మోదీ బర్త్‌డే.. కాంగ్రెస్‌ నేత అసభ్య ట్వీట్‌! | Even the Mahatma can't teach Narendra Modi desh bhakti, says Manish Tewari | Sakshi
Sakshi News home page

మోదీ బర్త్‌డే.. కాంగ్రెస్‌ నేత అసభ్య తిట్లు!

Published Sun, Sep 17 2017 5:04 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మోదీ బర్త్‌డే.. కాంగ్రెస్‌ నేత అసభ్య ట్వీట్‌! - Sakshi

మోదీ బర్త్‌డే.. కాంగ్రెస్‌ నేత అసభ్య ట్వీట్‌!

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీష్‌ తివారీ మాత్రం అసభ్య వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ తరహా దేశభక్తిని మహాత్మాగాంధీ సైతం నేర్పించలేరని పేర్కొన్నారు. అంతేకాకుండా అసభ్య వ్యాఖ్యలతో దూషణలకు దిగారు.

దేశభక్తి గురించి మహాత్మాగాంధీ నుంచి ప్రధాని మోదీ నేర్చుకోవాల్సిందేమీ లేదంటూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన తివారీ.. 'మూర్ఖులను భక్తులుగా మార్చడం, భక్తులను మూర్ఖులుగా తయారు చేయడమంటే ఇదే. మోదీ తరహా దేశభక్తిని మహాత్మా గాంధీ సైతం నేర్పించలేరు' అని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్‌లో హిందీలోని అసభ్య తిట్లను ఆయన ఉపయోగించడం గమనార్హం. దీంతో నెటిజన్లు ఆయనపై విమర్శలను గుప్పిస్తున్నారు. స్థాయి దిగజార్చుకొని అసభ్య దూషణలకు దిగడం సరికాదని హితవు పలికారు. గతంలో మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ సైతం ఇదేవిధంగా దూషణలకు దిగడంతో నెటిజన్లు అప్పట్లో తలంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement