
టాప్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న మాళవిక మోహన్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో మెళకువలు నేర్చుకుందంటూ ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైర
కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ ప్రస్తుతం టాప్‌లో ఉన్న హీరోహీరోయిన్ల ఫస్ట్ సినిమా చూస్తే వాళ్లు వీళ్లేనా? అనిపిస్తుంది. తొలి సినిమాకు, ఇప్పటికీ.. వారి ముఖంలో, యాక్టింగ్‌లో చాలా మార్పులు గమనించవచ్చు. తాజాగా టాప్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న మాళవిక మోహన్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో మెళకువలు నేర్చుకుందంటూ ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అప్పుడలా.. ఇప్పుడిలా
ఇందులో మాళవిక తన క్లాస్‌లో సైగలతోనే నటిస్తోంది. ఇది చూసిన జనాలు.. అక్కడున్నది హీరోయిన్ మాళవికనా? అని ఆశ్చర్యపోతున్నారు. డైలాగ్స్ లేకుండా పిచ్చిచూపులు చూస్తున్నట్లుగా ఉంది.. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం గ్రేట్ అని అభిమానులు కొనియాడుతున్నారు. కాగా మలయాళ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కూతురైన మాళవిక మొదట్లో మమ్ముట్టితో ఓ యాడ్‌లో నటించింది. తర్వాత పట్టమ్ పోలె అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా మారింది.
మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు..
నాను మత్తు వరలక్ష్మితో కన్నడలో, బియాండ్ ద క్లౌడ్స్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. రజనీకాంత్ పేట మూవీతో తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత దళపతి విజయ్ మాస్టర్, ధనుష్ మారన్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈమె నటించిన తంగలాన్ మూవీ త్వరలో విడుదల కానుంది. అలాగే ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్' మూవీలోనూ హీరోయిన్‌గా యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Still can’t act 😭
— Ana De Friesmass 2.0 (@ka_fries2366) January 16, 2024
pic.twitter.com/NnCzynn2EO