రిగ్గింగ్కు పాల్పడ్డారని పాక్ జెండా తగులబెట్టారు
నీలం వ్యాలీ: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) నీలమ్ వ్యాలీలో ఆందోళనకారులు చెలరేగిపోయారు. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ పాకిస్తాన్ జెండాను తగులబెట్టి నిరసన తెలిపారు. జులై 21న జరిగిన ఎన్నికల్లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్) అనూహ్య విజయం సాధించింది. ఇక్కడ 41 సీట్లకు గాను పీఎంఎల్-ఎన్ 31 సీట్లు గెలుచుకుంది. ముస్లిం కాన్ఫరెన్స్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు కేవలం మూడేసి సీట్ల చొప్పున గెలుచుకున్నాయి.
దీంతో ఎన్నికల్లో అక్రమాలకు, రిగ్గింగ్కు పాల్పడ్డారని ప్రజలు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులపై పోలీసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముజఫరాబాద్, కొట్లీ, చినారి, మిర్పుర్ ప్రాంతాల్లో అల్లర్లు వ్యాపించాయి.
Angry over rigged PoK elections, locals burnt Pakistani flag in Neelum Valley (PoK) and faced police action. pic.twitter.com/TYqVZgnzQD
— ANI (@ANI_news) 29 July 2016