Manish Tewari
-
అందులో తప్పేముంది? మేం రోజుకు 15 గంటలు పనిచేస్తున్నాం: కాంగ్రెస్ ఎంపీ
భారత్ శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Infosys Narayana Murthy) చేసిన వ్యాఖ్యపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కొంతమంది ఆయన్ను సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దేశ ఉత్పాదకత పెరగడానికి ఎక్కువ గంటలు పనిచేయాలన్న నారాయణమూర్తి సలహాను సమర్థిస్తున్నవారి జాబితాలోకి తాజాగా కాంగ్రెస్ ప్రముఖ నేత, ఎంపీ మనీష్ తివారి (Manish Tewari) చేరారు. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలో తప్పేముందని ప్రశ్నించారు. దీనిపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’(ట్విటర్)లో ఆయన పోస్ట్ చేశారు. అది తప్పనిసరి నియమం కావాలి ‘వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారు.. అందులో తప్పేముంది? ఓ వైపు ప్రజా జీవితం, మరో వైపు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూనే మా లాంటి ప్రజా ప్రతినిధులు రోజుకు 12-15 గంటలు పనిచేస్తున్నాం. నేను చివరగా ఎప్పుడు ఆదివారం సెలవు తీసుకున్నానో నాకు గుర్తే లేదు. గెలిచినా, ఓడిపోయిన ప్రజా జీవితంలో ఉన్నవారికి ఆదివారం సెలవు అనేది ఉండదు. వారానికి 70 గంటలు పని, ఒక రోజు సెలవు, సంవత్సరానికి 15 రోజులు విరామం అనేది తప్పనిసరి నియమం కావాలి’ అని మనీష్ తివారి తన ట్వీట్లో రాసుకొచ్చారు. I do not understand the brouhaha around @Infosys_nmurthy statement on a 70 hour work week . What is wrong with it ? Some of us Public Representatives work 12-15 hours a day 7 days a week balancing careers with Public Service. I do not recall when I last took a Sunday off.… — Manish Tewari (@ManishTewari) November 10, 2023 -
అలా జరిగి ఉంటే ఆజాద్ వీడేవారు కాదేమో!
ఢిల్లీ: గులాం నబీ ఆజాద్ నిష్క్రమణ తర్వాత కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతల ప్రకటనల పర్వం కొనసాగుతోంది. మరికొందరు సైతం పార్టీని వీడబోతున్నారనే సంకేతాలు అందుతున్నాయి. అయితే.. యాభై ఏళ్ల బంధం, మిగతా వాళ్లను కాదని ఏరికోరి పదవులు కట్టబెట్టినా కూడా ఆజాద్.. తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడడంపై చర్చ కూడా అదేస్థాయిలోనే కాంగ్రెస్‌లో జరుగుతోంది. అయితే.. కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితికి కారణాలేంటో విశ్లేషించారు కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ. దేశానికి, కాంగ్రెస్‌కు మధ్య సమన్వయ లోపం కారణంగానే పార్టీకి ఈ పరిస్థితి తలెత్తిందని శనివారం ఉదయం ఢిల్లీలో మీడియా మాట్లాడుతూ ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘రెండేళ్ల కిందట మాలోని(కాంగ్రెస్ సీనియర్లను ఉద్దేశించి) 23 మంది పార్టీ పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తూ.. పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలంటూ సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ లేఖ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇక్కడి నుంచే దేశానికి, కాంగ్రెస్‌కు మధ్య గ్యాప్ మొలైంది. 1885 జాతీయ కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి.. కాంగ్రెస్, దేశంతో పాటే నడిచింది. కానీ, పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కాబట్టి.. పార్టీకి ఇప్పటికైనా ఆత్మపరిశీలన అవసరం. డిసెంబరు 20, 2020న సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నేను భావిస్తున్నాను. అదే జరిగి ఉంటే.. ఆజాద్ ఈనాడు కాంగ్రెస్‌ను వీడేవారు కాదేమో! అని మనీశ్ తివారీ తన అభిప్రాయం తెలిపారు. డిసెంబరు 20, 2020న సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో.. సోనియా, రాహుల్ గాంధీలు కాంగ్రెస్‌లో సీనియర్లకు గౌరవం ఉంటుందని, వాళ్ల సలహాలను పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందని ప్రకటించారు. కానీ, ఆ తర్వాత ఆ హామీ గాలికి పోయిందన్నది కాంగ్రెస్ జీ-23 నేతల ఆరోపణ. #WATCH | Congress MP M Tewari says, "Don't want to go into merits of Mr Azad's letter, he'd be in best position to explain...But strange that people who don't have capacity to fight a ward poll, were "chaprasis" of Congress leaders when give "gyaan" about party it's laughable..." pic.twitter.com/9dKLO2y2S8 — ANI (@ANI) August 27, 2022 ఆజాద్ లేఖ మీద చర్చోపచర్చలు అనవసరం. ఎందుకంటే ఆయన వివరణ ఎప్పుడూ సమర్థవంతంగానే ఉంటుంది. కానీ, కాంగ్రెస్ నుంచి కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వాళ్లు కూడా.. ఇవాళ పార్టీకి జ్ఞానం పంచాలని చూడడం నవ్వు తెప్పిస్తోందని మనీశ్ తివారీ అన్నారు. శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన తన రాజీనామా లేఖలో.. దేశం కోసం పోరాడే సంకల్పం, సామర్థ్యాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని ఎత్తిపొడిచారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. చిన్న స్థాయి నేతల సూచనల మేరకు పార్టీ నడుస్తోందని ఆయన లేఖలో ఆరోపించారు. భారత్ జోడో యాత్రకు బదులు.. కాంగ్రెస్ జోడో యాత్ర చేపట్టాలంటూ సూచిస్తూనే.. పార్టీలో రాహుల్ పాత్రను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇదీ చదవండి: గులాం నబీ ఆజాద్.. విధేయుని అసమ్మతి -
ఆహ్వానించినందుకు ధన్యవాదాలు!.. కానీ రాలేను: కాంగ్రెస్ ఎంపీ
న్యూఢిల్లీ: భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్‌లో పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తదితరుల సమక్షంలో భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ఆహ్వానం లేదు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ట్విట్టర్లో మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్‌ను నేను అభినందిస్తున్నాను. ఆయన ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున నేను హాజరు కాలేక పోతున్నాను. కానీ పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి చరణ్‌జిత్ సింగ్ నన్ను ఆహ్వానించకపోవడం విడ్డూరం." అని తివారీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే పంజాబ్‌లోని ఆనంద్‌పూర్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ సాహిబ్ కూడా పార్లమెంటు సమావేశాలు ఉన్నందున తాను వేడుకకు హాజరు కాలేనని చెప్పారు. అంతేకాదు తివారీ పంజాబ్ సీఎం ఆహ్వాన కార్డును కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలోని 117 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 92 స్థానాలతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ 18 సీట్లకు పరిమితమైంది. పంజాబ్‌లో కాంగ్రెస్ స్పష్టమైన ఓట్ల చీలికను చవి చూసింది. అయితే తివారీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన లేరు. అయితే భగవంత్ మాన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్దగా కేంద్ర మంత్రి లేదా జాతీయ స్థాయిలోని పెద్ద నాయకులెవరిని ఆహ్వానించ లేదు. I congratulate @BhagwantMann on being sworn in as Chief Minister I thank him for inviting me to his swearing in . Due to Parliament being in session I will not be able to make it . It is ironic I was not invited to @CHARANJITCHANNI ‘s swearing in though he was one of my MLA’s pic.twitter.com/AyW91uNyYE — Manish Tewari (@ManishTewari) March 16, 2022 (చదవండి: రెండోసారి సీఎంలుగా ప్రమోద్ సావంత్, బీరేన్ సింగ్) -
పార్టీని విడిచిపెట్టను.. గెంటేస్తే తప్పా
న్యూఢిల్లీ: తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టబోనని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మనీష్ తివారి స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీని వీడుతున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. వీటిపై ఆయన స్పందిస్తూ.. ‘నేను కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లాలని అనుకోవడం లేదు. పార్టీ నుంచి నన్ను గెంటేయాలని ఎవరైనా అనుకుంటే అది వేరే విషయం. నా జీవితంలో 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాన’ని అన్నారు. పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పంజాబ్‌లో అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్.. మనీష్ తివారి సేవలను వినియోగించుకోవడం లేదు. దీంతో ఆయన తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. (క్లిక్: సీఎం ఛన్నీ, ప్రియాంక గాంధీపై మోదీ ఆగ్రహం) గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై మనీష్ తివారి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దీంతో హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలోనూ ఆయన చోటు దక్కలేదు. గాంధీల నాయకత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయనకు అధిష్టానం విధించిన 'శిక్ష'గా ఈ పరిణామాన్ని పరిగణించారు. అయితే పార్టీలో ప్రజాస్వామ్య సంస్కరణలను తాను కోరుకుంటున్నానని తివారి చెప్పారు. (క్లిక్: పంజాబ్‌లోని ఈ ఎన్నారై బెల్ట్‌లో హోరాహోరీ పోరు) ఆయన రాజీనామా ఆందోళన కలిగిస్తోంది ఒక చిన్న పార్టీ కార్యకర్త కాంగ్రెస్‌ను వీడినా కాంగ్రెస్‌కే నష్టమని మనీష్ తివారి అన్నారు. సీనియర్ నేతలు పార్టీని వీడితే పెద్ద నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అశ్వనీ కుమార్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 46 ఏళ్ల పాటు కాంగ్రెస్ కొనసాగిన అశ్వనీ కుమార్.. పార్టీని వీడటం పట్ల తివారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన రాజీనామా దురదృష్టకరమని, కాంగ్రెస్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అన్నారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 25న ఒకే విడతలో జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. -
పాక్‌తో వాణిజ్య చర్చలు వృథా.. సిద్ధూ వ్యాఖ్యలపై విమర్శలు
లుధియానా: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆ పార్టీ ఎంపీ మనీష్ తివారీ విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు పెంచుకోవటం వల్ల ఇరు దేశాల స్నేహబంధం పెరుగుతుందన్న సిద్ధూ వ్యాఖ్యలను ఖండించారు. భారత్‌పై.. పొరుగు దేశం పెంచుకుంటున్న వ్యతిరేకత ఆగేవరకు పాక్‌తో వాణిజ్య చర్చలు జరపడం వ్యర్థమని స్పష్టం చేశారు. చదవండి: మొదటి వారం రాజ్యసభ సమావేశాలు.. 52 శాతం సమయం వృథా పాకిస్తాన్ ఇండియాలోకి ఉగ్రవాదులను పంపుతోందని మండిపడ్డారు. మారణాయుధాలు, డ్రగ్స్‌ను పాక్ తమ డ్రోన్ల ద్వారా భారత భూభాగంలో చేరవేస్తోందని అన్నారు. ఇలాంటి చర్యలు ఆగేవరకు పాక్‌తో వాణిజ్య చర్చలు జరపడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. కరాచీ సరిహద్దు తెరిచి ఉంటే.. వ్యాపారం కోసం అట్టారీ సరిహద్దును ఎందుకు తెరవలేరని సిద్ధూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. -
పీసీసీపై కాంగ్రెస్ కసరత్తు.. తెరపైకి వచ్చిన ఇద్దరు నాయకులు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఇటీవల రాష్ట్ర పార్టీలో సంస్థాగతంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన వ్యూహాలకు కాంగ్రెస్ హైకమాండ్ పదునుపెట్టింది. పంజాబ్ కాంగ్రెస్‌లో గొడవను పరిష్కరించేందుకు హైకమాండ్ ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని తీసుకోనప్పటికీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం అనేక అవకాశాలను పరిశీలిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, నాయకుల మధ్య సమన్వయ లోపాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు రాబోయే కొద్దిరోజుల్లో తీసుకుంటారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు సునీల్ జఖర్ స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తోందని తెలుస్తోంది. నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ చాన్నాళ్లుగా సీఎం అమరీందర్‌పై బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య సమోధ్య కుదర్చడం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. పంజాబ్ కాంగ్రెస్‌లో గందరగోళం వాస్తవానికి కొన్ని నెలలుగా పంజాబ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితుల మధ్య ప్రతిరోజూ పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్ మిలాఖత్ అయి పనిచేస్తున్నాయనే అభిప్రాయం సాధారణ జనంలో ఉందని అసమ్మతి శిబిరం మాట్లాడటం ప్రారంభమైనప్పటి నుంచి పార్టీలో అంతర్గత గొడవ మొదలైంది. క్రమంగా ఇది సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు వ్యతిరేకంగా మారడంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ముందు 63 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పనితీరుపై ప్రశ్నలు సంధించారు. అసమ్మతిని తగ్గించేందుకు ప్యూహం పీసీసీ అధ్యక్షుడిగా సునీల్ జఖర్ స్థానంలో ఆనంద్‌పూర్ సాహిబ్ ఎంపీ, యూపీఎ హయాంలో కేంద్రమంత్రి మనీష్ తివారీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాల పేర్లు హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మనీష్ తివారీ గతేడాది పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని సోనియాగాంధీకి లేఖ రాసిన జీ–23లో సభ్యుడిగా ఉన్నారు. కానీ ఈమధ్య కాలంలో మనీష్ తివారీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ కారణంగా జీ–23లో అసమ్మతిని తగ్గించేందుకు మనీష్ తివారీ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. మరోవైపు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో సన్నిహితంగా ఉండటమే కాకుండా, అధిష్టాన పెద్దల్లో... ముఖ్యంగా రాహుల్ గాంధీ శిబిరంలో మంచి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికల ముందు పీసీసీ మార్పు కీలక పరిణామంగా చూడాల్సి ఉంటుంది. చదవండి: ఇంజనీరింగ్ చదివారు.. గంజాయి అమ్ముతూ బుక్కయ్యారు! -
ఎవరికీ నష్టం లేదు : సమానత్వాన్ని కాలరాస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలు, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా మాత్రం పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా తన వాదనను వినిపించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు 130 కోట్ల మంది భారతీయుల మద్దతు ఉందని, 2014, 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని నిందించిన అమిత్ షా.. పౌరసత్వ సవరణ బిల్లుతో ఎవరికీ అన్యాయం జరగబోదని, ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకం కాదని అన్నారు. ఈ బిల్లు వెనుక ఎలాంటి రాజకీయాలు, అజెండా లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా నిజానికి మైనారిటీలు హక్కులు పొందుతారని, విదేశాల నుంచి దేశంలోకి శరణార్థులుగా వచ్చిన మైనారిటీలు హక్కులు పొందుతారని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పౌరసత్వ సవరణ బిల్లుపై ధ్వజమెత్తారు. ఈ బిల్లు అతి పెద్ద తప్పిదమని, ఈ అసమగ్ర బిల్లు కొన్ని వర్గాలపై వివక్ష చూపేలా ఉందన్నారు. ఆర్టికల్ 14, 15, 21, 25, 26లకు వ్యతిరేకంగా బిల్లు ఉందని, రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఈ బిల్లు కాలరాస్తుందని మండిపడ్డారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
రాహుల్ నోట.. మళ్లీ అదే మాట
సాక్షి, న్యూఢిల్లీ: ఎవరెన్ని చెప్పినా తన నిర్ణయంపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగలేనని మరోసారి విస్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాహుల్‌ను బుచ్చగించేందుకు ఎంపీలు ప్రయత్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి బాధ్యత ఏ ఒక్కరిదో కాదని, అధ్యక్షుడిగా కొనసాగాలని రాహుల్‌కు శశిథరూర్, మనీష్ తివారి నచ్చజెప్పారు. పార్టీకి మీ అవసరం ఉందని, అధ్యక్షుడిగా కొనసాగాలని కోరారు. ఈ అంశంపై తాను ఇప్పటికే ఒక తుది నిర్ణయం తీసుకున్నానని, వెనక్కు తగ్గబోనని వారికి రాహుల్ స్పష్టం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని గత వారం రోజులుగా ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హరియాణా, మహారాష్ట్ర నాయకులతో ఆయన చర్చలు జరపడంతో ఈరకమైన ఊహాగానాలు వచ్చాయి. గత నెలలో అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు వెలువడిన తర్వాత జరిగిన మొదటి సీడబ్ల్యూసీ సమావేశంలోనే ఈ నిర్ణయం ప్రకటించారు. అప్పటి నుంచి ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. (చదవండి: ఇతరులూ కాంగ్రెస్ చీఫ్ కావొచ్చు) -
‘టీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే’
హైదరాబాద్: బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య స్నేహపూర్వకమైన పోటీ ఉందని, టీఆర్ఎస్, ఎంఐఎంలలో ఎవరికి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్లేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ కుమార్ తివారీ వ్యాఖ్యానాంచారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా దారుణమన్నారు. తెలంగాణాలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. తెలంగాణాలో ప్రజాస్వామ్య బద్దంగా పాలన జరగడం లేదన్నారు. గతంలో కూడా కోదండరాంను కూడా ఇలానే అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బహిరంగంగానే మద్ధతు తెలిపిందని చెప్పారు. లోక్‌సభకు ఎన్నికలు జరిగే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం: అజారుద్దీన్ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు అజారుద్దీన్ అన్నారు. పోలీసులు చట్టపరిధి దాటి శ్రుతి మించి పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపాలని కోరారు. కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతోనే టీఆర్ఎస్ ఇలాంటి పనులు చేస్తున్నదని ధ్వజమెత్తారు. -
‘పాన్‌షాప్‌లను జూద అడ్డాలుగా మారుస్తారా..?’
సాక్షి, న్యూఢిల్లీ : క్రికెట్ వంటి జనాదరణ కలిగిన క్రీడల్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్లను చట్టబద్ధం చేయాలంటూ లా కమిషన్ చేసిన సిఫార్సులపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆదాయం సమకూర్చుకునేందుకు బెట్టింగ్ సంస్కృతిని ప్రోత్సహించడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారి ఏఎన్ఐతో మాట్లాడుతూ... వివాదాస్పదమైన ఈ నిర్ణయం క్రీడలతో పాటు సమాజంపై కూడా చెడు ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బెట్టింగ్‌ను చట్టబద్దం ద్వారా చేయడం ద్వారా దేశంలోని ప్రతీ పాన్షాప్ను జూదానికి అడ్డాగా మార్చాలనుకుంటున్నారా అంటూ ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటువంటి అనుచిత నిర్ణయాల వల్ల సమాజంపై ఎటువంటి ప్రభావం పడుతుందో ఒకసారి ఆలోచించాలంటూ హితవు పలికారు. కాగా లా కమిషన్(21వ) తాజాగా చేసిన సిఫార్సుల్లో గ్యాంబ్లింగ్, క్రీడల్లో బెట్టింగ్ ను అనుమతించాలని పేర్కొన్న విషయం తెలిసిందే. తద్వారా కేంద్ర ఖజానాకు పన్ను రూపంలో మరింత ఆదాయం వస్తుందని కమిషన్ వెల్లడించింది. వీటితోపాటు క్యాసినో, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించాలని కూడా లా కమిషన్ సిఫార్సు చేసింది. అయితే ఇందుకోసం ఓ నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని కమిషన్ పేర్కొంది. -
భారత్ తప్పు చేసిందా?
సాక్షి, న్యూఢిల్లీ : గూఢచర్య ఆరోపణలపై పాక్ జైల్లో బంధీగా ఉన్న కులభూషణ్ జాదవ్‌ను ఎట్టకేలకు ఆయన కుటుంబ సభ్యులు కలుసుకోవటంతో కాస్త ఊరట పొందారు. అయితే ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జాదవ్ తల్లి అవంతి, భార్య చేతన్‌కుల్ ను పాక్ అధికారులు అవమానించటం.. మన రాజకీయ పక్షాలెన్నీ ఏకమై పాక్ తీరుకు వ్యతిరేకంగా గళం వినిపించటం చూశాం. కానీ, పాక్ గురించి తెలిసి కూడా కేంద్రం ముందుకు వెళ్లటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇదో దౌత్యపరమైన అపజయంగా ఇప్పటికే అభివర్ణించిన కాంగ్రెస్ తాజాగా ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించింది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ తెవారి జాదవ్ కుటుంబానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూనే.. ఓ సందేశం ఉంచారు. 1. ఏ ఒప్పందం మేరకు భారత్-పాక్ ఈ కలయికకు ఏర్పాటు చేశారు. 2. పాక్ కుటిలబుద్ధి తెలిసి కూడా దౌత్యానికి భారత్ ఎందుకు మొగ్గుచూపింది?. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీఆర్సీ పద్ధతి) ద్వారానో లేదా కనీసం, ఐక్యరాజ్యసమితి ద్వారానో ముందుకు వెళ్లాలే తప్ప.. ఇలాంటి మార్గం ఎందుకు ఎంచుకుంది? ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. Pak’s mistreatment of Jadhav’s family unequivocally condemnable but-1.What were ground rules settled between India&Pak about the meeting?2 Knowing Pak’s perfidy fully well why did India not ask ICJ to facilitate meeting through ICRC or any other UN body rather than bilaterally??? — Manish Tewari (@ManishTewari) December 29, 2017 ఇక పాక్ విదేశాంగ కార్యాలయం వెలుపల కులభూషణ్ జాదవ్ తల్లి, భార్యలను పాక్ మీడియా ఎలా వేధించాయో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీరు ఓ టెర్రరిస్టుకు తల్లిగా ఎలా ఫీలవుతున్నారు? అంటూ ఇబ్బందికర ప్రశ్నలతో జాదవ్ తల్లిపై పాక్ మీడియా ప్రశ్నలు గుప్పించాయి. -
మోదీ బర్త్‌డే.. కాంగ్రెస్ నేత అసభ్య ట్వీట్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ మాత్రం అసభ్య వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ తరహా దేశభక్తిని మహాత్మాగాంధీ సైతం నేర్పించలేరని పేర్కొన్నారు. అంతేకాకుండా అసభ్య వ్యాఖ్యలతో దూషణలకు దిగారు. దేశభక్తి గురించి మహాత్మాగాంధీ నుంచి ప్రధాని మోదీ నేర్చుకోవాల్సిందేమీ లేదంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన తివారీ.. 'మూర్ఖులను భక్తులుగా మార్చడం, భక్తులను మూర్ఖులుగా తయారు చేయడమంటే ఇదే. మోదీ తరహా దేశభక్తిని మహాత్మా గాంధీ సైతం నేర్పించలేరు' అని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్లో హిందీలోని అసభ్య తిట్లను ఆయన ఉపయోగించడం గమనార్హం. దీంతో నెటిజన్లు ఆయనపై విమర్శలను గుప్పిస్తున్నారు. స్థాయి దిగజార్చుకొని అసభ్య దూషణలకు దిగడం సరికాదని హితవు పలికారు. గతంలో మరో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం ఇదేవిధంగా దూషణలకు దిగడంతో నెటిజన్లు అప్పట్లో తలంటారు. -
‘మోదీ, బీజేపీ నేతలు తప్పు ఒప్పుకున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకు తాజా మంత్రివర్గ విస్తరణే నిదర్శనమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మనీష్ తివారీ విమర్శించారు. ప్రభుత్వం చాలా అంశాల్లో దారుణ వైఫల్యాలను మూటకట్టుకోవడంతో కేబినెట్ హోదా నుంచి కొందరు మంత్రులను తప్పించారని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో పెద్ద నోట్లరద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తుందని విమర్శించిన మనీష్ తివారీ తాజాగా కేబినెట్ విస్తరణపై తీవ్ర స్థాయిలో స్పందించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్ మెంట్ మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, కార్మికశాఖ మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మాజీ మంత్రి కల్రాజ్ మిశ్రాలను మంత్రి వర్గం నుంచి తొలగించడమంటే.. స్కిల్ డెవలప్ మెంట్, ఉద్యోగకల్పన చేయలేకపోవడంతో పాటు పరిశ్రమలు తీసుకురాలేదని ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు తామంతట తామే తప్పును ఒప్పుకున్నట్లేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ చెప్పారు. ఇంకా చెప్పాలంటే వీఐపీలకు మాత్రమే పనిచేసే వ్యక్తులకు కేబినెట్ హోదా దక్కిందని ఎద్దేవా చేశారు. కొత్త మంత్రివర్గం ఓల్డ్ సిటిజన్ క్లబ్ లా మారిందన్నారు. పెట్రోలియం మంత్రిగా 38 నెలలు పనిచేసిన వ్యక్తి ధర్మేంద్ర ప్రదాన్ కేవలం వీఐపీల కోసం పనిచేసి కేబినెట్ లో ప్రమోషన్ పొందారని ఆరోపించారు. బీజేపీ కోశాధికారి అయినందున విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన పీయూష్ గోయల్ రైల్వేశాఖ మంత్రిగా కేబినెట్ హోదా దక్కించుకున్నారని చెప్పారు. ఈ ఇద్దరితో పాటు నిర్మలా సీతారామన్ (రక్షణశాఖ), ముక్తార్ అబ్బాస్ నఖ్వీ (మైనారిటీ వ్యవహారాలశాఖ)లు కేబినెట్ హోదా దక్కించుకోగా, తెలుగు రాష్ట్రాలకు మాత్రం కేంద్రం మొండిచేయి చూపించింది. -
‘అమెరికా పునరాలోచించుకోవాలి’
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్–అమెరికా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపగలదని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ అన్నారు. ఈ నిర్ణయంపై అమెరికా పునరాలోచించుకోవాలని సూచించారు. అమెరికాలో సాంకేతిక రంగం ఎదుగుదలకు భారతీయులు, భారత కంపెనీలు దోహదం చేశాయనీ, ఈ రంగ అభివృద్ధికి మేధో పరమైన పెట్టుబడులను భారతీయులు పెట్టారని ఆయన అన్నారు. అమెరికాలోని అట్లాంటిక్ కౌన్సిల్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) అధ్యక్షుడి నేతృత్వంలో ఒక బృందం ఈ వారంలో వాషింగ్టన్లో పర్యటించి హెచ్–1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వ అధికారులు, మేధో సంస్థలు, చట్టసభల సభ్యులతో చర్చలు జరపనుంది. ఈ బృందంలో మనీష్ తివారీ కూడా సభ్యుడిగా ఉన్నారు. -
ఆర్మీ కొత్త చీఫ్ నియామకంపై రగడ
-
ఆర్మీ కొత్త చీఫ్ నియామకంపై రగడ
సీనియర్లను పక్కనపెట్టి రావత్‌కు పట్టమా?: కాంగ్రెస్ న్యూఢిల్లీ: భారత కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించడంపై వివాదం రేగింది. రావత్ కంటే ఇద్దరు సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ వారిని పక్కనబెట్టి ఆయనను నియమించడాన్ని కాంగ్రెస్, వామపక్షాలు తప్పుబట్టాయి. ప్రతి సంస్థకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయని, సీనియారిటీని గౌరవించాల్సి ఉంటుందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారి అన్నారు. రావత్ సామర్థ్యాన్ని తాము ప్రశ్నించడం లేదని.. సీనియర్లను పక్కనబెట్టి లైనులో నాలుగో స్థానంలో ఉన్న వ్యక్తిని కొత్త ఆర్మీ చీఫ్‌గా తీసుకోవడాన్నే తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. సీపీఐ నేత డి.రాజా స్పందిస్తూ ఆర్మీలో నియామకం, సీవీసీ, చీఫ్ జస్టిస్ తదితర ఉన్నతస్థాయి నియామకాలన్నీ వివాదాస్పదంగా మారుతుండటం దురదృష్టకరమని అన్నారు. సైన్యమంటే దేశానికంతటికీ చెందినదని.. అలాంటప్పుడు ఆయా నియామకాలు ఎలా జరిగిందీ దేశానికి చెప్పాల్సిన అవసరం, నియామకంపై ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. సమర్థించుకున్న బీజేపీ.. రావత్ నియామకాన్ని బీజేపీ సమర్థించుకుంది. సైనిక వ్యవహారాల్లో అనుభవం, కార్యదక్షతను చూసి ఆయనను నియమించినట్లు పేర్కొంది. రాజకీయ పార్టీల్లో దేశభక్తి లోపించడం వల్లే కొత్త సైన్యాధ్యక్షుడి నియామకాన్ని ప్రశ్నిస్తున్నాయంది. విపక్షాల వ్యాఖ్యల వల్ల సైనికదళాల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని పార్టీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆర్మీ చీఫ్ నియామకానికి 10, జన్‌పథ్ (సోనియా గాంధీ అధికార నివాసం) అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయాలను సమయం వచ్చినపుడల్లా ప్రశ్నించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. -
నోట్ల రద్దుపై కాంగ్రెస్ గరం గరం
-
మోదీ ఆధునిక తుగ్లక్: కాంగ్రెస్
-
సామాన్యుడికి చాలా ఇబ్బంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల చలామణి వాడకంపై మోదీ ప్రభుత్వం తీసుకున్న అకస్మాత్తు నిర్ణయంపై కాంగ్రెస్ పలు ప్రశ్నలు సంధించింది. దీనివల్ల సామాన్య ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తంచేసింది. అలాగే వ్యాపారులు, చిన్న వర్తకులు, గృహిణులు కూడా ఆందోళన చెందుతారని పేర్కొంది. మంగళవారం పార్టీ ముఖ్యఅధికార ప్రతినిధి రణ్‌దీప్ మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనం నియంత్రణకు తీసుకునే అర్థవంతమైన చర్యలకు తమ పార్టీ ఎప్పటికీ మద్దతు పలుకుతుందన్నారు. విదేశాల్లో దాగున్న రూ.80 లక్షల కోట్లను వెనక్కితెచ్చి, ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తామన్న హామీని నెరవేర్చడంలో విఫలమై ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందో అధ్యయనం చేయకుండా ప్రస్తుత పండుగ, పెళ్లిళ్ల సీజన్లో హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. ఒకవైపు నల్లధనంపై పోరాటం చేస్తున్నామంటూనే .. మరోవైపు రూ. 2 వేల నోటును ప్రవేశపెడతామని చెప్పడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. మోదీ ఆధునిక తుగ్లక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ట్విటర్లో స్పందిస్తూ.. ‘మోదీ రూ.500, 1000 నోట్లను రద్దుచేసి సామాన్యుడిపై అణ్వస్త్రాన్ని ప్రయోగించారు. దీన్నిబట్టి చూస్తూ ఆయన ఆధునిక తుగ్లక్ అని అర్థమవుతుంది. తుగ్లక్‌ను తలపిస్తున్న ఆయన దేశ తదుపరి రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు మారుస్తారేమో. దేశంలో చాలామంది ప్రజలు నగదుతోనే లావాదేవీలు చేస్తారు. వారికి బ్యాంక్ సౌలభ్యం లేదు. ఇప్పుడు వెరుు్యరూపాయలంటే 20 ఏళ్ల క్రితం రూ. వందతో సమానం’ అని పేర్కొన్నారు. -
‘కశ్మీర్’కు ప్రేమ మంత్రం
-
‘కశ్మీర్’కు ప్రేమ మంత్రం
- కశ్మీర్లో పిల్లలను రెచ్చగొట్టి రాళ్లేయిస్తున్నారు - జీఎస్టీ కోసం అన్ని పార్టీలు ఏకమవటం శుభపరిణామం - పర్యావరణ అనుకూల గణపతిని వాడండి - మన్ కీ బాత్‌లో పేర్కొన్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ: కశ్మీరీలకు చేరువయ్యేందుకు ఐకమత్యం, ప్రేమలే ప్రధాన మార్గాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోయలో అమాయకులైన పిల్లలను కూడా హింసలో భాగం చేస్తున్న వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం సందర్భంగా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. లోయలో జరుగుతున్న అల్లర్లలో ప్రాణాలు కోల్పేయే యువకుడైనా.. భద్రతా సిబ్బంది అయినా మనవాళ్లేనన్న విషయం మరిచిపోవద్దన్నారు. ఈ విషయం ప్రధాని నుంచి గ్రామసేవకుడి వరకు అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అమాయక యువతను, చిన్నపిల్లలను రెచ్చగొట్టి రాళ్లేయిస్తున్నవారంతా.. ఒక రోజు ఈ చిన్నారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీతో సమావేశంలో మూడు అంశాల ఫార్ములాపై చర్చించిన నేపథ్యంలోనే నేటి మన్‌కీ బాత్‌లో ఈ అంశాలను మోదీ స్పృశించారు. కశ్మీర్లో అస్థిరతకు ముగింపు పలికేందుకు అఖిలపక్షంతో సమావేశమై.. వారినుంచి తీసుకున్న సలహాలతో.. ‘ఏకత’, ‘మమత’ ద్వారానే సమస్య పరిష్కారమని తనకు అర్థమైందన్నారు. లోయలో ప్రజలకు మేమున్నామనే సందేశాన్నివ్వటం ద్వారా ప్రపంచానికి, వేర్పాటువాదులకు స్పష్టమైన సంకేతాన్నివ్వాలని అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. దీంతోపాటు ప్రతిష్టాత్మక జీఎస్టీ బిల్లు ఆమోదం పొందటంలోనూ అన్ని రాజకీయ పార్టీల సహకారం మరువలేనిదన్నారు. రాజకీయంగా బద్ధవిరోధులైనా.. దేశం కోసం అందరూ ఒకటవటం శుభపరిణామమన్నారు. దీంతోపాటు సెప్టెంబర్ 4న భారతరత్న మదర్ థెరిసాకు ‘సెయింట్‌హుడ్’ ప్రదానోత్సవానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరవుతారని మోదీ తెలిపారు. సెప్టెంబర్ 5 (ఉపాధ్యాయ దినోత్సవం)ను దృష్టిలో పెట్టుకుని టీచర్-స్టూడెంట్ సంబంధంపైన, గంగానది ప్రక్షాళన, స్వచ్ఛ్ భారత్ అభియాన్, పర్యావరణ అనుకూల గణేశ్ విగ్రహాల అంశాలపైనా మోదీ మాట్లాడారు. పొరుగుదేశాలతో బలమైన, సత్సంబంధాలను నెలకొల్పేందుకే భారత్ మొదట్నుంచీ ప్రయత్నిస్తోందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల కారణంగా జరిగిన నష్టంపైనా ప్రధాని మాట్లాడారు. స్థానిక అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించారని.. బాధితులకు కేంద్రం సహాయం చేస్తోందన్నారు. కర్ఫ్యూ కోసం ఏమీ చేయలేదు? ప్రధాని మన్ కీబాత్ కార్యక్రమంపై కాంగ్రెస్, జేడీయూలు నిప్పులు చెరిగాయి. ‘కేవలం 5శాతం మంది వల్లే సమస్యలు అనుకుంటే.. కశ్మీర్లో కర్ఫ్యూ ఎందుకు ఎత్తేయటం లేదు? ఎందుకు కశ్మీర్లో పరిస్థితిని అదుపుచేయడం లేదు?’ అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ట్వీటర్లో విమర్శించారు. కన్నడ విద్యార్థినికి ప్రశంసలు ఇంట్లో శౌచాలయ నిర్మాణం కోసం తల్లిదండ్రులను ఎదురించటంతోపాటు.. ఉపవాస దీక్ష చేసి అనుకున్నది సాధించి, గ్రామంలో చైతన్యం తెచ్చిన కన్నడ విద్యార్థిని మల్లమ్మ (16)ను ప్రధాని మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. కర్ణాటకలోని కొప్పళ జిల్లా ఢాణాపుర గ్రామానికి చెందిన మల్లమ్మ ఇంట్లో దీక్ష చేయటంతో ఈ విషయం గ్రామ పెద్దలవరకు వెళ్లిందని.. వారు ఏడు రోజుల్లోనే రూ.8వేల ఖర్చుతో మల్లమ్మ ఇంట్లో శౌచాలయాన్ని నిర్మించారని ప్రధాని ప్రశంసించారు. అటు, ఓ 84 ఏళ్ల రిటైర్డ్ ఉపాధ్యాయురాలు.. ఎల్పీజీ సబ్సిడీని వదులుకోవటంతోపాటు.. కట్టెలపొయ్యిపై వంట చేసుకుంటున్న ఓ మహిళకు రూ.50వేలు ఇవ్వటంపైనా ప్రశంసలు కురిపించారు. -
సత్యసంధతే క్షేమం!
ఆదినుంచీ క్రమశిక్షణకు మారుపేరుగా, వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్న మన సైన్యంపై నాలుగేళ్ల క్రితం ఒక ఆంగ్ల దినపత్రికలో సంచలనాత్మక కథనం వెలువడింది. 2012 జనవరి 16న ఢిల్లీ వెలుపల సైన్యం కదలికలు ప్రభుత్వాన్ని కలవరపరిచాయన్నది ఆ కథనం సారాంశం. అప్పటినుంచీ ఆ కథనం అడపా దడపా చర్చల్లోకి వస్తూనే ఉంది. అలా వచ్చిన ప్రతిసారీ వివాదం అవుతూనే ఉంది. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ ఈసారి ఆ పుణ్యం కట్టుకున్నారు. ఎప్పట్లానే మరోసారి అది పతాక శీర్షికలకెక్కింది. హర్యానాలో ఉన్న పదాతి దళానికి చెందిన సాంకేతిక విభాగం, ఆగ్రాలో ఉన్న పారా బ్రిగేడ్ దళాలు అసాధారణ రీతిలో ఢిల్లీ వైపు కదలివచ్చాయని ఆనాటి కథనం వెల్లడించింది. అప్పట్లో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఈ కథనాన్ని తీవ్రంగా ఖండించింది. సైన్యానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ రాసే ఈ మాదిరి రాతలు దేశ క్షేమం రీత్యా సబబు కాదని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ వ్యాఖ్యానించారు. సైనిక దళాలకు రివాజుగా ఉండే విన్యాసాలే ఆ రోజూ సాగాయి తప్ప అందులో ‘అసాధారణత’ ఏం లేదని వారు చెప్పారు. సైన్యం కదలికలకు సంబంధించిన కథనంలోనే దానికి కొనసాగింపుగా ఇంకేమి పరిణామాలు చోటుచేసుకున్నాయో ఉంది. అయితే వాటికి సంబంధించిన అంశాలపై మాత్రం ఎవరూ వివరణ ఇవ్వలేదు. మన దేశంలో మొదటినుంచీ ఇదే సమస్య. దేన్నయినా సందేహాతీతంగా చెప్పడం పాలకులకు చేతకాదు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణం మొదలుకొని ప్రాముఖ్యతగల ప్రతి విషయాన్నీ జనం ఊహలకూ, కల్పనలకూ వదిలేయడమే అలవాటు. ఫలితంగా ఏదో దాస్తున్నారన్న అభిప్రాయం కలగడానికే ఎక్కువ ఆస్కారం ఏర్పడుతోంది. తాజాగా కాంగ్రెస్ నాయకుడు మనీశ్ తివారీ ఆ కథనం ‘దురదృష్టకరమైనదే అయినా వాస్తవం’ అని వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని అప్పట్లో రక్షణ మంత్రి త్వ శాఖ అధికారి ఒకరు ప్రైవేటు సంభాషణలో ధ్రువీకరించారని కూడా వెల్లడించారు. మళ్లీ యథాప్రకారం దానిపై ఖండనమండనలు మొదలయ్యాయి. సంబంధంలేని విషయాలు మాట్లాడొద్దని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మనీశ్‌ను మందలించారు. ఆ సమయంలో దళాల కదలిక నిజమే అయినా రక్షణ నిర్మాణంలో అది అంతర్భాగమే తప్ప అందులో మరింకేదో వెదకడం సరికాదని వివరణనిచ్చారు. బీజేపీ కూడా మనీశ్ ప్రకటనను ఖండించడంతోపాటు మన్మోహన్, ఆంటోనీలు దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేసింది. ఇలా అధికార, విపక్షాలు రెండూ ఏకమై ఖండించినంత మాత్రాన ఇది సమసిపోదు. దాన్ని అంగీకరిస్తే ఆనాటి తమ అధికారిక వివరణకు విరుద్ధమవుతుందని కాంగ్రెస్... ఈ వివాదం ముదిరి వీకే సింగ్‌ను ప్రస్తుతం మంత్రి పదవినుంచి తప్పించవలసి రావొచ్చునని బీజేపీ అనుకుంటున్నాయన్న అభిప్రాయం జనంలో కలగడానికి ఆస్కారం ఏర్పడుతుందని ఆ రెండు పార్టీలూ గుర్తించాలి. ఆంగ్ల దినపత్రిక కథనం సంచలనం కలిగించడానికి కారణాలున్నాయి. అప్పట్లో సైనిక దళాల ప్రధానాధికారిగా వ్యవహరించిన జనరల్ వీకే సింగ్ పుట్టిన తేదీకి సంబంధించిన వివాదంలో చిక్కుకున్నారు. తన సర్టిఫికెట్లలో తేదీ తప్పుగా పడటంవల్ల ముందుగా రిటైర్ కావలసివస్తున్నదని, దాన్ని సరిచేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు. ప్రభుత్వం అందుకు తిరస్కరించింది. దానిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలా ఆశ్రయించిన రోజు రాత్రే(2012 జనవరి 16) సైన్యం కదలికలపై ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రభుత్వానికి ఉప్పందించాయని ఆంగ్ల పత్రిక కథనం తెలిపింది. ఇది తెలిశాక అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి శశికాంత్ శర్మను ఆదరాబాదరగా మలేసియానుంచి రప్పించారని, ఆయన రాత్రి 11 గంటల సమయంలో తన కార్యాలయాన్ని తెరిచి, మిలిటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్(డీజీఎంఓ) ఏకే చౌధురిని తక్షణం రమ్మని కబురంపారని వెల్లడించింది. ఆ కదలికలను ఆపమని కూడా చౌధురికి ఆదేశాలు వెళ్లాయన్నది. పర్యవసానంగా కొన్ని గంటల్లోనే అంతా సర్దుకుందని చెప్పింది. కథనం ఉత్తదే అన్నవారు ఇలాంటి ఇతర అంశాల జోలికిపోలేదు. సరికదా నిరుడు ఏకే చౌధురి ఒక ఇంటర్వ్యూలో సైనిక దళాల కదలిక, అర్థరాత్రి కబురొస్తే తాను శశికాంత్ శర్మను కలవడం నిజమేనని ఒప్పుకున్నారు. అంతేకాదు...సైన్యానికీ, ప్రభుత్వానికీ మధ్య అపార్థాలూ లేదా కొన్ని అంశాలపట్ల విభిన్న దృక్పథాలు లేదా విశ్వాసరాహిత్యమూ ఉండొచ్చునని కూడా అన్నారు. ఈ కదలికల విషయమై ఉన్నతస్థాయిలోని వారు కలవరపడినందువల్ల వాటిని తక్షణం ఆపాలని శర్మ కోరారని చెప్పారు. నిజానికి సైనిక దళాల చీఫ్‌గా ఆ సమయంలో వీకే సింగ్ కాక మరెవరైనా ఉంటే అసలీ అపార్థాలే తలెత్తేవి కాదేమో! ఎందుకంటే వీకే సింగ్ అంతక్రితమే ‘మన రక్షణ మేడిపండు...మన దళాల సంసిద్ధత ఉత్త డొల్ల’ అంటూ ప్రధానినుద్దేశించి ఒక లేఖ రాశారు. నాసిరకం ట్రక్కుల్ని కొనుగోలు చేస్తే రూ. 14 కోట్లు ఇస్తానంటూ ఒక దళారీ తన దగ్గరకొచ్చాడని అందులో ఆయన ఆరోపించారు. సైనిక దళాల చీఫ్‌గా ఉన్నవారు ఈ స్థాయిలో ఆరోపణలు చేయడమైనా, వివాదాల్లో చిక్కుకోవడమైనా అంతక్రితంగానీ, ఆ తర్వాతగానీ లేదు. ఇప్పుడు ఈ వివాదం లేవనెత్తిన మనీశ్‌కు జవాబుగా ‘నా పుస్తకంలో వివరంగా రాశాను...చదవండి’ అని సింగ్ చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు ఏదో ఒకటి చెప్పడంకాక ప్రభుత్వమే ఉన్నదున్నట్టు తేటతెల్లం చేస్తే అప్పట్లోనే అది సద్దుమణిగేది. ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు మించిన శక్తిమంతమైన ఆయుధం మరేదీ లేదు. అందరూ మనుషులే గనుక పొరపాటో, తొందరపాటో, అపార్థాలో చోటుచేసుకోవచ్చు. వాటిని దాచిపెట్టడంకంటే కాస్త వెనకో, ముందో వెల్లడించడమే శ్రేయస్కరం. అలా చేయకపోవడంవల్లే సమస్యలొస్తున్నాయని అన్ని పక్షాలూ గుర్తించడం మంచిది. -
‘ఢిల్లీ వైపు సైన్యం’ నిజమే...
-
‘ఢిల్లీ వైపు సైన్యం’ నిజమే...
► 2012లో సైనిక దళాల కదలికలపై నాటి కేంద్ర మంత్రి మనీశ్ తివారీ స్పష్టీకరణ ► అప్పుడు ఆర్మీ చీఫ్‌గా ఉన్నది నేటి కేంద్ర మంత్రి వీకే సింగ్ ► అప్పట్లో యూపీఏ సర్కారుకు, వీకే సింగ్‌కు మధ్య విభేదాలు! ► సుప్రీంకోర్టు దాకా వెళ్లిన సింగ్ ‘పుట్టినరోజు’ రగడ ► తివారీ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ ► పనిలేని వ్యాఖ్యలన్న వీకే సింగ్ న్యూఢిల్లీ: 2012లో నాటి ఆర్మీ చీఫ్, నేటి కేంద్రమంత్రి జనరల్ వీకే సింగ్ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటుకు ప్రయత్నం జరిగిందన్న వార్త తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చి సంచలనం సృష్టించింది. ‘జనవరి 16, 2012 రాత్రి కీలకమైన రెండు సైనిక దళాలు.. ఒకటి హరియాణాలోని హిసార్ కేంద్రంగా ఉన్న దళం, మరొకటి ఆగ్రాలోని 50వ పారా బ్రిగేడ్.. అనూహ్యంగా, ప్రభుత్వానికి కానీ, మంత్రిత్వ శాఖకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. దేశ రాజధాని ఢిల్లీ వైపునకు కదిలాయి. ఈ విషయాన్ని కేంద్ర నిఘా విభాగం ప్రభుత్వానికి నివేదించింది’ అంటూ ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఏప్రిల్ 4న ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వార్తను అప్పుడే ఆర్మీ ఖండించింది. తాజాగా శనివారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ ఆ ఘటనను ప్రస్తావించారు. ‘ఆ ఘటన దురదృష్టకరమే కానీ వాస్తవం. నేనప్పుడు రక్షణ రంగ స్థాయీ సంఘంలో సభ్యుడిగా ఉన్నాను’ అని తివారీ వ్యాఖ్యానించడంతో సైనిక కుట్ర అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుత కేంద్రమంత్రి జనరల్ వీకే సింగ్ ఘటన జరిగిన సమయంలో సైనిక దళాల ప్రధానాధికారిగా ఉన్నారు. ఆయన జన్మదినానికి సంబంధించిన ఒక వివాదంపై ఆ రోజే(2012, జనవరి 16న) సుప్రీంకోర్టులో కేసు వేశారు. అదే వివాదానికి సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏతో జనరల్ వీకే సింగ్‌కు విబేధాలు పొడచూపాయన్న వార్తలూ అప్పుడు ప్రచారంలో ఉన్నాయి. దాంతో సైనిక కుట్రకు జనరల్ సింగ్ ప్రయత్నించారన్న వాదన వినిపించింది. కానీ ఆ వార్తలను నాటి యూపీఏ ప్రభుత్వం, ఆర్మీ ఆ వెంటనే ఖండించాయి. కాగా, మనీశ్ తివారీ చేసిన తాజా వ్యాఖ్యలు సొంతపార్టీ కాంగ్రెస్‌ను సైతం ఇరుకున పెట్టాయి. దాంతో, తివారీ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ‘సైనిక దళాల కదలికకు సంబంధించిన కథనం అవాస్తవం. ఆర్మీ యూనిట్స్‌లో అలాంటి కదలికలు సహజమే.. సాధారణమే. వాటిపై ఇప్పుడు మాట్లాడటం అసందర్భం.. అనవసరం.. తప్పు కూడా. అదీకాక మా సహచరుడు(మనీశ్ తివారీ) అప్పుడు భద్రతపై కేబినెట్ కమిటీలోనే కాదు.. సంబంధిత నిర్ణయాలు తీసుకునే ఏ విభాగంలోనూ సభ్యుడు కాదు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వివరణ ఇచ్చారు. సంబంధం లేని విషయాలపై ఇకపై మాట్లాడవద్దంటూ తివారీని సున్నితంగా హెచ్చరించారు. మరోవైపు, తివారీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, నాటి ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ మండిపడ్డారు. ‘ప్రస్తుతం ఏ పనీ లేని వ్యక్తి నుంచి ఆ వ్యాఖ్యలు వచ్చాయం’టూ తిప్పికొట్టారు. నాటి ఘటనలను తాను రాసిన పుస్తకంలో స్పష్టంగా వివరించానని, ముందు ఆ పుస్తకం చదవమని తివారీకి సలహా ఇచ్చారు. అయితే, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మనీశ్ తివారీ ఆదివారం స్పష్టం చేశారు. తివారీ తాజా వ్యాఖ్యలపై నాటి ప్రధాని మన్మోహన్సింగ్, అప్పుడు రక్షణమంత్రిగా ఉన్న ఏకే ఆంటోనీ వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆర్మీలో నైతిక స్థైర్యం దెబ్బదీసేలా రాజకీయ కుట్రలకు పాల్పడటం కాంగ్రెస్‌కు అలవాటేనని బీజేపీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్నాథ్ సింగ్ విమర్శించారు. పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో చర్చించిన అంశాలను బహిరంగపర్చకపోవడం పార్లమెంటరీ సంప్రదాయమని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆర్మీ కదలికలపై వచ్చిన వార్తలను అప్పుడే ఆర్మీ, యూపీఏ ఖండించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
ఔను! సైన్యం అనుమానాస్పద కదలిక నిజమే!
కాంగ్రెస్ నేత మనీష్ తీవారి వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన వీకే సింగ్ న్యూఢిల్లీ: మూడేళ్ల కిందట హర్యానా నుంచి ఢిల్లీ వైపుగా సైన్యం అనుమానాస్పదంగా కదిలిన ఘటన నిజమేనంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మనీష్ తివారి పేర్కొనడం రాజకీయ దుమారం రేపుతోంది. మనీష్ తీవారి వ్యాఖ్యలను ఆర్మీ మాజీ చీఫ్, కేంద్రమంత్రి వీకే సింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. 'మనీష్ తివారీకి ఏ పని లేదు. ఇందుకు సంబంధించిన నా పుస్తకం ఒకటి ఉంది. దానిని చదవమనండి. ఆయనకే అంతా తేటతెల్లం అవుతుంది' అని వీకే సింగ్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మనీష్ తివారీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. సైన్యం అనుమానాస్పద కదలిక వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. 2012లో జరిగిన ఈ ఘటన దురదృష్టకరమైనది అయినప్పటికీ నిజమేనని మనీష్ తివారి పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన ఆహూతుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. 'ఆనాటి రాత్రి రైసినా హిల్స్ భయభ్రాంతులకు లోనైంది. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండానే రెండు ఆర్మీ యూనిట్లు (2012 ఏప్రిల్ 4న) ఢిల్లీ వైపుగా కదిలాయి. ఇది దురదృష్టకరం అయినప్పటికీ, నిజం' అని చెప్పారు. తాను అప్పుడు రక్షణశాఖపై పార్లమెంటు స్థాయీ సంఘంలో ఉన్నానని, తనకు తెసినంతవరకు ఇది నిజంగా జరిగిన ఘటనేనని అన్నారు.