కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటే ఇదే.. తనను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టిన తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సౌత్ ఇండియన్ సినిమా వాళ్లు నడుము మత్తులోనే ఉంటారని, మిడ్ డ్రెస్‌లలో తమని చూడాలనుకుంటారని చెప్పుకొచ్చారు. ఆమె నవ్వుతూ చెప్పిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. సౌత్ ఇండియా సినిమాల వల్లే హీరోయిన్‌గా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్న పూజా ఇలాంటి కామెంట్లు చేయడం దారుణమని తిట్టిపోస్తున్నారు. అన్నం పెట్టిన చేతికి సున్నం పెడుతోందని విమర్శిస్తున్నారు. ఇలా దక్షిణాదిని కించపరిచే బదులు గ్లామర్ పాత్రలు చేయకుండా ఉండాల్సిందని హితవు పలుకుతున్నారు. (చదవండి: ఆయనకు నేనో పెద్ద ఫ్యాన్: థ్రిల్ అవుతున్న పూజా)
Your Well wishers always find good in you to love you more , thanks for the compliment about Telugu fans pooja 🥰❤️ #PoojaHegde #SarkaruVaariPaata @hegdepooja pic.twitter.com/0H5OWOM3uH
— Prince ತರುಣ್ °•. 👶🏻 (@PrinceTarunDHFM) November 6, 2020
అలాగే హిందీలో మాత్రం అన్నీ సాంప్రదాయబద్ధమైన పాత్రలే చేస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. తెలుగు చిత్రాలను వదిలేసి హిందీలో సెటిల్ కావాల్సిందని ఉచిత సలహా ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ చేసినందుకు తగిన గుణపాఠం చెప్పావని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోమని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. మరి దీనిపై పూజా ఏమని సమాధానమిచ్చుకుంటారో చూడాలి. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ హీరో, హీరోయన్లకు సమాన పారితోషికం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. కాగా 'ముకుంద' చిత్రంతో క్లిక్ అయిన పూజా 'అల వైకుంఠపురములో'తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్'తో పాటు అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి 'సర్కస్' అనే కామెడీ చిత్రంలోనూ నటించనున్నారు (చదవండి: హీరో విజయ్ అభిమానుల అత్యుత్సాహం!)
South have obsession with navels and mid dresses#PoojaHegde disgusting
— Maddy (@saimadhav999m) November 6, 2020
1st Taapsee and now pooja degrading South films#AlaVaikunthapurramuloo pic.twitter.com/ihCl5CzO0A
Comments
Please login to add a commentAdd a comment