ఒక్కసారి సెలబ్రిటీలు అయ్యారంటే ఆచితూచి మాట్లాడాల్సిందే. కొన్నిసార్లు సరదాగా అన్నా, పొరపాటున ఏవైనా పొరపాటుగా మాట్లాడినా సోషల్ మీడియాకు అడ్డంగా దొరికిపోతారు. అప్పటివరకు ఆరాధించిన అభిమానులే విమర్శల వర్షం కురిపిస్తారు. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా స్టార్‌డమ్ సంపాదించుకున్న పూజా హెగ్డే విషయంలో అదే జరిగింది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి వాళ్లకు నడుమంటే వ్యామోహం అని, హీరోయిన్లను మిడ్ డ్రస్‌లలో చూడటానికి ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. అంతే.. ఈ ఒక్క క్లిప్పింగ్ సోషల్ మీడియాకు దొరికింది. ఆమెను వేటాడటం మొదలు పెట్టింది. మీకు అన్నం పెట్టిన తెలుగు చిత్ర పరిశ్రమను కించపర్చడానికి సిగ్గనిపించట్లేదా? అంటూ నెటిజన్లు నోటికొచ్చిన మాటలు అన్నారు. టాలీవుడ్‌ను వదిలి వెళ్లిపొమ్మన్నారు.
అక్షరాన్ని మార్చగలరు, అభిమానాన్ని కాదు
వీటన్నింటిపై పూజా హెగ్డే స్పందించారు. తాను ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరాన్ని మార్చగలరేమో కానీ అభిమానాన్ని కాదని చెప్పుకొచ్చారు. తనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పటికీ ప్రాణ సమానమని స్పష్టం చేశారు. ఇది తన చిత్రాలను అభిమానించే వారికీ, తన అభిమానులకు తెలిసినా.. ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే మళ్లీ చెబుతున్నానని చెప్పుకొచ్చారు. తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఓ లేఖను విడుదల చేశారు. తన ఇంటర్వ్యూను మొత్తం చూస్తే మీకే అన్నీ అర్థమవుతుందని సలహా ఇచ్చారు. (చదవండి: దీపావళి కానుకగా వన్‌గ్రామ్ గోల్డ్, బట్టలు ఇచ్చిన హీరో)
కాళ్లు చూస్తే బాగుండు అనుకుంటా
కాగా పూజా తన ఇంటర్వ్యూలో తెలుగు ప్రేక్షకులు సినిమా వాళ్లను ఆరాధిస్తారని, సార్లను దేవుళ్లుగా పూజిస్తారని నాలుగు మంచి మాటలు కూడా చెప్పారు. అలాగే ‘అల వైకుంఠపురములో’ సినిమాలో హీరో తన కాళ్లను చూడటం గురించిన చర్చలో భాగంగా వచ్చిన ప్రశ్నకు ఆమె ‘దక్షిణాదివాళ్లకు నడుము భాగం అంటే పిచ్చి’ అనే అర్థం వచ్చేట్లు సమాధానం ఇచ్చారు. ‘నాకైతే ఎవరైనా నా కాళ్లు చూస్తే బావుణ్ణు అనుకుంటాను కానీ నడుము కాదు’ అనే ఉద్దేశంలో పూజ మాట్లాడారు. (చదవండి: సౌత్ ఇండస్ట్రీపై పూజా సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment