పాక్‌ జెండా కలకలం | Pakistan flags hurled inside prison | Sakshi
Sakshi News home page

పాక్‌ జెండా కలకలం

Published Sun, Jun 18 2017 8:43 AM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

పాక్‌ జెండా కలకలం

పాక్‌ జెండా కలకలం

తిరువొత్తియూరు(తమిళనాడు): తమిళనాడు పుళల్‌ సెంట్రల్‌ జైలు వద్ద పాకిస్తాన్‌ జెండా, సెల్‌ఫోన్‌ను సిబ్బంది కనుగొన్నారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం సిబ్బంది గస్తీ చేస్తుండగా.. జైలు సమీపంలో నలుపు స్టిక్కర్లు అతికించిన అట్టపెట్టె పడి ఉంది. ఆ పెట్టెను తెరచి చూడగా 24 మీటర్ల వెడల్పు కలిగిన పాకిస్తాన్‌ జెండా, సెల్‌ఫోన్‌ ఉంది. సమాచారం అందుకున్న జైలర్‌ జయరామన్‌ ఈ విషయాన్ని తనపై అధికారి శైలేంద్రబాబుకు తెలియజేశారు. దీంతో పుళల్‌ పోలీసులకు జైలర్‌ ఫిర్యాదు చేశారు.

పాక్‌ జెండా, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పుళల్‌ ఇన్‌స్పెక్టర్‌ విచారణ చేపట్టారు. జైలు లోపల అలజడి సృష్టించడానికే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, తమిళనాడు క్యూ బ్రాంచ్‌ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ విభాగం సిబ్బంది పుళల్‌ జైలుకు చేరుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement