజయవాడలో గురువారం అధ్యాపక జేఏసీ 13 జిల్లాల నాయకుల సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోస్తా, సీమ జిల్లాల్లోని 665 కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది సమ్మెలో పాల్గొంటూ నిరవధిక నిరాహారదీక్షలకు దిగనున్నట్టు చెప్పారు. ప్రైవేటు కళాశాలల అధ్యాపక సిబ్బంది కూడా తమతో కలిసివచ్చేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం బాగుండాలని ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోకాళ్లపై మెట్లెక్కి ఆలయంలో పూజలు చేశారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ తెల్లం వెంకట్రావు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర నేత కడియం రామాచారి పాల్గొన్నారు. -
రాజధానిలో నినాదాల హోరు
సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో రాజధాని హోరెత్తుతోంది. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ, సమైక్యవాదుల మధ్య మంగళవారం కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరస్పర వాగ్వాదాలు, ఆరోపణలు, ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవన్, విద్యుత్‌సౌధ, దేవాదాయశాఖ కార్యాలయం, కోఠి డీఎంహెచ్ఎస్, బీమాభవన్, తదితర కార్యాలయాల్లో పోటాపోటీ నిరసనలు కొనసాగాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఏపీఎన్జీవో నేతృత్వంలో బీఆర్కే భవన్లో ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన కొనసాగిస్తుండగా, శాంతిసద్భావన ర్యాలీ పేరుతో తెలంగాణవాదులు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు చేసిన ‘జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర’ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న సెంట్రల్‌జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని రెండు వర్గాలకు నచ్చచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. విద్యుత్‌సౌధలో నాగం హడావుడి: విద్యుత్‌సౌధలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్ద న్‌రెడ్డిని పోలీసులు విద్యుత్‌సౌధ గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సీమాంధ్ర తొత్తులుగా మారి తెలంగాణవాదులను అణచివేయాలని చూస్తున్నారంటూ నాగం మండిపడ్డారు. అరగంటపాటు గేటు ముందు బైఠాయించిన నాగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం సంతోష్ అనే తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేస్తే వారిపై చర్యలు తీసుకోలేదని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు రఘు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డితో కలిసి విద్యుత్ ఉద్యోగులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్‌భవన్‌లో కవిత: తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత నిబద్ధత ఉందని, సీమాంధ్ర ఉద్యమం రాద్ధాంత ఉద్యమమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదనే నమ్మకం ఉందని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంటే ఈ ప్రాంత ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా చేయాలంటూ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో బస్ భవన్ వద్ద చేపట్టిన ధర్నాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కమిషనర్ ఆఫీసులో ఏపీఎన్జీవో ఉద్యోగులు విధులు బహిష్కరించి మౌనప్రదర్శన నిర్వహించారు. వీరికి పోటీగా భోజన విరామంలో టీఎన్జీవోస్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షిస్తూ ధర్నా నిర్వహించారు. -
శాంతియుత నిరసనలకు అభ్యంతరం లేదు: అనురాగ్ శర్మ
సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా జరిగే తెలంగాణ, సమైక్యాంధ్ర నిరసనలకు అభ్యంతరం చెప్పబోమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. అవి శ్రుతి మించితే మాత్రం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న ఆందోళనల్లో బయటి వ్యక్తులు, నేతలు పాల్గొంటే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఏపీఎన్జీఓ నేత అశోక్‌బాబు ఇటీవల మీడియా ముందు చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తున్నామని, ఇవి అభ్యంతరకరంగా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. శర్మ మంగళవారం తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంది. దాదాపు ప్రతి కీలక కార్యాలయంలోనూ అక్కడి సిబ్బంది నిరసనలకు దిగుతున్నారు. అయితే కార్యాలయాలతో సంబంధం లేని బయటి వాళ్లు కూడా అక్కడికొచ్చి రెచ్చగొడుతున్నారు. వారిలో చాలా మందిని ముందు జాగ్రత్తగా అరెస్టు చేస్తున్నాం’ అని తెలిపారు. ఒకే కార్యాలయంలో భిన్న డిమాండ్లతో ఆందోళనలు చేస్తున్న వారు ఒకే సమయంలో కాకుండా ఒక్కో సమయంలో ఆందోళనలు చేస్తే ఇబ్బందులు ఉండవని సూచించారు. నగరంలో ఇప్పటికే నిషేధాజ్ఞలు విధించామని, పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పారు. -
ప్రభుత్వాల తీరు గర్హనీయం: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో గత 27 రోజులుగా వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని శాంత పరిచే ప్రయత్నాలు చేయకపోవటం గర్హనీయమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టి భావోద్వేగాలను పెంచి రాజకీయ ప్రయోజనం పొందాలని కొన్ని పార్టీలు చూడటం బాధాకరమని సోమవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వికృత క్రీడలో కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు భాగస్వామ్యం కావటం దురదృష్టకరమని, ఆ పార్టీల వ్యవహారాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు నానాటికీ అధ్వానంగా మారుతున్నా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు చోద్యం చూస్తున్నారని, శాంతియుత సహజీవనానికి దోహదపడే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీలు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు. -
సమైక్య సమ్మెతో ఆర్టీసీకి 200 కోట్ల నష్టం
రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 రోజుల నుంచి వరుసగా సమ్మెలు జరుగుతూనే ఉండటంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీకి వాటిల్లిన నష్టం ఎంతో తెలుసా.. అక్షరాలా 200 కోట్ల రూపాయలు!! కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ స్థాయిలో ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతుండటం, ఆర్టీసీ సిబ్బంది కూడా సమ్మెలో ఉండటంతో బస్సులు ఒక్కటి కూడా సరిగా నడవడం లేదు. మొత్తం 13 జిల్లాల్లోని ఆర్టీసీ సిబ్బంది సహా దాదాపు 4 లక్షల మందికి పైగా ఉద్యోగులు సమ్మె బాటలో ఉన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలన్న ఏకైక డిమాండుతో వీరు సమ్మె చేస్తున్నారు. ఉద్యోగులు చేస్తున్న ఈ సమ్మె వల్ల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీకి అక్షరాలా రోజుకు 13 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాన్న ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటివరకు సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల ఆర్టీసీకి దాదాపు 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. ఈ ఆందోళనలు మరింతకాలం కొనసాగితే ఆర్టీసీ మనుగడ కూడా కష్టంగా మారుతుందన్నారు. ఇప్పటికే ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో ఉందని ఆయన తెలిపారు. అందువల్ల ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను విరమించి వెంటనే విధులకు హాజరై, ప్రజలకు అసౌకర్యం లేకుండా, ఆర్టీసీకి నష్టాలు రాకుండా చూడాలని ఖాన్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు సమ్మె చేసినా, రూపాయి విలువ పడిపోవడం వల్ల డీజిల్ ధరలు పెరిగినా, ఏం జరిగినా కూడా చివరకు చిల్లు పడేది మాత్రం ప్రయాణికుల జేబుకే. ఎందుకంటే, నష్టాలను భరించడానికి ప్రభుత్వం ఎటూ ముందుకు రాదు కాబట్టి, ఆ నష్టాలను మళ్లీ ప్రజల మీదనే చార్జీల రూపంలో ఆర్టీసీ రుద్దడం ఖాయం. -
సీమాంధ్ర ఉద్యోగుల ఢిల్లీ బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ఏపీఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 25న ఢిల్లీ యాత్రకు సమాయత్తమవుతున్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లటానికి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవటానికి సహకారం కోరటం ఈ యాత్ర లక్ష్యంగా వెల్లడించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగే అనర్థాలను వివరించటంతో పాటు శ్రీకృష్ణ కమిటీ నివేదిక మీద పార్లమెంటులో చర్చించాలని అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేయనున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ఆంటోనీ కమిటీతోనూ భేటీ కావాలని నిర్ణయించింది. అయితే ఈ భేటీ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని చెప్తున్నారు. ఢిల్లీ వెళ్లే బృందంలో అన్ని ప్రధాన సంఘాల నాయకులకు ప్రతినిధి బృందంలో చోటు కల్పించనున్నారు. ఉద్యోగుల రక్తదానం : రాష్ట్రం సమైక్యంగానే కొనసాగాలని ఆకాంక్షిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు గురువారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. నగరంలోని ఎంజేఎం ఆస్పత్రి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఉద్యోగ ఫోరం అధ్యక్షుడు యూ మురళీకృష్ణ, కార్యదర్శి కేవీ కృష్ణయ్యలు తెలిపారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానం వాయిదా వేయాలని సీఎంకు వినతి ఎక్కడ నుంచి అయినా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకొనే విధానం అమలును వాయిదా వేయాలని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సీమాంధ్ర ఉద్యోగుల ప్రతినిధి బృందం గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. నూతన విధానాన్ని ఈ నెల 25 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. సీమాంధ్రలో ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున అమలును వాయిదా వేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చారని భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. రెండు దరఖాస్తుల్నీ పరిశీలిస్తున్నాం: డీసీపీ కమలాసన్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో సభ, చలో ఎల్బీ స్టేడియం కార్యక్రమాలకు సంబంధించి ఏపీ ఎన్జీవోలు, ఓయూ జాక్ నుంచి గురువారం అందిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని మధ్యమండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు ముందు నుంచే అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉందని, వీటితో పాటు నగరంలో శాంతి భద్రతల అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే వీటికి అనుమతించడంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 7న హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తాం వచ్చే నెల 7న హైదరాబాద్‌లో సభ నిర్వహించాలని సీమాంధ్ర ఉద్యోగులు పట్టుదలతో ఉన్నారు. సభకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీఎన్జీవో ప్రతినిధి బృందం గురువారం డీసీపీ కమలాసన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసింది. పోలీసులు వినాయక మండపాల బందోబస్తులో నిమగ్నమై ఉంటారని, అందువల్ల సెప్టెంబర్ 7న సభకు అనుమతి ఇవ్వటం సాధ్యం కాదని, అయినా ఉన్నతాధికారులకు నివేదించామని డీసీపీ చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వస్తే వెంటనే సమాచారం అందిస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. -
హోరెత్తిన నిరసనలు
సాక్షి నెట్వర్క్: జై సమైక్యాంధ్ర.. జై తెలంగాణ..నినాదాలతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పోటాపోటీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం రాజధానిలోని విద్యుత్‌సౌధ, ఇతర ప్రధాన ప్రభుత్వ విభాగాలు నిరసన కార్యక్రమాలతో హోరెత్తాయి. వివరాలు..సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు, ప్రత్యేక తెలంగాణను వెంటనే ప్రకటించాల తెలంగాణ ఉద్యోగుల ధర్నాలు, నినాదాలతో విద్యుత్‌సౌధ దద్దరిల్లింది. సీమాంధ్ర ఉద్యోగులు- ‘కుర్చీని కాపాడుకోవడం ఎలా?’ అనే నాటికను ప్రదర్శించారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తుతుందని సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీవిద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. శాంతిభద్రతల్ని సాకుగా చూపుతూ సీఎం మాట్లాడడం సరికాదని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు రఘు పేర్కొన్నారు. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా కోఠి డీఎంహెచ్ఎస్లో ఏపీఎన్జీవోలు విధులు బహిష్కరించి డీఎంహెచ్ఎస్ క్యాంపస్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైద్య విధాన పరిషత్, ఏపీసాక్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం, డీఎంఈ, డీహెచ్ తదితర కార్యాలయాల ఉద్యోగులు ర్యాలీలో సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమాభవన్‌లో, బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ కార్యాలయంలోనూ ఏపీఎన్జీవోల ప్రదర్శనలు కొనసాగాయి. -
పోటాపోటీగా ఆందోళనలు
సాక్షి,నెట్వర్క్: తెలంగాణ రాష్ట్ర అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో బుధవారం నగరం అట్టుడికింది. పలుచోట్ల సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీగా ఆందోళనలు చేశారు. తెలంగాణ విద్యుత్‌పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల కు నిరసనగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చేపట్టిన ధర్నాలతో విద్యుత్‌సౌధ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగులు దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. మెయిన్‌గేట్ నుంచి కార్యాలయానికి వెళ్లేవారి ని తనిఖీలు చేశారు. మింట్ కాంపౌండ్‌లోని ఏపీసీపీడీసీఎల్ కార్యాలయంలోనికి వెళ్లేందుకు సీమాంధ్ర ఉద్యోగులు ప్రయత్నించగా, తెలంగాణ విద్యుత్ జేఏసీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఉద్యోగులుగా మీ బాధ్యతలు నెరవేర్చుకోండి.. కానీ సమైక్యవాదం పేరుతో రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రఘు సూచిం చారు. ఇలా రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీపీడీసీఎల్ జేఏసీ చైర్మన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సైఫాబాద్ పోలీసులు జోక్యంచేసుకుని వారిని శాంతింపజేశారు. కార్యక్రమంలో టీ-విద్యుత్ జేఏసీ నాయకులు రవీందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వాణి, రాజేష్‌లతో పాటు వేయి మంది ఉద్యోగులు పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోల సమ్మె బుధవారం కూడా కొనసాగింది. అబిడ్స్ తిలక్ రోడ్డులోని బీమా భవన్, బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో, కోఠి డీఎంహెచ్ఎస్లో సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె కొనసాగించారు. కోఠి డీఎంహెచ్ఎస్లో ఏపీఎన్జీవోలను సుల్తాన్‌బజార్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశా రు. శాంతియుత పంథాలో సమ్మె నిర్వహిస్తున్న తమను పోలీ సులు అక్రమంగా అరెస్టు చేశార ని ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని పోలీసులు విడుదల చేశారు. -
హామీతో వెనక్కి తగ్గిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా వారం రోజులుగా పార్లమెంటులో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు తెరపడింది. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకొంటామని, సీమాంధ్ర నేతలతో సంప్రదింపులు జరుపుతామని ఇచ్చిన హామీతో తమ పార్టీ ఎంపీలు ఆందోళనను విరమించారని ఏఐసీసీ అధికార ప్రతినిధి, లోక్‌సభ చీఫ్ విప్ సందీప్ దీక్షిత్ పార్లమెంటు ఆవరణలో విలేకరులతో చెప్పారు. సభా కార్యక్రమాలకు అవరోధం కలిగించకుండా పార్లమెంటు ఆవరణలో వారు నిరసన తెలుపుతున్నారని.. అందువల్ల వారిని అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. అయితే, మంగళవారం లోక్‌సభ, రాజ్యసభల్లో టీడీపీ ఎంపీలు ‘ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి’ అనే నినాదాలు ముద్రించిన చొక్కాలు ధరించి ఆందోళనను కొనసాగించగా.. కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు మాత్రం సభల్లోకి రాకుండా పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. కాగా.. టీడీపీ సభ్యులు లోక్‌సభలో ఆందోళన కొనసాగించడంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ఎంతో ముఖ్యమైన ఆహార భద్రత బిల్లుపై చర్చించాల్సిన సమయంలో సభకు అడ్డుతగులుతున్న టీడీపీ సభ్యులపై చర్య తీసుకోవాల్సిందిగా స్పీకర్ మీరాకుమార్ను కోరతామన్నారు. కమల్ నాథ్ మాటలపై రగడ.. గొడవ చేస్తే సభను నడపబోమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ మంగళవారం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘ఆయన బెదిరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు’ అని బీజేపీ సభ్యుడు యశ్వంత్ సిన్హా ఆక్షేపించారు. దీంతో కమల్‌నాథ్ వెనక్కి తగ్గారు. జోషీ అంటే తనకు గౌరవమని, తన వ్యాఖ్యలతో ఆయన మనసు గాయపడి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటానని అన్నారు. మరోపక్క.. సుష్మా స్వరాజ్ స్పందిస్తూ, ‘కమల్ నాథ్ వినయం అలవర్చుకోవాలి. ఏం చెబుతున్నామో ముఖ్యం కాదు, ఎలా చెబుతున్నామో ముఖ్యం’ అని చెప్పారు. -
జోరు వానలోనూ ఆగని పోరు
సాక్షి నెట్వర్క్: ఎడతెరపి లేని వర్షంలోనూ సమైక్య సెగ ఎగసింది. సీమాంధ్ర జిల్లాల్లో సోమవారం జోరు వానను సైతం లెక్కచేయకుండా సమైక్యవాదులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో వేకువజాము నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉన్నా నిరసనలు పోటెత్తాయి. రాష్ట్రాన్ని విభజిస్తే చూస్తూ ఊరుకోమని సమైక్యవాదులు హెచ్చరించారు. ఏఐసీసీ అధిష్టానం వేర్పాటు ప్రకటన వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, వంటావార్పులు, రాస్తారోకోలతో హోరెత్తించారు. సోనియాగాంధీ, కేసీఆర్, బొత్సల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు సోమవారం కూడా అడుగడుగునా కనిపించాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కటిక యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మిగనూరులో మాల మహానాడు యూత్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మకు మద్యం బాటిళ్ల దండను వేసి పుర వీధుల్లో ఊరేగించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కేసీఆర్, సోనియగాంధీ దిష్టిబొమ్మలను ఊరేగించి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దహనం చేశారు. విజయనగరంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స, దిగ్విజయ్ సింగ్, రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ, కేసీఆర్ మాస్కులు వేసుకున్న వ్యక్తులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి సీమాంధ్ర ప్రజల చెవిలో పువ్వులు పెట్టినట్లు నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో భవన నిర్మాణ కార్మికులు కేసీఆర్, సోనియాలకు సమాధి కడతాం అంటూ లారీల్లో బొమ్మల్ని ఊరేగించి వినూత్నంగా నిరసన తెలిపారు. చిల్లర వర్తకులు గుర్రాలు, ఒంటెలపై ప్రదర్శనగా వెళ్లి బీచ్‌రోడ్డులోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రైతుబజార్ల బంద్ కృష్ణాజిల్లా వ్యాప్తంగా రైతుబజార్లు మూతపడ్డాయి. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉన్నా జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. కేబుల్ ఆపరేటర్లు పూర్తిగా వినోద ప్రసారాలను నిలిపివేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి 24 గంటల బంద్ చేపట్టాలని పెట్రోల్‌బంక్‌ల యాజమాన్యాలు నిర్ణయించాయి. నూజివీడులో వీఆర్వోలు భారీ ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత గౌతంరెడ్డి నేతృత్వంలో విజయవాడలో అర్చకులు సమైక్యాంధ్ర కోసం హోమం నిర్వహించారు. తిరువూరులో వేలాదిమంది విద్యార్థులు, డ్వాక్రా మహిళలు ప్రదర్శన చేపట్టారు. ఎడ్లబండ్ల ర్యాలీ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలులో భారీ ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పాల్గొని రైతుల ఉద్యమానికి ఊతమిచ్చారు. సమైక్యాంధ్ర పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ఏలూరు నగర బంద్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి ఉద్యమానికి మద్దతు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో వంటావార్పు నిర్వహించారు. భీమవరం పరిసర ప్రాంతాలకు చెందిన క్రైస్తవ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించి, ప్రార్థనలు చేపట్టాయి. పాలకొల్లులో రైతు వేదిక ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు సమైక్యాంధ్ర కోరుతూ కదం తొక్కారు. మరో రెండురోజులు ‘తూర్పు’బంద్ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా సోమవారం బంద్ పాటించారు. మంగళ, బుధవారాలు కూడా బంద్ పాటించాలని జేఏసీలు నిర్ణయించాయి. విద్యా సంస్థలు వరుసగా 12వ రోజు కూడా మూత పడ్డాయి. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. మంత్రి తోట నరసింహం సతీమణి వాణి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరింది. చేనేత కార్మికుల ప్రదర్శన పిఠాపురంలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. తుని, పాయకరావు పేటల్లో రిక్షాపుల్లర్స్ ర్యాలీలు నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన 23 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఉద్యోగులు రాజమండ్రిలో ర్యాలీ చేపట్టారు. వికలాంగుల నిరశన దీక్షలు రాజానగరం సెంటర్లో వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. అనపర్తిలో నాయీ బ్రాహ్మణులు సోనియా గాంధీ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలతో శవయాత్ర చేసి దేవీచౌక్‌లో దగ్ధం చేశారు. నెల్లూరు జిల్లాలో వర్షాన్ని సైతం లెక్కచేయక జనం రోడ్లమీదకు వచ్చారు. నెల్లూరు నగరంలోని జాతీయ రహదారిపై జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి హైవేను దిగ్బంధించడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచి పోయింది. కావలిలో ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి సమైక్య ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రకాశం జిల్లాలో సోమవారం వేకువజాము నుంచి జోరున వర్షం పడుతున్నా సమైక్య హోరు మాత్రం కొనసాగింది. పర్చూరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త గొట్టిపాటి నరసయ్య కుమారుడు భరత్ చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. కనిగిరిలో వైఎస్సార్ సీపీ నాయకుడు రాజాల ఆదిరెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష రెండో రోజుకు చేరింది. కదం తొక్కిన కార్మికులు కర్నూలు నగరంలో వైఎస్సార్సీపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేలాదిమంది ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆదోనిలో విద్యుత్‌శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి సమైక్య ఆందోళనలో పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. నంద్యాలలో రాయలసీమ ఇంజినీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టగా.. వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. గళార్చనతో నిరసన తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రాస్తారోకో చేపట్టారు. ఇందిరా మైదానంలో ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో గళార్చన నిర్వహించి ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తిరుపతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో సుమారు 300 మంది మహిళలు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌లో కార్మికులు బస్సులను తాడుతో కట్టి లాగి నిరసన తెలిపారు. చిత్తూరులో వైఎస్సార్సీపీ నేత ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో జానపద గేయాలతో ప్రజలను చైతన్య పరచారు. పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో సుమారు 4వేల మంది దళిత, గిరిజనులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ నేతృత్వంలో జోరువర్షాన్ని సైతం లెక్కచేయకుండా గుంటూరులో ఆందోళనలు చేపట్టారు. దుగ్గిరాలలో పసుపు రైతుల నిరసన నేపథ్యంలో యార్డులో వేలం ప్రక్రియను నిలిపివేశారు. 10వేల మందితో సమైక్య మార్చ్ పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం విజయనగరం జిల్లా చీపురుపల్లి కేంద్రంలో సమైక్య నినాదం హోరెత్తింది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు పదివేలమందికిపైగా చేయి చేయి కలిపి భారీ మార్చ్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యార్ధులు నిరసనప్రదర్శనలు చేపట్టారు. పాలకొండ-విశాఖపట్నం రహదారిలో గోపాలపురం వద్ద , యువజన సంఘాల ప్రతినిధులు నాటుబండ్లు, ట్రాక్టర్ ట్రాలీలు రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఎచ్చెర్లలోని బీఆర్‌ఏయూ విద్యార్థులు ఆంటోని కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. ‘అనంత’ 48 గంటల జిల్లా బంద్ విజయవంతం అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 48 గంటల జిల్లా బంద్ విజయవంతమైంది. వైఎస్సార్సీపీతో పాటు టీడీపీ కూడా బంద్‌కు పిలుపునివ్వడంతో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్రంగా కొనసాగింది. విశాఖ నగరంలోని శ్రీకనకమహాలక్ష్మి దేవస్థానం అధికారులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి జగదాంబ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. 14న విశాఖలో సింహగర్జన 14న ఏయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో సింహగర్జన ఉంటుందని, బీచ్‌రోడ్డులో ఈనెల 18న మిలీనియం మార్చ్ నిర్వహిస్తామని సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ప్రకటించారు. బద్వేలులో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు వైఎస్సార్ జిల్లా బద్వేలులో క్రైస్తవ సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించి నాలుగురోడ్ల కూడలిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని వేడుకున్నారు. కడపలో గెజిటెడ్ అధికారులు సైతం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేశారు. ఇరిగేషన్ ఉద్యోగులు వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టి తమ నిరసనను తెలియజేశారు. ఆర్టీపీపీలో ఉద్యోగులు విధులను బహిష్కరించారు. గడికోట, రవీంద్రనాథ్‌ల ఆమరణ నిరశన సాక్షి, కడప: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి సోమవారం నుంచి వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. వీరివురికి సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చిన జనంతో కలెక్టరేట్ పరిసరప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ జీవితాలను త్యాగం చేసైనా విభజనను అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ర్టవ్యాప్తంగా ప్రాంతాలకతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనాన్ని తట్టుకోలేకే విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. దమ్ముంటే కాంగ్రెస్ అధిష్టానం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలే గానీ ఇలా కుట్రలు చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూంటే జనం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాయలసీమ వాసి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఈ ప్రాంతం తరఫున ఏ వాదన వినిపించకపోవడం దారుణమన్నారు. తెలంగాణలో కూడా 50 శాతం మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని వారు పేర్కొన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ, రాజ్యాధికారం కోసం కాంగ్రెస్‌పార్టీ తెలుగుజాతిని రెండు ముక్కలుగా చేసేందుకు సిద్ధపడిందని మండిపడ్డారు. విభజన జరిగిన తర్వాత జూరాల ఎత్తుపెంచితే రాయలసీమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే సాగునీటి సమస్యలతో సీమ రైతాంగం అల్లాడిపోతోందని, విభజన జరిగితే ఎడారి కావడం త థ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమరణ నిరాహారదీక్షలో వైసీపీ నేతలు హఫీజుల్లా, పాండురంగారెడ్డి, సంపత్‌లు కూడా కూర్చున్నారు. మరో 12మంది రిలేనిరాహారదీక్షలో కూర్చున్నారు. పగిలిన గుండెలు సాక్షి నెట్వర్క్: సీమాంధ్రలో మృత్యుఘోష ఆగడం లేదు. విభజన వార్తలను తట్టుకోలేక సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో తొమ్మిది మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామానికి చెందిన బోనెల వైకుంఠరావు (23) పొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అతను రాష్ట్రాన్ని విడదీయవద్దని బిగ్గరగా కేకలు వేస్తూ నేలకొరిగిపోయాడు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయిందని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి పంచాయతీ పరిధిలోని కంది శ్రీరామపురంలో జామి వెంకటరావు విభజన వార్తలపై పదిరోజులుగా ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో న్యూస్‌పేపర్ చదువుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలొదిలాడు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక గెడ్డంవారిపేటకు చెందిన కూలీ బూల పల్లయ్య (40) పెద్దకొడుకు వెంకటేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాష్ట్రాన్ని విడదీస్తున్నారని మనస్తాపం చెందిన పల్లయ్య హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవలసిందేనని కేసీఆర్ అన్నరోజు నుంచీ మరింత ఆందోళనకు గురయ్యాడని, సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించాడు. అనంతపురం జిల్లా సోమందేపల్లికి చెందిన బాదయ్యపల్లి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం వరిఘేడు గ్రామానికి చెందిన దాసి మత్తయ్య (58) సోమవారం రాత్రి టీవీలో విభజన వార్తలు చూస్తూ కలతచెంది గుండెపోటుతో మరణించగా, దెందులూరుమండలం దోసపాడులో పెనుబోయిన సుబ్బమ్మ (70) విభజన నిర్ణయూన్ని తట్టుకోలేక.. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న తన మనుమడి భవిష్యత్‌పై బెంగపెట్టుకుని సోమవారం గుండె ఆగి మరణించింది.సమైక్యాంధ్ర ఉద్యమాలకు సంబంధించి టీవీల్లో వార్తలు చూస్తూ ఉద్వేగానికి లోనై సోమవారం వైఎస్ఆర్ జిల్లాలో ముగ్గురు గుండె పోటుతో మృతి చెందారు. జమ్మలమడుగు మండలం సిరిగేపల్లిలో బుకే రామదాసు నాయక్ (40) ఆదివారం రాత్రి టీవీ వార్తలు చూస్తూ గుండె నొప్పితో కుప్పకూలి మరణించారు. అట్లూరు క్రాస్‌రోడ్డులోని మద్దూరు కాలనీకి చెందిన నరసింహులు (35) ఎక్కడైనా సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నాలు జరుగుతుంటే వెళ్లేవాడు. సోమవారం రాత్రి టీవీ చూస్తూ గుండె పోటు రావడంతో ఆటోలో కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రైల్వేకోడూరులోని పారిశుద్ధ్య కాలనీలో సమైక్య ఉద్యమం వార్తలు చూస్తూ సోమవారం ఎన్.మంజుల (35) గుండెపోటుతో మృతిచెందినట్లు సమీప బంధువులు తెలిపారు. -
బాబును నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు: కడియం
హైదరాబాద్: టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని ఆయన చెప్పారు. తెలంగాణ టీడీపీ నాయకులు ఇప్పటికైనా చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకోవాలన్నారు. ఇటు తెలంగాణ ప్రజలు, అటు సీమాంధ్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన విషయంలో నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు విశ్వసనీయతలేని నాయకుడు అని కడియం శ్రీహరి విమర్శించారు. కాగా, తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని ప్రకటించిన నాటినుంచి సీమాంధ్ర ప్రాంతాలలో అందోళన వాతావారణం నెలకొంది. రాష్ట్ర విభజనపై నిరసనగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై నిర్ణయం వెలువబడిన నేపథ్యంలో దాదాపు 10రోజులుగా సమైక్యంధ్ర రగలిపోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణవాదులు చేసినా ఉద్యమాలతో కేంద్రం దిగివచ్చింది. దీంతో గత నెల జూలై 30న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. అంతేకాకుండా హైదరాబాద్ ను పది సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
నగరమే చిక్కుముడి: సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసుకు నేతల నివేదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో హైదరాబాదే పెద్దచిక్కుముడి అని, దానికి సరైన పరిష్కారం చూపితే ఇపుడున్న ఆందోళనలు చాలావరకు తగ్గుముఖం పడతాయని పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్రవ్యవహారాల సహాయ ఇన్చార్జి తిరునావుక్కరసుకు సూచించారు. విభజనతో సీమాంధ్రలో తలెత్తిన ఆందోళనలపై రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉండి పార్టీనేతల నుంచి అభిప్రాయాలు సేకరించిన తిరునావుక్కరసు బుధవారం ఢిల్లీకి వెళ్లారు. తన నివేదికను అధిష్టానానికి అందించనున్నారు. తిరునావుక్కరసును కలిసిన నేతల్లో ఎక్కువమంది ఒకవైపు సమైక్యాంధ్ర వాదాన్ని వివరిస్తూనే విభజన విషయంలో హైదరాబాద్ అంశంపై తలెత్తే అభ్యంతరాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇక్కడి ప్రజల్లో నెలకొన్న భయాలు పోగొట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తిచేశారు. యూటీ చేస్తే నగర ప్రజలకు నష్టం: జాఫ్రీ హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేయడంవల్ల ఏ ప్రాంత ప్రజలకూ ఫలితం ఉండదని, ఇలాంటి ప్రతిపాదన సరికాదని ఎంఐఎం నేతలు అభిప్రాయపడుతున్నారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, విప్ రుద్రరాజు పద్మరాజు, ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ ఒకరికొకరు ఎదురుపడి దీనిపై మాట్లాడుకున్నారు. హైదరాబాద్‌పై సీమాంధ్ర నేతలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు సరైనవి కావని జాఫ్రీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అక్కడ సమకూరే ఆదాయం మొత్తం కేంద్రానికే దక్కుతుందని, తద్వారా ఇరుప్రాంతాలూ నష్టపోతాయని చెప్పారు. యూటీగా మారిస్తే ప్రజల సమస్యలు తీర్చేవారు కానీ, వారి హక్కులు పరిరక్షించే వారు కానీ కనిపించరని చెప్పారు. సమైక్యంగా ఉన్న ప్రస్తుత తరుణంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్థానిక సీమాంధ్రులకు టికెట్లు ఇచ్చేందుకు పార్టీలు వెనుకాడుతున్నాయని పద్మరాజు పేర్కొన్నారు. విభజన జరిగితే సీమాంధ్రులు పోటీచేస్తామన్నా టికెట్లు ఇచ్చేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాదని, సీమాంధ్ర ప్రజలకు ఇక్కడి చట్టసభల్లో అవకాశం దొరుకుతుందనుకోవడం అత్యాశే అవుతుందని చెప్పారు. -
‘కమిటీ’ కహానీలు... కాంగ్రెస్ నుంచి పూటకో మాట
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగుతున్న ఆందోళనలు, పార్టీ నాయకుల ఒత్తిళ్లపై ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో కాంగ్రెస్ అధిష్టానం గందరగోళంలో పడినట్లు కనిపిస్తోంది. ఆ ప్రాంత నేతల అభిప్రాయాలను, ఫిర్యాదులను వినేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఒకసారి.. కమిటీని ఏర్పాటు చేశామని, పని మొదలు పెట్టిందని మరొకసారి.. రెండు మూడు రోజుల్లో కమిటీని ప్రకటిస్తామని ఇంకొకసారి.. తమను కలిసిన నాయకులకు రకరకాలుగా చెప్తుండటమే ఇందుకు నిదర్శనం. అదీగాక.. ఒక్కరే ఈ సమస్యలను పరిశీలిస్తారని తొలుత చెప్పిన కాంగ్రెస్ నాయకత్వం.. ఆ తర్వాత ఇద్దరు సభ్యులతో కమిటీ అని, అనంతరం ముగ్గురు సభ్యులని చెప్పగా.. ఇప్పుడు మొత్తం ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఉంటుందని పేర్కొనటం విశేషం. సీమాంధ్ర నేతల ఆందోళనలు, అభిప్రాయాలను వినే పనిని తొలుత సహజంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు అప్పగించారు. ఆ తర్వాత.. దిగ్విజయ్‌సింగ్, గులాంనబీఆజాద్లతో ఇద్దరు సభ్యుల కమిటీ ఉంటుందని హైకమాండ్ చెప్పింది. ఈ విషయం తొలుత కేంద్రమంత్రి పురందేశ్వరి, ఆ తర్వాత స్వయంగా దిగ్విజయ్ కూడా ప్రకటించారు. సోమవారం రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందని పార్టీ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ మీడియాకు తెలిపారు. రాష్ట్ర నేతలతో ఆంటోనీ మాట్లాడటం మొదలుపెట్టారని కూడా ఆయన ప్రకటించారు. కానీ.. అసలు ఇలాంటి కమిటీ ఏర్పాటు గురించి తనకు ఏమీ తెలియదని ఆంటోని మంగళవారం స్పష్టం చేయటం విశేషం. ఈ కమిటీ విషయంలో తనకు పార్టీ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని కూడా ఆయన పార్లమెంటు ప్రాంగణంలో తనను కలిసిన విలేకరులతో పేర్కొన్నారు. మరోవైపు.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర సహాయమంత్రి జె.డి.శీలం ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ప్రాంత నేతల అభిప్రాయాలను వినేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ ఉంటుందని చెప్పారు. ఆ కమిటీలో ఎ.కె.ఆంటోని, వీరప్పమొయిలీ, దిగ్విజయ్‌సింగ్‌లు ఉంటారని పేర్కొన్నారు. కానీ సాయంత్రానికల్లా అది ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అని.. అందులో ఆంటోనీ, మొయిలీ, దిగ్విజయ్‌లతో పాటు ఆజాద్, సుశీల్కుమార్షిండేలు కూడా ఉంటారన్న మాట బయటకు వచ్చింది. ఈ విషయం రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితో పాటు కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఐదుగురు నేతలతో కమిటీ ఉంటుందని సోనియాగాంధీ స్వయంగా తమకు చెప్పారని ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మీడియాతో పేర్కొన్నారు. పార్టీ ఏర్పాటు చేయబోయే కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు.. ఏ ఏ అంశాలను పరిశీలిస్తుంది అనే విషయాలను దిగ్విజయ్ త్వరలో ప్రకటిస్తారని.. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు సోనియాను కలిసిన తర్వాత మీడియాతో చెప్పటం మరో విశేషం. విభజనపై వాదప్రతివాదనలు వినేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న ఉన్నతస్థాయి కమిటీ ఐదుగురు సభ్యుల వద్ద ఆగుతుందా ఇంకా పెరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఈ పరిణామాలు తెలంగాణ ఏర్పాటు త్వరగా పూర్తికావాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆ ప్రాంత నేతలకు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో కేంద్ర హోంశాఖకు ఎలాంటి గందరగోళం లేదు. ‘మాకు వివరించిన ప్రకారం నోట్ ముసాయిదాను రూపొందిస్తున్నాం’ అని ఆ శాఖలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. -
విభజన వద్దు: సమస్త వృత్తుల చైతన్యనాదం.. పల్లెల్లోనూ పల్లవించిన నినాదం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోనివ్వమంటూ సీమాంధ్రలో రగిలిన ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. వరుసగా ఆరో రోజు సోమవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వేర్పాటు నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు, రాజకీయపార్టీల నేతలు, మేధావులు, వివిధవర్గాల ప్రజలే కాదు.. సామాన్యజనం కూడా రోడ్లపైకి వస్తున్నారు. పిల్లా, పెద్దా, ముసలి, ముతక బేధం లేకుండా వ్యక్తిగతంగా కుటుంబాలు సైతం నిరసనదీక్షలకు దిగుతున్నాయి. రాష్ట్రం సమైక్యంగా లేకుంటే తమకు భవితవ్యమే లేదనే ఆందోళనతో అన్ని కులాలు, వృత్తుల వారు స్వచ్ఛందంగా ఆందోళనలు చేపడుతున్నారు. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామీణప్రాంతాల నుంచి ఉద్యమం ఇప్పుడు మూరుమూల పల్లెలకు సైతం విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించని ఆ పార్టీ నేతల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులతీరుపై సమైక్యవాదులు, సామాన్యప్రజానీకమే కాదు స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద సమైక్యవాదులు చేపట్టిన రిలే దీక్షల శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన మంత్రి అహ్మదుల్లాకు చేదు అనుభవం ఎదురైంది. దీక్షా శిబిరం వద్దకు రావద్దని చెప్పడంతో మంత్రి, సమైక్యవాదుల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ దశలో సమైక్యవాదులు మంత్రిపై దాడికి యత్నించడంతోపాటు చెప్పులు విసిరారు. దీంతో ఆయన అతికష్టంపై పోలీసు రక్షణలో దీక్షా శిబిరం వద్దకు రాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. చిరంజీవి, కావూరి, బొత్స డబ్బుకు అమ్ముడుపోయి మాకంటే హీనంగా మారారని ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో హిజ్రాలు దుమ్మెత్తిపోశారు. మంత్రి పదవి కోసం కావూరి కక్కుర్తి పడి రాష్ట్రం ముక్కలవుతున్నా చేతకానివాడిలా ఉండిపోయారని ఆయన ఇంటిని ముట్టడించిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెదబొడ్డేపల్లిలో సోమవారం ఉదయం మంత్రి బాలరాజు కాన్వాయ్‌ను ఉపాధ్యాయులు అడ్డగించి మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. కోపోద్రిక్తుడైన మంత్రి వారిపై చెయ్యెత్తి దాడి చేసేంత పని చేశారు. పరిస్థితి వేడెక్కడంతో పోలీసులు ఆయనను బతిమాలి అక్కడ నుంచి పంపించేశారు. విశాఖలో తన వాహనాన్ని అడ్డగించిన నిరసనకారులపై గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పక్కనే ఉన్న సీఐ సత్యనారాయణతో ‘నీ గన్ ఇవ్వు..ఒక్కొక్కరినీ కాల్చేస్తా’నంటూ ఆవేశంతో ఊగిపోయూరు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన మంత్రి తోట నరసింహం సరైన సమయంలో తాను రాజీనామా చేస్తానన్నారు. టీడీపీ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో ఆ పార్టీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని న్యాయవాదులు అడ్డుకున్నారు. విజయనగరం పట్టణంలో చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. అన్నిచోట్లా మున్సిపల్ ఉద్యోగుల సమ్మె సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ పిలుపుమేరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ అధికారులు, సిబ్బంది 72గంటల సమ్మెలో భాగంగా సోమవారం విధులను బహిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీలో వైద్యసేవలను నిలుపుచేసి డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. క్వారీ ఏరియాలో గుడాల ప్రసాద్ అనే యువకుడు భార్య, ఇద్దరు పిల్లలతో పాటు 24 గంటల దీక్ష ప్రారంభించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన భారీ బహిరంగసభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హాజరై ఉద్యమానికి ఊతమిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో రైల్ రోకో నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్ ఆండ్ బీ ఈఈ లక్ష్మీనారాయణరెడ్డికి సన్మానం చేశారు. ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్లో యాచకులు నిరసన ప్రదర్శన, మానవహారం చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గుంటూరు నగర పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని మూయించారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ నేతృత్వంలో జరిగిన ధర్నాలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, సెంట్రల్ కన్వీనర్ పి. గౌతంరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందేనని పొలిటికల్ జేఏసీ తరపున మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు. విజయనగరం శివారు ప్రాంతంలో మజ్జిపేట కాలనీ వద్ద విజయనగరం నుంచి విశాఖ వెళ్తున్న దుర్గ్ పాసింజర్ రైలును ఆందోళనకారులు అరగంటపాటు అడ్డుకున్నారు. బొబ్బిలిలో రైల్‌రోకో నిర్వహించారు. హిందూపురం మెప్మా పీఓ విజయభాస్కర్ రాజీనామా అనంతపురం జిల్లా హిందూపురం మునిసిపాలిటీలో మెప్మా ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న విజయభాస్కర్ సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు అనంతపురం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ చెన్నకేశవరావు, డీఆర్వో హేమసాగర్ మద్దతు తెలిపారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో గుండా రవికుమార్ అనే వికలాంగుడు ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. తెలంగాణ ఉద్యోగుల ‘సమైక్యాంధ్ర’ నినాదాలు చిత్తూరు జిల్లా పీలేరులో తెలంగాణ ప్రాంత అధికారులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేయడంతో వారికి స్థానిక ఉద్యోగులు సన్మానం చేశారు. ఐదురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఆయన సతీమణి లావణ్య ప్రకటించారు. చిత్తూరులోని మత్య్సశాఖ కార్యాలయంలో రెండు ప్రభుత్వ వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో రెండున్నర గంటలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. విశాఖ జిల్లా ఏజెన్సీలో వైఎస్సార్ సీపీ సహా వర్తక, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో దుకాణాలు మూయించారు. మన్యంలోని టూరిస్టు ప్రదేశాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. మ్యూజియం, పద్మావతి గార్డెన్, బొర్రా గుహలు మూతపడ్డాయి. నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైల్‌రోకో చేశారు. కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు పాల్గొన్న నిరసన కార్యక్రమంలో గోపి అనే యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. విభజన వార్తలతో కలత ఒకరి ఆత్మహత్య, నలుగురు గుండెపోటుతో మృతి సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజన వార్తలను తట్టుకోలేక సోమవారం వేర్వేరు ప్రాంతాలలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు గుండెపోటుతో మరణించగా, ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన కొవ్వూరి రాంబాబు (50), కామవరపుకోట మండలం వీరంపాలెంకు చెందిన బొమ్మగంటి సత్యనారాయణ (63) విభజన వార్తలపై తీవ్ర కలత చెందారు. దీంతో వారు నిద్రలోనే గుండెపోటుతో మరణించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుమడాం గ్రామానికి చెందిన పొడమచ్చిలి బంగారి(51) టీవీలో విభజన వార్తలు చూస్తుండగా ఉద్వేగానికి గురై గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా.. కొద్దిసేపటికే మృతి చెందారు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గోనబావికి చెందిన వడ్డే కొల్లప్ప (60), అనంతపురం నగరానికి చెందిన శివశంకరరావు(42) గుండెపోటుతో మృతి చెందారు. కాగా, నిడదవోలు మండలం ఉనకరమిల్లిలో రవికుమార్ (35) మూడు రోజులుగా సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నాడు. రాష్ట్ర విభజన ఖాయమనే వార్తల నేపథ్యంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు కుటుంబానికి చెవిరెడ్డి సాయం సమైక్యాంధ్ర కోసం ఆత్మాహుతి చేసుకున్న చిత్తూరు జిల్లా పాకాల మండలం కూనపల్లెకు చెందిన ఆంజనేయులు(48) కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం ఆర్థిక సాయం అందజేశారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన ఆయన రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ఎవరూ బలిదానాలకు పాల్పడవద్దని కోరారు. -
అలహాబాద్ విద్యార్థుల ఆందోళన