లగ్జరీ రిసార్ట్‌లో పూజాహెగ్డే .. ఒక్కరోజు ఖర్చు ఎంతో తెలుసా..? | Pooja Hegde Spend Money Celebrates Her Birthday | Sakshi
Sakshi News home page

లగ్జరీ రిసార్ట్‌లో పూజాహెగ్డే .. ఒక్కరోజు ఖర్చు ఎంతో తెలుసా..?

Oct 21 2024 11:21 AM | Updated on Oct 21 2024 11:49 AM

Pooja Hegde Spend Money Celebrates Her Birthday

నటి పూజాహెగ్డే కెరీర్‌ మొదలై దశకం దాటింది. ఆరంభంలో ఆశాజనకంగా లేకపోయినా ఆ తరువాత తెలుగులో స్టార్‌ హీరోలతో జత కట్టి సూపర్‌ హిట్‌ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగారు. అయితే ఆ తరువాత ఈమె నటించిన తెలుగు, తమిళం, హిందీ చిత్రాలు వరుసగా అపజయం పాలవ్వడంతో మార్కెట్‌ పడిపోయింది. దీంతో పూజాహెగ్డే పనైపోయిందనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఆమె కెరీర్‌ రైజ్‌ అయ్యిందనే చెప్పాలి. 

కోలీవుడ్‌లో ఏకంగా రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు తలుపు తట్టాయి. అదీ స్టార్‌ హీరోల సరసన. అందులో ఒకటి సూర్యకు జంటగా నటించే చిత్రం కాగా, మరొకటి విజయ్‌తో జత కట్టే అవకాశం. వీటిలో సూర్యకు జంటగా నటించిన చిత్రాన్ని పూర్తి చేసిన పూజాహెగ్డే ప్రస్తుతం విజయ్‌తో జత కడుతున్న చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులోనూ మంచి అవకాశం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితులో పూజా హెగ్డేకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

ఈ క్రేజీ బ్యూటీ ఇటీవల తన 34వ పుట్టిన రోజు వేడుకను శ్రీలంకలో జరుపుకున్నారు. అక్కడ తనకు ఇష్టమైన  వైల్డ్‌ కాస్ట్‌ టెన్టెడ్‌ లాడ్జ్‌ అనే  రిసార్ట్‌లో ఒక రాత్రి బస చేసి ఎంజాయ్‌ చేశారు. విశేషమేమిటంటే ఈ రిసార్ట్‌ పూర్తిగా వెదురుతో రూపొందించడం, ప్రశాంతమైన, ఆహ్లదకరమైన పరివాహక ప్రాంతంలో స్పా సౌకర్యాలతో కూడిన వైద్య చికిత్స వంటి పలు ప్రత్యేక సదుపాయాలు చోటు చేసుకున్నాయట. అయితే అది చాలా ఖరీదుతో కూడిన ప్రదేశం అట. అక్కడ ఒక్క రాత్రి బస చేస్తే రూ. 1 లక్ష నుంచి రూ.1.5 లక్షలు రుసుము చెల్లించాల్సి ఉంటుందట. అలా నటి పూజాహెగ్డే ఒక్క రాత్రికి అక్కడ బస చేసినందుకు సుమారు లక్షా యాభై  వేలు చెల్లించి అక్కడి ప్రకృతి అందాలను, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించారట. 

ఆమె ఆ రిసార్ట్‌లో తిరుగుతున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెతలా, పూజాహెగ్డే వంటి స్టార్‌ హీరోయిన్‌ అనుకుంటే ఆ డబ్బు ఏమంత ఎక్కువ కాదు అంటున్నారు నెటిజన్లు. ఇకపోతే ఈ అమ్మడు ఇటీవల ఒక క్రికెట్‌ క్రీడాకారుడితో చెట్టాపట్లాలేసుకుని తిరుగుతున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement