
సెలబ్రిటీలకు పొగడ్తలే కాదు విమర్శలు కూడా వస్తుంటాయి. హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా ఎన్నోసార్లు ట్రోలింగ్ బారిన పడింది. అయితే డబ్బులిచ్చి మరీ తనను తిట్టించడం షాక్‌కు గురి చేసిందంటోందీ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. పీఆర్(Public Relations) స్ట్రాటజీలతో నాపై ట్రోలింగ్ చేయించారు. అది నన్నెంతగానో షాక్‌కు గురి చేసింది.
డబ్బు ఖర్చు చేసి మరీ తిట్టించారు
మీమ్ పేజెస్ వరుసగా నన్ను తిడుతూ పోస్టులు పెడుతున్నాయి. అరె, ఇదేంటి? నా గురించి కంటిన్యూగా తిడుతూనే ఉన్నారేంటి.. అనుకున్నాను. కావాలనే టార్గెట్ చేశారని తర్వాత తెలిసింది. నన్ను కిందకు లాగడానికి కొందరు ఈ రకంగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తెలుసుకున్నాను. అప్పుడు నేను, నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డాం. ఇంత దిగజారతారా? అని షాకయ్యాను. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ట్రోలింగ్ (Trolling) చేయించారు.
లక్షలు ఖర్చు చేశారు
నన్ను కిందకు లాగాలని చూస్తున్నారంటే వారికంటే ఒక మెట్టు పైనున్నట్లే కదా! నా పేరెంట్స్‌కు ఆందోళన పడొద్దని ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాను. మరోవైపు ట్రోలింగ్ తారాస్థాయికి చేరింది.. నన్ను ట్రోల్ చేయడానికి లక్షలు ఖర్చు పెట్టారు. అసలు వారి బాధేంటో కనుక్కోమని నా టీమ్‌కు చెప్పాను. వాళ్లు మీమ్ పేజెస్‌ను సంప్రదించగా.. నన్ను తిట్టేందుకు ఫలానా మొత్తం ఇస్తున్నారని చెప్పారు.

చెప్పినంత డబ్బిస్తే ట్రోలింగ్ ఆపేస్తారట!
ట్రోలింగ్‌ను ఆపేయాలన్నా.. అవతలివారిని తిట్టాలన్నా మీరు కూడా ఇంత మొత్తం ఇస్తే సరిపోతుందని ఆఫర్ ఇచ్చారు. నాకది మరీ వింతగా అనిపించింది. ఇలాంటి పీఆర్ స్టంట్లు నాకు నచ్చవు. కొన్నిసార్లు భయంకరమైన కామెంట్లు పెడుతుంటారు. చెడుగా కామెంట్ చేసిన వ్యక్తి ప్రొఫైల్‌లోకి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. కనీసం ఒక ఫోటో, పోస్ట్‌లాంటివేవీ ఉండదు. కేవలం ఎవరో ఆశ చూపించిన డబ్బుకోసం కక్కుర్తి పడి ఇలా తిడుతున్నారని ఇట్టే అర్థమైపోతుంది అని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్‌కు దూరమైన బుట్టబొమ్మ
ఒకప్పుడు టాలీవుడ్(Tollywood)లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే.. తెలుగు వెండితెరపై కనిపించి చాలాకాలమే అవుతోంది. 2022లో రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో మెరిసింది. ఎఫ్ 3లో లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా పాటలో తళుక్కుమని మెరిసింది. మళ్లీ ఇంతవరకు తెలుగులో కనిపించనేలేదు. ప్రస్తుతం హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. సూర్యతో రెట్రో, రాఘవ లారెన్స్‌తో కాంచన 4, విజయ్‌తో జన నాయగన్‌లో నటిస్తోంది. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ చేస్తోంది.
చదవండి: నీదీ నాది ఒకే కథ.. బంధువులే అసభ్యంగా.. ఏడ్చేసిన వరలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment