flops
-
పూజాహెగ్డేకు బ్యాడ్‌టైం.. ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న బ్యూటీ
నటి పూజా హెగ్డేకు ఇప్పుడు టైం బాగా లేనట్టుంది. వరుస ప్లాపులతో సతమతం అవుతోంది. ఈ బ్యూటీ స్టార్ హీరోలతోనే నటిస్తోంది. అయినప్పటికీ విజయాలు మాత్రం దక్కడం లేదు. ఆ మధ్య తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి విజయాలను తన ఖాతాలో వేసుకున్న పూజ హెగ్డే చివరిగా తెలుగు చిత్రం అల వైకుంఠపురం చిత్రంతో సక్సెస్ చూసింది. ఆ తర్వాత ఎన్నో ఆశలతో తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ చిత్రం ప్లాప్ కావడం ఈమెను చాలా నిరాశపరిచింది. చదవండి: రజనీకాంత్ సినిమాకు ఆ కండీషన్ పెట్టిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ అంతేకాదు ఇక్కడ పదేళ్ల క్రితం నటించిన ముగమూడి చిత్రం కూడా ప్లాప్ కావడంతో కోలీవుడ్‌లో సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. తెలుగులోనూ ప్రభాస్‌కు జంటగా నటించిన రాధే శ్యాం, రామ్ చరణ్‌తో నటించిన ఆచార్య వంటి చిత్రాలు నిరాశపరిచాయి. ఇక బాలీవుడ్లో సల్మాన్ ఖాన్‌తో జతకట్టిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రం పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇది తమిళంలో అజిత్ కథానాయకుడుగా నటించిన సూపర్ హిట్ చిత్రం వీరానికి రీమేక్. అయితే హిందీలో మాత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రం చతికిలబడింది. మరో విషయం ఏమిటంటే ఇదే చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశారు. అదీ అక్కడ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన నటిస్తున్న తాజా చిత్రంపైనే ఈ అమ్మని కెరీర్ ముడిపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.చదవండి: నా ఫేవరేట్ ఐపీఎల్ టీం అదే.. మనసులో మాట చెప్పేసిన శ్రీవల్లి -
వాళ్లను నిందించొద్దు.. వందశాతం తప్పు నాదే: అక్షయ్ కుమార్
ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ సునాయసంగా వందల కోట్లు సంపాదిస్తున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఒకప్పుడు వరుస హిట్లు కొట్టిన ఈ ఖిలాడి హీరో.. ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాడు. గతేడాది ఈ హీరో నటించిన అత్రంగిరే ,కట్‌పత్లీ, బచ్చన్ పాండే,సామ్రాట్ పృథ్వీరాజ్,రక్ష బందన్,రామ్ సేతు చిత్రాలలో ఒకటి కూడా హిట్ టాక్‌కి సంపాదించుకోలేదు. కనీస వసూళ్లు కూడా రాకపోవడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. ఇక తాజాగా విడుదలైన ‘సెల్ఫీ’చిత్రం కూడా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన సినిమా పరాజయాలపై అక్షయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘సెల్ఫీ’సినిమా ప్రమోషన్స్ భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఫ్లాప్‌లపై అక్షయ్ మాట్లాడాడు. ‘సినిమాల విషయంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాను. ఒకనొక సమయంలో నేను నటించిన 16 సినిమాలు నిరాశపరిచాయి. మరోసారి 8 సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. సినిమా హిట్ అవ్వడం లేదంటే అది కచ్చితంగా నా తప్పే. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. వాళ్లు కొత్తదనం ఆశిస్తున్నారు. ప్రస్తుతం నేను దాని కోసమే ప్రయత్నిస్తున్నాను. సినిమా హిట్ అవ్వకపోతే ప్రేక్షకులను నిందించవద్దు. అది వంద శాతం నా తప్పే’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. -
ఈ హీరోయిన్స్ కు అన్ని ప్లాపులే పాపం..
-
అందర్నీ ఇంప్రెస్ చేయలేం
‘దబంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ‘రౌడీ రాథోడ్, సన్నాఫ్ సర్దార్, దబంగ్ 2’ అంటూ వరుస విజయాలతో గోల్డెన్ రన్ చూశారు బొద్దుగుమ్మ సోనాక్షి. ఇటీవల ఆమెకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘యాక్షన్ జాక్సన్‘ తర్వాత వరుస బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ చూస్తున్నారామె. మధ్యలో ‘లుటేరా, అకీరా, నూర్’ వంటి సినిమాల్లో మంచి పెర్ఫార్మెన్స్ చేసినా సినిమాలు హిట్స్ కాలేకపోయాయి. ఈ వరుస వైఫల్యాల గురించి సోనాక్షి మాట్లాడుతూ – ‘‘ఈ మధ్య నా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా ఆడట్లేదు కానీ యాక్టర్‌గా నేను చేస్తున్న రోల్స్ నాకు చాలా సంతృప్తి ఇచ్చాయి. ‘అకీరా, నూర్, లుటేరా’ వంటి సినిమాల్లో భాగమైనందుకు నేనెంతో గర్వపడుతున్నాను. కమర్షియల్ సినిమాలతో సక్సెస్ సాధించినప్పుడు అందులో నేను చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంటే కమర్షియల్ సినిమాలు ఎందుకు చేయట్లేదు? అంటున్నారు. ఈ రెండు రకాల మాటలు విన్న తర్వాత నాకు అర్థం అయ్యిందేంటంటే.. మన వర్క్‌తో అందర్నీ ఇంప్రెస్ చేయలేమని, అందర్నీ సంతృప్తి పరచలేమని, విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే ఉంటారు. అందుకే నాకు నచ్చింది, నన్ను చాలెంజ్ చేసే పాత్రలే చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. హ్యాపీగా, బ్యాలెన్డ్స్‌గా ఉన్నప్పుడే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. అందుకే నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటా’’ అని పేర్కొన్నారు సోనాక్షి. -
అపజయాలకు నేనే కారణమనుకుంటా!
అనుష్క... అందానికి చిరునామా ఈ నటి. అంతే కాదు మొదట్లో అందాలతో ఆ తరువాత అభినయంతోనూ సినీ లవర్స్‌ను ఆనందపరస్తున్న నాయకి అనుష్క. ఈమె నటించారంటే జయాపజయాలకు అతీతంగా ఆ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుందనే స్థాయికి ఎదిగిన నటి అనుష్క.లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలంటే అనుష్కనే అన్నంతగా పేరు తెచ్చుకున్న ఈ యోగా బ్యూటీ తన మానసిక సమస్యల నుంచి బయటపడేసేది కూడా ఆ యోగానే నంటున్నారు. నటిగా దశాబ్దకాలాన్ని పూర్తి చేసుకున్న ఈ స్వీటీ ఇప్పటి వరకూ తమిళం,తెలుగు భాషల్లో 40 చిత్రాల్లో నటించారు. ఈ అందాల రాశి నట జీవితంలో జయాపజయాలున్నా అందులో అధిక శాతం విజయాలే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చును. నేటికీ ప్రముఖ హీరోయిన్గా వెలుగొందుతున్న ఈ బెంగళూర్ బ్యూటీ ప్రస్తుతం బాహుబలి-2, సింగం చిత్రానికి సీక్వెల్ ఎస్-3 చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో బాగమతి అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో నటించడానికి సిద్ధమవుతున్నారు. అజిత్ తాజా చిత్రంలోనూ అనుష్కనే నాయకి అనే ప్రచారం జరుగుతోంది. అదే విధంగా చిరంజీవి 150వ చిత్ర హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మనే అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. దశకం దాటినా వన్నె తగ్గని అందాలతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటూపోతున్న అనుష్క అంతరంగం ఏమిటో చూద్దాం. ప్రతి నటీ నటుడు తమ చిత్రాలు విజయం సాధిస్తాయన్న నమ్మకంలోనే కథా పాత్రలను ఎంపిక చేసుకుంటారు. అయితే కొన్ని చిత్రాలు తాము ఆశించినట్లు ఆడవు. అయితే ఒక చిత్ర విజయం సాధించడానికి,నటీనటులు విజయాలతో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వెనుక చాలా మంది కారణం అవుతారు. వారి శ్రమ, సాయం చాలా ఉంటుంది. ఇటీవల నేనే నటించిన బాహుబలి చిత్రం ఘన విజయం సాధించింది. ఆ విజయాన్ని ఏ ఒక్కరో సొంతంగా భావించరాదు. అది అందులో పని చేసిన వారందరికి చెందుతుంది. అదే విధంగా అపజయాలకు అందరూ బాధ్యత వహించాలి. ఇక నా వరకూ నా చిత్రాల అపజయాలకు పూర్తిగా నేనే కారణంగా భావిస్తాను. మంచి కథలను, దర్శకులను ఎంచుకోవడంలో నేనే పొరపాటు పడి ఉంటాను. అందుకే అపజయాలకు నేనే కారణం అని భావిస్తాను. అయితే అవి నన్ను పెద్దగా బాధించవు. కారణం అలాంటి వాటివల్ల కలిగే మాన సిక చింతల నుంచి యోగా నన్ను బయట పడేస్తుంది. నిత్యం యోగాభ్యాసం చేస్తే ఎలాంటి మనోవేదనల నుంచి అయినా బయట పడవచ్చు. -
అపజయాలే ముందుకు నడిపాయి
ముంబై: దశాబ్దాల తన కెరీర్లో చెస్ మేధావి విశ్వనాథన్ ఆనంద్ ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూశాడు. అయితే ఎలాంటి ఫలితాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకు సాగడమే తనకు తెలుసని చెబుతున్నాడు. సాధించిన విజయాలను మర్చిపోయి మరో కొత్త లక్ష్యం కోసం ఎదురుచూడాలని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 45 ఏళ్ల ఆనంద్ అన్నాడు. ‘అత్యున్నత స్థాయికి ఎదగాలంటే తొలి నిబంధన స్వయం తృప్తి పొందకపోవడం. ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన, వినయం ఎవరికైనా ఉండాలి. నేను మూడుసార్లు ప్రయత్నించాకే ప్రపంచ చాంపియన్ కాగలిగాను. అపజయాలు నాలో ప్రేరణను కలిగించాయి. ఆ తర్వాత ప్రయత్నాలన్నీ అనుకూలంగా వచ్చాయి. తొలిసారిగా విశ్వ చాంపియన్ అయ్యాక కాస్త సంతృప్తి చెందాను. ఇది ఆ తర్వాత పోటీలపై ప్రభావం పడింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడితేనే బావుంటుంది. నిజానికి ఎవరు ఏ విషయంలోనూ మాస్టర్ కాలేరు’ అని ఆనంద్ అన్నాడు.