Pooja Hegde On Big Back To Back Flops - Sakshi
Sakshi News home page

Pooja Hegde : పూజా హెగ్డేకు బ్యాడ్‌ టైం.. స్టార్‌ హీరోలతో నటించినా వరుస ఫ్లాపులు

Published Tue, May 2 2023 7:26 AM | Last Updated on Tue, May 2 2023 8:55 AM

Pooja Hegde On Big Back To Back Flops - Sakshi

నటి పూజా హెగ్డేకు ఇప్పుడు టైం బాగా లేనట్టుంది. వరుస ప్లాపులతో సతమతం అవుతోంది. ఈ బ్యూటీ స్టార్‌ హీరోలతోనే నటిస్తోంది. అయినప్పటికీ విజయాలు మాత్రం దక్కడం లేదు. ఆ మధ్య తెలుగులో మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి విజయాలను తన ఖాతాలో వేసుకున్న పూజ హెగ్డే చివరిగా తెలుగు చిత్రం అల వైకుంఠపురం చిత్రంతో సక్సెస్‌ చూసింది. ఆ తర్వాత ఎన్నో ఆశలతో తమిళంలో విజయ్‌ సరసన నటించిన బీస్ట్‌ చిత్రం ప్లాప్‌ కావడం ఈమెను చాలా నిరాశపరిచింది.

చదవండి: రజనీకాంత్‌ సినిమాకు ఆ కండీషన్‌ పెట్టిన డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ 

అంతేకాదు ఇక్కడ పదేళ్ల క్రితం నటించిన ముగమూడి చిత్రం కూడా ప్లాప్‌ కావడంతో కోలీవుడ్లో సక్సెస్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంది. తెలుగులోనూ ప్రభాస్‌కు జంటగా నటించిన రాధే శ్యాం, రామ్‌ చరణ్‌తో నటించిన ఆచార్య వంటి చిత్రాలు నిరాశపరిచాయి. ఇక బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌తో జతకట్టిన కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ చిత్రం పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది.

ఇది తమిళంలో అజిత్‌ కథానాయకుడుగా నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం వీరానికి రీమేక్‌. అయితే హిందీలో మాత్రం కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ చిత్రం చతికిలబడింది. మరో విషయం ఏమిటంటే ఇదే చిత్రాన్ని తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా కాటమరాయుడు పేరుతో రీమేక్‌ చేశారు. అదీ అక్కడ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక తెలుగులో మహేష్‌ బాబు సరసన నటిస్తున్న తాజా చిత్రంపైనే ఈ అమ్మని కెరీర్‌ ముడిపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: నా ఫేవరేట్ ఐపీఎల్ టీం అదే.. మనసులో మాట చెప్పేసిన శ్రీవల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement