శ్రీనగర్: ఉగ్రవాదాన్ని నియంత్రించే విషయంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ వ్యూహం సరిగాలేదని ప్రధాన పార్టీల నేతలు మండిపడ్డారు. గవర్నర్ తక్షణమే జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీషా జిలానీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మరో వేర్పాటువాది మసరత్ అలమ్ పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడమే కాకుండా భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. దీంతో మసరత్ వైఖరిపై ప్రధాన పార్టీల నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా జమ్మూ కశ్మీర్ సీఎం ముఫ్తీ వేర్పాటువాదులపై స్పందించాల్సిందిగా ప్రధాన పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
పాకిస్థాన్ జెండాను మనదేశంలో ప్రదర్శించడం పట్ల బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కశ్మీర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారి డిమాండ్ చేశారు.