నా మార్కెట్‌ పడిపోయిందని చాలామంది అన్నారు: పూజా | Pooja Hegde Again Will Get Movie Chances In Telugu And Tamil | Sakshi
Sakshi News home page

ఇక్కడ నా మార్కెట్‌ పడిపోయిందని చాలామంది అన్నారు: పూజా

Published Sat, Nov 9 2024 5:32 PM | Last Updated on Sat, Nov 9 2024 5:39 PM

Pooja Hegde Again Will Get Movie Chances In Telugu And Tamil

జీవితంలో ఎవరికైనా జయాపజయాలు సహజం. విజయాలతో విర్రవీగిన మహామహులు కూడా అపజయాలను చవి చూశారు. ఇందుకు సినీ తారలు అతీతం కాదు.  నటి పూజాహెగ్డే విషయానికి వస్తే ఈ ఉత్తరాది భామ గత 12 ఏళ్ల క్రితం టాలీవుడ్‌,కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే, తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో నటించారు. తమిళ చిత్రాల నుంచి ఎప్పుడో ఎగ్జిట్‌ అయిపోయారు. ఇప్పుడు రీఎంట్రీలో కూడా తెలుగుతో పాటు తమిళ్‌లో మళ్లీ అవకాశాలు దక్కుతున్నాయి.

గతంలో మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించిన చిత్రాలు సూపర్‌హిట్‌ కావడంతో పూజాహెగ్డేకు ఒక్కసారిగా స్టార్‌డమ్‌ వచ్చేసింది. దీంతో  కోలీవుడ్‌ స్వాగతం పలికింది. అయితే అలా తమిళంలో విజయ్‌ సరసన నటించిన బీస్ట్‌ చిత్రం కూడా పూర్తిగా నిరాశ పరిచింది. అదే సమయంలో టాలీవుడ్‌, బాలీవుడ్‌లో పూజాహెగ్డే నటించిన చిత్రాలు ప్లాప్‌ కావడంతో ఇక ఈ అమ్మడి పనైపోయింది అనే ప్రచారం జోరందుకుంది. కాగా ప్రస్తుతం హిట్స్‌ లేకపోయినా భారీ అవకాశాలు పూజాహెగ్డే తలుపు తట్టడం విశేషం. తమిళంలో సూర్యకు జంటగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో నటించి పూర్తి చేశారు. 

తాజాగా నటుడు విజయ్‌తో ఆయన 69వ చిత్రంలో జత కడుతున్నారు. అలాగే తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. ఈ సందర్బంగా నటి పూజాహెగ్డే ఒక భేటీలో తన కెరీర్‌ గురించి పేర్కొంటూ తన మార్కెట్‌ పడిపోయిందనే ప్రచారం గురించి తాను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. అలాగే అపజయాల గురించి బాధ పడిందిలేదు, భయపడింది లేదన్నారు. తన వరకూ తాను తన పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తున్నానని, మంచి టైమ్‌ కోసం సహనంగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ప్రస్తుతం 5 చిత్రాల్లో నటిస్తున్నట్లు ,అందులో రెండు తమిళం, ఒక హిందీ చిత్రాలు ఉన్నాయని నటి పూజాహెగ్డే పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement