ఆర్మీ కొత్త చీఫ్‌ నియామకంపై రగడ | Fight on the appointment of the new Chief of Army | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 19 2016 6:43 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

భారత కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించడంపై వివాదం రేగింది. రావత్‌ కంటే ఇద్దరు సీనియర్‌ అధికారులు ఉన్నప్పటికీ వారిని పక్కనబెట్టి ఆయనను నియమించడాన్ని కాంగ్రెస్, వామపక్షాలు తప్పుబట్టాయి. ప్రతి సంస్థకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయని, సీనియారిటీని గౌరవించాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ ప్రతినిధి మనీష్‌ తివారి అన్నారు. రావత్‌ సామర్థ్యాన్ని తాము ప్రశ్నించడం లేదని.. సీనియర్లను పక్కనబెట్టి లైనులో నాలుగో స్థానంలో ఉన్న వ్యక్తిని కొత్త ఆర్మీ చీఫ్‌గా తీసుకోవడాన్నే తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. సీపీఐ నేత డి.రాజా స్పందిస్తూ ఆర్మీలో నియామకం, సీవీసీ, చీఫ్‌ జస్టిస్‌ తదితర ఉన్నతస్థాయి నియామకాలన్నీ వివాదాస్పదంగా మారుతుండటం దురదృష్టకరమని అన్నారు. సైన్యమంటే దేశానికంతటికీ చెందినదని.. అలాంటప్పుడు ఆయా నియామకాలు ఎలా జరిగిందీ దేశానికి చెప్పాల్సిన అవసరం, నియామకంపై ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement