
దక్షిణాదిన హీరోయిన్ల నాభి అందాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారంటోంది హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ముంబైలో పెరగడం వల్ల సౌత్‌లో కొన్ని విషయాలు చూసినప్పుడు ఇదేంటని ఆశ్చర్యపోయేదాన్ని. ఇక్కడ(దక్షిణాదిన) నాభి అందాల్ని ఎక్కువ హైలైట్ చేస్తుంటారు. హీరోయిన్ల ఫోటోలను జూమ్ చేసి చూస్తుంటారు.
అప్పుడు నాకు 21 ఏళ్లే..
ఇకపోతే మొదట్లో నేను మరింత సన్నగా ఉండేదాన్ని. తొలి సినిమా చేసేటప్పుడు నా వయసు 21 మాత్రమే. అప్పుడు బక్కగా ఉండటం వల్ల చాలామంది ట్రోల్ చేశారు. కొన్నేళ్లకు నా శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయి. అప్పుడు కూడా దారుణంగా విమర్శించారు (Social Media Trolling). అస్థిపంజరంలా ఉన్నావ్.. కాస్త లావు అవొచ్చుగా.. ఇలా చాలా చెప్పారు. అయితే ప్రతి ఒక్కరూ ఇంత పద్ధతిగా ఏం మాట్లాడలేదు. అవమానకర వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయంలో శరీరం గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసి అవతలి వ్యక్తిని బాధపెట్టడం కరెక్ట్ కాదు. మీరు విమర్శించడమే కాదు మాటలతో భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు కూడా! అని మాళవిక చెప్పుకొచ్చింది.

మలయాళ కుట్టి
మాళవిక మోహనన్ మలయాళ అమ్మాయి. పట్టం పోలే (Pattam Pole) చిత్రంతో 2013లో కథానాయికగా మలయాళ వెండితెరకు పరిచయమైంది. మలయాళంతోపాటు కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ద రాజా సాబ్ మూవీలో మాళవిక కథానాయికగా యాక్ట్ చేస్తోంది. అలాగే తమిళంలో కార్తీ సర్దార్ 2 మూవీలోనూ నటిస్తోంది. ఇది సూపర్ హిట్ మూవీ సర్దార్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అలాగే మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి హృదయపూర్వం సినిమా చేస్తోంది.
రాజాసాబ్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ
రాజా సాబ్ (The Raja Saab Movie) విషయానికి వస్తే.. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. నిజానికి ఈ మూవీని ఈ నెల 10న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడక తప్పలేదు. అయితే రాజాసాబ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు.
చదవండి: భరించలేని నొప్పితో ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీకి ఆపరేషన్