దుబ్బాకలో పాకిస్థాన్ జెండాను దగ్ధం చేస్తున్న బీజేపీ నాయకులు
- జిల్లాలో వెల్లువెత్తిన నిరసనలు
దుబ్బాక: పాకిస్థాన్ దుశ్చర్యపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దుబ్బాక, మెదక్ తదితర ప్రాంతాల్లో బీజేపీ నాయకులు పాకిస్థాన్ జెండాలను తగలబెట్టారు. కౌడిపల్లిలో విద్యార్థులు సైనికుల మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.