pakistan flag
-
అంతరగంగపై పాకిస్తాన్ జెండా చిత్రం
కర్ణాటక: నగర సమీపంలోని అంతరగంగ పర్వతంపై ఉన్న బండరాళ్లపై కొందరు ఆకతాయిలు పాకిస్తాస్ ధ్వజం పోలిన రంగును పూయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పోలీసులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్నారు. అయితే ఘటన వివాదం కాకముందే మరుసటి రోజునే దీనికి తెల్లరంగును పూసి పూర్తిగా తుడిచి వేశారు. దీనిపై పోలీసులు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. -
‘నీకు పాకిస్తాన్ పౌరసత్వమే కరెక్ట్’
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ మరో సారి వార్తల్లోకెక్కారు. పాక్ జెండా పట్టుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాఖీ సావంత్. దాంతో నెటిజన్లు ఓ రేంజ్లో రాఖీని ట్రోల్ చేస్తున్నారు. ‘నీకు పాకిస్తాన్ పౌరసత్వమే కరెక్ట్, మీస్ రాఖీ పాకిస్తాన్ సావంత్’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాక ఇలాంటి పనులు చేస్తే నిన్ను ఫాలో అవ్వం అని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు రాఖీ సావంత్. ‘ధార 370’ చిత్రంలో తాను పాకిస్తాన్ అమ్మాయి పాత్ర పోషిస్తున్నాని.. దాని కోసమే పాక్ జెండాను పట్టుకున్నానని వివరణ ఇచ్చారు రాఖీ. అంతేకాక పాకిస్తాన్ ప్రజలంతా చెడ్డవారు కాదని.. ఎవరో కొందరు మాత్రమే జిహాద్ పేరుతో మానవబాంబులు ప్రయోగిస్తారని చెప్పుకొచ్చారు. అంతేకాక పాకిస్తాన్ అన్నా.. ఆ దేశ ప్రజలన్నా తనకు ఎంతో గౌరవమన్నారు రాఖీ. View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on May 8, 2019 at 9:43am PDT -
పాక్ జెండా.. బెస్ట్ టాయిలెట్ పేపరంట!
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యుత్తమ టాయిలెట్ పేపర్ పాకిస్తాన్ జాతీయ జెండానేనట. అవును గూగులమ్మ ఇదే చెబుతోంది. ‘‘Best toilet paper in the world’ అని టైప్ చేస్తే.. పాకిస్తాన్ జాతీయ పతాకమే కనిపిస్తోంది. ఇంకేముంది.. పుల్వామా ఉగ్రదాడితో ఉడికిపోతున్న మనోళ్లకు మంచి అవకాశం దొరికింది. వెంటనే వాటి స్క్రీన్ షాట్లు తీసి పక్కదేశంపై కుళ్లు జోకులు పేల్చారు. అంతేకాకుండా వాటిని మీరు చూడండని నెట్టింట పెట్టారు. ‘Best toilet paper in the world’ అని టైప్ చేసి.. ఇమేజ్ ఆప్షన్ నొక్కితే పాకిస్తాన్ జాతీయ జెండా వస్తుందని, చూసి ఎంజాయ్ చేయండి అంటూ సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఈ విషయం తెలసుకున్న గూగులమ్మ నిర్వాహకులు తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. కానీ నెటిజన్స్ సేవ్ చేసిన స్క్రీన్ షాట్లు మాత్రం ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. #Besttoiletpaperintheworld trending this is. But, pakistan deserves worst than this!They deserve to be rolled in red Hot chillies, And then Fried In hot Burning, Boiling oil! They deserve to be cut down From their hands, legs and tongue and then thrown on d streets for survival. pic.twitter.com/euWnVUYkAY — Gauri Joshi (@GauriJo43735050) February 17, 2019 #besttoiletpaperintheworld #on #google #PulwamaTerrorAttack #weallarereadytoattack #IndiaUnited #BLACK DAY FOR INDIA 🇮🇳#phulwamaattack #PulwamaRevenge #India #RIPBraveRealHero #WantRevengeOnBloodyPakistan pic.twitter.com/vYIY08wBCg — kundan singh rajput (@IamkundanRajput) February 16, 2019 -
పాక్ జెండా కలకలం
తిరువొత్తియూరు(తమిళనాడు): తమిళనాడు పుళల్ సెంట్రల్ జైలు వద్ద పాకిస్తాన్ జెండా, సెల్‌ఫోన్‌ను సిబ్బంది కనుగొన్నారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం సిబ్బంది గస్తీ చేస్తుండగా.. జైలు సమీపంలో నలుపు స్టిక్కర్లు అతికించిన అట్టపెట్టె పడి ఉంది. ఆ పెట్టెను తెరచి చూడగా 24 మీటర్ల వెడల్పు కలిగిన పాకిస్తాన్ జెండా, సెల్‌ఫోన్ ఉంది. సమాచారం అందుకున్న జైలర్ జయరామన్ ఈ విషయాన్ని తనపై అధికారి శైలేంద్రబాబుకు తెలియజేశారు. దీంతో పుళల్ పోలీసులకు జైలర్ ఫిర్యాదు చేశారు. పాక్ జెండా, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పుళల్ ఇన్స్పెక్టర్ విచారణ చేపట్టారు. జైలు లోపల అలజడి సృష్టించడానికే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, తమిళనాడు క్యూ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బంది పుళల్ జైలుకు చేరుకుని విచారణ చేపట్టారు. -
పాకిస్తాన్ జెండా దగ్ధం
జిల్లాలో వెల్లువెత్తిన నిరసనలు దుబ్బాక: పాకిస్థాన్ దుశ్చర్యపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దుబ్బాక, మెదక్ తదితర ప్రాంతాల్లో బీజేపీ నాయకులు పాకిస్థాన్ జెండాలను తగలబెట్టారు. కౌడిపల్లిలో విద్యార్థులు సైనికుల మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
రిగ్గింగ్‌కు పాల్పడ్డారని పాక్ జెండా తగులబెట్టారు
నీలం వ్యాలీ: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) నీలమ్ వ్యాలీలో ఆందోళనకారులు చెలరేగిపోయారు. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ పాకిస్తాన్ జెండాను తగులబెట్టి నిరసన తెలిపారు. జులై 21న జరిగిన ఎన్నికల్లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్) అనూహ్య విజయం సాధించింది. ఇక్కడ 41 సీట్లకు గాను పీఎంఎల్-ఎన్ 31 సీట్లు గెలుచుకుంది. ముస్లిం కాన్ఫరెన్స్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు కేవలం మూడేసి సీట్ల చొప్పున గెలుచుకున్నాయి. దీంతో ఎన్నికల్లో అక్రమాలకు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ప్రజలు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులపై పోలీసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముజఫరాబాద్, కొట్లీ, చినారి, మిర్పుర్ ప్రాంతాల్లో అల్లర్లు వ్యాపించాయి. Angry over rigged PoK elections, locals burnt Pakistani flag in Neelum Valley (PoK) and faced police action. pic.twitter.com/TYqVZgnzQD— ANI (@ANI_news) 29 July 2016 -
తిరుమల జపాలి తీర్థంలో పాకిస్థాన్ జెండా?
తిరుమల: పాపనాశనం వెళ్లే మార్గంలో ఉన్న జపాలి తీర్థంలో గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్ జెండాను వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. నెలవంక, నక్షత్రం గుర్తుతో తెలుపు రంగులో ఉన్న జెండాను సోమవారం ఉదయం జపాలి తీర్థం వద్ద భక్తులు గమనించారు. ఆ విషయాన్ని భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు జపాలి తీర్థం వద్దకు వెళ్లి ఆ జెండాను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉరుసు ఉత్సవాల్లో దర్గాలవద్ద కట్టే జెండానా?.. లేక పాకిస్థాన్ జెండానా?.. అని విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. -
మనదేశంలో పాక్ జెండాను ప్రదర్శిస్తారా?
శ్రీనగర్: ఉగ్రవాదాన్ని నియంత్రించే విషయంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ వ్యూహం సరిగాలేదని ప్రధాన పార్టీల నేతలు మండిపడ్డారు. గవర్నర్ తక్షణమే జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీషా జిలానీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మరో వేర్పాటువాది మసరత్ అలమ్ పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడమే కాకుండా భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. దీంతో మసరత్ వైఖరిపై ప్రధాన పార్టీల నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా జమ్మూ కశ్మీర్ సీఎం ముఫ్తీ వేర్పాటువాదులపై స్పందించాల్సిందిగా ప్రధాన పార్టీల నేతలు డిమాండ్ చేశారు. పాకిస్థాన్ జెండాను మనదేశంలో ప్రదర్శించడం పట్ల బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కశ్మీర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారి డిమాండ్ చేశారు.