వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ మరో సారి వార్తల్లోకెక్కారు. పాక్ జెండా పట్టుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాఖీ సావంత్. దాంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో రాఖీని ట్రోల్ చేస్తున్నారు. ‘నీకు పాకిస్తాన్ పౌరసత్వమే కరెక్ట్, మీస్ రాఖీ పాకిస్తాన్ సావంత్’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాక ఇలాంటి పనులు చేస్తే నిన్ను ఫాలో అవ్వం అని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు రాఖీ సావంత్.
‘ధార 370’ చిత్రంలో తాను పాకిస్తాన్ అమ్మాయి పాత్ర పోషిస్తున్నాని.. దాని కోసమే పాక్ జెండాను పట్టుకున్నానని వివరణ ఇచ్చారు రాఖీ. అంతేకాక పాకిస్తాన్ ప్రజలంతా చెడ్డవారు కాదని.. ఎవరో కొందరు మాత్రమే జిహాద్ పేరుతో మానవబాంబులు ప్రయోగిస్తారని చెప్పుకొచ్చారు. అంతేకాక పాకిస్తాన్ అన్నా.. ఆ దేశ ప్రజలన్నా తనకు ఎంతో గౌరవమన్నారు రాఖీ.
Comments
Please login to add a commentAdd a comment