సోనాక్షీ సిన్మా
‘దబంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ‘రౌడీ రాథోడ్, సన్నాఫ్ సర్దార్, దబంగ్ 2’ అంటూ వరుస విజయాలతో గోల్డెన్ రన్ చూశారు బొద్దుగుమ్మ సోనాక్షి. ఇటీవల ఆమెకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘యాక్షన్ జాక్సన్‘ తర్వాత వరుస బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ చూస్తున్నారామె. మధ్యలో ‘లుటేరా, అకీరా, నూర్’ వంటి సినిమాల్లో మంచి పెర్ఫార్మెన్స్ చేసినా సినిమాలు హిట్స్ కాలేకపోయాయి. ఈ వరుస వైఫల్యాల గురించి సోనాక్షి మాట్లాడుతూ – ‘‘ఈ మధ్య నా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా ఆడట్లేదు కానీ యాక్టర్‌గా నేను చేస్తున్న రోల్స్ నాకు చాలా సంతృప్తి ఇచ్చాయి.
‘అకీరా, నూర్, లుటేరా’ వంటి సినిమాల్లో భాగమైనందుకు నేనెంతో గర్వపడుతున్నాను. కమర్షియల్ సినిమాలతో సక్సెస్ సాధించినప్పుడు అందులో నేను చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంటే కమర్షియల్ సినిమాలు ఎందుకు చేయట్లేదు? అంటున్నారు. ఈ రెండు రకాల మాటలు విన్న తర్వాత నాకు అర్థం అయ్యిందేంటంటే.. మన వర్క్‌తో అందర్నీ ఇంప్రెస్ చేయలేమని, అందర్నీ సంతృప్తి పరచలేమని, విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే ఉంటారు. అందుకే నాకు నచ్చింది, నన్ను చాలెంజ్ చేసే పాత్రలే చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. హ్యాపీగా, బ్యాలెన్డ్స్‌గా ఉన్నప్పుడే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. అందుకే నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటా’’ అని పేర్కొన్నారు సోనాక్షి.
Comments
Please login to add a commentAdd a comment