నల్లధనాన్ని ప్రజలందరికి పంచాలి: మనీష్ తివారీ
నల్లధనాన్ని ప్రజలందరికి పంచాలి: మనీష్ తివారీ
Published Wed, Oct 29 2014 12:34 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
న్యూఢిల్లీ: 'నల్లధనం'పై ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన హామీలన్ని నెరవేర్చాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ డిమాండ్ చేశారు. విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని స్వదేశానికి తెప్పించి.. ప్రజలందరికి పంచుతానని మోడీ చేసిన హామీని అమలు చేయాలని ఆయన అన్నారు.
ఈ కేసులో న్యాయపరమైన అంశాలను సుప్రీం కోర్టు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. నల్ల కుబేరుల జాబితాను సుప్రీం కోర్టుకు కేంద్రం ప్రభుత్వం దాఖలు చేసిన నేపథ్యంలో మనీష్ తివారీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో నల్లధనాన్ని స్వదేశానికి తెప్పించి ప్రజలందరికి పంచుతానని మోడీ చేసిన వ్యాఖ్యలను మనీష్ తివారీ గుర్తు చేశారు.
Advertisement
Advertisement