
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా పూజా హెగ్డేకు ప్రత్యేక స్థానం ఉంది. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్‌లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే. తాజాగా రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చేసింది. ఈ మేరకు పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.
రజనీకాంత్(Rajinikanth ) ‘కూలీ’(Coolie Movie) సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. ‘జైలర్’లోని ‘కావాలయ్యా’ పాట తరహాలో ఈ ఐటమ్ సాంగ్ ఉండబోతుందని ప్రచారం ఉంది. స్పెషల్ పాటల్లో నటించడం పూజా హెగ్డేకి కొత్తేమి కాదు.హీరోయిన్ గా నటించిన చిత్రాలకంటే.. స్పెషల్ డ్యాన్స్ తో ఇరగదీసిన చిత్రాలతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 'రంగస్థలం' చిత్రంలో పూజా హెగ్దే 'జిగేలు రాణి' స్పెషల్ సాంగ్ అప్పట్లో యూత్‌ని ఉర్రూతలూగించింది. ఆ పాటకి పూజా వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఎఫ్ 3లోనూ పూజా ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసింది. అది కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ రజనీకాంత్‌తో కలిసి ‘స్పెషల్’ స్టెప్పులేసేందుకు పూజా రెడీ అయిపోయింది. రజనీకాంత్‌తో పాటు నాగార్జున కూడా ఈ పాటలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తుంది. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్‌లో ఆమె కనిపించనుంది. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment